అన్నదాతలపై బాష్పవాయువు ప్రయోగం.. గాయపడిన కర్షకులు..ఆసుపత్రికి తరలింపు..నిలిచిన రైతుల ‘చలో దిల్లీ’.. “పోలీసుల పేరు చెబితే నేరస్తులు హడలిపోవాలి- సీఎం రేవంత్ రెడ్డి.. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఫేక్ బర్త్ సర్టిఫికెట్లు..!!!..భీమా చెక్ ను అందించిన ఏపీ జి బి రీజనల్ మేనేజర్ (అర్ధవీడు).. నాటు సారా తయారీ పై అవగాహన.. 20 గొర్రెలు అపహరణ (పొదిలి)

👉అన్నదాతలపై బాష్పవాయువు ప్రయోగం..గాయపడిన కర్షకులు..ఆసుపత్రికి తరలింపు..నిలిచిన రైతుల ‘చలో దిల్లీ’..
సంయుక్త కిసాన్‌ మోర్చా, కిసాన్‌ మజ్దూర్‌ మోర్చా
భేటీలో తేలనున్న తదుపరి కార్యాచరణ..
పంజాబ్‌-హరియాణా సరిహద్దు ప్రాంతం శంభులో రైతులపైకి బాష్పవాయువు ప్రయోగిస్తున్న పోలీసులు
శంభు, దిల్లీ: పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంతోపాటు తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ.. హరియాణా, పంజాబ్‌ రైతులు చేపట్టిన ‘చలో దిల్లీ’ కార్యక్రమం శుక్రవారం నిలిచిపోయింది. పంజాబ్‌-హరియాణా సరిహద్దులో పోలీసులు ప్రయోగించిన బాష్పవాయు గోళాల కారణంగా పలువురు అన్నదాతలు గాయపడటంతో వారు కవాతును నిలిపివేశారు. ఉదయం 101 మందితో కూడిన కర్షక బృందం శంభు సరిహద్దు నుంచి దిల్లీ దిశగా కవాతు ప్రారంభించింది. కొద్ది దూరం సాగగానే హరియాణా భద్రతా సిబ్బంది ఏర్పాటు చేసిన బహుళ అంచెల బారికేడ్లతో వారి యాత్ర ఆగిపోయింది. వారిని చెదరగొట్టేందుకు సాయుధ సిబ్బంది బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. దీంతో ఆ పొగ నుంచి రక్షణగా తమ కళ్లు, నోళ్లకు తడి గోనెసంచులు అడ్డుగా పెట్టుకుని కొందరు ఆందోళనకారులు తొలి అంచె బారికేడ్‌ను సులువుగా దాటగలిగారు.అయితే అక్కడ నుంచి ముందుకు సాగలేక పోయారు.జలఫిరంగి వాహనాలనూ శంభు సరిహద్దులో మోహరించారు.నిషేధ ఆజ్ఞలు అమల్లో ఉన్నందున ముందుకు సాగరాదంటూ హరియాణా పోలీసులు రైతులకు సూచించారు.
ఈ క్రమంలో తమ బృందంలోని ఐదారుగురు రైతులు టియర్‌ గ్యాస్‌ ప్రయోగంతో గాయపడ్డారని రైతు నాయకుడు సర్వణ్‌ సింగ్‌ పాంధేర్‌ వెల్లడించారు. వారిని ఆసుపత్రికి తరలించామని ఈ కారణంగా తమ కవాతును శుక్రవారం నిలిపేస్తున్నట్లు ప్రకటించారు. తదుపరి చేపట్టాల్సిన ఆందోళననపై సంయుక్త కిసాన్‌ మోర్చా, కిసాన్‌ మజ్దూర్‌ మోర్చా భేటీ అనంతరం నిర్ణయిస్తాయని తెలిపారు. సిక్కు గురు తేజ్‌ బహదూర్‌ బలిదాన దినాన్ని రైతులు శంభు, ఖన్నౌరి సరిహద్దు ప్రాంతాల్లో పాటించారు. ఇదిలా ఉండగా ఎస్‌కేఎం నాయకుడు జగ్జిత్‌ సింగ్‌ దలేవాల్‌ కన్నౌరి సరిహద్దులో చేపట్టిన నిరవధిక నిరసన దీక్షను శుక్రవారమూ కొనసాగించారు. తమ దిల్లీ యాత్రను భద్రతా సిబ్బంది అడ్డు కోవడంతో గత ఫిబ్రవరి 13 నుంచి పంజాబ్, హరియాణా సరిహద్దుల్లోని శంభు,ఖన్నౌరి ప్రాంతాల్లో రైతులు బస చేసి ఉంటున్నారు..
⚫అంబాలా జిల్లాలో ఇంటర్నెట్‌ బంద్‌..
మరోవైపు అంబాలా జిల్లాలోని 11 గ్రామాల్లో మొబైల్‌ ఇంటర్నెట్, గంపగుత్త ఎస్‌ఎంఎస్‌ సేవలను ఈ నెల 9 వరకూ హరియాణా ప్రభుత్వం నిలిపివేసింది.
⚫నొయిడాలో ట్రాఫిక్‌ జామ్‌*
గ్రేటర్‌ నొయిడాలో ఆందోళనలో పాల్గొంటున్న రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. నిరసన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు భారీగా రైతులు రావడం వల్ల గ్రేటర్‌ నొయిడాలో భారీ ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది.
⚫రైతులకు కాంగ్రెస్‌ మద్దతు..
దిల్లీలో రైతుల శాంతియుత నిరసనలకు కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ప్రకటించింది. వారిపై బాష్పవాయు గోళాలను ప్రయోగించడాన్ని ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఖండించారు. వారి డిమాండ్లను తక్షణం ఆమోదించాలని కేంద్రానికి సూచించారు..
⭐అన్నదాతల ప్రధాన డిమాండ్లు ఇవి..
⭐పంటల కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)కు చట్టబద్ధత
⭐పంట రుణాల మాఫీ..రైతులు, రైతు కూలీలకు పింఛన్లు
⭐విద్యుత్‌ ఛార్జీలను పెంచరాదు..⭐రైతులపై పెట్టిన పోలీసు కేసులను ఉపసంహరించాలి..⭐లఖింపుర్‌ ఖేరి హింసలో మృతి చెందిన బాధితులకు న్యాయం అందించాలి..⭐2020-21 ఆందోళన కాలంలో మరణించిన రైతుల కుటుంబాలకు పరిహారం అందించాలి..⭐భూసేకరణ చట్టం 2013ను పునరుద్ధరించాలి
👉మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంది..శివరాజ్‌సింగ్‌.. వ్యవసాయ ఉత్పత్తులను కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేసేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ స్పష్టం చేశారు.మోదీ గ్యారంటీని కచ్చితంగా అమలు చేసి తీరుతామన్నారు.ఉత్పత్తి ధర కంటే కనీసం 50శాతం అధికంగా చెల్లించి పంటను కొనుగోలు చేయాలన్న ఎంఎస్‌ స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసులను పరిగణనలోకి తీసుకోలేమని గతంలో కాంగ్రెస్‌ చెప్పిందని చౌహాన్‌ సభకు వివరించారు.కానీ,మోదీ ప్రభుత్వం ఇప్పటికే ధాన్యం, గోధుమలు,సోయాబీన్,జొన్న పంటలకు ఉత్పత్తి ధర కంటే 50 శాతం అధికంగా చెల్లించి కొనుగోలు చేస్తోందని వివరించారు.
👉పోలీసులపేరు చెపితే నేరస్తులు హడాలెత్తిపోవాలి.. సీఎం రేవంత్ రెడ్డి..
👉పోలీసులపేరు చెపితే నేరస్తులు హడాలెత్తిపోవాలని సమాజంలో కొత్త పుంతలు తొక్కుతున్న నేరాలను అరికట్టడంలో సరికొత్త వ్యూహాలతో ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి రాష్ట్ర పోలీసు శాఖకు సూచించారు. సమాజాన్ని పట్టి పీడిస్తున్న సైబర్ క్రైమ్స్, డ్రగ్స్ మహమ్మారిని నిరోధించడానికి పోలీసు శాఖలో సుశిక్షితులైన వారితో ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయాలని దిశానిర్ధేశం చేశారు.డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగ స్ఫూర్తిని,పోలీస్ రైజింగ్ డేను స్మరిస్తూ, ప్రజా సేవ కోసం ఎక్కువ సమయం విధి నిర్వహణలో ఉంటున్న హోంగార్డులకు ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పలు వరాలను ప్రకటించారు.
⭐ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలు కార్యక్రమాల్లో భాగంగా హోం శాఖ విజయాలపై నెక్లెస్ రోడ్డు హెచ్ఎండీఏ మైదానంలో నిర్వహించిన సదస్సులో ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారితో కలిసి పాల్గొన్నారు. పోలీసు శాఖలోని వివిధ విభాగాలు, డాగ్ స్వ్కాడ్‌లు ఇచ్చిన ప్రదర్శనలను తిలకించారు.
🌟ఆయా విభాగాలు వినియోగించే ఆయుధాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన పరికరాలతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకించారు.ట్రాఫిక్ అసిస్టెంట్స్‌గా నియమితులైన ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులకు నియామక పత్రాలను అందించారు.
⭐అనంతరం ముఖ్యమంత్రి సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తూ…
⭐గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలను నిరోధించడంలో కొంత ప్రగతి సాధించినప్పటికీ ప్రస్తుత చర్యలు సరిపోవు. మరింత కఠినంగా వ్యవహరించాల్సి ఉంది. డ్రగ్స్, సైబర్ క్రైమ్స్ వంటి కేసుల్లో న్యాయస్థానాల్లో కఠిన శిక్షలు పడే విధంగా స్పెషల్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసి సుశిక్షితులైన అధికారులను నియమించాలి. ఈ కేసుల కోసం ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నాం..
⭐హైదరాబాద్ నగరంలో ప్రధానంగా కాలుష్యం తగ్గించడం, ట్రాఫిక్ ను నియంత్రించాల్సిన అవసరం ఎంతో ఉంది. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ట్రాన్స్ జెండర్లు అడుక్కునే దృశ్యాలను గమనించి, వారు ఆత్మగౌరవంతో బతకడానికి, జనజీవన స్రవంతిలో చేర్చాలన్న ఉద్దేశంతో ట్రాఫిక్ అసిస్టెంట్స్‌గా విధుల్లోకి తీసుకోవడం జరిగింది.సమాజంలో వారు వివక్షకు గురికావొద్దు..
⭐విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోతున్న పోలీసు ఉన్నతోద్యోగులకు పరిహారం చెల్లిస్తున్నట్టుగానే, హోం గార్డులు ఎవరైనా ప్రమాదవ శాత్తు మరణిస్తే వారి కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం చెల్లించాలని నిర్ణయించాం..
⭐అలాగే, హోం గార్డులకు రోజుకు 921 రూపాయలు చెల్లిస్తుండగా,ఇకనుంచి 1000 రూపాయలకు పెంపు. వీక్లీ పరేడ్ అలవెన్స్ రూ.100 నుంచి రూ.200 కు పెంపు. ప్రభుత్వ ఉద్యోగులకు వైద్య సౌకర్యాలు అందుతున్నట్టుగా హోం గార్డులకు ఆ సౌకర్యాలు లేని కారణంగా వారి కుటుంబాలను రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలు చేస్తాం. ఇవన్నీ జనవరి ఒకటి నుంచి అమలు చేస్తాం..
⭐పోలీసు పిల్లలు సైతం ఉన్నతమైన విద్యను అభ్యసించా లన్న లక్ష్యంతో నేషనల్ డిఫెన్స్ అకాడమీ, కేంద్రీయ విద్యాలయాలు, సైనిక్ స్కూళ్లకు తీసిపోకుండా వచ్చే విద్యా సంవత్సరం నుంచి 50 ఎకరాల్లో పోలీస్ స్కూల్ ప్రారంభి స్తున్నాం.ఎక్కడి నుంచి వచ్చారంటే పోలీస్ స్కూల్ నుంచి వచ్చామని సగర్వంగా చెప్పుకునే స్థాయిలో తీర్చిదిద్దుతాం.
⭐సమాజానికి ఎన్నో సేవలు అందిస్తున్న పోలీసు ఉద్యోగం అంటే మీకు ఉపాధి కాదు. ఇదొక భావోద్వేగం. ప్రభుత్వ ప్రతిష్టను కాపాడే బాధ్యత మీపైన ఉంది. ప్రెండ్లీ పోలీసు అంటే… బాధితుల పట్ల మర్యాదగా వ్యవహరించాలి. బాధితులు, అన్యాయానికి గురైన వారి పట్ల గౌరవంగా వ్యవహరించాలి. కబ్జాలు, హత్యలు, ఆర్థిక నేరగాళ్ల పట్ల కఠినంగా వ్యవహరించాలి. నేరగాళ్లకు ప్రొటోకాల్ పాటిస్తే మీరు మీ విధులను నిర్వర్తించలేరు.
⭐సమాజంలో ఎక్కువ సేవలు అందిస్తున్నది పోలీసులే. అలాగే ఎక్కువ విమర్శలు ఎదుర్కోనేది కూడా పోలీసులే. యూనిఫామ్ ఫోర్స్ అంటే క్రమశిక్షణతో ఉండాలి. మీకేవైనా సమస్యలు ఉంటే వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రజల సమస్యలను పరిష్కరించే మీకు సమస్యలు ఉండకూడదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
⭐కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులతో పాటు హోం శాఖ కార్యదర్శి, డీజీపీ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, ఆయా విభాగాల అధిపతులు,ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
*స్టేట్ ఇంచార్జ్.. హైదర్ అలీ..
👉పోలీస్ స్టేషన్లకు వచ్చి హడావుడి చేస్తే బొక్కలో వేయండి:
ఎవరైనా సరే పోలీస్ స్టేషన్లకు వచ్చి హడావుడి చేస్తే చక్కగా తీసుకెళ్లి బొక్కలో వేయండి అని సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర పోలీసులను ఆదేశించారు. పోలీసులంటే నేరగాళ్లు భయపడాల్సిందేనన్నారు. పోలీస్ స్టేషన్‌కి వచ్చిన ఏ ప్రజాప్రతినిధి అయినా మర్యాదగా వ్యవహరించాలన్నారు. పేదలు, సామాన్యులు, బాధితులకు పోలీసులు అండగా ఉండాలన్నారు. నేరగాళ్ల హోదా చూసి పోలీసులు వెనక్కి తగ్గొద్దని అన్నారు. విధి నిర్వహణలో మరణించిన అధికారులు, పోలీసుల కుటుంబాలకు అండగా ఉంటామని సీఎం తెలిపారు.
👉 రేషన్‌ బియ్యం అక్రమ రవాణాపై ‘సిట్‌’ ఏర్పాటు..
అమరావతి: రేషన్‌ బియ్యం అక్రమ రవాణాపై ప్రత్యేక దర్యాప్తు బృందం ‘సిట్‌’ను ఏర్పాటు చేస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆరుగురు సభ్యులతో కూడిన సిట్‌కు చీఫ్‌గా వినీత్‌ బ్రిజ్‌లాల్‌కు బాధ్యతలు అప్పగించారు..సిట్‌ సభ్యులుగా సీఐడీ ఎస్పీ ఉమామహేశ్వర్‌, డీఎస్పీలు అశోక్‌ వర్ధన్‌, గోవిందరావు, డీఎస్పీలు బాలసుందర్‌రావు, రత్తయ్యలను నియమించారు. ప్రతి 15 రోజులకోసారి కేసు పురోగతిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించిన ప్రభుత్వం.. సిట్‌కు పూర్తి స్థాయి అధికారాలు అప్పగించింది. పీడీఎస్‌ బియ్యం అక్రమ రవాణాపై కాకినాడలో 13 ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి..
