ప్రతిపక్ష నాయకుడిగా తన హక్కులను మోదీ సర్కారు కాలరాసింది – రాహుల్‌గాంధీ .. ఏపీలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం: మంత్రి లోకేష్.. మంత్రి డోలా సమక్షంలో20 దళిత కుటుంబాలు టీడీపీలో చేరిక…. . మంగళగిరిలో మంత్రి లోకేష్ ను కలిసిన మార్కాపురం ఎమ్మెల్యే కందుల.. రైతులకు అవగాహన (కంభం)…. విద్యార్థులకు అవగాహన (కంభం)

👉 ప్రతిపక్ష నాయకుడిగా తన హక్కులను మోదీ సర్కారు కాలరాసిందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆక్షేపించారు. మత ఉద్రిక్తతలు నెలకొన్న ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌ జిల్లాకు వెళ్లేందుకు తన సోదరి ప్రియాంకతో కలిసి ఆయన చేసిన ప్రయత్నాన్ని పోలీసులు వమ్ముచేశారు. ఢిల్లీ – యూపీ సరిహద్దుల్లోని ఘజియాబాద్‌ వద్ద వారిని అడ్డుకుని వెనక్కి పంపించివేశారు. బుధవారం ఉదయం 11 గంటలకు రాహుల్‌ తన కాన్వాయ్‌తో ఘజియాబాద్‌ వరకు చేరుకున్నారు. అప్పటికే అక్కడ పెద్దఎత్తున మోహరించిన పోలీసులు జాతీయ రహదారిని బారికేడ్‌లతో మూసివేశారు. రాహుల్‌ తన వాహనంలోంచి దిగి సీనియర్‌ పోలీసు అధికారులతో మాట్లాడినా.. ప్రయోజనం లేకపోయింది. దీంతో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. తన పర్యటనను పోలీసులు అడ్డుకోవడం తన రాజ్యాంగ హక్కులను హరించడమేనని రాహుల్‌ ఆక్షేపించారు. ‘‘సంభాల్‌కు వెళ్లకుండా పోలీసులు నన్ను అడ్డుకున్నారు. కార్యకర్తలు వెంట లేకుండా ఒక్కడినే అక్కడకు వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పాను. అయినా, పోలీసులు అంగీకరించలేదు. ఒక విపక్ష నేతగా సంభాల్‌లో పర్యటించడం నా విధి.. రాజ్యాంగ హక్కు. ఆ హక్కును పోలీసులు హరించారు. నా పర్యటనను చూసి ఎందుకు బీజేపీ భయపడుతోంది’’ అని రాహుల్‌ విమర్శించారు.
👉వారికి రూ.లక్ష: హోమంత్రి అనిత..
విధి నిర్వహణలో అమరులైన పోలీసు కుటుంబాలకు అందించే తక్షణ సాయాన్ని కూటమి ప్రభుత్వం మూడు రెట్లు పెంచింది. వారి అంతిమ సంస్కారాల కోసం అందించే రూ.25 వేల సాయాన్ని రూ. లక్షకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విధి నిర్వహణలో ప్రమాదవశాత్తూ/ ఆకస్మికంగా/అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు ఇది వర్తిస్తుందని హోంమంత్రి అనిత ఎక్స్లో వెల్లడించారు.
👉ఏపీలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం: మంత్రి నారా లోకేశ్*
ఏపీలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయనున్నట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యపై నిర్వహించిన సమీక్షలో లోకేశ్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలకు స్టార్ రేటింగ్ ఇవ్వాలని నిర్ణయించారు. ప్రభుత్వ సలహాదారు చాగంటి సూచనల మేరకు నైతిక విలువల పై పాఠ్యాంశాలలు పెట్టాలని సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు.

👉మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ ను కలిసిన మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి.ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే.
👉మంత్రి లోకేష్ ను కలిసిన తుని ఆర్టీసీ బస్ డ్రైవర్ లోవరాజు…*దేవర సినిమా పాటకు డ్యాన్స్ వేసి సస్పెన్షన్ కు గురైన డ్రైవర్.. *మంత్రి లోకేష్ చొరవతో సస్పెన్షన్ రద్దు.. *కుటుంబతో సహా మంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన లోవరాజు..*
👉 మార్కాపురం నియోజకవర్గ పరిధిలో సెల్ టవర్ ఏర్పాటుపై అధికారులతో కలెక్టర్ అన్సారియా సమీక్ష సమావేశం నిర్వహించారు.
