వరుస హత్యలపై ఆమ్‌ఆద్మీ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆందోళన…గాజాపై కొనసాగుతున్న ఇజ్రాయెల్ దాడులు …ఏపీ లో 3 వేల మంది బాలికలు అదృశ్యం.. తలసరి విద్యుత్‌ వినియోగం.. ఆ రాష్ట్ర ప్రగతికి చిహ్నం- ముఖ్యమంత్రి చంద్రబాబు..సీఎస్‌కు సమన్లు..ఆర్బీఐ-90 క్విజ్‌లో జాతీయ స్థాయి పోటీలో ఉస్మానియా వైద్య కళాశాల విద్యార్థులు..మంచు కుటుంబంలో మరోసారి భగ్గుమన్న గొడవలు…మారథాన్లో పాల్గొనేందుకు వెళ్తుండగా ప్రమాదం.. ఇద్దరు కానిస్టేబుల్స్ మృతి..యువతిపై అగంతకుడు దాడి..

👉 దిల్లీ: దేశ రాజధానిలో జరుగుతున్న వరుస హత్యలపై ఆమ్‌ఆద్మీ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆందోళన వ్యక్తం చేశారు. దిల్లీలో ఒకే రోజు మూడు వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న హత్య ఘటనల గురించి మాట్లాడుతూ దిల్లీని గ్యాంగ్‌స్టర్లు నియంత్రిస్తున్నారని ఆరోపించారు. ఇక్కడ శాంతి భద్రతలు దెబ్బతింటున్నా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దిల్లీలో వరుస హత్యలు జరుగుతుంటే అమిత్‌ షా మాత్రం ఎన్నికల బిజీలో ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. దేశరాజధానిలో శాంతి భద్రతల పూర్తి బాధ్యత ఆయనదేనని అన్నారు. ఘటనలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ నేరస్థులు ఇంత నిర్భయంగా ఎలా హత్యలకు పాల్పడుతున్నారని కేజ్రీవాల్‌ ప్రశ్నించారు.
ఇప్పటి వరకు దిల్లీలో జరుగుతున్న హత్య కేసు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేస్తున్నప్పటికీ..దాని వెనక ఉన్న సూత్రధారులను మాత్రం పట్టుకోలేకపోతున్నారని దుయ్యబట్టారు. గతకొద్ది రోజులుగా దిల్లీలోని వ్యాపారస్థులకు బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని..దీని వల్ల వారు దేశ రాజధానిని వదిలి, ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్నారని అన్నారు. దిల్లీలో వ్యాపారులకు, మహిళలకు, ప్రజలకు భద్రత కల్పించడంతో పోలీసు వ్యవస్థ కూడా విఫలమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘ఇక్కడి ఓటర్లు పాఠశాలలు, ఆసుపత్రులను చక్కదిద్దే బాధ్యతను మాకు (ఆప్‌ ప్రభుత్వం) అప్పగించారు. భాజపా కు వారు ఇచ్చిన ఏకైక బాధ్యత శాంతి భద్రతల పరిరక్షణ మాత్రమే..వీటిని కూడా కేంద్ర ప్రభుత్వం సరిగ్గా నిర్వహించలేకపోతోంది’’ అని కేజ్రీవాల్‌ అసహనం వ్యక్తం చేశారు. శనివారం ఉదయం..ఈశాన్య దిల్లీలోని షహదారాలో శనివారం ఉదయం మార్నింగ్ వాక్‌కు వెళ్లిన సునీల్ జైన్‌ (52) అనే వ్యాపారిని బైక్‌పై వచ్చిన దుండగులు తుపాకితో కాల్చి చంపారు. మరో ఘటనలో దక్షిణ దిల్లీలోని గోవింద్‌పురిలో మరుగుదొడ్డి పరిశుభ్రతపై ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తి కత్తిపోట్లకు గురై ప్రాణాలు కోల్పోయాడు. మరోవైపు ఓ కుమారుడు తన తల్లిని దారణంగా హత్య చేసిన ఘటన చోటుచేసుకుంది.
👉 గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఉత్తర గాజా లోని అద్వాన్‌ ఆస్పత్రి పరిసరాల్లో ఇజ్రాయెల్‌ వైమానిక దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో నలుగురు వైద్య సిబ్బంది సహా 29 మంది పాలస్తీనా వాసులు మృతి చెందినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. శిథిలాల కింద చిక్కుకొని చాలా మంది గాయపడ్డారని పేర్కొన్నారు.
