👉ఇవిఎంలపై అనుమానాలు… ”ఆ ఈవీఎం”లు తెరవగానే లెక్క మారిందంటున్న నటి!..ఆరోపణలన్నీ భారతీయ జనతాపార్టీ వైపే వేళ్లు చూపిస్తున్నాయని అంటున్నారు!😱😱😱
ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల నుంచి మొన్న జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికలు, తాజాగా వెలువడిన మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల వరకూ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (ఈవీఎం) లపై సంచలన ఆరోపణలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఆరోపణలన్నీ భారతీయ జనతాపార్టీ వైపే వేళ్లు చూపిస్తున్నాయని అంటున్నారు!
ఈ సందర్భగా వారు చేసే ఆరోపణలకు చూపించే ఆధారాలు ఆసక్తికరంగా ఉంటున్నాయి! ఈ క్రమంలో తాజాగా మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల కౌంటింగ్ నేడు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఈవీఎం మెషిన్స్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు అనుశక్తి నగర్ ఎన్సీపీ (ఎస్పీ) అభ్యర్థి ఫహద్ అహ్మద్ భార్య,నటి స్వర భాస్కర్.
అవును… 👉తన భర్త ఫహద్ అహ్మద్ మహారాష్ట్రలోని అనుశక్తి నగర్ నియోజకవర్గంలో అనేక రౌండ్ల ఓట్ల లెక్కింపులో ముందంజలో ఉన్నప్పటికీ.. వెనుకంజ వేయడం ప్రారంభిచడానికి గల కారణాలు ఇవే అంటూ నటి స్వర భాస్కర్ ఆసక్తికర చర్చకు తెరలేపారు. ఈ సందర్భంగా ఈవీఎంలలో 99% ఛార్జింగ్ ఉండటంపై ప్రశ్నించారు.
ఈ సందర్భంగా స్పందించిన స్వర భాస్కర్… 99% ఛార్జ్ తో ఉన్న ఈవీఎంలను తెరిచే వరకూ ముంబైలోని అనుశక్తి నగర్ సీటులో ఫహద్ అహ్మద్ ఆధిక్యంలో ఉన్నారని ఆమె తెలిపారు. అయితే… 17, 18, 19 రౌండ్లలో 99% బ్యాటీ ఛార్జ్ ఉన్న ఈవీఎంలు తెరవబడ్డాయని.. వెంటనే లెక్కలు మారిపోయాయని తెలిపారు.
ఇందులో భాగంగా… ఆ ఈవీఎంలను ఓపెన్ చేయగానే బీజేపీ మద్దతు ఉన్న ఎన్సీపీ (అజిత్ పవార్) అభ్యర్థి ఆధిక్యంలోకి వచ్చేశారని ఆమె చెప్పారు. ఒక రోజు మొత్తం ఓటు వేసినా కూడా మెషిన్లు 99% ఛార్జ్ చేయబడిన బ్యాటరీలు అన్నీ బీజేపీ, దాని మిత్రపక్షాలకే ఎందుకు ఓట్లు ఇస్తాయని ప్రశ్నిస్తూ ఈసీ, మహా వికాస్ అఘాడీ అగ్రనేతలను ట్యాగ్ చేశారు.
ఇదే సమయంలో… 17వ రౌండ్ వరకూ తాను ఆధిక్యంలో ఉన్నానని.. ఈ అంశంపై ఎన్నికల కమిషన్ ను ఆశ్రయిస్తానని అహ్మద్ ట్వీట్ చేశారు. దీంతో.. మరోసారి ఈవీఎంల వ్యవహారంపై చర్చ మొదలైందని అంటున్నారు.
