పార్లమెంట్‌ను కుదిపేస్తున్న అదానీ అంశం.. అదానీ ఇచ్చిన 100 కోట్ల రూపాయల విరాళం వివాదంలో వెనక్కి తగ్గిన రేవంత్ రెడ్డి..సోషల్‌ మీడియాతో న్యాయమూర్తులను ప్రభావితం చేస్తున్నారు..!.. మాజీ సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ..విచారణ కోసం జగన్ అమెరికాకు వెళ్తే.. జీవితాంతం ఏపీకి తిరిగిరాడు: బుద్దా వెంకన్న.. అప్పుల బాధతో తెలంగాణలో ఒక్కరోజే ఐదుగురు రైతుల ఆత్మహత్య (తెలంగాణ)..కాంగ్రెస్‌లోకి ఇద్దరు మాజీ మంత్రులు?..రేషన్ మాఫియాకు చెక్ పెట్టిన గిద్దలూరు అర్బన్ సీఐ సురేష్….సిపిఐ,ఎఐటియుసి లతో ఇబ్రహీం కు సంబంధం లేదు: గిద్దలూరు సిపిఐ నాయకులు..

👉 పార్లమెంట్‌ను కుదిపేస్తున్న అదానీ అంశం.. అదానీ వ్యవహారంపై చర్చకు పట్టుబడుతున్న ప్రతిపక్షం.. సభ్యుల నినాదానాలతో హోరెత్తిపోయిన లోక్‌సభ.. అదానీ వ్యవహారంపై చర్చించాల్సిందేనంటున్న విపక్ష ఎంపీలు.. ఎల్లుండికి వాయిదా పడ్డ రాజ్యసభ, లోక్‌సభ

👉అదానీ ఇచ్చిన 100 కోట్ల రూపాయల విరాళం వివాదంలో వెనక్కి తగ్గిన రేవంత్ రెడ్డి..
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అదానీ ఇచ్చిన 100 కోట్ల రూపాయలను తిరిగి ఇచ్చేసినట్లు తెలిపిన రేవంత్ రెడ్డి.. టెండర్లను చట్టబద్ధంగా పోటీపడి గెలుచుకోవాలని రాహుల్ గాంధీ చెప్పారు..పోటీపడే వారిలో అదానీ, అంబానీ, టాటా, బిర్లా ఎవరైనా ఉండొచ్చు – రేవంత్ రెడ్డి
👉 సోషల్‌ మీడియాతో న్యాయమూర్తులను ప్రభావితం చేస్తున్నారు..!.. మాజీ సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ కీలక వ్యాఖ్యలు..!
న్యాయమూర్తులు జాగ్రత్తగా ఉండాలని మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ అన్నారు. కేసుల తీర్పులను ప్రభావితం చేసేందుకు కొందరు సోషల్‌ మీడియాను ఉపయోగిస్తున్నారన్నారు. దానిపై అప్రమత్తంగా ఉండాలని అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రస్తుత రోజుల్లో యూట్యూబ్‌, సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ కారణంగా 20 సెకన్ల ఆధారంగా అభిప్రాయాన్ని ఏర్పరచాలని కోరుకుంటున్నారని.. ఇది ప్రమాదకరమన్నారు. కోర్టుల నిర్ణయాలపై తన అభిప్రాయాన్ని వ్యక్తీకరించేరందుకు ప్రతి పౌరుడికి హక్కు ఉందని.. అయితే, కోర్టు నిర్ణయాలను దాటి న్యాయమూర్తులను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకున్న సమయంలో ‘ఇది నిజంగా భావ ప్రకటన స్వేచ్ఛా? అనే ప్రాథమిక ప్రశ్నను లేవనెత్తుతుందన్నారు. కోర్టుల్లో నిర్ణయం తీసుకునే ప్రక్రియ చాలా తీవ్రమైందని.. దీన్ని అర్థం చేసుకునే ఓపిక, సహనం ఎవరికీ లేదన్నారు.
ఇది చాలా చిన్న విషయం అయినా.. భారత న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న చాలా తీవ్రమైన సమస్య అని జస్టిస్‌ చంద్రచూడ్‌ పేర్కొన్నారు. సోషల్‌ మీడియా ట్రోల్
👉 కాంగ్రెస్‌లోకి ఇద్దరు మాజీ మంత్రులు?
