రైతుల కోసం కేంద్రాన్ని ప్రశ్నించిన ఉపరాష్ట్రపతి* – ఏం హామీలిచ్చారు.. ఎందుకు నెరవేర్చడంలేదు? ..26 జిల్లాలు ప్రాతిపదికను రద్దు చేసి పాత 13 జిల్లాలనే ప్రకటించే యోచనలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం! ..ఇళ్ల పట్టాల పంపిణీలో భారీ కుంభకోణం…విక్రాంత్‌, విజయసాయి రెడ్డి, అరబిందో కంపెనీలపై సీఐడీ కేసు నమోదు .. ఆస్తులు లాక్కోవడం జగన్‌ సర్కారుకు అలవాటే- షర్మిల.. రఘురామ కేసులో హాట్ టాపిక్‌గా తులసి– ఎవరీయన?..బయోమెట్రిక్ వేయని సచివాలయ సిబ్బంది..* *15వేల మందికి షోకాజ్ నోటీసులు జారీ…వాజేడు ఎస్ఐ హరీష్ ఆత్మహత్య వెనుక విస్తుపోయే విషయాలు..ముఖ్యమంత్రిని “ఆహ్వానించిన” కడప ముస్లింలు:..జాగృతి ఆదర్శ విద్యాలయను వెంటనే సీజ్ చేయాలి…మఠంపల్లి ఎస్సై రామాంజనేయులు సస్పెన్షన్..

👉రైతుల కోసం కేంద్రాన్ని ప్రశ్నించిన ఉపరాష్ట్రపతి*
– ఏం హామీలిచ్చారు.. ఎందుకు నెరవేర్చడంలేదని సభలో ప్రశ్నించిన ధన్ ఖడ్- రైతులు గతేడాది ఆందోళన చేశారు.. ఇప్పుడు కూడా ఆందోళన చేస్తున్నారని వెల్లడి- దేశం మారుతున్నా రైతుల పరిస్థితిలో మార్పు రావడంలేదన్న ఉపరాష్ట్రపతి
దేశానికి అన్నం పెట్టే రైతన్న ఆందోళనతో రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటూ రాజ్యసభ చైర్మన్ జగ్ దీప్ ధన్ ఖడ్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాజ్యసభలో మంగళవారం ఈమేరకు కేంద్ర వ్యవసాయ మంత్రికి పలు ప్రశ్నలు సంధించారు. ‘దేశం మారుతుండడం తొలిసారి చూస్తున్నా.. అభివృద్ధి చెందిన భారతదేశం కోసం కలలు కనడం కాకుండా దానిని లక్ష్యంగా నిర్ణయించుకుని ముందుకు సాగడం ఫస్ట్ టైమ్ చూస్తున్నా.. దేశం ఉన్నత శిఖరాలవైపు పయనిస్తోంది. అయితే, రైతులు మాత్రం ఆందోళన చేస్తున్నారు. రోడ్లపైకెక్కి తమ ఆవేదన వెలిబుచ్చుతున్నారు. దేశంలో రైతు మాత్రమే అసహాయుడిగా మిగిలిపోతున్నాడు. అసలేం జరుగుతోంది?’ అంటూ మంత్రిని ధన్ ఖడ్ ప్రశ్నించారు. రైతులకు ఇచ్చిన హామీలు ఏంటి.. వాటిని ఎందుకు అమలు చేయలేకపోతున్నామని ధన్ ఖడ్ నిలదీశారు. రైతులు గతేడాది ఆందోళన చేశారు.. ఈ ఏడాది ఇప్పుడు కూడా ఆందోళన చేస్తున్నారని గుర్తుచేశారు. అయితే, కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దీనికి ఎలాంటి జవాబు ఇవ్వలేదు. ఉపరాష్ట్రపతి ప్రశ్నలకు చౌహాన్ మౌనాన్ని ఆశ్రయించారు. గత పదిహేనేళ్లుగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన శివరాజ్ సింగ్ చౌహాన్ ను బీజేపీ హైకమాండ్ కేంద్ర కేబినెట్ లోకి తీసుకుని వ్యవసాయ శాఖను అప్పగించిన విషయం తెలిసిందే.
👉 26 జిల్లాలు ప్రాతిపదికను రద్దు చేసి పాత 13 జిల్లాలనే ప్రకటించే యోచనలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం!😲
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన ఎన్నో కొత్త విధానాలను రద్దు చేస్తూ వచ్చింది.తాజాగా 26 కొత్త జిల్లాలు రద్దు చేసి13 పాత జిల్లాలు కొనసాగించే యోచనలో ఉందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది..
ఆంధ్రప్రదేశ్ లో 13 జిల్లాలను పార్లమెంటు సెగ్మెంట్ కేంద్రంగా ఒక జిల్లాగా గుర్తిస్తూ.. 26 జిల్లాలను చేశారు. నిజానికి 25 పార్లమెంటు స్థానాలు ఉన్నా.. విశాఖలో పెద్ద నియోజకవర్గాలు ఉండడంతో వాటిని రెండుగా విభజించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాలు ఉన్నాయి అయితే ఈ 26 జిల్లాల వల్ల ఎక్కడ పెద్దగా సమస్య అయితే ఏర్పడలేదు కానీ పలుచోట్ల మాత్రం జిల్లాల పేర్లు మార్చాలని అలాగే కలెక్టర్లకు భవనాలు లేకపోవడంతో కలెక్టర్ల కోసం అద్దె భవనాలను ఏర్పాటు చేశారు.