👉 అదానీ పెట్టుబడులు.. కూటమికి భారీ దెబ్బ..😲😲 ముఖ్యంగా జగన్ తీసుకువచ్చిన సౌర విద్యుత్ ఒప్పందాలపై అప్పట్లో చంద్రబాబు బాగానే విమర్శలు గుప్పించారు. దేశంలో ప్రముఖ వ్యాపారవేత్త, ప్రపంచ కుబేరుల్లో తొలి ఐదు స్థానాల్లో ఉన్న గౌతం అదానీ వ్యవహారం అమెరికాలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా రచ్చ రేపుతోంది. ఆయన పలువురు అధికారులు, రాజకీయ నేతలకు లంచాలు ఇవ్వచూపారనే విషయం వెలుగులోకి వచ్చాక.. పారదర్శకత కోరుకునే ఏపీ వంటి కూటమి సర్కార్లకు ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆది నుంచి కూడా అదానీ వ్యవహారంపై అనుమానాలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా జగన్ తీసుకువచ్చిన సౌర విద్యుత్ ఒప్పందాలపై అప్పట్లో చంద్రబాబు బాగానే విమర్శలు గుప్పించారు. అయితే.. సర్కారు మారి, కూటమి వచ్చిన తర్వాత.. అదే అదానీ వ్యవహారంలో సునిశితంగా వ్యవహరిస్తూ వచ్చారు. అమరావతి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అదానీ పెట్టుబడులు పెట్టేందుకు మరోసారి ముందుకు వచ్చారు. దీనికి సంబంధించి ఆయన ప్రతినిధులు కూడా చంద్రబాబును కలిశారు. దాదాపు 70 వేల కోట్ల వరకు పెట్టుబడులు కొత్తా పెట్టేందుకు ప్రతిపాదించారు.ఈ పెట్టుబడుల వ్యవహారంపై చంద్రబాబు కూటమి సర్కారు సమాలోచనలు ప్రారంభించింది. అన్నీ కలిసి వస్తే.. వచ్చే నెల డిసెంబరులో అదానీకి తిరిగి.. గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని కూడా నిర్ణయించారు. నిజానికి జగన్ చేసుకున్న ఒప్పందాలపై విమర్శలు చేసిన చంద్రబాబు.. అదే అదానీ కంపెనీతో ఒప్పందాలకు సిద్ధం కావడం అందరినీ ఆశ్చర్య పరిచినా.. అప్పట్లో చేసిన రాజకీయాలు ఇప్పుడు చేసేది లేదని.. అందుకే అదానీతో పారదర్శకంగా ఒప్పందాలు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని వార్తలు వచ్చాయి. కానీ, ఇంతలోనే ..అదానీపై విమర్శలు, లంచాల ఆరోపణలు రావడంతో చంద్రబాబు సర్కారు ఇప్పడు డోలాయమానంలో పడిపోయింది. అయితే.. ఈ ఒప్పందాలు చేసుకోలేదు కాబట్టి చంద్రబాబు ఈ విషయంలో తృటిలో బయట పడ్డారనే చెప్పాలి. ఎందుకంటే.. కొన్ని ప్రాజెక్టుల విషయంలో నెల రోజుల కిందట అదానీ గ్రూపు సంస్థలతో కూటమి ప్రభుత్వం చర్చించింది. అవి అప్పట్లోనే పట్టాలు ఎక్కి ఉంటే.. ఇప్పుడు చంద్రబాబు కూడా విమర్శలు ఎదుర్కొనాల్సి వచ్చేది. అయితే.. ఈ ప్రభావం ఏపీపై ఎక్కువగానే పడనుంది. అదానీని కాదంటే.. 70 వేల నుంచి భవిష్యత్తులో లక్ష కోట్ల వరకు కోల్పోవడం ఖాయం. అయినా.. ఇప్పడున్న పరిస్థితిలో తప్పేలా లేదు.
👉అక్రమ మద్యం సీసాలను స్వయంగా ధ్వంసం చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు*
*ఎవరైనా అక్రమ మద్యం రవాణా మరియు విక్రయాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు: జిల్లా ఎస్పీ *
ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ ఆదేశాల మేరకు 2023,2024 సంవత్సరాలలో టంగుటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన అక్రమ మద్యం కేసుల్లో 380 క్వార్టర్ బాటిల్స్, 16 ఫుల్ బాటిల్స్, మూడు బీరు బాటిల్లను ఒంగోలు డిఎస్పీ రాయపాటి శ్రీనివాస్, ఎక్సైజ్ డీఎస్పీ పి.ఈ. వెంకట్, సింగరాయకొండ సిఐ సిహెచ్.హాజరత్తయ్య, ఎక్సైజ్ సీఐ ఈశ్వరరావు, టంగుటూరు ఎస్సై వి.నాగమల్లేశ్వరరావు మరియు టంగుటూరు పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో 30 కేసుల్లోనే 399 బాటిల్స్ ను మరియు నాటు సారా కి సంబంధించిన కేసులోని 15 లీటర్ల నాటుసారాయిని టంగుటూరు లోని కొండేపి ఫ్లై ఓవర్ వద్ద రోడ్డు రోలర్ ద్వారా ధ్వంసం చేయటం అయినది.
జిల్లాలో నాటుసారా, అక్రమ మద్యం, గంజాయి, గుట్కా, పేకాట వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని, ఎవరైనా అక్రమ మద్యం రవాణా మరియు విక్రయాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ గారు హెచ్చరించారు.
👉 తూగో జిల్లా దేవరపల్లి లో పాడేరు నుంచి తమిళనాడు కు అక్రమంగా ద్విచక్ర వాహనాలపై గంజాయి తరలిస్తున్న స్మగ్లర్లను పట్టుకున్న పోలీసులు… నలుగురు వ్యక్తుల అరెస్టు .. 40 కేజీల గంజాయి స్వాధీనం..రెండు బైకులు సీజ్ చేసి కేసు నమోదు చేసిన పోలీస్ లు…పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది