ఏపీ కేబినెట్‌లో అదానీ పవర్‌పై కీలక చర్చ.. వైసిపి టీడీలపై ధ్వజమెత్తిన ఏపీసీసీ చీఫ్ షర్మిల.. పవన్ కళ్యాణ్ శపథం నెరవేరేనా ?..రామ్ గోపాల్ వర్మ అకౌంట్ లోకి భారీగా డబ్బులు..

👉 ఏపీ కేబినెట్‌లో అదానీ పవర్‌పై కీలక చర్చ…
*సెకీ ఒప్పందంపై ఏ చర్యలు తీసుకోవాలనే అంశంపై చర్చిస్తున్న కేబినెట్.. *అదానీ పవర్‌పై నిర్ణయం తీసుకునే వరకు పవర్ సప్లై అగ్రిమెంట్‌ని పెండింగ్‌లో పెట్టే అవకాశం.*
*అదానీ విద్యుత్ ఒప్పందం కారణంగా రూ. 1750 కోట్ల ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలు.
*కేబినెట్‌లో పూర్తి వివరాలను సహచరులకు వివరిస్తున్న చంద్రబాబు..*విద్యుత్ ధరలు తగ్గించకపోతే ఒప్పందాన్ని రద్దు చేసుకుని పెనాల్టీ చెల్లించడమే ఉత్తమమని అభిప్రాయం.. *ఒప్పందం రద్దు చేసుకుంటే పెనాల్టీగా చెల్లించాల్సింది రూ. 2100 కోట్లు.*
*👉అనంతపురంలో విమానాశ్రయం ఏర్పాటుకు కేంద్రం ఓకే*
*అనంతపురంలో విమానాశ్రయం ఏర్పాటుపై ముందడుగు పడింది..*ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వశాఖ సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం.
*దీని నిర్మాణానికి 1,200 ఎకరాలు కేటాయించాలని కేంద్ర మంత్రిత్వశాఖ రాష్ట్ర సర్కారును కోరినట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి. *పేరో భూమి చూపిన వెంటనే తదుపరి కార్యాచరణ మొదలుకానుంది..*అనంతపురం పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ భూమి కేటాయిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
👉వైసీపీ టీడీలపై ధ్వజమెత్తిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల..
వైసిపి హయాంలో ఆస్తులు లాక్కోవడం ట్రెండ్‌గా మారితే..
-వాటిని చూసి మౌనం వహించడం కూటమి సర్కార్ ట్రెండ్‌గా పెట్టుకుంది..అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటినా గత ప్రభుత్వం ధారాదత్తం చేసిన ఏ ఒక్క ఆస్తిపై, కనీసం ఒక్క చర్య కూడా లేదు. .విచారణకు సైతం దిక్కులేదు..
రాష్ట్రంలో కాకినాడ పోర్టు ఒక్కటే కాదు..కృష్ణపట్నం పోర్టును గుంజుకున్నారు.
*ప్రభుత్వ ఆధీనంలో అత్యధిక లాభాలు గడించే గంగవరం పోర్టును అప్పనంగా అమ్మేశారు..కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.
*ఏపీని పోర్టులకు హబ్‌గా మార్చే పాలసీలు సరే..మరి గంగవరం పోర్ట్ సంగతేంటి..?
*ప్రతి ఏటా దాదాపు రూ.2వేల కోట్ల లాభాలు గడించే పోర్టును గత వైసీపీ ప్రభుత్వం 2021లో అదానీకి రాసి ఇచ్చింది.