కేటీఆర్‌కు సన్నిహితంగా ఉండే ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని ఇటీవల టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అయితే గత ప్రభుత్వంలో కీ రోల్ పోషించిన ఇద్దరు మాజీ మంత్రులు సైతం కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. వీరితోపాటు మరికొంత మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని సమాచారం. వీరిలో గ్రేటర్‌కు చెందిన వారే ఎక్కువగా ఉన్నట్టు టాక్.
👉విచారణ కోసం జగన్ అమెరికాకు వెళ్తే.. జీవితాంతం ఏపీకి తిరిగిరాడు: బుద్దా వెంకన్న*- అధికారమదంతో నాని, వంశీ నోటికొచ్చినట్టు మాట్లాడారన్న వెంకన్న- చంద్రబాబును విమర్శించే నైతిక అర్హత కూడా వారికి లేదని వ్యాఖ్య
– వీళ్లను చూసి పోసాని కూడా అడ్డగోలుగా వాగాడని విమర్శ..
విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి అదానీ నుంచి రూ. 1,750 కోట్ల ముడుపులు తీసుకున్నట్టు అమెరికాలో నమోదైన కేసు విచారణకు జగన్ వెళితే కనుక… ఇక ఎప్పటికీ ఆయన ఏపీకి తిరిగి రాలేరని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. అధికారమదంతో కొడాలి నాని, వల్లభనేని వంశీ నోటికొచ్చినట్టు వాగారని మండిపడ్డారు. చంద్రబాబును విమర్శించే నైతిక అర్హత కూడా వారికి లేదని… అలాంటి వారికి బుద్ధి చెప్పాలని అన్నారు. నాని, వంశీ వంటి వెధవలను చూసి పోసాని కృష్ణమురళి కూడా అడ్డగోలుగా వాగాడని విమర్శించారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ, పోసాని, దేవినేని అవిశాశ్ వంటి వారు క్షమార్హులు కాదని వెంకన్న అన్నారు. ఇలాంటి వెధవలకు శిక్షలు పడితే ఇతరులకు గుణపాఠం అవుతుందని తెలిపారు. వాళ్ల మాదిరి తాము డబ్బుకు అమ్ముడుపోయే వ్యక్తులం కాదని చెప్పారు. తాము ఏనాడూ భారతీరెడ్డి గురించి తప్పుగా మాట్లాడలేదని అన్నారు. టీడీపీ కార్యకర్తలను ఇప్పుడు టచ్ చేస్తే చేయి తీసేస్తారని హెచ్చరించారు.
👉మహారాష్ట్ర కాంగ్రెస్ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన నానా పటోలే..
101 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ కేవలం 16 స్థానాల్లోనే గెలిచి, ఘోర ఓటమికి బాధ్యత వహిస్తూ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన నానా పటోలే
👉👉తాడిపత్రి టౌన్ లో కుక్కల బీభత్సం.. యువతికి తీవ్ర గాయాలు* అనంతపురం జిల్లా తాడిపత్రి టౌన్ లో వీధి కుక్కలు బీభత్సం సృష్ఠిస్తున్నాయి. తాడిపత్రి పట్టణ పరిధిలోని బుగ్గ రామలింగేశ్వర స్వామి క్షేత్రానికి ఈరోజు తెల్లవారుజామున వెళుతున్న సమయంలో పుట్లూరు రోడ్ లోని ఓ యువతిపై వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో జయశ్రీ అనే ఆమె బైకుతో ఎదురుగా ఉన్న స్తంభాన్ని ఢీ కొట్టింది. దీంతో జయశ్రీ కి తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం అనంతపురం తరలించారు.
👉ఇండియన్ రైల్వేస్.. రూ.5 ల కోసం కక్కుర్తి పడితే రూ. లక్ష బొక్క, రైల్వే సంస్థ షాకింగ్ డెసిషన్!
రైల్వే స్టేషన్లతో పాటు రైళ్లలో ఎమ్మార్పీకి మించి వస్తువులను విక్రయించకూడదని రైల్వే సంస్థ సీరియస్ గా చెప్పినా, కొంత మంది తీరు మార్పుకోవడం లేదు.
