👉 షర్మిల ఆరోపణలను పర్సనల్ ఇష్యూస్ అంటున్న వైసిపి నేతలపై ఆగ్రహం … ఈ మేరకు ఆమె ‘పర్సనల్ ఇష్యూస్’ అనే అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజకీయాల్లో ‘షర్మిల వర్సెస్ వైసీపీ’ అనే ఇష్యూ రోజు రోజుకీ వేడెక్కుతున్న సంగతి తెలిసిందే. అంశం ఏదైనా, సందర్భం మరేదైనా ఏపీ పీసీసీ చీఫ్ హోదాలో షర్మిల ఎంట్రీ ఇస్తుండటం.. దీనిపై ప్రతిపక్షాన్ని తీవ్రస్థాయిలో విమర్శించడం తెలిసిందే! ఇదే సమయంలో ప్రభుత్వానికి పలు సూచన్లు చేస్తున్నారు షర్మిల…. షర్మిలను రాజకీయ నాయకురాలిగా ఎవరు గుర్తించడం లేదని.. తాము కూడా అంతే అని.. పీసీసీ చీఫ్ గా ఆమె పర్సనల్ టార్గెట్స్ కాకుండా విసృత అంశాలపై దృష్టి సారించాలన్నట్లుగా బొత్స సత్యనరాయణ సూచించిన సంగతి తెలిసిందే.👉 ఈ నేపథ్యంలో స్పందించిన షర్మిల… పచ్చ కామెర్ల రోగికి లోకమంతా పచ్చగా ఉంటుందన్నట్లుగా బొత్స సత్యనారాయణ తీరు ఉందని అన్నారు! అందుకే తాను మాట్లాడేది వ్యక్తిగతం అనుకుంటున్నారని అన్నారు.”మీ నిర్లక్ష్యం, అవినీతి, మధ్య నిషేధమని చెప్పి కల్తీ మద్యం అమ్మడం గురించి మాట్లాడితే అది వ్యక్తిగతమా అని ప్రశ్నించారు.”వివేకా హత్య, రూ.1,750 కోట్ల లంచాలు,”గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటా అదానీకి కారుచౌకగా విక్రయించడం గురించి మాట్లాడితే అవి పర్సనల్ ఎలా అవుతాయో వైసీపీ నేతలు చెప్పాలని అన్నారు. ఈ నేపథ్యంలోనే… తాను వ్యక్తిగతంగా మాట్లాడితే వైసీపీ నేతలు ఇంట్లో నుంచి అడుగు కూడా బయటపెట్టలేరని షర్మిల ధ్వజమెత్తారు. సోషల్ మీడియాలో సైతాన్ సైన్యం అరాచకాలపై మాట్లాడితే అది పర్సనల్ ఎలా అవుతుందని నిలదీశారు.సెకీ ఒప్పందాలపై తాము వితండ వాదం చేయాల్సిన అవసరం లేదని షర్మిల స్పష్టం చేశారు.
**ఇదే సమయంలో… సెకీ ఒప్పందంలో జగన్ అవినీతిపై అన్ని ఆధారాలు దగ్గరపెట్టుకుని కూడా కూటమి ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటోంది అని షర్మిల ప్రశ్నించారు. కాకినాడ పోర్టునే కాదు.. కృష్ణంపట్నం పోర్టు, గంగవరం పోర్టుల విషయంలోనూ సమగ్ర విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరోపక్క.. సెకీతో ఒప్పందాలపై లోతుగా పరిశీలన చేయాలని కేంద్ర విద్యుత్ నియంత్రణ సంస్థ లేఖ రాస్తున్నామని అన్నారు. ఇదే సమయంలో… సెకి ఒప్పందంపై కేసు నమోదు చేసి, విచారణ చేపట్టాలని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేస్తామని షర్మిల తెలిపారు.
