👉లక్ష మందితో సీఎం బహిరంగ సభ..మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి* .. సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన*
ప్రభుత్వం ఏర్పడి ఏడాది నిండుతున్న సందర్భంగా జిల్లా కేంద్రం సమీపంలో ఎస్‌ఎల్‌బీసీ వద్ద ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల పక్కన లక్ష మందితో సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ సభ నిర్వహిస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఈనెల 7న సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల నిమిత్తం రానుండగా, ఏర్పాట్లను మంత్రి గురువారం పరిశీలించారు. వైద్య కళాశాల నూతన భవనాల వద్ద విలేకరులతో ఆయన మాట్లాడారు.
సీఎం పర్యటనలో భాగంగా సుమారు రూ.1000కోట్లతో చేపట్టిన బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ చానల్స్ ప్రారంభిస్తారని తెలిపారు. 2008లో వైఎస్ హయాంలో ఈ పనులు మంజూరు కాగా, 80శాతం పూర్తయ్యాయని, గత ప్రభుత్వం ఈ పనులను పట్టించుకోలేదన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పనులు పూర్తిచేశామని తెలిపారు. బ్రాహ్మణవెల్లెంల ద్వారా సుమారు లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని, భూగర్భజలాలు పెరుగుతాయన్నారు. పెండింగ్‌లో ఉన్న ఎస్‌ఎల్‌బీసీ పనులకు సైతం సీఎం రూ.4,540కోట్లు మంజూరు చేశారని, అమెరికా నుంచి బోరింగ్ యంత్రం పరికరాలు రానున్నాయని తెలిపారు. ఎస్‌ఎల్‌బీసీ పూర్తయితే 4,000 నుంచి 6,000 క్యూసెక్కుల నీటితో నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. సీఎం యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌లో యూనిట్-2లో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించి ఎస్‌ఎల్‌బీసీ గంధంవారిగూడెం వద్ద రూ.275కోట్లతో నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రారంభిస్తారని తెలిపారు. అక్కడే రూ.40కోట్లతో నిర్మిస్తున్న నర్సింగ్ కళాశాలకు శంకుస్థాపన చేస్తారన్నారు. స్కిల్ డెవల్‌పమెంట్ కేంద్రాన్ని ప్రారంభించి, గ్రంథాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని, కనగల్, తిప్పర్తి మండలాలకు మంజూరైన జూనియర్ కళాశాలకు కూడా శంకుస్థాపన చేస్తారని తెలిపారు. అలాగే నార్కెట్‌పల్లి, దామరచర్ల మండలాలకు జూనియర్ కళాశాలలు మంజూరు చేస్తూ డిసెంబరు 9 తర్వాత జీవో రానుందని వెల్లడించారు. ఎల్లారెడ్డిగూడెం వద్ద రూ.10కోట్లతో టూరిజం ద్వారా హరిత హోటల్ నిర్మిస్తున్నామన్నారు. సంక్రాంతి తర్వాత రైతు భరోసాను సీఎం ప్రకటించనున్నారని తెలిపారు. వచ్చే నెలలో మూసీ ప్రక్షాళనకు రూ.25వేల కోట్లతో టెండర్లు పిలిచి దశలవారీగా పనులు చేపడతామన్నారు. సీఎం బహిరంగ సభకు ప్రజలు తరలిచివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆయన వెంట కలెక్టర్ ఇలాత్రిపాఠి, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, బత్తుల లక్ష్మారెడ్డి, అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివా్‌సరెడ్డి, అదనపు ఎస్పీ రాములునాయక్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ శ్రీవాణి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పుట్ల శ్రీనివాస్, ఆర్డీవో అశోక్‌రెడ్డి, డీఎస్పీ శివరాంరెడ్డి ఉన్నారు.
***స్టేట్ ఇంచార్జ్ హైదర్ అలీ..
👉 ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వబోం: మంత్రి కోమటిరెడ్డి* హైదరాబాద్:డిసెంబర్ 06
స్టార్ హీరోల సినిమాల బెనిఫిట్ షోలు వేసుకోవ డానికి ఏపీ, తెలంగాణ, ప్రభుత్వాలు అనుమతులు ఇస్తుండటం తెలిసిందే. అల్లు అర్జున్ తాజా చిత్రం ‘పుష్ప-2’ కు కూడా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు బెనిఫిట్ షోలకు అనుమతులు ఇచ్చాయి. అయితే, హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది.ఈ నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై ఏ సినిమాకు కూడా బెనిఫిట్ షోకు అనుమతు లు ఇవ్వబోమని ఆయన చెప్పారు.నగరంలో బెని ఫిట్ షోలు వేయడం వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని కోమటిరెడ్డి అన్నారు. కుటుంబంతో కలిసి సరదాగా సినిమా చూసేం దుకు వచ్చినవారు తమ కుటుంబ సభ్యురా లిని కోల్పోవడం తనను ఎంతో బాధించిందని చెప్పారు.ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఉన్న సంధ్య థియేటర్ లో కుటుంబంతో కలిసి సినిమా చూసేందుకు అల్లు అర్జున్ వచ్చారు. దిల్ సుఖ్ నగర్ కు చెందిన రేవతి (39),ఆమె భర్త భాస్కర్, పిల్లలు శ్రీతేజ్, శాన్వికలు కూడా సినిమా చూసేందుకు వచ్చారు. బన్నీ వచ్చిన సమయంలో ఎవరూ ఊహించని విధంగా తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి, కుమారుడు శ్రీతేజ్ ఊపిరాడక అపస్మారక స్థితిలోకి వెళ్లారు.దీన్ని గమనించిన పోలీసులు ఆమెకు సీపీఆర్ చేసినా లాభం లేకపోయింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు.అయితే అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు నిర్ధారించారు.ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో విషాదాన్ని నింపింది.మహిళ మృతిపై ‘పుష్ప’ టీమ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.మృతురాలి కుటుంబానికి అండగా నిలబడతామని ప్రకటించింది.** హైదరాబాద్ రిపోర్టర్ షేక్ అమీర్..
👉 ముదురుతున్న సంధ్య థియేటర్ వ్యవహారం…
పుష్ప 2 బెనిఫిట్ షోతో సాధించిన వసూళ్లు ఎంత ఆశ్చర్యపరిచాయో !!!
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఘర్షణ, అక్కడ పోయిన ఓ అభిమాని ప్రాణం అంతగా ఆందోళనకు గురి చేసింది.
సినిమా అంటే పిచ్చి వ్యామోహం, వెర్రి అభిమానంతో, కట్టలు తెంచుకొన్న అత్యుత్సాహంతో ఓ అమాయకురాలి ప్రాణం పోయింది. ఓ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ నేపథ్యంలో ఈ ఘటనకు కారణమైన వాళ్లపై చర్యలు తీసుకోవడంలో పోలీసులు నిమగ్నమయ్యారు. సంథ్య థియేటర్ యాజమాన్యంతో పాటుగా అల్లు అర్జున్‌పై కూడా పలు సెక్షన్లలో కేసులు నమోదయ్యాయి. అయితే ఇది ఇక్కడితో ఆగలేదు. మానవహక్కుల సంఘంలోనూ ఇప్పుడు ఫిర్యాదు నమోదైంది.
సంధ్య థియేటర్ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలంటూ అందిన ఫిర్యాదుకు మేరకు మానవ హక్కుల సంఘం స్పందించింది. విచారణ జరపాల్సిందిగా ఆదేశించింది. ఈ ఘనటకు కారణమైన వాళ్లపై చర్యలు తీసుకోవాలని, ఇది కూడా త్వరితగతిన జరగాలంటూ పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఘటనపై సీరియస్ అయ్యింది. ఇక మీదట తెలంగాణలో బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వకూడదన్న నిర్ణయానికి వచ్చింది.మైత్రీ మూవీస్ నిర్మాతలకు ఈ ఘటన తలనొప్పిగా మారింది. ఈ వ్యవహారంలో మైత్రీ మూవీస్ నిర్మాతలపైనా విచారణ జరగొచ్చు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకొంటామని నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. అల్లు అర్జున్ కూడా ఈ మేరకు ఓ ప్రకటన చేసే అవకాశం ఉంది.
*హీరో అల్లు అర్జున్ హౌస్ అరెస్ట్?*
మూడు రోజుల క్రితం సంధ్య థియేటర్ వద్ద చోటుచేసుకున్న ఘటనలో అల్లు అర్జున్‌పై కేసు నమోదు చేసినట్లు సెంట్రల్ జోన్ డీసీపీ అక్షాంశ్ యాదవ్ తెలిపారు. చిక్కడపల్లి పోలీసు స్టేషన్‌లో సంధ్య థియేటర్ యాజమాన్యం, అల్లు అర్జున్, ఆయన సెక్యూరిటీ టీమ్‌పై బీఎన్ఎస్‌లోని సెక్షన్ 105,118(1) r/w 3(5) కింద కేసు నమోదై నట్టుగా వెల్లడించారు.ఈ నేపథ్యంలోనే సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనతో అంతా షాక్ అయ్యారు. దీంతో ఇలాంటి ఘటన మరే థియేటర్ వద్ద జరగకూడ దని పోలీసులు అల్లు అర్జున్ ను ఈరోజు హౌస్ అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
బన్నీ మరే థియేటర్ వద్దకు వెళ్లినా..జనాలు పోగు అవుతారని.. అదే సమయంలో తోపులాట జరిగే ప్రమాదం ఉందని భావించి పోలీసులు అల్లు అర్జున్ ను హౌస్ అరెస్టు చేసినట్లు సమాచారం.మరింత సమాచారం తెలియవలసింది.
👉రాజ్యసభలో నోట్ల కట్టల కలకలం!*
రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు అభిషేక్ మను సింఘ్వి సీటు వద్ద రూ. ఐదువందల నోట్ల కట్టలు సెక్యూరిటీకి లభించిన ఘటన కలకలం రేపుతోంది.
ఆ డబ్బులు తనవి కావని ఎంపీ సింఘ్వి స్పష్టం చేశారు.
ఆ డబ్బులు తమవి అని ఒక్కరంటే ఒక్క ఎంపీ కూడా ముందుకు రాలేదు. దాంతో రాజ్యసభ చైర్మన్ ఈ అంశంపై విచారణకు ఆదేశించారు. అభిషేక్ మను సింగ్వి సీటు దగ్గర దొరికిన డబ్బుల విషయంపై పూర్తి వివరాలు తెలుసుకోవాలని భద్రతా సిబ్బందిని ఆదేశించారు.
గురువారం రొటీన్ సెక్యూరిటీ చెకప్ చేస్తున్న సమయంలో సింఘ్వి సీటు వద్ద డబ్బు కట్టలను గుర్తించి రాజ్యసభ చైర్మన్ కు సమాచారం ఇచ్చారు.ఈ అంశంపై అంతర్గతంగా వివరాలు సేకరించినప్పటికీ ఎవరూ సమాధానం చెప్పలేదు.దాంతో విచారణకు ఆదేశించారు . అయితే రాజ్యసభ చైర్మన్ సింఘ్వీ సీటుదగ్గర దొరికిన డబ్బులు అని చెప్పడంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎవరివో తెలియనప్పుడుఆయన పేరు ఎలా ప్రస్తావిస్తారని మండిపడింది. ఈ అంశంపై అభిషేక్ సింఘ్వి కూడా స్పందించారు. ఈ డబ్బుల అంశంపై తనకు ఏ మాత్రం తెలియదని స్పష్టం చేశారు. గురువారం నుంచి తాను పార్లమెంట్ కు వచ్చినా సీటులో కూర్చోలేదని క్యాంటిన్ లో వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డితో మాట్లాడుతూ ఉన్నానని తర్వాత వెళ్లిపోయానని చెప్పుకొచ్చారు. మొత్తానికి ఈ డబ్బు వ్యవహారంలో విచారణ చేసి ఏం తేలుస్తారో కానీ.. ఆ డబ్బులు ఖచ్చితంగా ఎవరో ఎంపీలవే అయి ఉంటాయి.. కానీ వారు తమకు తెలియదని ఎందుకు చెబుతున్నారో ఎవరికీ అర్థం కావడంలేదు. ఏదో డీల్ పార్లమెంట్ లో చేసుకున్నారేమోనన్న అనుమానాలు సామాన్యులకు కలగడం సహజమే.