👉కోలాహలంగా మంత్రి డా.డోలా జన్మదిన వేడుకలు*
రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి జన్మదిన వేడుకలు కోలాహలంగా జరిగాయి. బుధవారం నాడు సాయంత్రం ఒంగోలు తూర్పు నాయుడుపాలెంలోని తన నివాసంలో కార్యకర్తలు, నాయకులు మధ్య మంత్రి తన పుట్టినరోజు రోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు తెచ్చిన భారీ కేక్ ని కట్ చేశారు.అనంతరం భారీ గజమాలలు, శాలువాలతో మంత్రిని సత్కరించిన కార్యకర్తలు, నేతలు, పలువురు అధికారులు పుష్ప గుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రికి శుభాకాంక్షలు తెలిపేందుకు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పోటెత్తడంతో మంత్రి నివాసం వద్ద సందడి వాతావరణం నెలకొంది.
👉 చలన చిత్ర నేపథ్య గాయకులు,గాన గంధర్వులు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు 102 వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని పొదిలి మున్సిపల్ కమిషనర్ పూసల శ్రీనివాసులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఘంటసాల చైతన్య కళా స్రవంతి వ్యవస్థాపక అధ్యక్షులు నాగశ్రీ మాట్లాడుతూ ఉదయం 10 గంటల నుండి రాత్రి పది గంటల వరకు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నాగశ్రీ సతీమణి ప్రసున అన్నారు. డాక్టర్ ఏస్ రహంతుల్లా చే ఘంటసాల అష్టావధానం నిర్వహించారు. అంతే కాకుండా గీతం యూనివర్శిటీ హైదారాబాద్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తూ నాట్యం లో డాక్టరేట్ పొందిన గొప్ప నర్తకి కీర్తి శేషులు వేంపటి చినసత్యం మనవరాలు బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ వల్లూరి లలితా సిందురి చే నృత్యాప్రదర్శన ఏర్పాటు చేశారు. కాకినాడ కు చెందిన ప్రముఖ గాయకులు వానపల్లి ప్రభాకర్ మాట్లాడుతూ ఘంటసాల జయంతి సందర్భంగా పొదిలి లో ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించడం చాలా గొప్ప విషయం అని రాష్ట్రం నలుమూలల నుంచి గాయని గాయకులు విచేస్తున్నట్లు తెలిపారు. జిల్లా స్టాఫ్ రిపోర్టర్ రహమాన్..
👉యర్రగొండపాలెం నియోజకవర్గం పుల్లచెరువు మండలం నాయుడు పాలెం గ్రామంలోని ఎస్సిపాలెంలో మండల పరిషత్ స్కూల్ ను ఆకస్మిక తనిఖీ చేసిన యర్రగొండపాలెం శాసనసభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్
👉కిలేడీ వలపు వలకు బలైన ఎస్సై హరీశ్‌?*
ప్రేమ పేరుతో దగ్గరై పెళ్లికి ఒత్తిడి తేవడంతోనే అఘాయిత్యం
గతంలో ముగ్గురు యువకులను ప్రేమ పేరుతో బ్లాక్‌మెయిల్‌
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన ములుగు జిల్లా వాజే డు ఎస్సై రుద్రారపు హరీశ్‌ (29) ఆత్మహత్య ఘటన నిగ్గు తేల్చేందకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఈ క్రమంలో విస్తుపోయే విషయాలు వెలుగుచూస్తున్నాయని సమాచారం. ముళ్లకట్ట అంతర్రాష్ట్ర వంతెన పక్కనే ఉన్న ప్రైవేట్‌ రిసార్టులో ఎస్సై హరీశ్‌ సోమవారం ఉదయం తన సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో గదిలో ఓ యువతి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే రక్తపు మడుగులో విగతజీవి గా ఉన్న హరీశ్‌ మృతదేహంపై ఓ యువతి పడి రోదించిన ఫొటో లు, వీడియోలు వైరల్‌ అయ్యాయి.