కొత్త జిల్లాల వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ ఉందని భావించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరిగి కొత్త జిల్లాలన్నింటిని రద్దుచేసి ఇకపై ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలనే ప్రకటించాలని ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది ప్రస్తుతం ఇదే విషయంపై చర్చలు కూడా జరుగుతున్నాయట. త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జిల్లాలు ఉన్నాయి అనే విషయంపై క్లారిటీ రానుంది.
👉ఇళ్ల పట్టాల పంపిణీలో భారీ కుంభకోణం*
గత ప్రభుత్వ హయాంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భారీ కుంభకోణం జరిగినట్లుగా కూటమి ప్రభుత్వం గుర్తించింది. లబ్ధిదారుల పేరిట అనర్హలకు ఇంటి స్థలాలు కేటాయించారని ఆ శాఖకు సంబంధించిన అధికారులు గుర్తించారు. అంతేకాదు ఆ పార్టీకి చెందిన నాయకుల చేత ముందుగానే కొన్ని ప్రాంతాలలో భూములు కొనుగోలు చేయించి ఎకరా 10 లక్షలు కూడా పలకని భూమికి కోట్ల రూపాయలు నాయకులకు లబ్ధి చేకూర్చినట్లు సంబంధిత శాఖ మంత్రి ఏపీ సీఎం చంద్రబాబుకు నివేదిక సమర్పించారు.రాష్ట్రంలో 32,000 ఎకరాల భూమి కొనుగోలుకు అప్పటి ప్రభుత్వం 24 వేల కోట్లు ఖర్చు చేసిందని కూటమి ప్రభుత్వం లెక్కలు చెబుతుంది. ఈ కుంభకోణంపై సిఐడి లేదా విజిలెన్స్ అధికారుల చేత విచారణ చేయించాలని ఏపీ సీఎం చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం..
👉ముఖ్యమంత్రిని “ఆహ్వానించిన” కడప ముస్లింలు:
ఈ నెల 15 డిశంబర్ 2024న ఆదివారం, కడప నగరంలో ముస్లిం సమూహం, సమాజం “జమీయత్ – ఉలేమా – ఏ – హింద్” పేరుతో ఐక్యంగా, సమిష్టిగా, సంఘటితంగా మరియు కలిసికట్టుగా నిర్వహించతలపెట్టిన “భారీ బహిరంగ సభ”కు ముఖ్యఅతిథిగా హాజరవ్వమని.. అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ను.. ప్రముఖ ముస్లిం మైనారిటీ నాయకులు, TDP మాజీ బాధ్యులు వి.ఎస్. అమీర్ బాబు నాయకత్వంలో..హజ్రత్ మౌలానా సయ్యద్ , ముతాది హుస్సేన్ సహా తదితర పెద్దలు వ్యక్తిగతంగా, సమూహ,సమాజ పక్షాన వెలగపూడి, అమరావతిలో కలిసి సాదరంగా అహ్వానించినట్లు సమాచారం.రండి.. అంధ్రప్రదేశ్ రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా, లక్షలాదిగా కడపకు తరలివచ్చి.. “భారీ బహిరంగ సభ” ఉద్దేశాన్ని, లక్ష్యాన్ని, ఆశయాన్ని మరియు సంకల్పాన్ని నెరవేర్చుదామని కోరారు.

👉 కాకినాడకు చెందిన ఆలీషా బార్జిల (పెద్ద పడవలు లేదా నౌకలు) తయారీ వ్యాపారవేత్త అని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు పంపిన నివేదికలో కాకినాడ జిల్లా అధికారులు వివరించారు. ఇటీవల కాకినాడ వచ్చిన పవన్‌ పోర్టులో బియ్యం తనిఖీల సందర్భంగా ‘హూ ఈజ్‌ ఆలీషా’ అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఆయన వివరాలను తెలియజేస్తూ ఉపముఖ్యమంత్రికి నివేదిక పంపారు. ‘కాకినాడ పోర్టులో ఆలీషా రెండెకరాలు లీజుకు తీసుకుని నౌకలు నిర్మిస్తున్నారు. ఒకప్పుడు ఆయిల్‌ స్మగ్లింగ్‌లో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ముంబైలో బార్జిలు/నౌకలు నిర్మిస్తున్నారు. గతంలో ఆయిల్‌ మాఫియాకు ఆయన గోదాములు ఇచ్చారని.. గత ప్రభుత్వంలో బార్జిల వ్యాపారంలో పైచేయిగా ఉండేలా చక్రం తిప్పారని, పలు రాష్ట్రాలతోపాటు దుబాయ్‌లో ఆస్తులు పోగేశారని రిపోర్టులో ప్రస్తావించారు. కాగా.. ఆలీషాకు బియ్యం వ్యాపారాలు ఉన్నాయన్న అనుమానంతో పవన్‌ ఆరా తీయగా.. అధికారులు విచారించి ఆయనకు అసలు బియ్యం వ్యాపారమే లేదని తేల్చారు.