*నికర ఆర్థిక నిల్వలతో పాటు.. రూ.9వేల కోట్ల విలువజేసే 10 శాతం వాటాను కేవలం రూ.640 కోట్లకు పుట్నాల కింద అమ్మారు..2,800 ఎకరాల విలువైన ప్రభుత్వ భూములను అదానీకి కట్టబెట్టారు..BOT కింద ఇంకో 15 ఏళ్లలో పూర్తిగా ప్రభుత్వపరం అవ్వాల్సిన పోర్టు అది.. అదానీకి కట్టబెట్టేటప్పుడు ఎలాంటి టెండర్లు లేవు. కళ్ళు మూసీ తెరిచేలోగా అన్ని అనుమతులు ఇచ్చేశారు..పైగా మిగతా పోర్టుల అభివృద్ధికి ఆ నిధులు ఉపయోగం అని బుకాయించారు..ప్రతిపక్షంలో ఉండగా గంగవరం పోర్టుపై చెప్పిన మీ మాటలకు,ఇచ్చిన హామీలకు,ఇప్పుడు అమలు చేస్తున్న విధానాలకు ఎంతమాత్రం పొంతన లేదు..గంగవరం పోర్టులో ప్రభుత్వానికి ఉన్న వాటాను వెనక్కు తీసుకొనే విధంగా చర్యలు చేపట్టాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.
👉ఈనెల 5న ఇంద్రమ్మ ఇల్లు యాప్ ఓపెన్ మంత్రి పొంగిలేటి*..ప్రతి నియోజకవర్గానికి 3500 చొప్పున ఇందిరమ్మ ఇల్లు ఇవ్వనున్నారని మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ ఈనెల 5న ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన యాప్ ఓపెన్ చేస్తా, ప్రతి గ్రామానికి అధికారులు బృందాలు వస్తాయి, అని పేర్కొన్నారు. సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా నిధులను రైతులు ఖాతాలో జమ చేస్తారు.
వైసీపీ టీడీపీలపై భుజమెత్తిన ఏపీసీసీ చీఫ్ షర్మిల రెడ్డి
వైసిపి హయాంలో ఆస్తులు లాక్కోవడం ట్రెండ్‌గా మారితే..
వాటిని చూసి మౌనం వహించడం కూటమి సర్కార్ ట్రెండ్‌గా పెట్టుకుందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి ఆరోపించారు .
– అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటినా గత ప్రభుత్వం ధారాదత్తం చేసిన ఏ ఒక్క ఆస్తిపై, కనీసం ఒక్క చర్య కూడా లేదు.. విచారణకు సైతం దిక్కులేదు.
– రాష్ట్రంలో కాకినాడ పోర్టు ఒక్కటే కాదు..కృష్ణపట్నం పోర్టును గుంజుకున్నారు.
– ప్రభుత్వ ఆధీనంలో అత్యధిక లాభాలు గడించే గంగవరం పోర్టును అప్పనంగా అమ్మేశారు.. కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.. ఏపీని పోర్టులకు హబ్‌గా మార్చే పాలసీలు సరే.
👉 మరి గంగవరం పోర్ట్ సంగతేంటి..?
ప్రతి ఏటా దాదాపు రూ.2వేల కోట్ల లాభాలు గడించే పోర్టును గత వైసీపీ ప్రభుత్వం 2021లో అదానీకి రాసి ఇచ్చింది.నికర ఆర్థిక నిల్వలతో పాటు.. రూ.9వేల కోట్ల విలువజేసే 10 శాతం వాటాను కేవలం రూ.640 కోట్లకు పుట్నాల కింద అమ్మారు.. 2,800 ఎకరాల విలువైన ప్రభుత్వ భూములను అదానీకి కట్టబెట్టారు..BOT కింద ఇంకో 15 ఏళ్లలో పూర్తిగా ప్రభుత్వపరం అవ్వాల్సిన పోర్టు అది.
👉 అదానీకి కట్టబెట్టేటప్పుడు ఎలాంటి టెండర్లు లేవు. కళ్ళు మూసీ తెరిచేలోగా అన్ని అనుమతులు ఇచ్చేశారు.. పైగా మిగతా పోర్టుల అభివృద్ధికి ఆ నిధులు ఉపయోగం అని బుకాయించారు.. ప్రతిపక్షంలో ఉండగా గంగవరం పోర్టుపై చెప్పిన మీ మాటలకు,ఇచ్చిన హామీలకు, ఇప్పుడు అమలు చేస్తున్న విధానాలకు ఎంతమాత్రం పొంతన లేదు.. గంగవరం పోర్టులో ప్రభుత్వానికి ఉన్న వాటాను వెనక్కు తీసుకొనే విధంగా చర్యలు చేపట్టాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.