👉జగన్ విషయంలో అన్నంతపని చేసిన షర్మిల !!!… తాజాగా ఆమె అన్నంతపని చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆమె మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. సెకీతో ఒప్పందాలపై లోతుగా పరిశీలన చేయాలని కేంద్ర విద్యుత్ నియంత్రణ సంస్థ లేఖ రాస్తున్నామని.. ఇదే సమయంలో..** సెకి ఒప్పందంపై కేసు నమోదు చేసి, విచారణ చేపట్టాలని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేస్తామని ప్రకటించిన షర్మిల.. తాజాగా అన్నంతపని చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.అవును…** ముందుగా ప్రకటించినట్లుగానే ఏసీబీకి షర్మిల ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతు.. అదానీ అనే పారిశ్రామికవేత్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఓ విద్యుత్ ఒప్పందం చేసుకునే క్రమంలో… నాటి ముఖ్యమంత్రి జగన్ కు రూ.1,750 కోట్లు లంచం ఇచ్చారనే విషయం అమెరికా దర్యాప్తు సంస్థలు బయట పెట్టాయని అన్నారు. తెలంగాణలో తాజా ఇష్యూ! అదానీ 2021 ఆగస్టులో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిశారని.. సోలార్ పవర్ డీల్ ఆంధ్ర రాష్ట్రం 7వేల మెగావాట్లు కొనేటట్టుగా డీల్ మాట్లాడుకునే విషయంపై వీరిద్దరి మధ్య ఒప్పందం జరిగిందని, ఒప్పందం ప్రకారం రూ.1,750 కోట్లు లంచం వ్యవహారంపై పలు ప్రూఫ్స్ తెరపైకి తెచ్చి ట్రయల్ కూడా యూఎస్ లో మొదలుపెట్టబోతున్నారని అన్నారు. ఇంతపెద్ద డీల్ మన రాష్ట్రంలో 2021లోనే జరిగితే మన రాష్ట్రమో, మన దేశమో ఎందుకు బయట పెట్టదు అని ప్రశ్నించిన షర్మిల… మన దేశంలో దర్యాప్తు సంస్థలు లేవా అని ప్రశ్నించారు. 2021లోనే ఇప్పటి మంత్రి పయ్యావుల కేశవ్ ఈ వ్యవహారంపై హైకోర్టులో పిటిషన్ వేశారని గుర్తు చేశారు. అయినప్పటికీ ఇప్పటికీ ఎందుకు చర్యలు లేవని ఆమె ప్రశ్నించారు. పక్క రాష్ట్రంలో రూ.1.99 పైసలకే ఇదే పవర్ సప్లై డీల్ చేసుకుంటే.. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అప్పటి ముఖ్యమంత్రి జగన్ మాత్రం రూ.2.49 పైసలకు ఒప్పందం కుదుర్చుకున్నారని.. అంటే ఏభై పైసలు ఎక్కువకు చేసుకున్నారని.. అది కూడా 25 ఏళ్లకు ఒకటే లాకిన్ అని..వ్యాఖ్యానించారు. దీనిపై సర్కార్ ఏ విధంగా స్పందిస్తుందనేది చూడాలి!
👉 గురుకులాల్లో, పాఠశాలల్లో జరిగే ఫుడ్ పాయిజన్ ఘటనలు ఒక పథకం ప్రకారం బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి
ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ కుట్రలు చేస్తున్నాడు – దేవరకొండ కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలు నాయక్
👉 మంగళగిరిలో ఎర్రచందనం స్వాధీనం..
మంగళగిరి మండలం కాజా టోల్ ప్లాజా వద్ద బుధవారం భారీగా ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూరల్ సీఐ వై.శ్రీనివాసరావు మాట్లాడుతూ తమకు అందిన సమాచారం మేరకు టోల్ గేటు వద్ద తనిఖీలు చేయగా పేపరు లోడులో 10టన్నుల ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఎర్ర చందనం చెన్నై నుంచి అస్సాం, అస్సాం నుంచి చైనాకు తరలిస్తున్నట్లు ప్రాధమిక విచారణలో తేలిందన్నారు.
👉ఈరోజు ఢిల్లీలో తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులతో కలిసి ఆస్ట్రేలియా హైకమిషన్ ప్రతినిధులతో పరస్పర చర్చ కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి..