👉విక్రాంత్‌, విజయసాయి రెడ్డి, అరబిందో కంపెనీలపై సీఐడీ కేసు నమోదు*.. కాకినాడ పోర్టు, సెజ్‌లలో వాటాలను లాక్కున్నారంటూ యాజమాని కేవీ రావు సీఐడీకి ఫిర్యాదు
– పోర్టులో రూ.2,500 కోట్ల విలువైన వాటాకు రూ.494 కోట్లే ఇచ్చారని ఆరోపణ – సెజ్‌లో రూ.1,104 కోట్ల షేర్లకు రూ.12 కోట్లే ఇచ్చినట్టు వెల్లడి – విజయసాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్, అరబిందో కంపెనీపై కేసు నమోదు – నాటి సీఎం జగన్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వెల్లడి…కాకినాడ పోర్టు, కాకినాడ సెజ్‌‌లలో తన వాటాలను బలవంతంగా, బెదిరించి లాక్కున్నారంటూ కాకినాడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ యజమాని కర్నాటి వెంకటేశ్వరరావు (కేవీరావు) సీఐడీకి ఫిర్యాదు చేశారు. పోర్టులో రూ.2500 కోట్ల విలువైన తన వాటాను రూ.494 కోట్లకు, సెజ్‌లో ఉన్న రూ.1109 కోట్ల విలువైన వాటాను కేవలం రూ.12 కోట్లకే లాక్కున్నారని సీఐడీ అదనపు డీజీకి ఫిర్యాదు అందించారు. దీంతో మంగళగిరి సీఐడీ అధికారులు సోమవారం కేసు నమోదు చేశారు. ఐపీసీ 506, 384, 420, 109, 467, 120(బి) రెడ్‌ విత్‌ 34 ఐపీసీ, భారతీయ న్యాయ సంహితలోని ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ బీఎన్‌ఎస్‌ 111 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
*కేవీ రావు ఫిర్యాదులో ఏముంది?*
జగన్‌ మోహన్ రెడ్డి సీఎం అవ్వగానే తన కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వంతో ఇబ్బందులు మొదలయ్యాయని ఆయన పేర్కొన్నారు. చెన్నైకి చెందిన శ్రీధర్‌ అండ్‌ సంతానం కంపెనీ, ముంబైకి చెందిన మరో సంస్థతోనూ ఆడిట్‌ చేయిస్తున్నామంటూ సమాచారం ఇచ్చారని తెలిపారు. ఎంతో నిజాయతీగా నడుచుకున్నప్పటికీ.. ప్రభుత్వానికి రూ.994 కోట్లు ఎగ్గొట్టినట్లు వైసీపీ సర్కారుకు ఆడిట్ రిపోర్టు సమర్పించారని కేవీ రావు వెల్లడించారు. ఇదే సమయంలో విజయసాయి రెడ్డి తమకు ఫోన్ చేసి జగన్‌ మోహన్ రెడ్డి బాబాయ్‌ వైవీ సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్‌ రెడ్డిని కలవాలని చెప్పారని తెలిపారు. ఆయన దగ్గరకు వెళ్లి మాట్లాడగా.. ‘మీ కుటుంబం జైలుకు వెళ్లకూడదనుకుంటే కంపెనీ షేర్లన్నీ అమ్మేయండి’ అంటూ బెదిరించానని కేవీ రావు వాపోయారు. ఇది తన మాట కాదని, సీఎం జగన్‌ హుకుం అంటూ విక్రాంత్ రెడ్డి హెచ్చరించారని పేర్కొన్నారు. దిక్కుతోచని పరిస్థితిలో కంపెనీ షేర్లు అమ్మడానికి ఒప్పుకున్నామని, 41.14 శాతం షేర్ విలువను కేవలం రూ.494 కోట్లుగా ఖరారు చేశామని, ఒప్పందం చేసుకోవాలంటూ హెచ్చరించారని కేవీ రావు తెలిపారు. ఒక్క ఏడాదిలోనే భారీ ఆదాయాన్ని సంపాదించే తమ కంపెనీ షేర్లకు ఇంత తక్కువ విలువ కట్టడం ఏమిటని ప్రశ్నించినా పట్టించుకోలేదని ఆయన వివరించారు. బెజవాడ బెంజ్‌ సర్కిల్‌లో స్థిరాస్తిని కూడా తక్కువ రేటుకు లాక్కున్నారని వివరించారు.
*కాకినాడ సెజ్‌లో ఏం జరిగింది? అరబిందో కేసు ఏంటి?*
కాకినాడ సెజ్‌ను 1999 నుంచి జీఎంఆర్‌తో కలిపి తాము అభివృద్ధి చేశామని కేవీ రావు తన ఫిర్యాదులో వెల్లడించారు. సెజ్‌లో 48.74శాతం తమ కుటుంబ వాటా కాగా, మిగిలింది జీఎంఆర్‌ వాటా అని వివరించారు. సెజ్ పేరిట 8 వేల ఎకరాల భూమి, పోర్టులో షేర్లు ఉన్నాయని, వైసీపీ సర్కారు బాధలు పడలేక సెజ్‌లో తమ భూమి, వాటాను రూ.400 కోట్లకు భాగస్వామి జీఎంఆర్‌కు అప్పగించాలనుకున్నామని తెలిపారు. వాస్తవానికి ఆ ఆస్తి విలువ రూ.1104 కోట్లే అయినప్పటికీ భాగస్వామి కావడంతో జీఎంఆర్‌‌కు వదిలేయాలనుకున్నామని, ఈ మేరకు అగ్రిమెంట్ కూడా కుదిరిందని పేర్కొన్నారు. అయితే ఈ డీల్‌ను రద్దు చేసుకొని భూమి మొత్తం తమకే అప్పగించాలంటూ అరబిందో యాజమాన్యం తమను బెదిరించిందని కేవీ రావు వివరించారు. భూమిని తమకు ఇవ్వకుంటే జైలుకు పోవాల్సి ఉంటుందని బెదిరించిందని పేర్కొన్నారు. రూ.12 కోట్లు మాత్రమే ఇచ్చి కాకినాడ సెజ్‌లో ఉన్న 48.74 శాతం తమ వాటాను లాక్కున్నారని వాపోయారు. తన కంపెనీ ఆదాయంలో 22 శాతం ప్రభుత్వానికి చెల్లించేలా ఒప్పందం ఉందని, అయితే 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇబ్బందులు మొదలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
*జగన్ పట్టించుకోలేదు*
తమకు జరిగిన అన్యాయంపై నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని కేవీ రావు ఫిర్యాదులో కేవీ రావు వాపోయారు. తాడేపల్లిలోని జగన్‌ ప్యాలెస్‌కు విక్రాంత్ రెడ్డి తనను తీసుకెళ్లారని, అన్యాయం జరగబోతోందని చెప్పబోతుండగానే విక్రాంత్ రెడ్డి చెప్పినట్టు వినాలని జగన్ అన్నారని వివరించారు.