తాజాగా ఓ రైల్లో నిర్ణీత ధరకు మించి వాటర్ బాటిళ్లను అమ్మిన ఘటనపై రైల్వే సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. క్యాటరింగ్ కంపెనీకి ఏకంగా రూ. లక్ష ఫైన్ విధించడంతో పాటు ప్రయాణీకుల నుంచి అధికంగా వసూళు చేసిన డబ్బులను తిరిగి ఇప్పించింది.
139కి కాల్ చేసిన ఫిర్యాదు చేసిన ప్రయాణీకుడు..
ఈ నెల 12న 12414 నెంబర్ గల పూజా ఎస్ఎఫ్ ఎక్స్ ప్రెస్.. జమ్ము తావి నుంచి అజ్మీర్ జంక్షన్ కు బయల్దేరింది. మార్గం మధ్యలో థర్డ్ ఏసీ బోగీలోకి క్యాటరింగ్ బాయ్ వాటర్ బాటిళ్లను తీసుకొచ్చాడు. వాటర్ బాటిల్ ధర రూ. 15 ఉండగా, రూ. 20కి అమ్మడం మొదలు పెట్టాడు. ఓ ప్రయాణీకుడుఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు అమ్మడం ఏంటని అభ్యంతరం వ్యక్తం చేశాడు. అయినా, సదరు క్యాటరింగ్ బాయ్ రూ. 20 ఇవ్వాల్సిందేనన్నాడు. అన్ని బోగీల్లో అదే ధరకు వాటర్ బాటిళ్లను అమ్మాడు. సదరు ప్యాసెంజర్ ఈ విషయాన్ని సెల్ ఫోన్ లో రికార్డు చేయడంతో పాటు రైల్వే మద్దత్ నెంబర్ 139కు కాల్ చేశాడు. రైల్లో ఎమ్మార్పీ ధరకు మించి వాటర్ బాటిళ్లను విక్రయిస్తున్నారని కంప్లైంట్ చేశాడు. ఇలా ఫోన్ కట్ గానే అలా క్యాటరింగ్ సంస్థకు కాల్ వచ్చింది. వెంటనే ప్రయాణీకుల నుంచి అధికంగా వసూళు చేసిన డబ్బులను తిరిగి ఇవ్వాలని అధికారులు ఆదేశించారు.
👉క్యాటరింగ్ సంస్థకు రూ. లక్ష జరిమానా విధించిన రైల్వే సంస్థ..
రైల్వే అధికారుల ఆదేశాలో ఏ క్యాటరింగ్ కుర్రాడు ఎక్కువ ధరకు వాటర్ బాటిళ్లు అమ్మాడో, అదే కుర్రాడు ఎక్కువగా వసూళు చేసిన డబ్బులను ప్రయాణీకులకు అందజేశాడు. అంతేకాదు, విచారణ తర్వాత రైల్వే ఆదేశాలను లెక్క చేయకుండా అధిక ధరకు వాటర్ బాటిళ్లను అమ్మిన సదరు క్యాటరింగ్ సంస్థకు ఏకంగా రూ. లక్ష రూపాయలు జరిమానా విధించింది.
ఎక్కువ ధరకు అమ్మితే ఎలా ఫిర్యాదు చేయాలంటే?
⦿ రైల్లో ఎమ్మార్పీకి మించి వస్తువులను అమ్మితే వెంటనే 139కి కాల్ చేయాలి.
⦿ PNR నంబర్‌ని అడుగుతారు.
⦿ PNR నెంబర్ చెప్పగానే కంప్లైంట్ ఫైల్ చేస్తారు.
అటు రైల్వే టోల్ ఫ్రీ నంబర్ 1800111139కి కాల్ చేసి కూడా కంప్లైట్ చేసే అవకాశం ఉంది. మెసేజ్ ద్వారా కూడా ఫిర్యాదు చేసే అవకాశం కల్పిస్తున్నది భారతీయ రైల్వే సంస్థ. ఏ రైల్లో ప్రయాణిస్తున్నా, ఎమ్మార్పీకి మించి వస్తువులను అమ్మితే 9717630982కు మెసేజ్ ద్వారా ఫిర్యాదు చెయ్యొచ్చని అధికారులు వెల్లడించారు.
