ఈవీఎంలపై అనుమానాలున్నాయి..ప్రమాణం చేయం..మహారాష్ట్రలో మరో మెలిక … ప్రజలపై భారాలు మోపే అదాని విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలి – సిపిఐ డిమాండ్ ..ఆశ్రమ పాఠశాలలో రాగింగ్ ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డ విద్యార్థి..?…రేవతి ఫ్యామిలీకి సంతాపం తెలియజేస్తున్నాను..అల్లు అర్జున్…వెయిట్ లిఫ్టింగ్ పతక విజేతను అభినందించిన ఎం.పీ మాగుంట…పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో పాల్గొన్న టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి… కంభం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అలరించిన ఆత్మీయ సమావేశం… బైండోవర్ కేసులు నమోదు (కంభం) …

👉ఈవీఎంలపై అనుమానాలున్నాయి..ప్రమాణం చేయం..మహారాష్ట్రలో మరో మెలిక.. దేశంలో రాజకీయంగా అత్యంత కీలక రాష్ట్రం.. ఆర్థిక రాజధాని కొలువైన రాష్ట్రం.. భౌగోళికంగా మూడో అతి పెద్దరాష్ట్రం.. కానీ, అనిశ్చితిలో చిన్న రాష్ట్రాలను తలపిస్తోంది. దేశంలో రాజకీయంగా అత్యంత కీలక రాష్ట్రం.. ఆర్థిక రాజధాని కొలువైన రాష్ట్రం.. భౌగోళికంగా మూడో అతి పెద్దరాష్ట్రం.. కానీ, అనిశ్చితిలో చిన్న రాష్ట్రాలను తలపిస్తోంది. ఇప్పటికే ఎన్నికల ఫలితాలు వెలువడిన 10 రోజుల పైగా విరామం అనంతరం ప్రభుత్వం ఏర్పడింది. ఈ మధ్యలో అనేక డ్రామాలు నడిచాయి. మరెన్నో మలుపులు.. ఎట్టకేలకు ప్రభుత్వం ఏర్పడినా శాఖల పంచాయితీ కొనసాగుతూనే ఉంది. ఎన్నికల్లో గెలిచి.. సర్కారులో ఓడి మహారాష్ట్ర ఫలితాలను చూస్తే.. బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమి ఎన్నికల్లో గెలిచి, సర్కారు ఏర్పాటులో ఓడిపోయిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వాస్తవానికి ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమిలోని శివసేన (ఉద్ధవ్‌) 20, కాంగ్రెస్‌ 16, ఎన్సీపీ (ఎస్‌పీ) 10 స్థానాలు గెలుచుకున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ 2, జన్‌ సురాజ్య శక్తి 2, రాష్ట్రీయ యువత స్వాభిమాన్‌ పార్టీ, రాష్ట్రీయ సమాజ్‌ పక్ష, ఏఐఎంఐఎం, సీపీఎం, పీడబ్ల్యూపీఐ, ఆర్‌వీఏ చెరో ఒక స్థానం చొప్పున గెలుపొందగా, స్వతంత్ర అభ్యర్థులు రెండు స్థానాల్లో విజయం సాధించారు. ఈమొత్తం కలిపినా 51 మాత్రమే. ముహూర్తం ఫిక్స్! ‘మహాయుతి’ మాత్రం ప్రభంజనం సృష్టించింది. మొత్తం 288 సీట్లకు 233 ఈ కూటమి ఖాతాలోకే చేరాయి. చోట్ల గెలుపొందింది. భాజపా 132 స్థానాలను గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించింది. శివసేన (శిందే) 57, ఎన్సీపీ (అజిత్‌ పవార్‌) 41 స్థానాల్లో జయకేతనం ఎగురవేశాయి. అదే గనుక హంగ్ ఫలితం వచ్చి ఉంటే కథ వేరేగా ఉండేది. మహా వికాస్ అఘాడీకి కాస్త పైచేయి సాధించే అవకాశం దక్కితే రాజకీయం రసవత్తరంగా మారేది. అసెంబ్లీ కొలువుదీరినా.. ప్రభుత్వం ఏర్పాటు అనంతరం ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారానికి శనివారం ముహూర్తం నిర్ణయించారు. అయితే, మహా వికాస్ అఘాడీ ఎమ్మెల్యేలు దీనిని బహిష్కరించాలని నిర్ణయించారు. మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే కుమారుడు, శివసేన (యూబీటీ) కీలక నాయకుడు, మాజీమంత్రి ఆదిత్య ఠాక్రే వెల్లడించారు. కూటమిలో వీరి పార్టీ ఎమ్మెల్యేలు మాత్రమే ప్రమాణం చేయడం లేదని చెప్పాడు. దీనికి కారణం.. ఈవీఎంలపై తమకు అనేక అనుమానాలు ఉండడమే అని పేర్కొన్నాడు. ప్రజాస్వామ్యాన్ని చంపేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని.. ఫలితాలపై ప్రజలు సంతృప్తిగా లేరని ఆదిత్య పేర్కొన్నారు.