👉 మంత్రి నాదెండ్ల మనోహర్‌ చెప్పినట్లు వైసీపీ నేతలు కాకినాడ పోర్టు నుంచి బియ్యం స్మగ్లింగ్‌ చేయడం వల్ల రాష్ట్రానికి రెవెన్యూ రాబడి తగ్గిపోతుందని టీడీపీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ఆదాయం తగ్గినప్పుడు రాష్ట్ర విజిలెన్స్‌ కమిషన్‌ అందుకు కారణమైన స్మగ్లింగ్‌పై విచారణకు ఆదేశించవచ్చని పేర్కొన్నారు. విచారణ ఆలస్యం చేస్తే ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే ప్రమాదముందన్నారు. కాకినాడ పోర్టు నుంచి ఎన్నో ఏళ్ల తరబడి బియ్యం అక్రమ రవాణా జరుగుతుందని ప్రభుత్వమే పేర్కొంటున్నందున వెంటనే ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు కూడా ప్రభుత్వాన్ని అదే కోరుకుంటున్నారని యనమల ఆ ప్రకటనలో తెలిపారు.
👉 ఆస్తులు లాక్కోవడం జగన్‌ సర్కారుకు అలవాటేనని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. జగన్‌ హయాంలో ఆస్తులు లాక్కోవడం ట్రెండ్‌ అయితే.. వాటిని చూసీ చూడనట్లుగా వదిలేయడం కూటమి ప్రభుత్వానికి ట్రెండ్‌గా మారిందని మంగళవారం ఎక్స్‌ వేదికగా ఆరోపించారు. ‘‘అధికారంలోకి వచ్చి ఆరు నెలలు దాటినా గత ప్రభుత్వం ధారాదత్తం చేసిన ఏ ఒక్క ఆస్తిపైనా కనీసం చర్య కూడా లేదు. రాష్ట్రంలో కాకినాడ పోర్టుతో సహా.. కృష్ణపట్నం పోర్టునూ అప్పట్లో గుంజుకున్నారు. ప్రభుత్వాధీనంలోని అత్యధిక లాభాలు గడిస్తున్న గంగవరం పోర్టునూ అప్పనంగా అమ్మేశారు. ఏపీని పోర్టులకు హబ్‌లుగా మార్చే పాలసీలు సరే.. మరి గంగవరం పోర్టు మాటేమిటి. ఏటా దాదాపు రూ. 2,000 కోట్ల లాభాలు గడించే పోర్టును వైసీపీ ప్రభుత్వం 2021లో అదానీకి రాసిచ్చేసింది. నికర ఆర్థిక నిల్వలతో పాటు రూ. 9,000 కోట్లు విలువచేసే 10 శాతం వాటాలను కేవలం రూ. 640 కోట్లకే అమ్మేశారు. బీవోటీ కింద మరో పదిహేనేళ్లలో ప్రభుత్వ పరం అవ్వాల్సిన పోర్టు అది. ఎలాంటి టెండర్లు లేకుండానే అదానీకి జగన్‌ కట్టబెట్టేశారు. పైగా మిగతా పోర్టుల అభివృద్ధికి ఆ నిధులు ఉపయోగపడతాయని జగన్‌ బుకాయించారు. ప్రతిపక్షంలో ఉండగా గంగవరం పోర్టుపై కూటమి పక్షాలు చెప్పిన మాటలకు.. చేస్తున్న విధానాలకూ పొంతనే లేదు’’ అని షర్మిల విమర్శించారు.
👉ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ. 22,507 కోట్లతో వైజాగ్ మరియు విజయవాడ మెట్రో ప్రాజెక్టుల ఫేజ్ 1ని ఆమోదించింది.వైజాగ్: 46.23 కి.మీ విజయవాడ: 38.40 కి.మీ
👉 వాజేడు ఎస్ఐ హరీష్ ఆత్మహత్య వెనుక విస్తుపోయే విషయాలు..!!!
హరీష్ ప్రేమించిన యువతి గతంలో ముగ్గురు యువకులను ప్రేమ పేరుతో మోసం చేసిందని, ఆ ముగ్గురిపై కేసులు కూడా పెట్టినట్లు సమాచారం.డబ్బు, పలుకుబడి ఉన్నవారిని ఆ యువతి లొంగదీసుకుంటుందని, ఈ క్రమంలోనే ఎస్ఐ హరీష్‌ను కూడా ప్రేమలోకి దించిందని సమాచారం.