👉చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఫేక్ బర్త్ సర్టిఫికెట్లు..!!!
నెలరోజుల వ్యవధిలో వెయ్యికి పైగా ఫేక్ బర్త్ సర్టిఫికెట్లు
రామకుప్పం, కుప్పం శాంతిపురం మండలాల్లో పలు ఇంటర్నెట్, కమ్యూనిటీ సర్వీస్ సెంటర్లలో కుప్పం ఆర్డీవో శ్రీనివాసులు ఆకస్మిక తనిఖీలు..
అనంతపురం, కృష్ణ జిల్లాలకు సంబంధించి పలు సచివాల యాల డిజిటల్ సిగ్నేచర్ లతో ఫేక్ బర్త్ సర్టిఫికెట్లు
ఫేక్ బర్త్ సర్టిఫికెట్ల వ్యవహారంలో రామకుప్పం మండలానికి చెందిన మాజీ వాలంటీర్ ..
👉కుత్బుల్లాపూర్ దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో MLRIT ఇంజనీరింగ్ కళాశాల లో బీటెక్ మొదటి సంవత్సరం చదువు తున్న శ్రావణి (18) హాస్టల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య.?
శ్రావణి తల్లితండ్రులకు కనీస సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించిన కళాశాల యాజమాన్యం.ప్రాదమిక దర్యాప్తు లో వికారాబాద్ జిల్లా మైలారం కొత్త తండా ధరూర్ మండలం కు చెందిన బలరాం, కవిత పెద్ద కూతురు శ్రావణిగా గుర్తించారు…తమ కూతురు ఆత్మహత్య చేసుకొనంత పిరికిది కాదని కళాశాల లో ఏం జరిగిందో తెలిపాలి మాకు న్యాయం చేయాలని MLRIT కళాశాల ఆవరణ లో ఆందోళన చేస్తున్న మృతురాలి కుటుంబ సభ్యులు..భారీగా మోహరించిన దుండిగల్ పోలీసులు*…
👉భీమా చెక్ ను అందించిన రీజనల్ మేనేజర్
మండలంలోని పాపినేనిపల్లె గ్రామానిచెందిన చెంచని మహాలక్ష్మమ్మ అక్టోబర్ పదిన గుండెపోటుతో మృతిచెందినది. మృతురాలికి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో భీమా చేయించుకున్నట్లుబ్యాంకు మేనేజర్ తెపారు.మార్కాపురం రీజనల్ మేనేజర్ యం రఘురామ్ మృతురాలి భర్త మోహాన్ రావుకు శుక్రవారంబీమా చెక్ ను అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏపీజీబీ బ్యాంకు పరిధిలోతక్కువ ప్రీమియంతో హెల్త్ కేర్ ఇన్స్ రెన్స్, ఛాయిస్ ఇన్సూరెన్స్ సౌకర్యం వున్నదని ప్రతి ఒక్కరు బీమా చేయించుకోవాలన్నారు కార్యక్రమంలో మేనేజర్ సిహెచ్ భద్రీనాద్, ఫిల్డ్ ఆఫీసర్ ఆశీస్, మణికంఠ సిబ్బంది పాల్గొన్నారు.