👉వివేకా కేసు.. సుప్రీంలో సునీత మరో పిటిషన్…
సునీత సుప్రీంకోర్టులో మరో పిటిషన్‌ దాఖలు చేశారు. వైఎస్ వివేకా హత్యకేసులో నిందితుడు భాస్కర్‌రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని అందులో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. భాస్కర్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. భాస్కర్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి. బెయిల్ రద్దయితే ఈ కేసులో కొంత కదలిక వచ్చి అవినాష్ రెడ్డి అరెస్టుకు కూడా దారి తీయవచ్చు. సీఎం చంద్రబాబును కలిసిన కొన్ని రోజుల తర్వాత సునీత పిటిషన్ వేయడం గమనార్హం.
👉పిల్లలే మీ ఆస్తి.. వారు పెద్దవారై ప్రయోజకులైతే మీ జీవితాలు బాగుపడతాయి…తల్లిదండ్రులు తప్పనిసరిగా మీ చిన్నారులపై దృష్టి పెట్టండి.. మీ పిల్లలు ఎలా చదువుతున్నారో వారి మీద ఫోకస్ పెట్టండి…దీని కోసమే మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రంలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఏర్పాటు చేశాం…ఒక్కరోజు మీ పిల్లలు స్కూల్ కి రాకపోయినా తల్లిదండ్రుల ఫోన్ కి మెసేజ్ వస్తుంది..తల్లిదండ్రులు మీ పిల్లలకి అతిగా సెల్ ఫోన్లు ఇవ్వద్దు..దాని వల్ల చిన్న వయసులోనే విద్యార్థులకు తప్పుడు ఆలోచనలు వచ్చే ఆస్కారం ఉంది ..బాపట్ల సభలో సీఎం చంద్రబాబు_

👉దారుణం.. పులి దాడిలో మహిళ మృతి
మహారాష్ట్రలో విషాద ఘటన చోటుచేసుకుంది. గడ్చిరోలిలో శారద (24) అనే 8 నెలల గర్భిణి మహిళ పొలం పనులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా పులి దాడి చేసింది. ఈ దాడిలో శారద అక్కడికక్కడే మృతిచెందింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం అటవీశాఖ అధికారులు పులి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
👉 కడపజిల్లా*మైదుకూరు ఆర్టీసీ బస్టాండ్ ను మూసేసిన ఆర్టీసీ అధికారులు*…
*బట్టల దుకాణం ప్రారంభోత్సవం సందర్బంగా అనసూయ వస్తుండటం తో మెయిన్ ద్వారం మూసేసిన ఆర్టీసీ అధికారులు* …*అవస్థలు పడుతున్న ప్రయాణికులు విద్యార్థులు*. ..*ఆర్టీసీ బస్టాండ్ లో బస్సులను ఆపడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు* ..
*ఆర్టీసీ బస్సు స్టాండ్ లో ఇతర వాహనాలను పార్కింగ్ చేస్తే జరిమానా విధించే అధికారులు దుకాణాలను ఏర్పాటు చేపించడం పట్ల ప్రజల ఆగ్రహం*…*మైదుకూరు ఆర్టీసీ అధికారులపై ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్*
👉 కెనడాలో భారతీయ విద్యార్థి దారుణ హత్య..
కెనడాలో భారతీయ విద్యార్థిని హత్య కేసు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డిసెంబర్ 1న పంజాబ్‌కు చెందిన భారతీయ విద్యార్థి గురాసిస్ సింగ్‌ను సర్నియాలో కత్తితో పొడిచి చంపారు. గురాసిస్‌ సింగ్‌ కెనడాలో బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ చదువుతూ సహచరుడైన క్రాస్‌లీ హంటర్‌తో కలిసి ఒకే ఇంట్లో ఉండేవాడు. వంటగదిలో ఇద్దరి మధ్య గొడవ కాగా.. గురాసిస్ సింగ్‌ రూమ్మేట్ అతనిపై కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలై విద్యార్థి మృతి చెందాడు.