ఇజ్రాయెల్ దాడులతో సుమారు లక్షమంది పాలస్తీనియన్లు సరైన ఆహారం, వైద్య సదుపాయాలు లేక అలమటిస్తున్నారని పాలస్తీనియన్ సివిల్ ఎమర్జెన్సీ సర్వీసెస్ పేర్కొంది. గాజాలోని ఆసుపత్రులో వైద్య సామగ్రి, మానవ వనరుల కొరత అధికంగా ఉందని అక్కడి అరోగ్య శాఖ వెల్లడించింది. ఇజ్రాయెల్‌ చేస్తున్న దాడుల్లో ఇప్పటి వరకు 44,600 మంది పాలస్తీనియన్లు మరణించారని..అందులో మహిళలు, పిల్లలు అధికంగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఓ వైపు ఒప్పందం దిశగా అడుగులు పడుతున్నా.. దాడులు మాత్రం తగ్గకపోవడం ఆందోళనకరంగా మారింది.
👉విజయవాడ: తలసరి విద్యుత్‌ వినియోగం.. ఆ రాష్ట్ర ప్రగతికి చిహ్నమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. దేశంలో ఇంధన శాఖకు చాలా ప్రాముఖ్యత ఉందని, వికసిత్‌ భారత్‌దిశగా వేగంగా అడుగులు వేస్తున్నామని సీఎం అన్నారు. కృష్ణా జిల్లా పోరంకిలో ఏర్పాటు చేసిన ఉర్జావీర్‌ కార్యక్రమాన్ని కేంద్ర ఇంధనశాఖ మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌తో కలిసి సీఎం చంద్రబాబు ప్రారంభించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… సరికొత్త నైపుణ్యాలు నేర్చుకుంటేనే ప్రపంచంతో పోటీ పడగలమని, నైపుణ్యాలు నేర్చుకునేందుకు యువత ముందుకు రావాలని సూచించారు. ‘‘విద్యుత్‌ రంగంలో ఏం చేయాలనేదానిపై చర్చించేందుకు ఇక్కడికి వచ్చాం. 1998లో విద్యుత్‌ సంస్కరణలు తీసుకొచ్చా. ఆరోజు రైతులు, పారిశ్రామికవేత్తలు, ఇళ్ల యజమానులు అనేక ఇబ్బందులు పడేవారు. 2004 నాటికి మనం మిగులు విద్యుత్‌ దశకు చేరుకున్నాం. ఎల్‌ఈడీ, ట్యూబ్‌లైట్లు ఇచ్చి గ్రామాల్లో వెలుగులు నింపాం. మేం తీసుకున్న చర్యల వల్ల రాష్ట్ర విద్యుత్‌శాఖకు అనేక అవార్డులు వచ్చాయి.
లక్ష మంది ఉర్జావీర్‌లు కావాలని భావించాం. 15 రోజుల క్రితం పిలుపునిస్తే… వారంలో 12వేల మంది ఉర్జావీర్‌లుగా నమోదు చేసుకున్నారు. కొందరు ఆపరేషన్‌ కూడా ప్రారంభించారు. ఒక్కో ఉర్జావీర్‌కు రూ.2,500 నుంచి రూ.15వేల వరకు అదనంగా ఆదాయం వస్తుంది. ఇంటి వద్దే ఉండి ఆదాయం సంపాదించే మార్గాల్లో ఇదొకటి. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానం అన్ని రంగాల్లో పెరుగుతోంది. అంగన్వాడీ మహిళలకు ఇండక్షన్‌ స్టవ్‌లు ఇచ్చాం.. వీటి వల్ల 20 నుంచి 30 శాతం విద్యుత్‌ ఆదా అవుతుంది’’ అని సీఎం తెలిపారు.
👉 హైదరాబాద్‌: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిర్వహించిన ఆర్బీఐ-90 క్విజ్‌లో జాతీయ స్థాయి పోటీలో ఉస్మానియా వైద్య కళాశాల విద్యార్థులు విజేతలుగా నిలిచారు. ఇటీవల రాష్ట్ర, రీజినల్‌ స్థాయిలో సయ్యద్‌ మహ్మద్‌ హష్మి, హుస్సేన్‌ అహ్మద్‌లు విజేతలుగా నిలిచారు. తాజాగా ముంబయిలో జరిగిన జాతీయ స్థాయి ఫైనల్స్‌లో వీరు విజేతలుగా నిలిచి రూ.10లక్షల నగదు బహుమతి గెలుచుకున్నారు. విద్యార్థుల్లో ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించిన పరిజ్ఞానాన్ని పరీక్షించేందుకు దేశ వ్యాప్తంగా వివిధ దశల్లో ఆర్బీఐ-90 క్విజ్‌ నిర్వహించింది. విద్యార్థులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర, రీజినల్‌, జాతీయ స్థాయిలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు రూ.10లక్షల వరకు నగదు బహుమతి ఇచ్చింది.