👉పింఛన్ దారులకు షాక్ ఇస్తున్న ఏపీ ప్రభుత్వం**
గత ఎన్నికల్లో భారీ హామీలిచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వం కొలువు దీరి ఐదు నెలలు దాటింది.కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత పెన్షన్లను మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయిలకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు.గత వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా పెన్షన్లను లబ్ధిదారులకు అందజేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లు లేకుండానే పెన్షన్లను పంపిణీ చేస్తోంది.
**కూటమి ప్రభుత్వంలో తగ్గిన పింఛన్లు**
మే నెలలో పింఛన్ల పంపిణి –65,49,864
డిసెంబర్ నెల పింఛన్ల పంపిణి – 63,92,702
మొత్తం తగ్గిన పింఛన్లు== 1,57,162
👉పవన్ కళ్యాణ్ శపధం నెరవేరేనా **
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దగ్గర మొత్తం ఐదు శాఖలున్నాయి. మంత్రివర్గాన్ని రూపొందించగానే ముందుగా పట్టుబట్టి పౌరసరఫరాలశాఖను తీసుకున్నారు.
దానికి మంత్రిగా జనసేనలో నెంబర్ టూగా చెలామణి అవుతున్న తన స్నేహితుడు నాదెండ్ల మనోహర్ కు అప్పగించారు. వెంటనే పౌరసరఫరాలశాఖలో అసలు ఏం జరుగుతోంది? ఈ ఐదు సంవత్సరాల్లో ఏం జరిగింది? అనే విషయాలను తెలుసుకోవడంపై ఆయన దృష్టిసారించారు. మొత్తం ఒక స్పష్టత వచ్చిన తర్వాత కాకినాడలో విస్త్రత తనిఖీలు చేపట్టారు. అయితే అప్పటికే వైసీపీ ప్రభుత్వానికి విధేయులుగా ఉన్న అధికారులు, ఉద్యోగులు ఉండటంతో వారి బదిలీలు జరిగాయి.
*ద్వారంపూడి వ్యవహారాలపై పవన్ అధ్యయనం**
ఇవన్నీ జరుగుతున్న సమయంలోనే పవన్ కల్యాణ్ ఒకటికి రెండుసార్లు కాకినాడ పర్యటించి వెళ్లారు. ఉప ముఖ్యమంత్రి కాబట్టి కార్యక్రమాల్లో భాగంగా ఆయన వచ్చివెళ్లారని అందరూ భావించారు. కానీ పవన్ వచ్చిన ఉద్దేశం వేరు. కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కార్యకలాపాలు, వ్యాపార వ్యవహారాలపై కూపీ లాగి అన్ని వివరాలను సేకరించి దగ్గర పెట్టుకున్నారు. కొద్దిరోజుల క్రితమే కాకినాడ జిల్లా కరప మండలంలోని గురజానపల్లిలో ద్వారంపూడికి చెందిన రొయ్యలను శుద్ధి చేసే కంపెనీని ప్రభుత్వం మూసేసింది. తాజాగా ప్రత్తిపాడు మండలం లంపకలోవ దగ్గర ఉన్న వీరభద్ర ఎక్స్ పోర్ట్స్ పేరుతో ఉన్న మరో కంపెనీని కూడా మూసేసింది. నియయ, నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవడంలేదని ఒకటికి రెండుసార్లు ప్రభుత్వం నోటీసులు జారీచేసినప్పటికీ ఈ కంపెనీలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, అంతే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
**ప్రతిజ్ఞ చేసిన పవన్ కల్యాణ్*
ఈ సంఘటనలు జరగడానికి ముందు, ఎన్నికలు జరగడానికి ముందు పవన్ కల్యాణ్ కాకినాడలో వారాహి యాత్రను నిర్వహించారు. ఆ సందర్భంగా ద్వారంపూడిపై పవన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నీ అన్యాయాలను, అక్రమాలను, అవినీతిని వెలికితీసి నడిరోడ్డుపై నిలబెట్టకపోతే నాపేరు పవన్ కల్యాణ్ కాదు అని ప్రతిజ్ఞ చేశారు. అయితే ద్వారంపూడి స్పందించి ముందు నువ్వు గెలిచి చూపించు అంటూ సెటైర్ వేశారు. తర్వాత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పార్టీ జనసేన 100 శాతం విజయాలను నమోదు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా పోటీచేసిన 21 స్థానాల్లోను గెలుపొందింది.