👉 కంభం ప్రొబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ వారి సిబ్బందితో కలిసి అర్ధవీడు మండలంలోని పాపినేనిపల్లి, చెంచుగూడెం గ్రామాలలోని అనుమానిత ప్రదేశాలలో దాడులు నిర్వహించగా నాటు సారాయి తయారీకి సంబంధించిన ఎటువంటి పదార్థాలు మరియు వస్తువులు కనుగొనబడలేదు. అంతటా సదరు గ్రామస్తులతో అవగాహన కార్యక్రమం నిర్వహించి ఎవరైనా నాటు సారాయి తయారు చేసినట్లయితే వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని అదేవిధంగా వారి మీద భవిష్యత్తులో పీడీ యాక్ట్ లు కూడా పెడతామని చెప్పడం జరిగింది.అంతట గ్రామస్తులకు గ్రామంలో ఎవరైనా నాటు సారాయి తయారు చేసినట్లయితే ఎక్సైజ్ పోలీసు వారికి తెలియపరచవలసినదిగా ప్రజలను కోరడమైనది అదే విధంగా వారికి కంభం ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కొండారెడ్డి నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది.కార్యక్రమంలో కంభం ఎక్సైజ్ ఇన్స్పెక్టర్,ఎస్.కొండారెడ్డి వారి సిబ్బంది అయిన రంగారావు ,నాగేశ్వరరావు, పోలీస్ భాష పాల్గొనడం జరిగింది.
👉గొర్రెలను అహరించిన గుర్తు తెలియని దుండగులు…
*లబోదిబో మంటున్న గొర్రెల పెంపకందారులు.. పొదిలి మండలం మాదిరెడ్డిపాలెం గ్రామంలో గొర్రెలను దోచుకెళ్లిన గుర్తు తెలియని దుండగులు.. నన్నేబోయిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి చెందిన సుమారు 20 గొర్రెలకు పైగా దోచుకెళ్లిన గుర్తుతెలియని దుండగులు…అర్ధరాత్రి సమయంలో ఇంటికి వెనకవైపు చిలుకువేసి గొర్రెలను అపహరించిన గుర్తు తెలియని దుండగులు…సుమారు 100కు పైగా గొర్రెలు ఉన్నాయంటూ అందులో 20 గొర్రెలను అప్పగించారని ఆందోళన వ్యక్తం చేస్తున్న వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు.. లబోదిబో మంటూ సుమారు మూడు లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగిందంటూ కన్నీరు మున్నీరు అవుతున్నరు వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు… గొర్రెలను దోచుకెళ్లిన దుండగులు పట్టుకొని మాకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధితులు.. స్టాఫ్ రిపోర్టర్ రహమాన్..

7k network
Recent Posts

ప్రియాంక గాంధీపై బీజేపీ నేత ర‌మేష్ బిధూరి చేసిన అనుచిత వ్యాఖ్య‌ల ప‌ట్ల‌ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన మంత్రి సీత‌క్క‌*.. *నవీన్ కి చెక్ పెట్టినట్లే కేజ్రీవాల్ కి కూడా ?.. *ఈ ఫార్ములా రేసులో కొన్ని నిజాలు *.. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఛైర్మెన్ జంగా రాఘవ రెడ్డి … ఏపీ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, మంత్రి సత్య కుమార్ యాదవ్* …ప్రభుత్వ ఆస్తిని అప్పనంగా దోచుకున్న ఓం నారాయణ పై చర్యలు : లంబాడి హక్కుల పోరాట సంఘం.. *పొదిలి మాదిరెడ్డిపాలెం వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షులుగా ఎర్రం రెడ్డి

👉ఎంఎస్‌పీ పంజాబ్‌కే కాదు.. దేశమంతటికీ అవసరమే ..*తెలుగు తమ్ముళ్లకు సంక్రాంతి పండుగ ముందే వచ్చిందా.😲 ..హుస్నాబాద్ మైనార్టీ గురుకుల బాలికల పాఠశాల లో ఆకస్మిక తనిఖీలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ … ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాటులను పర్యవేక్షించిన జిల్లా అధికారులు ..*ఆత్మకూరులో ఇస్తేమ పనులను పర్యవేక్షించిన మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్ .. *

👉ఏపీలో రేపటి నుంచి ఉచిత ఓపీ సేవలు బంద్ …* విశాఖ పోర్టులో పట్టుకున్న బియ్యానికి కలెక్టర్ క్లీన్ చిట్..😲… *విశాఖ సెంట్రల్‌ జైల్ ను సందర్శించిన రాష్ట్ర హోం మంత్రి .. అగ్ని ప్రమాదాల పై అవగాహన సదస్సు.. *ఉచిత బస్సు కంటే ఇతర సంక్షేమ పథకాలకు ఖర్చు పెడితే బెటరేమో ! .. *అధికారులను సత్కరించిన పొదిలి పట్టణ టిడిపి అధ్యక్షుడు. . *నిలిచిపోయిన కాపు భవనాలను పునఃప్రారంభించాలి: బలిజ సేవ సంఘం డిమాండ్ .