👉తాడేపల్లి*..*వడ్డేశ్వరం లో కార్డెన్ సెర్చ్ 21 హాస్టల్ లు తనిఖీ*..*లా అండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీ రవి కుమార్ ఆధ్వర్యంలో తనిఖీలు*
*డిఎస్పీ మురళీకృష్ణసిఐ లు కళ్యాణ్ రాజు నజీర్ బేగ్ ఎస్సైలు కోటయ్య,శ్రీనివాసరావు 100 మంది సిబ్బంది పాల్గొన్నారు*
👉ఆంధ్రప్రదేశ్ లో 3 వేల మంది బాలికలు అదృశ్యం.. సీఎస్‌కు సమన్లు.. రాష్ట్రంలో 3 వేల మంది బాలికలు అదృశ్యమయ్యారని వచ్చిన ఫిర్యాదుపై సీఎస్‌కు జాతీయ హ్యూమన్ రైట్స్ కమిషన్ సమన్లు జారీ చేసింది. బాలికల మిస్సింగ్‌పై ఓ సామాజిక కార్యకర్త జనవరిలో NHRCకి ఫిర్యాదు చేశారు. దీనిపై నివేదిక పంపాలని కమిషన్ సీఎస్‌ను కోరింది. రిమైండర్లు పంపినా స్పందించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తి సమాచారం, డాక్యుమెంట్లతో 2025 జనవరి 20వ తేదీలోగా తమ ముందు వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది.
👉 మంచు కుటుంబంలో మరోసారి భగ్గుమన్న గొడవలు.
▪️మోహన్ బాబుపై ఫిర్యాదు చేసిన కొడుకు మంచు మనోజ్.▪️తనను తండ్రి కొట్టాడని పీఎస్‌లో మంచు మనోజ్ ఫిర్యాదు.▪️మనోజే తనపై దాడి చేశాడని కొడుకుపై ఫిర్యాదు చేసిన మోహన్ బాబు.▪️స్కూల్, ఆస్తుల వ్యవహారంలో పరస్పర దాడులు.. గాయాలతో పీఎస్‌కు వచ్చి ఫిర్యాదు చేసిన మంచు మనోజ్.▪️తనతో పాటు తన భార్యపై కూడా దాడి చేశారని మోహన్ బాబుపై ఫిర్యాదు.
👉వచ్చే వారం నారా లోకేష్ సమక్షంలో టీడీపీలోకి వాసిరెడ్డి పద్మ.. ఈ నెల 9వ తేదీన నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరే అవకాశం .. ఎంపీ కేశినేని చిన్నిని కలిసిన వాసిరెడ్డి పద్మ.. మర్యాదపూర్వకంగా భేటీ అయిన వాసిరెడ్డి పద్మ..ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసిన వాసిరెడ్డి పద్మ..
నారా లోకేష్‌ సమక్షంలో టీడీపీలో చేరనున్న వాసిరెడ్డి
👉 హైదరాబాద్లో జరిగే మారథాన్లో పాల్గొనేందుకు వెళ్తుండగా ప్రమాదం.. ఇద్దరు కానిస్టేబుల్స్ మృతి..గజ్వేల్లో హిట్ అండ్ రన్.. తెల్లవారుజామున బైక్ పై వెళ్తున్న ఇద్దరిని ఢీ కొట్టి వెళ్లిపోయిన గుర్తు తెలియని వాహనం.. బైక్ పై ఉన్న ఇద్దరు స్పాట్ డెడ్..మృతులది సిద్దిపేట జిల్లా పెద్దాకోడూరు, గాడిచర్లపల్లి గ్రామం..దౌల్తాబాద్,రాయపోల్ పోలీస్ స్టేషన్లలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న వెంకటేష్, పరంధాములు
👉చెట్టును ఢీకొట్టిన కారు.. నలుగురి దుర్మరణం
పిడుగురాళ్ల: పల్నాడు జిల్లా బ్రాహ్మణపల్లి సమీపంలో అద్దంకి-నార్కట్‌పల్లి హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. గీతికా స్కూల్‌ వద్ద చెట్టును కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. ఘటనాస్థలాన్ని పోలీసులు పరిశీలించారు. క్షతగాత్రులను పిడుగురాళ్లలోని ఆస్పత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా ప్రాథమికంగా నిర్ధరించారు.