**తన గొయ్యి తానే తవ్వుకున్న ద్వారంపూడి**
ఆ తర్వాత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి చెందిన వ్యాపారాలన్నీ బద్ధలవుతున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లోని బియ్యం మిల్లుల్లో విస్త్రత తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో వెయ్యికిపైగా కేసులు నమోదయ్యాయి. కాకినాడు పోర్టు ప్రయివేటు పోర్టు కావడంతో ఇక్కడి నుంచి యథేచ్ఛగా గత ఐదు సంవత్సరాల్లో రేషన్ బియ్యం ఎగుమతులు అక్రమంగాజరిగాయి. ప్రస్తుతం వాటిపై కొరడా ఝుళిపించారు. స్టెల్లా నౌకలో అక్రమంగా ఎగుమతి అవుతున్న రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. నౌకపై కేసు నమోదు చేయబోతున్నారు. అయితే ఇవేవీ ఆషామాషీగా జరగలేదు. కొంతకాలంగా పవన్ కల్యాణ్ ద్వారంపూడికి చెందిన వ్యాపారాలు, అక్రమాలు, ఐదేళ్లలో చేసిన పనులపై పూర్తిగా అధ్యయనం చేశారు. వాటిని ఆధారంగా చేసుకొని పక్కాగా రంగంలోకి దిగారు. పవన్ కల్యాణ్ అంటే చాలా తేలికగా తీసుకున్నారని, ఆయన్ను రెచ్చగొట్టి తన గొయ్యిని తాను తవ్వుకునేలా ద్వారంపూడి చేసుకున్నారనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి
👉పవన్ డిమాండ్లపై తేల్చేసిన చంద్రబాబు, క్యాబినెట్ లోనే ఫుల్ క్లారిటీ**
ఇవాళ జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు ఓ కీలక సమస్యపై తన అభిప్రాయం చెప్పేశారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లేవనెత్తిన ఈ డిమాండ్ పై చంద్రబాబు మంత్రులకు క్లారిటీ ఇచ్చేశారు
దీంతో ఇకపై అధికారులు పరుగులు పెట్టబోతున్నారు. అయితే పవన్ డిమాండ్లపై చంద్రబాబు స్పందిస్తున్న తీరు మరోమారు రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. పవన్ కు చంద్రబాబు ఇస్తున్న ప్రయారిటీ దీంతో మరోసారి వెల్లడైంది.
ఇంతకీ విషయానికొస్తే.. కాకినాడ పోర్టులో తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించారు. అక్కడ రేషన్ బియ్యం అక్రమ రవాణాను గుర్తించారు. అంతటితో ఆగకుండా కాకినాడ పోర్టులో జరుగుతన్న అక్రమాలు, పోర్టు భద్రత వంటి అంశాలపై ఆందోళన వ్యక్తం చేశారు. అధికారుల తీరుపైనా మండిపడ్డారు. చివరికి కాకినాడ పోర్టు విషయంలో సీబీఐతో లేదా సీఐడీతో దర్యాప్తు చేయించే అంశంపై కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు.