👉 గురుకుల విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న అధికారులు..
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట.. మహబూబాబాద్ జిల్లా, చెర్లపాలెం సంక్షేమ శాఖ బాలుర వసతి గృహంలో విద్యార్థులకు కాలం చెల్లిన మందులు ఇచ్చిన వైద్య సిబ్బంది
అసలే ఫుడ్ పాయిజన్ ఘటనలతో భయాందోళనలో ఉన్న విద్యార్థులకు.. కాలం చెల్లిన మందులు ఇస్తున్న వైనం.
👉రేవతి ఫ్యామిలీకి సంతాపం తెలియజేస్తున్నాను..అల్లు అర్జున్*
సంధ్య థియేటర్ కి సినిమా చూసేందుకు వెళ్లాను
సినిమా చూసి వచ్చిన తరువాత మహిళ చనిపోయారు, బాబుకి సీరియస్ అని తెలిసింది..నేను, సుకుమార్, టీమ్ అంతా చాలా బాధ పడ్డాము..రేవతి ఫ్యామిలీకి సంతాపం తెలియజేస్తున్నాను..మేము ఏం చేసినా ఆ లోటును భర్తీ చెయ్యలేను…కానీ అన్నిటికీ మేము మీతో ఉంటాము…
25 లక్షలు వారి ఫ్యూచర్ కోసం ఇస్తున్నాను…ఈ 25 లక్షలకి సంభంధం లేకుండా మెడికల్ ఖర్చులు భరిస్తా… ఫ్యామిలీ భాద్యత నాది…మేము సినిమా తీసేది ఆడియన్స్ ను సంతోష పెట్టాలనే..సినిమా చూసి ఇంటికి సేఫ్ గా వెళ్లండి..
👉 వెయిట్ లిఫ్టింగ్ పతక విజేతను అభినందించిన ఎం.పీ మాగుంట…
ఇటీవల కాలంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నందు జరిగిన సౌత్ – వెస్ట్ ఇండియా జోనల్ వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో ద్వితీయ స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించిన ప్రకాశం జిల్లా, సి.ఎస్.పురం లోని బెల్లంకొండ డిగ్రీ కళాశాల విద్యార్థి ఎన్.వి.మహేష్ ను ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి హృదయ పూర్వకంగా అభినందించారు. శనివారం ఒంగోలు లోని రాం నగర్ లో ఉన్న ఎం.పి మాగుంట కార్యాలయంలో బెల్లంకొండ విద్యా సంస్థల యజమానులు మాగుంటను మర్యాద పూర్వకంగా కలుసుకొని మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా తమ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి మహేష్ కాంస్య పతకం సాధించిన విషయాన్ని ఆ కళాశాల యాజమాన్యం ఎం.పి మాగుంట శ్రీనివాసులు రెడ్డి దృష్టికి తీసుకొని వెళ్లారు. ఎంతగానో సంతోష పడిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో ఆంధ్ర కేసరి యూనివర్శిటీ తరుపున పోటీలో పాల్గొని కాంస్య పతకం సాధించిన మహేష్ ను పిలిపించి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
👉దర్శి లోని ఆదర్శ పాఠశాలలో పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో పాల్గొన్న టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి డాక్టర్ లలిత సాగర్ తో పాటు ఎంఈఓ తాసిల్దార్ సిఐ తల్లిదండ్రులు
👉 ప్రజలపై భారాలు మోపే అదాని విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలి ..ట్రూ అప్ చార్జీల పేరుతో వేస్తున్న భారాలను ప్రభుత్వమే భరించాలి…అదాని అవినీతి బాగోతాన్ని నిగ్గు తేల్చాలి.. విద్యుత్ బాదుడు ఆపేంతవరకు వామపక్ష ఉద్యమాల్లో భాగస్వామ్యం కావాలి ..రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె వి వి సత్యనారాయణమూర్తి పిలుపు…
ప్రజలపై భారాలు మోపే అదాని విద్యుత్ సెకి ఒప్పందాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే రద్దు చేయాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జే వి వి సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఒంగోలులోని మల్లయ్య లింగం భవనంలో సిపిఐ జిల్లా సమితి, వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పెంచిన విద్యుత్ ఛార్జీలు ఉపసంహరించుకోవాలని, సర్దుబాటు చార్జీల భాగాలను ప్రజలపై మోపకుండా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేస్తూ శనివారంరౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్ వెంకట్రావు అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జె వివి సత్యనారాయణ ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాం కాలంలో రాత్రి ముఖ్యమంత్రి జగన్ విద్యుత్ చార్జీలు నేరుగా పెంచకపోయిన ట్రూ అప్ చార్జీల పేరుతో ప్రజలపై ఏడుసార్లు విద్యుత్ భారాలు మోపారన్నారు. ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు విద్యుత్ భారాలపై పలుమార్లు ఆందోళన చేస్తూ ప్రజలపై బాదుడే బాదుడు అంటూ ప్రభుత్వం తీరును ఎండగట్టారన్నారు. అయితే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ బాదుడును కొనసాగిస్తున్నారన్నారు. అదాని సౌర విద్యుత్ ఒప్పందం పేరుతో దేశంలో రూ. 2200 కోట్లు లంచాలు ఇచ్చిందని,అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో నాటి ముఖ్యమంత్రి జగన్ కు రూ. 1750 కోట్లు లంచం ఇచ్చిందని అమెరికా దర్యాప్తు సంస్థలు అమెరికా కోర్టులో అవయవాలు నమోదు చేశాయన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సైతం లంచాలు ఇచ్చిన అదానిని వదిలేసి తీసుకున్న జగన్ పై ఆరోపణలు చేస్తూ దిగుతున్నారన్నారు. బిజెపి నాయకులయితే అదానీపై ఆరోపణలను దేశం పై దాడులుగా అభివర్ణించటం సిగ్గుచేటు అన్నారు. చంద్రబాబు నాయుడుకి ప్రజలపై చిత్తశుద్ధి ఉంటే రూ. లక్షా పన్నెండు వేల కోట్లు అదనపు భారాలు పడే సెకి ఒప్పందాన్ని వెంటనే రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. ట్రూ అప్ ఛార్జీల పేరుతో వేస్తున్న విద్యుత్ భారాలను ప్రభుత్వమే భరించాలనిడిమాండ్ చేశారు. రానున్న కాలంలో విద్యుత్ భారాల కు వ్యతిరేకంగా సిపిఐ నిర్వహించే పోరాటాలలో ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. సిపిఎం నాయకులు జి రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు వినియోగించుకున్న విద్యుత్ కన్నా సర్దుబాటు చార్జీల పేరుతో వేస్తున్న భారాలే అధికమని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్.కె సైదా మాట్లాడుతూ విద్యుత్ భాగాలకు వ్యతిరేకంగా జరిగే పోరాటాలలో తాము సైతం భాగస్వామ్యం అవుతావని హామీ ఇచ్చారు. సిపిఐ ఎంఎల్ నాయకులు ఎస్ లలిత కుమారి మాట్లాడుతూ విద్యుత్ బిల్లులను పేదలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కట్టేలా ఉండాలి తప్ప, భారాలుగా మారకూడదు అన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం ఎల్ నారాయణ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తుల కోసం పనిచేస్తున్నాయే తప్ప, ప్రజల కోసం కాదని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ప్రజలపై మరింత భారాలు మోపే అదాని విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా చుండూరి రంగారావు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాజ్యాంగం లోని ఆదేశిక సూత్రాలను సైతం తుంగలో తొక్కుతుందన్నారు. ఉన్నత వర్గాల నుండి పన్నులు వసూలు చేసి సామాన్య ప్రజలకు నాణ్యమైన విద్య వైద్యాన్ని అందించాల్సిన ప్రభుత్వం, అందుకు విరుద్ధంగా సామాన్య ప్రజలపై అధిక భారాలు మోపుతూ దేశ సంపదను కొల్లగొట్టి అతి కొద్ది మంది గా ఉన్న కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ పి డి ఆర్ రాష్ట్ర అధ్యక్షులు చావలి సుధాకర్ రావు మాట్లాడుతూ అదాని అవినీతి భాగవతాలు బయటపడకుండా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అడ్డుకుంటుందన్నారు. అదాని అవినీతిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె వీరారెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్ విద్యుత్ మీటర్లు వద్దన్న చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక అవి ఎలా ముద్దయ్యాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వడ్డే హనుమా రెడ్డి మాట్లాడుతూ ఒకవైపు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి స్మార్ట్ మీటర్లు బిగించమని హామీ ఇస్తూనే మరి వైపు యదేచ్చగా స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకటేష్ స్మార్ట్ మీటర్ల బిగింపును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ ఒంగోలు నగర సహాయ కార్యదర్శి శ్రీరామ శ్రీనివాస్, ఇన్సాఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు యం. ఎ. సలార్, ఐ ఫ్ టి యు జిల్లా నాయకులు మోహన్, రైతు కూలి సంఘం జిల్లా నాయకులు కోటేశ్వరరావు,ఇండియన్ లేబర్ పార్టీ నాయకులు దాసరి సుందరం,మహిళా సమాఖ్య నాయకులు యం.విజయ,ఆర్. లక్ష్మి,ఏ పి. రైతు సంఘం నాయకులు పెండ్యాల హనుమంతరావు,సిపిఐ జిల్లా నాయకులు నల్లూరి మురళి,గద్దల బాలకోటయ్య, ప్రభాకర్,రవి లెనిన్, అంజయ్య,పౌర సమాజం నరసింహరావు పాల్గొన్నారు.