మృతులను శ్రీపొట్టి శ్రీరాములు జిల్లా నెల్లూరు జిల్లా కావలి మండలం సిరిపురానికి చెందిన తుళ్లూరు సురేశ్‌, వనిత, యోగులు, వెంకటేశ్వర్లుగా గుర్తించారు. తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కొత్తకారుకు పూజలు చేయించేందుకు వీరంతా కొండగట్టుకు వెళ్లారు
👉 కడప జిల్లా* వేముల మండలం కొత్తపల్లి గ్రామంలో యువతిపై అగంతకుడు దాడి !!!..11 కత్తిపోట్లు పొడిచిన అగంతకుడు యువతి పరిస్థితి విషమం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స…ఎవరు లేని సమయంలో ఘటన..పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
👉చంద్రబాబు ఆలోచనలతో ఏపీలో మోడల్ విద్యావ్యవస్థ*
*విద్యార్థులకు చదువుతో పాటు నైతిక విలువల పై పాఠాలు*
*మెగా పేరెంట్స్ – టీచర్స్ సమావేశంలో గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల*
*ఏపీలో విద్యా వ్యవస్థను మెరుగు పరచాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు తన ఆలోచనా విధానాలతో రాష్ట్రంలో మోడల్ విద్యా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారని, గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి వ్యాఖ్యానించారు.. “మెగా పేరెంట్స్ – టీచర్స్” మీటింగ్ లో భాగంగా గిద్దలూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మరియు ముండ్లపాడు గ్రామంలోని ఉన్నత పాఠశాలల్లో జరిగిన సమావేశాల్లో ముఖ్య అతిధిగా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పాల్గోన్నారు.. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ మెగా పేరెంట్స్ – టీచర్స్ మీటింగ్ చూస్తుంటే సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్టుగా ఉందని, సమాజంలో ఎవరూ ఏ వృత్తి చేప‌ట్టినా, వారిని తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేనని, జాతిపిత మహాత్మా గాంధీజీ చెప్పినట్లు విద్య ద్వారానే సామాజిక మార్పు సాధ్య‌మ‌వుతుందని ఎన్దీయే ప్ర‌భుత్వం బ‌లంగా న‌మ్ముతోందని, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు విజ‌న‌రీ ఆలోచ‌న‌ల‌తో మన విద్యా వ్య‌వ‌స్థ దేశానికే ఆదర్శంగా ఉండేలా ఆంధ్ర మోడ‌ల్ తీసుకొస్తున్నామన్నారు. ఎన్దీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 16,347పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించిందని, ఆరునెలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తుందని, మెగా డీఎస్సీని పారదర్శకంగా నిర్వహించబోతున్నామని, విద్యార్థులు విద్యతో పాటు నైతిక విలువల పై కూడా పాఠ్యాంశాలు రూపొందిస్తున్నామని, మన పేరెంట్ – టీచర్స్ సమావేశాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించటం ఒక చరిత్ర అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రధాన ఉపాధ్యాయురాలు అనురాధ, లక్ష్మిదేవి, మండల ఎం.ఈ.ఓ లు కావడి వెంకటేశ్వర్లు, వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్మన్ పాముల వెంకట సుబ్బయ్య,అధ్యక్షులు సయ్యద్ శానేశా వలి, మార్తాల సుబ్బారెడ్డి, సర్పంచ్ కడియం శేషగిరి,మరియు విద్యా కమిటీ చైర్మన్లు, కౌన్సిలర్లు,విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గోన్నారు.