2700 కోట్ల ఇల్లు.. రూ.10 లక్షల సూట్ ధరించే వారా విమర్శించేది? .. *పవన్ ఆదేశాలు.. సముద్ర తీరంలో రెండు బోట్లు సీజ్* .. *విజయవాడలో వెలుగు చూసిన అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారం .. *చంద్రగిరి ‘బీసీ’ విద్యార్థినులకు మెరుగైన వైద్యం* *తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ కు మంత్రి సవిత ఆదేశం*.. *ఆర్మీ వాహనం లోయలో పడి ఇద్దరు సైనికులు మృతి.. *పుత్తూరు సబ్ డివిజన్ పోలీసులు హెల్మెట్ వాడకంపై అవగాహన కార్యక్రమాలు … మైలవరం లో మిక్సీంగ్ రాజకీయ సెగలు…! ..*రాజకీయ దుమారం రేపిన పాలడుగు దుర్గా ప్రసాద్, ఎమ్మెల్యే వసంత కలయిక… *ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తూ పోలీస్ సిబ్బంది జీవన విధానం ఉండాలి : ఐజి వి సత్యనారాయణ.. *పోలీసుల వేధింపులు తట్టుకోలేక హుజూర్‌ నగర్ పోలీస్ స్టేషన్ ముందు యువకుడి ఆత్మహత్యాయత్నం .. * డిగ్రీ విద్యార్థులకు కూడా తక్షణమే వర్తింప చేయండి..మాజీ ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు పివి శేషయ్య.

*రెవిన్యూ అధికారులకు పై సియం సీరియస్*…*ప్రభుత్వ ఉద్యోగులపై ఆరోపణలు, కేసులు పెట్టే వారికి రక్షణ కల్పించేలా సర్కార్‌ చర్యలు.. *పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు పటిష్ట చర్యలు ; రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా…*కాంస్య పతకం సాధించి దేశ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన ఓరుగ‌ల్లు ముద్దుబిడ్డ .. *నితీష్ కి కన్ను గీటిన లాలూ..ఎన్డీయేలో కలవరమేనా ? ..*అమెరికాలో విచిత్రం ఇస్తున్న నోరో వైరస్ …*చైనాలో మరోసారి హెల్త్ ఎమర్జెన్సీ

⭐సూపర్-6 హామీలు కచ్చితంగా అమలు చేస్తాం..గత పాలనంతా విధ్వంసం…మేము రిపేర్లు చేస్తూ వెళ్తున్నాం..తప్పుడు పనులు చేయొద్దు.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు హెచ్చరిక : సీఎం చంద్రబాబు ..*మాదాపూర్ పేస్ హాస్పిటల్‌లో దారుణం.. *ఒక్క పైసా కూడా అవినీతి లేదు. -కేటీఆర్‌ ..*.. ఫారిన్‌లో ఎడ్యుకేషన్‌ పేరుతో మోసాలు. బోగస్‌ కన్సల్టెన్సీ ప్రతినిధులను అరెస్ట్‌ చేసిన పోలీసులు… సైబర్ నేరాలకు అడ్డా ‘వాట్సప్’.. హోంశాఖ నివేదిక.*.. యాపిల్ పండ్ల మాటున మద్యం అక్రమ తరలింపు …*తిరుపతిలో మత్తు వదిలించిన పోలీస్