👉 సిగరెట్ బంకుల లో చోరీ*
పట్టణంలోని అర్బన్ కాలనీలోని ఒక చిల్లర దుకాణంలో, కందులాపురం సెంటర్ లొని ఒక బంకులో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. దాదాపు 40000 రూ నగదు మరియు ఖరీదైన సిగరెట్ బాక్సులు చోరీకి గురైనట్లు బాధితులు తెలిపారు.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
👉మద్యం బెల్ట్ షాపు నిర్వాహకులపై బైండోవర్ కేసులు నమోదు .. అర్ధవీడు మండలం లోని దొనకొండ మరియు మోహిద్దినిపురం గ్రామాలలో బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను అర్థవీడు ఎమ్మార్వో వద్ద రెండు సంవత్సరాలకు 2,00,000/- రూపాయలకు ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కొండారెడ్డి బైండోవర్ కేసులు నమోదు చేశారు.ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ కొండారెడ్డి మాట్లాడుతూ ఎవరైనా నాటు సారాయి తయారుచేసిన, బెల్ట్ షాపులు నిర్వహించినా, అక్రమంగా మద్యం తరలించినా, అక్రమంగా మద్యం కలిగి ఉన్నా, అమ్మినా ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ వారికి వెంటనే సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
👉కంభం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అలరించిన ఆత్మీయ సమావేశం*
పచ్చని తోరణాలు,పరిమళ పుష్పాలు,రంగవల్లులు, రమణీయ రాగాల నడుమ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులకు స్వాగతం పలుకుతూ ఆత్మీయ సమావేశానికి ఆలంబనగా నిలిచింది కంభం ప్రభుత్వ ఉన్నత పాఠశాల. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మరియు మండల విద్యాశాఖ అధికారి బి.మాల్యాద్రి అధ్యక్షతన శనివారం నిర్వహించిన ప్రతిష్టాత్మక మెగా పేరెంట్ టీచర్ సమావేశం
ఆత్మీయ భావాలకు అద్దం పడుతూ మమతలను అక్షరాలుగా మలచి మంచి చెడుల సమీక్షకు వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎంపీపీ చేగిరెడ్డి.తులసమ్మ, తహసిల్దార్ కిరణ్ , ఎంపీడీవో వీరభద్రాచారి, సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున్, సబ్ఇన్స్పెక్టర్ నరసింహారావు విద్యార్థులకు,తల్లిదండ్రులకు వారి అమూల్యమైన సలహాలను,సందేశాలను వినిపించారు. విద్యార్థుల ప్రగతి పత్రాలను పరిశీలించి సామర్ధ్యాల సారూప్యాలను తల్లిదండ్రులతో చర్చించారు. ఈసందర్భంగా ఎంపీపీ తులసమ్మ మాట్లాడుతూ విద్యార్థులకు తల్లిదండ్రులే తొలి గురువులని,అనుకరణ అమ్మ,నాన్నల నుండే ఆరంభమవుతుందని,కుటుంబం నుండే సద్భావనలకు శ్రీకారం దిద్ధాలన్నారు. తహసిల్దార్ కిరణ్ మాట్లాడుతూ విద్యతోనే విలువలు సాధ్యమని, బంగారు బాల్యం వారోత్సవాలను గుర్తుచేస్తూ బాల్య దశలో వ్యవహరించవలసి తీరును వివరించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తల్లిదండ్రుల సమావేశాలు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి బాసటగా వుంటాయని, విద్యార్థుల సామర్థ్యాలను కచ్చితంగా అంచనా వేసే సత్తా ప్రభుత్వ పాఠశాలల సొంతమని అన్నారు. ఎంపీడీవో వీరభద్రాచారి పాఠ్య పుస్తకాలలోని అంశాలను ప్రస్తావిస్తూ విద్యార్థులతో మమేకమయ్యారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున్ మాట్లాడుతూ తల్లిదండ్రుల ప్రేమ పిల్లలకు శాపం కాకూడదంటూ,సైబర్ క్రైమ్, సామాజిక సమస్యల పట్ల అవగాహన కలిగించారు. అనంతరం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలసి ఆట,పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేశారు.రంగవల్లులు, టగ్ ఆఫ్ వార్ తదితర పోటీలలో విజేతలకు బహుమతులను అందించారు. బంగారు బాల్యంతో విద్యా ప్రమాణాలను మెరుగుపరచుకుంటామంటూ ప్రతిజ్ఞ చేశారు.అనంతరం తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సుభతిథి సహపంక్తి భోజనాలు చేశారు. కార్యక్రమంలో పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ కంచి. రామారావు, ఎస్ఎంసి సభ్యులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