ఈ నెల 14న ఎంగేజ్మెంట్ ఉండగా.. హరీష్‌ ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఆ యువతి హరీష్‌తో పాటే ఉంది.
దీంతో ఈ విషయాలు తెలియడంతో మనస్తాపానికి గురై ఎస్ఐ హరీష్‌ ఆత్మహత్య చేసుకున్నాడా? లేక యువతి బెదిరించినందుకు ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
👉 *బయోమెట్రిక్ వేయని సచివాలయ సిబ్బంది..*
*15వేల మందికి షోకాజ్ నోటీసులు జారీ..గుంటూరు :
గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు విధిగా బయోమెట్రిక్ హాజరు వేయాలి అయితే 13 రోజులు పాటు వారు వరుసగా బయోమెట్రిక్ వేయకపోవడంతో ప్రభుత్వం వారికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది..
AP రాష్ట్రంలోని 15 వేల మంది గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి ఈ నోటీసులు జారీ చేశారు …
👉రఘురామ కేసులో హాట్ టాపిక్‌గా తులసి– ఎవరీయన?*
రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఇప్పుడు ఓ కొత్తపేరు హాట్ టాపిక్ గా మారుతోంది. తనను అరెస్టు చేసిన కలెక్షన్ ఎజెంట్ అయిన కామేపల్లి తులసి అనే భారీకాయుడ్ని తనపై కూర్చోబెట్టారని రఘురామ ఆరోపించారు. ఆయన ఇప్పుడు గుడివాడలో దందాలు చేస్తున్నారని కూడా రఘురామ ఆరోపించారు. ఈ కారణంగా అసలు ఈ కామేపల్లి తులసీ ఎవరు అన్నదానిపై ఏపీలో విస్తృత చర్చ జరుగుతోంది.
*కామేపల్లి తులసీ – ఐపీఎస్ సునీల్ సన్నిహితుడు !*
రఘురామను కస్టోడియల్ టార్చర్ చేసినప్పుడు ఎక్కువగా ప్రైవేటు వ్యక్తులే ఉన్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అసలు పోలీసుల కన్నా బయట వ్యక్తులే వచ్చి టార్చర్ చేశారని రఘురామ ఆరోపిస్తున్నారు. అలా వచ్చిన వ్యక్తి కామేపల్లి తులసి. ఆయన పోలీసు డిపార్టుమెంట్‌లో ఉద్యోగికాదు. కానీ అప్పటి సీఐడీ చీఫ్ సునీల్ కు మాత్రం అత్యంత సన్నిహితుడు అని పోలీస్ డిపార్టుమెంట్‌లో అందరికీ తెలుసని గుసగుసలు వినిపిస్తున్నాయి.
*ఇప్పుడు గుడివాడలో ఏం చేస్తున్నారు ?*
ఇప్పుడు గుడివాడలో ఈ కామేపల్లి తులసి షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. ఆయన ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు సన్నిహితునిగా ఉంటూ నియోజకవర్గంలో వ్యవహారాలు చక్క బెడుతున్నరాని చెబుతున్నారు. ఆయన కృష్ణా జిల్లాకు చెందిన వ్యక్తి కాదు. ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తి. గుంటూరులో చేసిన ఓ డీల్ సమయంలో వెనిగండ్ల రాముకు ఆయన పరిచయం అయ్యారని అప్పట్నుంచి దగ్గరయ్యారని అంటున్నరు.
*పీవీ సునీల్‌కు.. వెనిగండ్ల రాముకూ సాన్నిహిత్యం?*
ఏపీ రాజకీయాల్లో చాలా మందికి తెలియనిది ఏమిటంటే.. టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, ఐపీఎల్ సునీల్ కుమార్ కూ సాన్నిహిత్యం ఉందని. వారిద్దరికి పరిచయం ఉందని.. ఈ కారణంగానే తులసీ టీడీపీ ఎమ్మెల్యేకు మరింత దగ్గరయ్యారని అంటున్నారు. వెనిగండ్ల రాము భార్య ఎస్సీ సామాజికవర్గానికి చెందినవారు. ఆయన మామకు చర్చిల్లో పలుకుబడి ఉంది. ఈ క్రమంలో పరిచయాలు పెరిగి ఉంటాయని కూడా అంచనా వేస్తున్నారు.
కారణం ఏదైనా ఈ కస్టోడియల్ టార్చర్ వ్యవహారంలో కామేపల్లి తులసి పేరును రఘురామ బయట పెట్టే వరకూ ఎవరికీ తెలియదు. ఇప్పుడు జరగబోయే పరిణామాలు మాత్రం ఆసక్తికరంగా ఉండే అవకాశం ఉంది.
👉నెల్లూరుకు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత*- ఏపీలో అక్రమంగా తరలిపోతున్న రేషన్ బియ్యం
– మైదుకూరు నుంచి నెల్లూరుకు బియ్యం తరలింపు
– 600 బస్తాల బియ్యాన్ని సీజ్ చేసిన అధికారులు
ఏపీలో పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదార్లు పడుతోంది. కేటుగాళ్లు రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. ఓవైపు కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం స్మగ్లింగ్ అంశం కలకలం రేపుతోంది. మరోవైపు మైదుకూరు నుంచి నెల్లూరుకు అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని రెవెన్యూ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు పట్టుకున్నారు. బియ్యం తరలిస్తున్న లారీని బద్వేలు వద్ద అదుపులోకి తీసుకున్నారు. లారీలో ఉన్న రూ. 15 లక్షల విలువైన 600 బస్తాల బియ్యాన్ని అధికారులు సీజ్ చేశారు. లారీతో పాటు డ్రైవర్ ఓబులేసును అదుపులోకి తీసుకున్నారు.