👉 ఒంగోలు పోలీసుల విచారణకు రామ్‌గోపాల్‌ వర్మ డుమ్మా
ఈరోజు విచారణకు రాలేనన్న రామ్‌గోపాల్‌వర్మ
విచారణకు రెండు వారాల గడువు కోరిన ఆర్జీవీ
హైదరాబాద్‌లోని ఆర్జీవీ ఇంటికి వెళ్లిన పోలీసులు
ఆర్జీవీ ఇంట్లో లేరని పోలీసులకు తెలిపిన సిబ్బంది
కోయంబత్తూర్‌లో ఆర్జీవీ ఉన్నట్టు పోలీసులకు సమాచారం
చెన్నై పోలీసులతో ప్రకాశం పోలీసుల సంప్రదింపులు
కోయంబత్తూర్‌కు వెళ్లనున్న ప్రత్యేక పోలీసు బృందం
👉అప్పుల బాధతో తెలంగాణలో ఒక్కరోజే ఐదుగురు రైతుల ఆత్మహత్య..రైతుబంధు సాయం అందక.. రుణమాఫీ కాక ఆత్మహత్య చేసుకుంటున్న రైతులు
కరీంనగర్ – జమ్మికుంట మండలం బిజిగిర్‌షరేఫ్ గ్రామంలో చల్ల శివసాగర్ (26) ఏడెకరాల భూమిని కౌలుకు తీసుకుని పత్తి సాగు చేస్తున్నారు. దీనికోసం రూ.5 లక్షల అప్పు చేశాడు.. పంట దిగుబడి రాక, చేసిన అప్పు ఎలా తీర్చాలో తెలియక ఆదివారం శివసాగర్ ఇంట్లో ఉరేసుకున్నారు..
నల్గొండ – కేతేపల్లి మండలంలోని తుంగతుర్తికి చెందిన రైతు ఉప్పుల మల్లయ్య (45) మూడెకరాల భూమి ఉన్న ఈ రైతు కుమార్తె పెళ్లి సమయంలో, వ్యవసాయ అవసరాల కోసం అప్పులు చేశారు. వాటిని తీర్చేందుకు తనకున్న భూమిలో రెండెకరాలు విక్రయించారు. అయినా ఇంకా రూ.9 లక్షల అప్పు ఉండటంతో, తీర్చే మార్గం లేక మల్లయ్య ఆదివారం పురుగుల మందు తాగి.. చికిత్స పొందుతూ మల్లయ్య మృతి చెందారు.
👉అప్పుల బాధతో రైతు దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య ..
వికారాబాద్ – యాలాల పోలీస్ స్టేషన్ పరిధిలో నాగసమందర్ కు చెందిన మాసుల యాదప్ప (42), భార్య మాసుల జ్యోతి (38) వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. రెండేళ్ల క్రితం అప్పులు చేసి కూతురు వివాహం చేశారు. మరోవైపు వ్యవసాయం కోసం కొంత అప్పులు చేశారు. అప్పులబాధ ఆర్థిక భారాలు మోయలేక మనోవేదనకు గురై ఆదివారం ఉదయం పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
మెదక్ – నర్సాపూర్ మం
డలం కంచనపల్లి గ్రామానికి చెందిన చంది శేఖులు(49) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రెండేళ్ల కిందట కొడుకు పెళ్లి చేయగా.. రూ.4 లక్షల వరకు అప్పు మిగిలింది. రెండు నెలల కిందట మళ్లీ రూ. లక్ష అప్పు తెచ్చి పొలంలో బోరు వేయగా నీళ్లు పడలేదు. పంట దిగుబడి రాక.. అప్పులు పెరిగి తీర్చేమార్గం లేకపోవడంతో తీవ్ర మనస్తాపం చెంది పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందాడు.
👉రేషన్ మాఫియా ఆగడాలకు చెక్ పెట్టిన గిద్దలూరు అర్బన్ సీఐ సురేష్..గిద్దలూరు అర్బన్ సీఐ అక్రమ రేషన్ మాఫియా పై ఉక్కు పాదం మోపారు .