అన్నట్లుగానే ఇవాళ జరిగిన కేబినెట్ భేటీలో పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని లేవనెత్తారు. కాకినాడ పోర్టు ద్వారా జరుగుతున్న వేల టన్నుల బియ్యం అక్రమ రవాణాపై తీసుకోవాల్సిన చర్యలపై సీఎం చంద్రబాబుతో చర్చించారు. దీంతో చంద్రబాబు కూడా ఈ వ్యవహారంపై ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం కాకినాడ పోర్టులో జరుగుతున్న అరాచకాలపై సీఐడీతో విచారణ చేయిద్దామని పవన్ సహా మంత్రులకు తేల్చిచెప్పేశారు. అంతే కాదు ఏయే అంశాలపై సీఐడీతో దర్యాప్తు చేయిస్తారో కూడా చెప్పేశారు.
కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు రవాణా అవుతున్న అక్రమ బియ్యం వ్యవహారంతో పాటు వైసీపీ హయాంలో ఈ పోర్టు యాజమాన్యం చేతులు మారడం, బెదిరింపులు, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు, బియ్యం అక్రమ రవాణా సాగిన తీరు.. ఇలా పలు అంశాలపై సీఐడీతో విచారణ చేయిద్దామని మంత్రులకు చంద్రబాబు తెలిపారు.
👉జనం మధ్యలోకి జగన్, నేతలకు చంద్రబాబు హెచ్చరిక**
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతున్న పథకాలను ప్రజలలోకి తీసుకువెళ్లాలని ప్రభుత్వం గురించి ప్రచారం చేయాలని కూటమిలో ఉండే నేతలకు సైతం ఏపీ సీఎం చంద్రబాబు తెలియజేస్తున్నారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి ఆరు నెలలు కావస్తున్నప్పటికీ ప్రజలు ఏం చేశారనే విషయం పైన వివరించాలన్నట్లుగా నేతలకు సైతం సీఎం చంద్రబాబు హెచ్చరిస్తున్నారట..అయితే ఇదంతా కూడా వైసిపి అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలలోకి వెళ్లడానికి సంక్రాంతి నుంచి సిద్ధమవుతున్నారని వార్తలు వినిపిస్తున్న తరుణంలో కూటమి నేతలని సీఎం చంద్రబాబు యాక్టివ్ చేసేలా ప్లాన్ చేశారట.
దీంతో ప్రతిపక్ష నాయకుడు ప్రజలలోకి వెళితే కచ్చితంగా అధికార ప్రభుత్వానికి సెగ ఉండెనే ఉంటుంది. అలాగే ప్రజలు మరిచిపోయిన అంశాలను కూడా ప్రతిపక్షాలు కచ్చితంగా గుర్తుకు చేస్తాయి.. గతంలో చంద్రబాబు నాయుడు కూడా ప్రతిపక్ష నాయకుడుగా ప్రజల మధ్యలోకి వచ్చినప్పుడు జగన్ సర్కార్ పై మద్య, ఇసుక వంటి పాలసీల పైన తీవ్ర వ్యతిరేకత సృష్టించేలా చేశారు. ఇప్పుడు ఇదే పని కూడా జగన్ కేవలం 6 నెలల్లోనే చేసేలా ప్లాన్ చేస్తున్నారు..
జగన్ ప్రజల మధ్యకు వస్తే ఖచ్చితంగా సూపర్ సిక్స్ హామీలపై మాట్లాడుతారని ఆ సమయంలోనే పన్నుల బాదుడు, విద్యుత్ చార్జీల భారం వంటి వాటి పైన కూడా మాట్లాడుతారని ఒక రకంగా కూటమి ఎన్ని చేసినా కూడా ఒక్కసారి వ్యతిరేకత మొదలయ్యింది అంటే మళ్ళీ 2019 ఎన్నికల ముందు ఏం జరిగిందో అదే జరుగుతుందని అప్పుడు వంగి వంగి దండాలు పెట్టిన ఎవరూ పట్టించుకోరని.. అందుకే జగన్ కంటే ముందుగానే కూటమి నేతలను సైతం ప్రజలలోకి వెళ్లాలని చంద్రబాబు నేతలను హెచ్చరిస్తున్నారట.. జగన్ జనంలోకి వెళ్లడానికి ముందే తమ ప్రోగ్రెస్ ను ప్రజలకు వివరించాలని సీఎం చంద్రబాబు నేతలకు చెప్పినప్పటికీ.. ఇప్పటివరకు ఇందుకు సంబంధించి పార్టీ నాయకులు,బిజెపి నేతలు ఎవరూ కూడా యాక్టివ్ గా ఉండలేదట.. చంద్రబాబు ఏం చేస్తారు చూడాలి మరి.