ఘటన అనంతరం పేరూరు పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. సంఘటన ఎలా జరిగింది? ఆ సమయంలో అక్కడ ఆమె ఎందు కు ఉందనే అంశాలపై విచారించారు. ఈ క్రమంలో పలు విస్తుపోయే విషయాలు పోలీసుల దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది.
ఆ యువతి సూర్యాపేట జిల్లా వాస్తవ్యురాలిగా గుర్తించారు. అక్కడి పోలీసులను సంప్రదించగా సదరు యువతి గతంలో ముగ్గురు యువకులకు ప్రేమపేరుతో దగ్గరై పెళ్లికి ఒత్తిడి చేసి వారు ఒప్పుకోకపోవడంతో కేసులు పెట్టించినట్లు తేలింది. ఈమె వేధింపులు భరించలేక ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా అతడి కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో ఆమెపై ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసు నమోదైనట్లు సమాచారం. సమాజంలో పలుకుబడి, ఆర్థికంగా ఉన్న వారిని లక్ష్యంగా చేసుకుని లొంగదీసుకోవడమే పనిగా పెట్టుకున్న ఆ యువతి ఏడాది క్రితం ఎస్సై హరీశ్‌కు ఫోన్‌లో కాంటాక్ట్‌ అయినట్లు సమాచారం.
ఈ క్రమంలో వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి ప్రేమకు దారితీసిందని, అయితే ఆమె గురించి అసలు విషయాలు తెలియడంతో ఆమెతో పెళ్లికి హరీశ్‌ నిరాకరించాడని సమాచారం. ఈ క్రమంలోనే హరీశ్‌ కుటుంబసభ్యులు చూసిన సంబంధాన్ని చేసుకునేందుకు అంగీకరించాడని, కానీ తనను పెళ్లి చేసుకోకుంటే రోడ్డుకీడుస్తానని, ఇప్పుడు తాను గర్భవతినని సదరు యువతి హరీశ్‌ను భయపెట్టడంతో తీవ్ర ఆందోళనకు గురైన ఆయన ఎక్కడ పరువుపోతుందోననే బలవన్మరణానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఎస్సై హరీశ్‌ మృతిపై తొలుత అనేక ఊహాగానాలు వినిపించాయి. ఉన్నతాధికారుల వేధింపులు, పని ఒత్తిడి అంటూ ప్రచారమైంది.ఈ నేపథ్యంలో ఆయన మరణానికి దారి తీసిన పరిస్థితులను నిగ్గుతేల్చేందుకు పోలీసు అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో సూర్యాపేట యువతి అసలు బండారం బయటపడింది. కాగా, ఆ యువతిని సోమవారం సాయంత్రమే ఇద్ద రు మహిళా కానిస్టేబుళ్లను ఎస్కార్ట్‌గా ఇచ్చి దూద్యా తండాకు తీసుకెళ్లి తల్లిదండ్రులకు అప్పగించారు. పోలీసుశాఖలో ఉజ్వల భవిష్యత్తు ఉన్న హరీశ్‌ జీవితం విషాదంగా ముగిసిపోవడం కుటుంబసభ్యులను, సన్నిహితులను తీవ్రంగా కలచివేస్తోంది.
👉విద్యుత్ షాక్ తో యువకుడు మృతి*. కరెంటు షాక్ కు గురై యువకుడు మృతి చెందిన ఘటన కంభంలో ఈరోజు బుధవారం చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లా కంభం పట్టణంలోని రహమత్ నగర్లో ఎలక్ట్రిషియన్ కమల్ రాజ్ (24) అనే యువకుడు ఓ శుభకార్యానికి విద్యుత్ సరఫరా ఇస్తుండగా ప్రమాదవశాత్తు కరెంటు షాక్ కు గురయ్యాడు.వెంటనే యువకుడిని కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే కమల్ రాజ్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రిపోర్టర్ ఎన్ వెంకట్..
👉మంత్రి డా. డోలా సమక్షంలో 20 దళిత కుటుంబాలు టీడీపీలో చేరిక*
దళితులకు టీడీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు.బుధవారం నాడు
టంగుటూరు మండలం జయవరం గ్రామానికి చెందిన 20 దళిత కుటుంబాలు టీడీపి గ్రామ పార్టీ అధ్యక్షుడు యర్రమోసు సుధాకర్ బాబు ఆధ్వర్యంలో వైసీపీని వీడి
మంత్రి సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ…..వైసీపీ దళితులను మోసం చేసిందని, అందుకే ఆ పార్టీని వీడి రాష్ట్ర అభివృద్ధికి పాడుపడు తున్న టీడీపీలో చేరు తున్నారని అన్నారు. టీడీపీ దళితులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మంత్రి అన్నారు.