*నరాల వారి వివాహా కార్యక్రమంలో పాల్గోన్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల*
*కంభం మండలం, ఎర్రబాలెం గ్రామంలో నరాల శ్రీకాంత్ రెడ్డి కుమార్తె చి.ల.సౌ భార్గవి మరియు చి. రోషన్ ఫనీంద్ర రెడ్డి ల వివాహా రిసెప్షన్ కార్యక్రమంలో గిద్దలూరు ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు ముఖ్య అతిధిగా పాల్గోని నూతన వధూ వరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గోన్నారు.*

7k network
Recent Posts

*యూజీసీ జారీ చేసిన కొత్త నిబంధనల్ని తక్షణమే రద్దు చేయాలి సీఎం స్టాలిన్ ..*జూరాల ప్రాజెక్ట్‌ నుంచి వాటర్‌ లీక్‌ !..చంద్రబాబూ డప్పు చాలూ, వక్కటి అయినా వచ్చిందా మేధావుల సూటి ప్రశ్న? .. 👉రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసినోళ్లకు రూ.5 లక్షలా? .. పరవాడ ఫార్మాసిటీలో ఎగసి పడుతున్న మంటలు* .. *తిరుపతి నూతన ఎస్పీగా హర్షవర్ధన్ రాజు*.. పూజలు చేస్తే లంకె బిందెలు లభిస్తాయంటూ రూ.28 లక్షలు వసూలు చేసి పరారైన దొంగ బాబా..

👉టీడీపీలో ఉండ‌లేం: త‌మ్ముళ్ల ఆవేద‌న.. సజ్జల ఆస్తులను కక్కించడానికి వీడెవడండి? – పవన్‌పై అంబటి విమర్శలు..లంగ్స్ స్పెషలిస్ట్ డాక్టర్ ముస్తఫా ఇక లేరు*.. 👉 కోడి పందాల్లో లేడీ బౌన్సర్స్.. 👉*ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు* .. తెలంగాణలో క్రిప్టో కరెన్సీ స్కాం ..

*నారా వారిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సిఎం చంద్రబాబు**పోలీసులకు బకాయిల చెల్లింపు పై హర్షం* …*సజ్జలపై పవన్ దండయాత్ర ! .. *న్యాయ పోరాటానికి దిగిన మెగా కోడలు ..*తిరుమలలో మరో అపశృతి *శుభాకాంక్షలు తెలిపిన ప్రకాశం జిల్లా ఎస్పీ A R దామోదర్**మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరణ* ..*క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎస్సై రవీంద్రారెడ్డి* ..

👉పులివెందుల డీఎస్పీ ని బహిరంగంగా బెదిరించిన జగన్ !*.. *నెల్లూరు జిల్లాలో నకిలీ సిగరెట్ల ముఠా గుట్టురట్టు,సుమారు 2.5 కోట్ల రూపాయలు విలువ చేసే డూప్లికేట్ బ్రాండ్ సిగరెట్లు సీజ్*.. *విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి పర్యటన .. *దర్శనం టికెట్లు అమ్ముకుని బెంజి కారు: రోజాపై జెసి ఫైర్* ..*టీటీడి ఇన్‌ఛార్జ్ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ *…*కలెక్టరేట్ లో ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం (జగిత్యాల). .. *మగాడైతే రాజీనామా చేసి గెలిచి రావాలి: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్.. *మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరించిన రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్ ..*మరోసారి ఎమ్మెల్యే దానం కీలక వ్యాఖ్యలు.. *ఆన్లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలి!

👉 కేరళలో అమానవీయ ఘటన… 18 ఏళ్ల అథ్లెట్ పై 60 మంది దారుణం! ..యూఎస్ లో కార్చిచ్చు… భారతీయుల పాట్లు ..*ఫ్యూచర్ సిటీపై సిఎం రేవంత్ ఫోకస్ …*టిటిడి ఔట్సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం..* *తిరుమల శ్రీవారి హుండీలో బంగారు దొంగతనం..*.. *5 కోట్ల విలువైన బంగారంతో కారు డ్రైవర్ పరారీ..* .. సింగరాయకొండలో ట్రావెల్స్‌ బస్సుకు ప్రమాదం ..ఘరానా మోసగాడు అరెస్ట్ (మంగళగిరి)..👉అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త

తిరుమల పవిత్రను కాపాడుతాం – ముఖ్యమంత్రి చంద్రబాబు .. 👉అన్న క్యాంటీన్ల కోసం రూ.10 లక్షల విరాళం* … *ఆప్ ఎమ్మెల్యే అనుమానాస్పద మృతి .. *సంక్షేమ పథకాల అమలులో జిల్లా కలెక్టర్లు క్రియాశీల పాత్రను పోషించాలి ..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి … *గాలి జనార్దన్ రెడ్డి కేసుల విచారణలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. 2026 నాటికి నియోజకవర్గాల పునర్విభజన ఖాయం .. *కోడి పందాలు పేకాటల పై కఠిన చర్యలు విజయవాడ పిసి