**ఆంధ్రప్రదేశ్ లో ఖేలో ఇండియా పధకం నిర్వహణపై మాగుంట ప్రశ్న.. దేశం మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖేలో ఇండియా (క్రీడల) పధకం క్రింద క్రీడల మౌలిక సదుపాయాలు, సెంటర్లు మరియు స్టేడియాలు వివరాలు, కేటాయించిన – వాడిన నిధులు, నిర్మాణాలకు మరియు పెంపుకు కేంద్ర ప్రతిపాదనలు గురించి ఒంగోలు పార్లమెంటు సభ్యులు, మాగుంట శ్రీనివాసులురెడ్డి ప్రస్తుత పార్లమెంటు సమావేశాలలో అడిగిన ప్రశ్నకు కేంద్ర యువజన వ్యవహారాల మరియు క్రీడల శాఖ మంత్రి, డా. మన్సుక్ మాండవీయ సమాదానమిస్తూ –
క్రీడల అభివృద్ధి, సమూహిక భాగస్వామ్యం మరియు ప్రతిభను ప్రోత్సహించడం ఖేలో ఇండియా (క్రీడల) పధకం ముఖ్య లక్ష్యాలని మరియు క్రీడా మైదానాల – కమ్యూనిటీ కోచింగ్ అభివృద్ధి, రాష్ట్ర స్థాయి కేంద్రాలు ఏర్పాటు, మహిళల క్రీడల ఏర్పాటు, క్రీడా పోటీలు నిర్వహణ, విలాంగుల క్రీడల ప్రోత్సహించుట మరియు మౌలిక సదుపాయాలు ఈ పధకం క్రింద ఏర్పాటు చేయబడునని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖేలో ఇండియా (క్రీడల) పధకం క్రింద రూ. 112.44 కోట్లు మంజూరు కాగా, రూ.52.47 కోట్లు విడుదల చేయడం జరిగిందని తెలిపారు. పూర్తి సమాచారమంతయు (వెబ్ సైట్ లింక్స్) ఇంటర్నెట్ లో వుంచబడినదని తెలిపారు.
క్రీడల అంశం రాష్ట్రాలకు సంబందించినది కనుక క్రీడల అభివృద్ధి, సెంటర్లు, కాంప్లెక్సులు మరియు స్టేడియాల నిర్మాణం మరియు వాటి నిర్వహణ గురించి రాష్ట్రాలే చూసుకుంటాయని, కేంద్రం సహకారం అందిస్తుందని తెలిపారు. కోరిన పనుల సంపూర్ణత, సాంకేతిక సాధ్యత మరియు నిధుల లభ్యతపై ఆధారపడి రాష్ట్రాల ప్రతిపాదనలను కేంద్రం ఆమోదిస్తుందని తెలిపారు.
👉గిద్దలూరు అటవీ ప్రాంతంలో 18 ఎర్రచందనం దుంగలు స్వాధీనం..ఇద్దరు అరెస్టు..
ప్రకాశం జిల్లా గిద్దలూరు అటవీ ప్రాంతంలో 18ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని, ఇద్దరు స్మగ్లర్లను టాస్క్ ఫోర్సు పోలీసులు గురువారం అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్సు ఇన్చార్జి, తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్.సుబ్బారాయుడు గారి కార్యాచరణతో టాస్క్ ఫోర్సు ఎస్పీ, శ్రీ పీ. శ్రీనివాస్ గారి పర్యవేక్షణలో డీఎస్పీ శ్రీ జీ. బాలిరెడ్డి గారి మార్గనిర్దేశంలో కడప సబ్ కంట్రోల్ ఆర్ఐ చిరంజీవులుకు చెందిన ఆర్ఎస్ఐ పీ.నరేష్ టీమ్ కూంబింగ్ నిమిత్తం కొమరోలు చేరుకున్నారు. అక్కడ నుంచి అటవీ అధికారులు లక్ష్మీ నాయక్, జమాల్ వల్లిలతో కలసి గిద్దలూరు డివిజన్ చింతలపల్లి వైపుగా కూంబింగ్ చేపట్టారు. అక్కడ కనుమబావి రస్తా వద్ద కొంతమంది వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని సమీపించే సరికి కొందరు పారిపోగా, ఇద్దరు పట్టుబడ్డారు. పట్టుబడ్డ వారిని ప్రకాశం జిల్లా వాసుగా గుర్తించారు. ఆ సమీపంలో వెతుకగా 18ఎర్రచందనం దుంగలు లభించాయి. దుంగలతో పాటు, ఇద్దరు వ్యక్తులను తిరుపతి టాస్క్ ఫోర్సు పోలీసు స్టేషన్ కు తరలించారు. సీఐ సురేష్ కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.. ని.వర్గ రిపోర్టర్ సనావుల్లా ఖాన్
సెకి ఒప్పందాలపై ఏసీబీకి షర్మిల ఫిర్యాదు .. షర్మిల ఆరోపణలను పర్సనల్ ఇష్యూస్ అంటున్న వైసిపి నేతలపై ఆగ్రహం … బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు.. ఖేలో ఇండియా పధకం నిర్వహణపై మాగుంట ప్రశ్న.. మంగళగిరిలో, గిద్దలూరులో ఎర్రచందనం స్వాధీనం.
Recent Posts