👉 షాద్‌నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌పై దోమలగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు..
వెలమ సామాజిక వర్గాన్ని అసభ్య పదజాలంతో దూషించిన షాద్‌నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌పై దోమలగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన ఆల్ ఇండియా వెలమ అసోసియేషన్ సభ్యులు.
👉 సూర్యాపేట జిల్లా:
*మఠంపల్లి నుండి రఘునాథపాలెం మధ్యలో కరెంట్ షాక్ తో వ్యక్తి మృతి..*పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది*
👉 మర్రి లక్ష్మారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య 😱😱😱 హైదరాబాద్ – దుండిగల్లోని మర్రి లక్ష్మారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఫస్టియర్ చదువుతున్న శ్రావణి అనే విద్యార్థిని ఆత్మహత్య.శ్రావణి మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపిన పోలీసులు.ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
👉మరో ఆడపిల్ల వద్దని..ఓ మృగం కిరాతకం.. భార్యను ప్రత్యక్ష సాక్షి కూతురును చంపేశాడు 😱..కర్నూలులో అమానుషం.. సభ్య సమాజం కన్నీరు మున్నీరు..
తన భార్య నిండు గర్బిణీ. తొమ్మిదినెలలు నిండాయి. పదోనెల వచ్చింది. ఇంకేముందీ మళ్లీ ఆడపిల్లనే కనబోతోందని ఓ మృగాడు రాక్షసుడిగా మారిపోయాడు. భార్యను కొట్టి చంపేశాడు. ప్రత్యక్ష సాక్షి కూతురు గొంతు నిలిమి ప్రాణం తీశాడు. ఈ కిరాతక చర్య సభ్య సమాజాన్ని కంట తడిపెట్టించింది. ఈ దారుణం కర్నూలు జిల్లా హోళగుంద మండలం హెబ్బటంలో దారుణం చోటు చేసుకుంది. శుక్రవారం వెలుగు చూసిన ఈ అమానుషం వివరాలు ఇవి.హేబ్బటం గ్రామానికి చెందిన సకరప్ప, సలీమా(21) భార్యాభర్తలు. వీరికి మూడేళ్ల కుమార్తె సమీరా ఉంది.ప్రస్తుతం సలీమా గర్భిణి.సలీమాకు మళ్లీ ఆడపిల్లే పుడుతుందేమోనని సకరప్ప అనుమానించాడు. నిత్యం ఘర్షణ పడుతున్నాడు. గురువారం రాత్రి వీరి మధ్య ఘర్షణ జరగా, ఆవేశంతో సకరప్ప కర్రతో సలీమా తలపై కొట్టి చంపాడు.ఈ అకృత్యానికి ప్రత్యక్ష సాక్షి సమీరా గొంతును నులిమి చంపేశాడు.పోలీసులకు లొంగిపోయారు.పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
లక్ష మందితో సీఎం బహిరంగ సభ .. ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వబోం:మంత్రి కోమటిరెడ్డి.. మర్రి లక్ష్మారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య…ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌పై దోమలగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు.. రాజ్యసభలో నోట్ల కట్టలు ఎవరివో???….ముదురుతున్న సంధ్య థియేటర్ వ్యవహారం… అల్లు అర్జున్ హౌస్ అరెస్ట్.. మరో ఆడపిల్ల వద్దని భార్యను కూతుర్ని చంపేసిన కిరాతకుడు.
Recent Posts