👉 సైబర్ నేరాలు మరియు మద్యం, మత్తు పదార్థాల సేవనం వల్ల కలిగే అనర్థాల గురించి అవగాహన …
మండలంలోని జంగంగుంట్ల లోని జడ్పీ హైస్కూలు విద్యార్థులకు సైబర్ నేరాలపై మద్యపానం, మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్ప్రయోజనాలపై గురించి , మహిళలపై జరుగుతున్న అత్యాచారాల గురించి ఎస్సై బి నరసింహరావు విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సిబ్బంది ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
👉ఎన్ సి సి “సి” సర్టిఫికెట్లు అందజేత*
కంభంలోని సిఎల్ఆర్ డిగ్రీ కళాశాలలలో విద్యార్థులకు ఎన్.సి.సి “సి”సర్టిఫికెట్లను బుధవారం నాడు అందజేయడం జరిగింది. కళాశాల విద్యార్థులైన సిహెచ్ మధు చిరంజీవి, డి.మహమ్మద్ రఫీ, ఎస్ భూలక్ష్మి, ఎం పుష్పకోమల, పి సంధ్య లకు ఎన్ సి సి 34 A బెటాలియన్ కమాండర్ వి.మోహన్ చేతుల మీదుగా సర్టిఫికెట్లను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఎల్ఆర్ విద్యాసంస్థల కరస్పాండెంట్ సయ్యద్ షా అలీ భాష, కళాశాల అధ్యాపకులు భూపని నారాయణ, జి ముక్తేశ్వరరావు, జూనియర్ కళాశాల డైరెక్టర్ సిరిగిరి బ్రహ్మం, ఏనుగుల రవికుమార్, ఎం.శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
👉 పొలం పిలుస్తుంది
పొలం పిలుస్తుంది కార్యక్రమం లో భాగంగా బుధవారం మండలం లో రావిపాడు మరియు హెచ్.గూడెం గ్రామాలలో మండల ఉద్యాన అధికారి డి శ్వేత, వ్యవసాయ అధికారి స్వరూప పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో డి శ్వేత మాట్లాడుతూ రబీలో మిరప పంటకు ప్రభుత్వం దిగుబడి ఆధారిత పంటల బీమా అమలు చేస్తుందన్నారు. జిల్లాకు సంబంధించి ఐసిఐసిఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా పంటల భీమా అమలు చేస్తారు. పథకంలో ప్రీమియం అమౌంట్ 525 రూపాయలు రైతులు చెల్లించాల్సి ఉంటుంది పంట కోత ప్రయోగాలు నిర్వహించి దిగుబడి తగ్గినట్లు నిర్ధారణ అయితే రైతుకు బీమా లభిస్తుంది. ఎకరాకు గరిష్టంగా 1,05,000/_రూపాయల వరకు చెల్లిస్తారు నమోదుకు డిసెంబర్ 15 వరకు గడువు ఉందని రైతులకు తెలిపారు. కంభం ఉద్యాన శాఖ అధికారి శ్వేత కంభం గ్రామంలోని మిరప పంటను పరిశీలించారు. వీరు రైతులతో మాట్లాడుతూ ప్రస్తుత వర్షాలకు మిరప పంటలో వివిధ రకాల ఎండు తెగుళ్లు ఆశించి చాలా వరకు దిగుబడి తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. మిరపకి మూడు రకాల రెండు తెగుళుఆశించే అవకాశం ఉంది. మిరప పంటని ఎండు తెగుళ్ల భారి నుండి కాపాడుకోవాలంటే ముఖ్యంగా రైతులు చేయవలసిన పని పంట మార్పిడి అవలంబించాలని రైతులు తెలియజేశారు.కార్యక్రమంలో ఆరుణ కుమారి,పాలిశెట్టి నవీన్ తదితరులు పాల్గొన్నారు.
👉మెడికవర్ ఆసుపత్రికి రూ.61.62 లక్షలు జరిమానా*
_వైద్యుల నిర్లక్ష్యంతో కంటి చూపు కోల్పోయిన బాధితుడు..