👉రాయచోటి..
విద్యార్థుల మద్య జరుగుతున్న ఘర్షణ ఆపిన ఉపాధ్యాయుడు.ఇద్దరు అన్నదమ్ములు మరొక విద్యార్థి కలిసి ఇతర విద్యార్థుల మీద దౌర్జన్యం చేసిన సందర్భంలో వారిని అడ్డుకున్న ఉపాధ్యాయుడు దీంతో ఒక్కసారిగా ఉపాధ్యాయుడి పై ఆ ముగ్గురు పిడిగుద్దులతో చెస్ట్ మీద , ముఖం మీద దాడికి పాల్పడటంతో కళ్ళద్దాలు కూడా విరిగిపోయిన పరిస్థితులలో మిగిలిన విద్యార్థులు విడిపించగా తీవ్ర ఆవేదనలో ఒక్కసారిగా కుప్పకూలిపోయిన ఉపాధ్యాయుడు.వెంటనే ఆసుపత్రిలో చేర్చిన తోటి ఉపాధ్యాయులు.కాసేపటికే ప్రాణాలు కోల్పోయిన హృదయ విషాదకర, విచారకరమైన ఈ సంఘటనను ఏ విధంగా అర్థం చేసుకోవాలో ఉపాధ్యాయ సమాజం విశ్లేసించుకోవాలి.
ఎటు పోతోంది నేటి యువత!
👉తల్లి నుంచి దూరమైన పిల్లలను తిరిగి తల్లి దగ్గరకు చేర్చిన రాజంపేట సబ్ కలెక్టర్ నైదియా దేవి…*
*రాజంపేట సబ్ కలెక్టర్ ను ప్రత్యేకంగా అభినందించిన జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి..
రాజంపేట, డిసెంబర్ 04:
రాజంపేటలో తల్లి దగ్గర నుంచి దూరం చేసిన పిల్లలను తిరిగి తల్లి దగ్గరకు చేర్చిన సంఘటనలో రాజంపేట సబ్ కలెక్టర్ నైదియాదేవి చేసిన కృషిని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ప్రత్యేకంగా అభినందించారు.
రాజంపేట కు చెందిన నజ్మా, చైతన్య పాఠశాలలో చదువుతున్న తన పిల్లలను వారి తండ్రి తనకు తెలియకుండా పాఠశాల నుంచి తీసుకెళ్లిపోయాడని నిస్సహాయ స్థితిలో ఉన్నానని సహాయం చేయవలసిందిగా సబ్ కలెక్టర్ నైదియా దేవికి ఆవేదనతో విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన సబ్ కలెక్టర్, పిడి ఐసిడిఎస్, సిడిపిఓ రాజంపేట మరియు పోలీసు సిబ్బందితో ప్రత్యేక టీం ను ఏర్పాటు చేశారు. ఈ బృందం బెంగుళూరు వెళ్లి పిల్లలను తీసుకువచ్చి పిల్లల తల్లికి డిసెంబర్ 4న అప్పగించారు.
ఎంతో చాకచక్యంగా పిల్లలను తల్లి దగ్గరకు చేర్చిన బృంద సభ్యులు… వై హరినాథ్ (కానిస్టేబుల్), రమణ (కానిస్టేబుల్), సాదిక్ నిసా (వన్ స్టాప్ సెంటర్, రాయచోటి), శైలజ (సోషల్ వర్కర్, జిల్లా పిల్లల రక్షణ యూనిట్, రాయచోటి) లను రాజంపేట సబ్ కలెక్టర్ నైదియాదేవి అభినందించారు. ఈ సందర్భంగా…. వెంటనే చర్యలు చేపట్టి పిల్లలను తల్లి దగ్గరికి చేర్చిన రాజంపేట సబ్ కలెక్టర్ నైదియాదేవికి జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
👉 డ్రగ్స్ కేసులో నటుడు మన్సూర్ అలీ ఖాన్ కొడుకు అరెస్ట్..
నటుడు మన్సూర్ అలీఖాన్ కొడుకు అలీఖాన్ తుగ్లక్, డ్రగ్స్ కేసులో అరెస్టయ్యాడు. అతడు డ్రగ్స్ అమ్మినట్లు, అలాగే వాడినట్లు పోలీసులు వైద్యపరీక్షల్లో నిర్ధారించారు. గత వారం కార్తికేయన్ అనేవ్యక్తితో సహా 10 మంది కాలేజీ విద్యార్థులను డ్రగ్స్ అమ్మకాలకు సంబంధించి జె.జె.నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో కార్తికేయన్ ద్వారా అలీఖాన్ ఆన్లైన్లో డ్రగ్స్ కొని, అమ్మారని, వాడారని తేలింది. దీంతో ఆయన్ను అరెస్ట్ చేశారు.