👉 ఆశ్రమ పాఠశాలలో రాగింగ్ ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డ విద్యార్థి..?
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలోని బాలురు ఆశ్రమ పాఠశాలలో ఆరో తరగతి విద్యార్థి ఈశం రుత్విక్ ను పదవ తరగతి విద్యార్థులు ర్యాగింగ్ చేయడంతో ఆ వేధింపులను తట్టుకోలేక ఎలర్జీ మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డ సంఘటన గూడూరు మండలంలో చోటుచేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న ఉపాధ్యాయులు హుటాహుటిన మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తరలించారు. అక్కడ పరిశీలించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది. ఆరో తరగతి విద్యార్థికి పదవ తరగతి విద్యార్థులు ఇద్దరూ రాగింగ్ చేయడంతో పలుమార్లు ప్రధానోపాధ్యాయులు, వార్డెన్ కు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని విద్యార్థి రోదిస్తూ తెలిపారు. ఈ సంఘటనపై ఇంకా పూర్తిస్థాయిలో వివరాలు తెలియవలసి ఉంది.
👉 వరంగల్ నగరంలో పట్టపగలే హత్య చేసి మృతదేహాన్ని కార్లో పెట్టిన ఘటనపై వీడిన మిస్టరీ..
డబ్బు, బంగారం కోసమే హత్య …
హంతకుడు ములుగు జిల్లా మంగపేట మండలం “కోమటిపల్లికి చెందిన జక్కుల శ్రీను అనే యూట్యూబ్ జర్నలిస్ట్. “మద్యం తాగించి రోకలి బండతో కొట్టి చంపిన హంతకుడు..గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే పోడెం వీరయ్య దగ్గర పీఏ.. గతంలో కూడా పలువురిని బెదిరింపులు, బ్లాక్‌మెయిల్ చేసిన శ్రీను.

7k network
Recent Posts

ప్రియాంక గాంధీపై బీజేపీ నేత ర‌మేష్ బిధూరి చేసిన అనుచిత వ్యాఖ్య‌ల ప‌ట్ల‌ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన మంత్రి సీత‌క్క‌*.. *నవీన్ కి చెక్ పెట్టినట్లే కేజ్రీవాల్ కి కూడా ?.. *ఈ ఫార్ములా రేసులో కొన్ని నిజాలు *.. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఛైర్మెన్ జంగా రాఘవ రెడ్డి … ఏపీ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, మంత్రి సత్య కుమార్ యాదవ్* …ప్రభుత్వ ఆస్తిని అప్పనంగా దోచుకున్న ఓం నారాయణ పై చర్యలు : లంబాడి హక్కుల పోరాట సంఘం.. *పొదిలి మాదిరెడ్డిపాలెం వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షులుగా ఎర్రం రెడ్డి

👉ఎంఎస్‌పీ పంజాబ్‌కే కాదు.. దేశమంతటికీ అవసరమే ..*తెలుగు తమ్ముళ్లకు సంక్రాంతి పండుగ ముందే వచ్చిందా.😲 ..హుస్నాబాద్ మైనార్టీ గురుకుల బాలికల పాఠశాల లో ఆకస్మిక తనిఖీలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ … ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాటులను పర్యవేక్షించిన జిల్లా అధికారులు ..*ఆత్మకూరులో ఇస్తేమ పనులను పర్యవేక్షించిన మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్ .. *

👉ఏపీలో రేపటి నుంచి ఉచిత ఓపీ సేవలు బంద్ …* విశాఖ పోర్టులో పట్టుకున్న బియ్యానికి కలెక్టర్ క్లీన్ చిట్..😲… *విశాఖ సెంట్రల్‌ జైల్ ను సందర్శించిన రాష్ట్ర హోం మంత్రి .. అగ్ని ప్రమాదాల పై అవగాహన సదస్సు.. *ఉచిత బస్సు కంటే ఇతర సంక్షేమ పథకాలకు ఖర్చు పెడితే బెటరేమో ! .. *అధికారులను సత్కరించిన పొదిలి పట్టణ టిడిపి అధ్యక్షుడు. . *నిలిచిపోయిన కాపు భవనాలను పునఃప్రారంభించాలి: బలిజ సేవ సంఘం డిమాండ్ .