👉రామ్ గోపాల్ వర్మ అకౌంట్ లోకి భారీగా డబ్బులు*!
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గత వైసిపీ ప్రభుత్వంలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఐటి శాఖ మంత్రి లోకేష్ పై ఎప్పటికప్పుడు అసభ్యపదజాలంతో విరుచుకుపడటమే కాకుండా,సోషల్ మీడియావేదికగా కూడా ఆ ముగ్గురిపై ట్రోల్ల్స్ చేస్తూ వాళ్ల పరువుకి భంగం కలిగించాడు.అంతే కాకుండా అసత్యాలని ప్రచారం చేస్తు కొన్ని రకాల సినిమాలు కూడా చేసాడు..
ఇప్పుడు ఈ విషయం మీద ప్రముఖ యూట్యూబర్ సంతు బాబు. మాట్లాడుతు చంద్రబాబు,పవన్,లోకేష్ ని వర్మ తిట్టినందుకు,వ్యతిరేకంగా సినిమా తీసినందుకు గాను వైసిపీ ప్రభుత్వం డిజిటల్ కార్పొరేషన్ అనే ఒక దాన్ని ఏర్పాటు చేసి వర్మకి భారీగా డబ్బులు చెల్లించిందని చెప్పుకొచ్చాడు.నెలకి ఇంత అని చెప్పి శాలరీ ఇవ్వడంతో పాటుగా సినిమాలకి డబ్బు కూడా వైసిపీనే ఇచ్చింది.అదంతా కూడా ప్రజల డబ్బే.పైగా వర్మకి డబ్బే ముఖ్యం.దాని కోసం ఎంత నీచానికైనా ఒడికడతాడు.డబ్బు ఇస్తానంటే తన ఇంట్లో వాళ్ళని కూడా తిడతాడని చెప్పుకొచ్చాడు.

7k network
Recent Posts

ప్రియాంక గాంధీపై బీజేపీ నేత ర‌మేష్ బిధూరి చేసిన అనుచిత వ్యాఖ్య‌ల ప‌ట్ల‌ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన మంత్రి సీత‌క్క‌*.. *నవీన్ కి చెక్ పెట్టినట్లే కేజ్రీవాల్ కి కూడా ?.. *ఈ ఫార్ములా రేసులో కొన్ని నిజాలు *.. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఛైర్మెన్ జంగా రాఘవ రెడ్డి … ఏపీ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, మంత్రి సత్య కుమార్ యాదవ్* …ప్రభుత్వ ఆస్తిని అప్పనంగా దోచుకున్న ఓం నారాయణ పై చర్యలు : లంబాడి హక్కుల పోరాట సంఘం.. *పొదిలి మాదిరెడ్డిపాలెం వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షులుగా ఎర్రం రెడ్డి

👉ఎంఎస్‌పీ పంజాబ్‌కే కాదు.. దేశమంతటికీ అవసరమే ..*తెలుగు తమ్ముళ్లకు సంక్రాంతి పండుగ ముందే వచ్చిందా.😲 ..హుస్నాబాద్ మైనార్టీ గురుకుల బాలికల పాఠశాల లో ఆకస్మిక తనిఖీలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ … ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాటులను పర్యవేక్షించిన జిల్లా అధికారులు ..*ఆత్మకూరులో ఇస్తేమ పనులను పర్యవేక్షించిన మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్ .. *

👉ఏపీలో రేపటి నుంచి ఉచిత ఓపీ సేవలు బంద్ …* విశాఖ పోర్టులో పట్టుకున్న బియ్యానికి కలెక్టర్ క్లీన్ చిట్..😲… *విశాఖ సెంట్రల్‌ జైల్ ను సందర్శించిన రాష్ట్ర హోం మంత్రి .. అగ్ని ప్రమాదాల పై అవగాహన సదస్సు.. *ఉచిత బస్సు కంటే ఇతర సంక్షేమ పథకాలకు ఖర్చు పెడితే బెటరేమో ! .. *అధికారులను సత్కరించిన పొదిలి పట్టణ టిడిపి అధ్యక్షుడు. . *నిలిచిపోయిన కాపు భవనాలను పునఃప్రారంభించాలి: బలిజ సేవ సంఘం డిమాండ్ .