👉*ప్రొద్దుటూరు*
*దీప్తి జూనియర్ కాలేజ్ యాజమాన్యం నిర్వాహకం*
*ఇద్దరు ఇంటర్ విద్యార్థులను విచక్షణారహితంగా బాదిన ఫిజిక్స్ లెక్చరర్*
*విద్యార్థుల గాయాలకు పెయిన్ కిల్లర్ స్ప్రే కొట్టి పంపించిన కాలేజీ యాజమాన్యం*..
*విద్యార్థుల తల్లిదండ్రులు.. విద్యార్థి సంఘాలు దీప్తి జూనియర్ కాలేజీ వద్ద ఆందోళన*.
👉ట్రస్ట్ పేరుతో ఫీజులు వసూలు*
*జాగృతి ఆదర్శ విద్యాలయను వెంటనే సీజ్ చేయాలి..*
*విద్యార్థులు ప్రాణాలతో చెలగాటమాడుతున్న జాగృతి ఆదర్శ విద్యాలయం యజమానిపై వెంటనే చర్యలు తీసుకోవాలి..*
*జై భీమ్ రావ్ భారత్ అనంతపురం జిల్లా యూత్ ప్రెసిడెంట్ చందు నాయక్ డిమాండ్*
*విలేకరుల సమావేశంలో జై భీమ్ రావ్ భారత్ పార్టీ అనంతపురం జిల్లా యూత్ ప్రెసిడెంట్ రమావత్ చందు నాయక్ మాట్లాడుతూ….*
*అనంతపురం జిల్లా కూడేరు మండల కేంద్రంలో గల జాగృతి ఆదర్శ విద్యాలయము ఇది సేవా ట్రస్ట్ పేరు అని చెప్పి విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర ఫీజులు వసూలు చేస్తున్నారు. ట్రస్ట్ అంటే దాతలు నుంచి డబ్బులు సేకరించి వాటి ద్వారా ఒక ప్రైవేట్ పాఠశాల నిర్మించి విద్యార్థులకు తక్కువ ఫీజులతో విద్యార్థులను చదివిస్తున్నామని. జాగృతి విద్యలయ యజమాన్యం చెబుతున్నారు. కానీ వారు స్కూల్ ఫీజు యూనిఫామ్ ఫీజు బుక్స్ ఫీజు వ్యాన్ ఫీజు అని రకరకాలుగా వారి ఇష్టానుసారం ధరలు నిర్ణయించి ఫీజులు వసూలు చేస్తున్నారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి జాగృతి ఆదర్శ విద్యాలయ యజమాన్యంపై తగిన చర్యలు తీసుకుని ఉన్నత అధికారులు స్పందించి ఆ పాఠశాలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. జాగృతి ఆదర్శ విద్యాలయం విద్యార్థులకు చుట్టుపక్కల పల్లెల నుంచి రవాణా చేయడానికి మూడు టాటా మ్యాజిక్ లో మూడు ఆటోలు సమకూర్చారు ఏ ఒక్క దానికి కూడా రికార్డులు సరిగ్గా లేవు డ్రైవర్లకు లైసెన్సులు లేవు ఒక ఆటోలో 30 మంది విద్యార్థులను గొర్రెలను తోలినట్లు తోలుతున్నారు. పలు విద్యార్థి సంఘాలు ఈ విషయంపై పలుమార్లు హెచ్చరించడం జరిగింది. విద్యార్థులకు ఏమైనా ప్రాణహాని జరిగితే ఎవరు బాధ్యతలు ఇంత నిర్లక్ష్యంగా దారుణంగా ట్రస్ట్ పేరుతో విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు ఇప్పటికైనా ఎంఈఓ స్పందించి స్కూల్ యజమానిపై తగిన చర్యలు తీసుకొని ఆ స్కూల్లో సీజ్ చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షాన కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని ఎంఈఓ ని తెలియజేశారు
👉సూర్యాపేట జిల్లా…హుజూర్నగర్ నియోజకవర్గంలో మఠంపల్లి ఎస్సై గా విదులు నిర్వహిస్తున్న రామాంజనేయులు సస్పెన్షన్….