_ఉమ్మడి నెల్లూరు జిల్లా వినియోగదారుల కోర్టు జింకా రెడ్డి శేఖర్ తీర్పు..సూళ్లూరుపేట‌కు చెందిన చేవూరు సురేష్‌బాబు అనే వ్య‌క్తికి నిర్ల‌క్ష్యంగా శ‌స్త్ర‌చికిత్స చేసిన మెడిక‌వ‌ర్ వైద్యులు…మెడిక‌వ‌ర్ ఆసుప‌త్రికి రూ. 61.62 ల‌క్ష‌లు జ‌రిమానా విధిస్తూ.. వినియోగ‌దారుల కోర్టు న్యాయ‌మూర్తి జింకారెడ్డి శేఖ‌ర్ తీర్పు_
👉హైదారాబాద్ :*ప్రాణం తీసిన సినిమా పిచ్చి సినిమా
దిల్ సుఖ్ నగర్ కు చెందిన రేవతి (39) తన భర్త భాస్కర్ ,ఇద్దరు పిల్లలు శ్రీ తేజ్ (9) , సన్వీక (7) కలిసి పుష్ప ప్రీమియర్ షో చూడటానికి ఆర్టీసీ రోడ్స్ లోని సంధ్య 70 mm కు వచ్చింది…
అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కు వచ్చిన సమయంలో అభిమానులు థియేటర్ గేటు లోపలికి చొచ్చుకు వచ్చారు…
ఈ సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి , ఆమె కొడుకు శ్రీ తేజ లు అపస్మారక స్థితిలోకి వెళ్లారు..
వెంటనే పోలీసులు విద్యానగర్ లోని దుర్గ భాయి దేశముఖ్ హాస్పిటల్ కు తరలించారు..రేవతి అప్పటికే మృతి చెందగా,శ్రీ తేజ పరిస్థితి విషమంగా ఉండటంతో బాలుడిని బేగంపేట కిమ్స్ హాస్పిటల్ కు తరలించారు..
రేవతి మృతదేహాన్ని దుర్గాబాయి దేశముఖ్ హాస్పిటల్ నుండి గాంధీ మార్చురీకి తరలించారు.
👉ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. హెడ్‌కానిస్టేబుల్‌ మృతి..
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. హెడ్‌కానిస్టేబుల్‌ మృతి
ఛత్తీస్‌గఢ్‌లో నారాయణ్‌పుర్‌ జిల్లాలో బుధవారం భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. ఈ ఘటనలో హెడ్‌కానిస్టేబుల్‌ మృతి చెందాడు. ఈ ఘటనలో డీఆర్‌జీ హెడ్‌ కానిస్టేబుల్‌ బీరేంద్ర కుమార్‌ సోరి ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

7k network
Recent Posts

ప్రియాంక గాంధీపై బీజేపీ నేత ర‌మేష్ బిధూరి చేసిన అనుచిత వ్యాఖ్య‌ల ప‌ట్ల‌ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన మంత్రి సీత‌క్క‌*.. *నవీన్ కి చెక్ పెట్టినట్లే కేజ్రీవాల్ కి కూడా ?.. *ఈ ఫార్ములా రేసులో కొన్ని నిజాలు *.. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఛైర్మెన్ జంగా రాఘవ రెడ్డి … ఏపీ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, మంత్రి సత్య కుమార్ యాదవ్* …ప్రభుత్వ ఆస్తిని అప్పనంగా దోచుకున్న ఓం నారాయణ పై చర్యలు : లంబాడి హక్కుల పోరాట సంఘం.. *పొదిలి మాదిరెడ్డిపాలెం వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షులుగా ఎర్రం రెడ్డి

👉ఎంఎస్‌పీ పంజాబ్‌కే కాదు.. దేశమంతటికీ అవసరమే ..*తెలుగు తమ్ముళ్లకు సంక్రాంతి పండుగ ముందే వచ్చిందా.😲 ..హుస్నాబాద్ మైనార్టీ గురుకుల బాలికల పాఠశాల లో ఆకస్మిక తనిఖీలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ … ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాటులను పర్యవేక్షించిన జిల్లా అధికారులు ..*ఆత్మకూరులో ఇస్తేమ పనులను పర్యవేక్షించిన మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్ .. *

👉ఏపీలో రేపటి నుంచి ఉచిత ఓపీ సేవలు బంద్ …* విశాఖ పోర్టులో పట్టుకున్న బియ్యానికి కలెక్టర్ క్లీన్ చిట్..😲… *విశాఖ సెంట్రల్‌ జైల్ ను సందర్శించిన రాష్ట్ర హోం మంత్రి .. అగ్ని ప్రమాదాల పై అవగాహన సదస్సు.. *ఉచిత బస్సు కంటే ఇతర సంక్షేమ పథకాలకు ఖర్చు పెడితే బెటరేమో ! .. *అధికారులను సత్కరించిన పొదిలి పట్టణ టిడిపి అధ్యక్షుడు. . *నిలిచిపోయిన కాపు భవనాలను పునఃప్రారంభించాలి: బలిజ సేవ సంఘం డిమాండ్ .