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం గత కొన్ని నెలలుగా ఇష్టానుసారంగా పగలు రాత్రి తేడా లేకుండా రేషన్ మాఫియా రేషన్ బియ్యాన్ని ఇతర ప్రాంత మిల్లులకు తరలిస్తున్న ఈ సమాచారం అందుకున్న పోలీసులు రేషన్ మాఫియాకి చెక్ పెట్టడానికి సమయం కోసం వేచి ఉన్నారు.
నిన్న రాత్రి గిద్దలూరు మండలం ఆదిమూర్తిపల్లె సమీపంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం వాహనాన్ని పట్టుకున్న పోలీసులు. గిద్దలూరు కొత్తకోట రేషన్ షాపుల నుంచి అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలించేందుకు ప్రయత్నిస్తుండగా అందిన సమాచారం మేరకు పోలీసులు రేషన్ బియ్యాన్ని స్వాధీనపరుచుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఈ వాహనంలో రేషన్ షాప్ కి ప్రభుత్వం వారు ఇచ్చే సీల్ వేసి ఉన్న రేషన్ బియ్యం బస్తాలు కూడా దర్శనమిచ్చాయి. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.
👉 సిపిఐ, ఎఐటియుసి లతో ఇబ్రహీం కు సంబంధం లేదు:స్పష్టం చేసిన గిద్దలూరు సిపిఐ నాయకులు.. అమ్మ దొంగ.. కమ్యూనిస్టు పార్టీని ఇలా మోసం చేసావా.😱😱😱

ఇటీవల కాలంలో వెలుగు ఆఫీసు లో అవినీతి జరుగుతుందని సమాఖ్య ఎన్నికలు సక్రమంగా జరగట్లేదని సంబంధిత కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వీడియోలు పెట్టి మరియు పత్రికా ప్రకటన లు ఇస్తున్న కంభం కు చెందిన విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి షేక్ మహమ్మద్ ఇబ్రహీం కు గత కొన్ని సంవత్సరాల కాలంగా కనీసం సభ్యత్వం కూడా లేదని గిద్దలూరు నియోజకవర్గ సిపిఐ పార్టీ నాయకులు తెలిపారు.
సోమవారం కంభం వెలుగు ఆఫీసు కు వచ్చిన సందర్భంగా వారు మాట్లాడుతూ ఇబ్రహీం ఇచ్చే ప్రకటనలకు సిపిఐ పార్టీ కి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసారు.
పార్టీకి చెడ్డ పేరు తెచ్చే విధంగా ప్రకటనలు ఇష్తున్న ఇబ్రహీం వైఖరిని ఖంఢిస్తున్నామని
తెలిపారు. ఈ సమావేశంలో గిద్దలూరు నియోజకవర్గ కార్యదర్శి వి జోసఫ్, ఎపి రైతు సంఘ కార్యదర్శి డా కాల్వ పుల్లయ్య, కంభం కమిటి కార్యదర్శి సభ్యులు వై శ్రీనివాసులు, జె. అంకయ్యలు పాల్గొన్నారు.

7k network
Recent Posts

తప్పు జరిగింది.. క్షమించండి: పవన్ .. *తొక్కిసలాట ఘటనలో డీఎస్పీని బకరాను చేస్తున్నారు: బీవీ రాఘవులు..*తొక్కిసలాట ఘటనకు సీఎం బాధ్యత వహించాలి: రోజా* 👉 టీటీడీ తొక్కిసలాట ఘటనపై కాంగ్రెస్ నాయకుడు చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు.. .. *ఫార్ములా ఈ కారు రేసులో దూకుడు – ఆయన అనుమతితోనే డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేశాం… *పేట’ప్రిన్సిపల్ వేధింపులతోనే విద్యార్థి ఆత్మహత్య*.. *సిరిసిల్లలో కదులుతున్న భూకబ్జాలు డొంక..!.