2700 కోట్ల ఇల్లు.. రూ.10 లక్షల సూట్ ధరించే వారా విమర్శించేది? .. *పవన్ ఆదేశాలు.. సముద్ర తీరంలో రెండు బోట్లు సీజ్* .. *విజయవాడలో వెలుగు చూసిన అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారం .. *చంద్రగిరి ‘బీసీ’ విద్యార్థినులకు మెరుగైన వైద్యం* *తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ కు మంత్రి సవిత ఆదేశం*.. *ఆర్మీ వాహనం లోయలో పడి ఇద్దరు సైనికులు మృతి.. *పుత్తూరు సబ్ డివిజన్ పోలీసులు హెల్మెట్ వాడకంపై అవగాహన కార్యక్రమాలు … మైలవరం లో మిక్సీంగ్ రాజకీయ సెగలు…! ..*రాజకీయ దుమారం రేపిన పాలడుగు దుర్గా ప్రసాద్, ఎమ్మెల్యే వసంత కలయిక… *ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తూ పోలీస్ సిబ్బంది జీవన విధానం ఉండాలి : ఐజి వి సత్యనారాయణ.. *పోలీసుల వేధింపులు తట్టుకోలేక హుజూర్‌ నగర్ పోలీస్ స్టేషన్ ముందు యువకుడి ఆత్మహత్యాయత్నం .. * డిగ్రీ విద్యార్థులకు కూడా తక్షణమే వర్తింప చేయండి..మాజీ ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు పివి శేషయ్య.

*రెవిన్యూ అధికారులకు పై సియం సీరియస్*…*ప్రభుత్వ ఉద్యోగులపై ఆరోపణలు, కేసులు పెట్టే వారికి రక్షణ కల్పించేలా సర్కార్‌ చర్యలు.. *పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు పటిష్ట చర్యలు ; రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా…*కాంస్య పతకం సాధించి దేశ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన ఓరుగ‌ల్లు ముద్దుబిడ్డ .. *నితీష్ కి కన్ను గీటిన లాలూ..ఎన్డీయేలో కలవరమేనా ? ..*అమెరికాలో విచిత్రం ఇస్తున్న నోరో వైరస్ …*చైనాలో మరోసారి హెల్త్ ఎమర్జెన్సీ

⭐సూపర్-6 హామీలు కచ్చితంగా అమలు చేస్తాం..గత పాలనంతా విధ్వంసం…మేము రిపేర్లు చేస్తూ వెళ్తున్నాం..తప్పుడు పనులు చేయొద్దు.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు హెచ్చరిక : సీఎం చంద్రబాబు ..*మాదాపూర్ పేస్ హాస్పిటల్‌లో దారుణం.. *ఒక్క పైసా కూడా అవినీతి లేదు. -కేటీఆర్‌ ..*.. ఫారిన్‌లో ఎడ్యుకేషన్‌ పేరుతో మోసాలు. బోగస్‌ కన్సల్టెన్సీ ప్రతినిధులను అరెస్ట్‌ చేసిన పోలీసులు… సైబర్ నేరాలకు అడ్డా ‘వాట్సప్’.. హోంశాఖ నివేదిక.*.. యాపిల్ పండ్ల మాటున మద్యం అక్రమ తరలింపు …*తిరుపతిలో మత్తు వదిలించిన పోలీస్