2700 కోట్ల ఇల్లు.. రూ.10 లక్షల సూట్ ధరించే వారా విమర్శించేది? .. *పవన్ ఆదేశాలు.. సముద్ర తీరంలో రెండు బోట్లు సీజ్* .. *విజయవాడలో వెలుగు చూసిన అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారం .. *చంద్రగిరి ‘బీసీ’ విద్యార్థినులకు మెరుగైన వైద్యం* *తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ కు మంత్రి సవిత ఆదేశం*.. *ఆర్మీ వాహనం లోయలో పడి ఇద్దరు సైనికులు మృతి.. *పుత్తూరు సబ్ డివిజన్ పోలీసులు హెల్మెట్ వాడకంపై అవగాహన కార్యక్రమాలు … మైలవరం లో మిక్సీంగ్ రాజకీయ సెగలు…! ..*రాజకీయ దుమారం రేపిన పాలడుగు దుర్గా ప్రసాద్, ఎమ్మెల్యే వసంత కలయిక… *ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తూ పోలీస్ సిబ్బంది జీవన విధానం ఉండాలి : ఐజి వి సత్యనారాయణ.. *పోలీసుల వేధింపులు తట్టుకోలేక హుజూర్‌ నగర్ పోలీస్ స్టేషన్ ముందు యువకుడి ఆత్మహత్యాయత్నం .. * డిగ్రీ విద్యార్థులకు కూడా తక్షణమే వర్తింప చేయండి..మాజీ ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు పివి శేషయ్య.

*రెవిన్యూ అధికారులకు పై సియం సీరియస్*…*ప్రభుత్వ ఉద్యోగులపై ఆరోపణలు, కేసులు పెట్టే వారికి రక్షణ కల్పించేలా సర్కార్‌ చర్యలు.. *పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు పటిష్ట చర్యలు ; రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా…*కాంస్య పతకం సాధించి దేశ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన ఓరుగ‌ల్లు ముద్దుబిడ్డ .. *నితీష్ కి కన్ను గీటిన లాలూ..ఎన్డీయేలో కలవరమేనా ? ..*అమెరికాలో విచిత్రం ఇస్తున్న నోరో వైరస్ …*చైనాలో మరోసారి హెల్త్ ఎమర్జెన్సీ

⭐సూపర్-6 హామీలు కచ్చితంగా అమలు చేస్తాం..గత పాలనంతా విధ్వంసం…మేము రిపేర్లు చేస్తూ వెళ్తున్నాం..తప్పుడు పనులు చేయొద్దు.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు హెచ్చరిక : సీఎం చంద్రబాబు ..*మాదాపూర్ పేస్ హాస్పిటల్‌లో దారుణం.. *ఒక్క పైసా కూడా అవినీతి లేదు. -కేటీఆర్‌ ..*.. ఫారిన్‌లో ఎడ్యుకేషన్‌ పేరుతో మోసాలు. బోగస్‌ కన్సల్టెన్సీ ప్రతినిధులను అరెస్ట్‌ చేసిన పోలీసులు… సైబర్ నేరాలకు అడ్డా ‘వాట్సప్’.. హోంశాఖ నివేదిక.*.. యాపిల్ పండ్ల మాటున మద్యం అక్రమ తరలింపు …*తిరుపతిలో మత్తు వదిలించిన పోలీస్