*పెళ్ళుబుక్కుతున్న మత విద్వేష సునామి.. హిందువులు శంఖం ఊదాల్సింది అందుకు కాదు, మరెందుకు?* .. *విశాఖలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అరెస్ట్* …రుయా ఆసుపత్రిలో మెరుగైన సౌకర్యాలు ఏర్పాటుకు అన్ని విధాల చర్యలు*జిల్లాలో జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు తదితర ప్రాజెక్టుల భూసేకరణ, నిర్మాణ పనులు మరింత వేగవంతం చేయాలి: తిరుపతి జిల్లా కలెక్టర్ * ..*యూరప్ లో మోసపోయిన తెలుగు వారు …ప్రతీకార రాజకీయం కొనసాగుతోంది_డా. జయప్రకాష్ నారాయణ .. లంచం డిమాండ్ చేసిన ఎమ్మార్వో, వీఆర్వో, ఆర్ ఐ ల పై వేటు వేసిన జిల్లా కలెక్టర్ .. ఖమ్మం తిరుపతి జిల్లాలలో భారీగా గంజాయి పట్టివేత

👉కర్రలతో కొట్టుకున్న కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు ..* కేజీవాల్ కు అఖిలేష్ మద్దతు.. ”ఇదేంటి పవన్ ఇలా అనేశారు” .. *కుప్పం టీడీపీ కార్యాలయంలో ‘జన నాయకుడు’ కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు .. ప్రకాశం జిల్లాలో కుక్కల స్వైర విహారం *గంజాయి గూచుల వద్ద 120 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న ఏసిపి..*ఎక్కువ చెత్త ఉత్పత్తి చేసే వారు స్వయంగా కంపోస్టు ఎరువు తయారు చేయండి:*కమిషనర్ ఎన్.మౌర్య*..👉 ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తే కఠిన చర్యలు: గిద్దలూరు సీఐ సురేష్ .. *ఆక్రమణకు గురైన మూడు ఎకరాల ప్రభుత్వ భూమి అప్పగింత* .. *ఆన్‌లైన్‌ బెట్టింగులపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్…*రామ్ చరణ్, బాలయ్య సినిమాలపై హైకోర్టులో పిల్* 👉 బీజీపీ నేతలకు అద్దంకి దయాకర్ సవాల్ …*గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్? (కరీంనగర్).. * వైయస్ అభిషేక్ రెడ్డి మృతి..*

ప్రియాంక గాంధీపై బీజేపీ నేత ర‌మేష్ బిధూరి చేసిన అనుచిత వ్యాఖ్య‌ల ప‌ట్ల‌ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన మంత్రి సీత‌క్క‌*.. *నవీన్ కి చెక్ పెట్టినట్లే కేజ్రీవాల్ కి కూడా ?.. *ఈ ఫార్ములా రేసులో కొన్ని నిజాలు *.. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఛైర్మెన్ జంగా రాఘవ రెడ్డి … ఏపీ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, మంత్రి సత్య కుమార్ యాదవ్* …ప్రభుత్వ ఆస్తిని అప్పనంగా దోచుకున్న ఓం నారాయణ పై చర్యలు : లంబాడి హక్కుల పోరాట సంఘం.. *పొదిలి మాదిరెడ్డిపాలెం వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షులుగా ఎర్రం రెడ్డి

👉ఎంఎస్‌పీ పంజాబ్‌కే కాదు.. దేశమంతటికీ అవసరమే ..*తెలుగు తమ్ముళ్లకు సంక్రాంతి పండుగ ముందే వచ్చిందా.😲 ..హుస్నాబాద్ మైనార్టీ గురుకుల బాలికల పాఠశాల లో ఆకస్మిక తనిఖీలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ … ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాటులను పర్యవేక్షించిన జిల్లా అధికారులు ..*ఆత్మకూరులో ఇస్తేమ పనులను పర్యవేక్షించిన మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్ .. *

👉ఏపీలో రేపటి నుంచి ఉచిత ఓపీ సేవలు బంద్ …* విశాఖ పోర్టులో పట్టుకున్న బియ్యానికి కలెక్టర్ క్లీన్ చిట్..😲… *విశాఖ సెంట్రల్‌ జైల్ ను సందర్శించిన రాష్ట్ర హోం మంత్రి .. అగ్ని ప్రమాదాల పై అవగాహన సదస్సు.. *ఉచిత బస్సు కంటే ఇతర సంక్షేమ పథకాలకు ఖర్చు పెడితే బెటరేమో ! .. *అధికారులను సత్కరించిన పొదిలి పట్టణ టిడిపి అధ్యక్షుడు. . *నిలిచిపోయిన కాపు భవనాలను పునఃప్రారంభించాలి: బలిజ సేవ సంఘం డిమాండ్ .