పలు అవినీతి ఆరోప ణల నేపథ్యంతో జిల్లాలోని మఠంపల్లి ఎస్సై రామాంజనేయులును విధుల నుంచి తొలగిస్తున్నట్లు తెలంగాణ మల్టీ జోన్-2 ఐజీ సత్య నారాయణ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
మట్టపల్లికి చెందిన ఓ వ్యక్తి అమెరికాలో స్థిరప డ్డారు. ఇటీవల ఎస్సై రామాంజనేయులు ఆ వ్యక్తికి చెందిన కారు మట్టపల్లిలోనే ఉండటంతో తన సొంత అవసరాల కోసం వినియో గించుకొని తిరిగి ఇస్తానని తీసుకున్నారు. కానీ వారం రోజులు గడుస్తున్నా కారును తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తుండ టంతో బాధితుడు ఈ విషయమై డీజీపీతో పాటు జిల్లా ఎస్పీకి ఈ- మెయిల్ ద్వారా పిర్యాదు చేశారు…ఎస్సైపై విచారణకు ఆదేశించిన అధికారులకు ఈ ఘటనతోపాటు పలు అవినీతి ఆరోపణలు వెలుగు చూసినట్లు సమాచారం..దీంతో ఎస్సై రామాంజనేయు లును విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు…

7k network
Recent Posts

ప్రియాంక గాంధీపై బీజేపీ నేత ర‌మేష్ బిధూరి చేసిన అనుచిత వ్యాఖ్య‌ల ప‌ట్ల‌ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన మంత్రి సీత‌క్క‌*.. *నవీన్ కి చెక్ పెట్టినట్లే కేజ్రీవాల్ కి కూడా ?.. *ఈ ఫార్ములా రేసులో కొన్ని నిజాలు *.. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఛైర్మెన్ జంగా రాఘవ రెడ్డి … ఏపీ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, మంత్రి సత్య కుమార్ యాదవ్* …ప్రభుత్వ ఆస్తిని అప్పనంగా దోచుకున్న ఓం నారాయణ పై చర్యలు : లంబాడి హక్కుల పోరాట సంఘం.. *పొదిలి మాదిరెడ్డిపాలెం వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షులుగా ఎర్రం రెడ్డి

👉ఎంఎస్‌పీ పంజాబ్‌కే కాదు.. దేశమంతటికీ అవసరమే ..*తెలుగు తమ్ముళ్లకు సంక్రాంతి పండుగ ముందే వచ్చిందా.😲 ..హుస్నాబాద్ మైనార్టీ గురుకుల బాలికల పాఠశాల లో ఆకస్మిక తనిఖీలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ … ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాటులను పర్యవేక్షించిన జిల్లా అధికారులు ..*ఆత్మకూరులో ఇస్తేమ పనులను పర్యవేక్షించిన మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్ .. *

👉ఏపీలో రేపటి నుంచి ఉచిత ఓపీ సేవలు బంద్ …* విశాఖ పోర్టులో పట్టుకున్న బియ్యానికి కలెక్టర్ క్లీన్ చిట్..😲… *విశాఖ సెంట్రల్‌ జైల్ ను సందర్శించిన రాష్ట్ర హోం మంత్రి .. అగ్ని ప్రమాదాల పై అవగాహన సదస్సు.. *ఉచిత బస్సు కంటే ఇతర సంక్షేమ పథకాలకు ఖర్చు పెడితే బెటరేమో ! .. *అధికారులను సత్కరించిన పొదిలి పట్టణ టిడిపి అధ్యక్షుడు. . *నిలిచిపోయిన కాపు భవనాలను పునఃప్రారంభించాలి: బలిజ సేవ సంఘం డిమాండ్ .

2700 కోట్ల ఇల్లు.. రూ.10 లక్షల సూట్ ధరించే వారా విమర్శించేది? .. *పవన్ ఆదేశాలు.. సముద్ర తీరంలో రెండు బోట్లు సీజ్* .. *విజయవాడలో వెలుగు చూసిన అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారం .. *చంద్రగిరి ‘బీసీ’ విద్యార్థినులకు మెరుగైన వైద్యం* *తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ కు మంత్రి సవిత ఆదేశం*.. *ఆర్మీ వాహనం లోయలో పడి ఇద్దరు సైనికులు మృతి.. *పుత్తూరు సబ్ డివిజన్ పోలీసులు హెల్మెట్ వాడకంపై అవగాహన కార్యక్రమాలు … మైలవరం లో మిక్సీంగ్ రాజకీయ సెగలు…! ..*రాజకీయ దుమారం రేపిన పాలడుగు దుర్గా ప్రసాద్, ఎమ్మెల్యే వసంత కలయిక… *ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తూ పోలీస్ సిబ్బంది జీవన విధానం ఉండాలి : ఐజి వి సత్యనారాయణ.. *పోలీసుల వేధింపులు తట్టుకోలేక హుజూర్‌ నగర్ పోలీస్ స్టేషన్ ముందు యువకుడి ఆత్మహత్యాయత్నం .. * డిగ్రీ విద్యార్థులకు కూడా తక్షణమే వర్తింప చేయండి..మాజీ ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు పివి శేషయ్య.

*రెవిన్యూ అధికారులకు పై సియం సీరియస్*…*ప్రభుత్వ ఉద్యోగులపై ఆరోపణలు, కేసులు పెట్టే వారికి రక్షణ కల్పించేలా సర్కార్‌ చర్యలు.. *పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు పటిష్ట చర్యలు ; రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా…*కాంస్య పతకం సాధించి దేశ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన ఓరుగ‌ల్లు ముద్దుబిడ్డ .. *నితీష్ కి కన్ను గీటిన లాలూ..ఎన్డీయేలో కలవరమేనా ? ..*అమెరికాలో విచిత్రం ఇస్తున్న నోరో వైరస్ …*చైనాలో మరోసారి హెల్త్ ఎమర్జెన్సీ

⭐సూపర్-6 హామీలు కచ్చితంగా అమలు చేస్తాం..గత పాలనంతా విధ్వంసం…మేము రిపేర్లు చేస్తూ వెళ్తున్నాం..తప్పుడు పనులు చేయొద్దు.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు హెచ్చరిక : సీఎం చంద్రబాబు ..*మాదాపూర్ పేస్ హాస్పిటల్‌లో దారుణం.. *ఒక్క పైసా కూడా అవినీతి లేదు. -కేటీఆర్‌ ..*.. ఫారిన్‌లో ఎడ్యుకేషన్‌ పేరుతో మోసాలు. బోగస్‌ కన్సల్టెన్సీ ప్రతినిధులను అరెస్ట్‌ చేసిన పోలీసులు… సైబర్ నేరాలకు అడ్డా ‘వాట్సప్’.. హోంశాఖ నివేదిక.*.. యాపిల్ పండ్ల మాటున మద్యం అక్రమ తరలింపు …*తిరుపతిలో మత్తు వదిలించిన పోలీస్