2700 కోట్ల ఇల్లు.. రూ.10 లక్షల సూట్ ధరించే వారా విమర్శించేది? .. *పవన్ ఆదేశాలు.. సముద్ర తీరంలో రెండు బోట్లు సీజ్* .. *విజయవాడలో వెలుగు చూసిన అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారం .. *చంద్రగిరి ‘బీసీ’ విద్యార్థినులకు మెరుగైన వైద్యం* *తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ కు మంత్రి సవిత ఆదేశం*.. *ఆర్మీ వాహనం లోయలో పడి ఇద్దరు సైనికులు మృతి.. *పుత్తూరు సబ్ డివిజన్ పోలీసులు హెల్మెట్ వాడకంపై అవగాహన కార్యక్రమాలు … మైలవరం లో మిక్సీంగ్ రాజకీయ సెగలు…! ..*రాజకీయ దుమారం రేపిన పాలడుగు దుర్గా ప్రసాద్, ఎమ్మెల్యే వసంత కలయిక… *ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తూ పోలీస్ సిబ్బంది జీవన విధానం ఉండాలి : ఐజి వి సత్యనారాయణ.. *పోలీసుల వేధింపులు తట్టుకోలేక హుజూర్‌ నగర్ పోలీస్ స్టేషన్ ముందు యువకుడి ఆత్మహత్యాయత్నం .. * డిగ్రీ విద్యార్థులకు కూడా తక్షణమే వర్తింప చేయండి..మాజీ ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు పివి శేషయ్య.

*రెవిన్యూ అధికారులకు పై సియం సీరియస్*…*ప్రభుత్వ ఉద్యోగులపై ఆరోపణలు, కేసులు పెట్టే వారికి రక్షణ కల్పించేలా సర్కార్‌ చర్యలు.. *పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు పటిష్ట చర్యలు ; రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా…*కాంస్య పతకం సాధించి దేశ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన ఓరుగ‌ల్లు ముద్దుబిడ్డ .. *నితీష్ కి కన్ను గీటిన లాలూ..ఎన్డీయేలో కలవరమేనా ? ..*అమెరికాలో విచిత్రం ఇస్తున్న నోరో వైరస్ …*చైనాలో మరోసారి హెల్త్ ఎమర్జెన్సీ

⭐సూపర్-6 హామీలు కచ్చితంగా అమలు చేస్తాం..గత పాలనంతా విధ్వంసం…మేము రిపేర్లు చేస్తూ వెళ్తున్నాం..తప్పుడు పనులు చేయొద్దు.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు హెచ్చరిక : సీఎం చంద్రబాబు ..*మాదాపూర్ పేస్ హాస్పిటల్‌లో దారుణం.. *ఒక్క పైసా కూడా అవినీతి లేదు. -కేటీఆర్‌ ..*.. ఫారిన్‌లో ఎడ్యుకేషన్‌ పేరుతో మోసాలు. బోగస్‌ కన్సల్టెన్సీ ప్రతినిధులను అరెస్ట్‌ చేసిన పోలీసులు… సైబర్ నేరాలకు అడ్డా ‘వాట్సప్’.. హోంశాఖ నివేదిక.*.. యాపిల్ పండ్ల మాటున మద్యం అక్రమ తరలింపు …*తిరుపతిలో మత్తు వదిలించిన పోలీస్