హత్రాస్ బాధితులకు న్యాయం చేసే వరకు పోరాడుతాం- రాహుల్ గాంధీ…..ఉపాధి’ నిధులున్నా బిల్లులు ఎందుకు చెల్లించట్లేదు?: సీఎం చంద్రబాబు ఆగ్రహం…. ఏపీలో అనర్హులకు పెన్షన్లు!..సానిపాయ రోడ్డులో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు అరెస్టు…రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బాంబు బెదిరింపులు..నరసరావుపేటలో వైసీపీ మాజీ ఎమ్మెల్యేల మీడియా సమావేశం…హీరో అల్లు అర్జున్ అరెస్ట్..

👉బాధిత కుటుంబానికి న్యాయం చేయకుండా ప్రభుత్వం వారిని నానా రకాలుగా చిత్రహింసలకు గురిచేస్తోంది…మరోవైపు నిందితులు స్వేచ్ఛగా తిరుగుతున్నారు… హత్రాస్ దుస్సంఘటనపై సంచలన వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ… నేను హత్రాస్‌కి వెళ్లి 4 సంవత్సరాల క్రితం జరిగిన అవమానకరమైన మరియు దురదృష్టకర సంఘటనలో బాధితురాలి కుటుంబాన్ని కలిశాను. సమావేశంలో ఆయన చెప్పిన విషయాలు నన్ను దిగ్భ్రాంతికి గురి చేశాయి.
కుటుంబం మొత్తం ఇప్పటికీ భయం నీడలో బతుకుతోంది. వారిని నేరస్తులుగా వ్యవహరిస్తున్నారు. వారు స్వేచ్ఛగా కదలలేరు – వారు ఎల్లప్పుడూ తుపాకులు మరియు కెమెరాలతో నిఘాలో ఉంచుతారు..
బీజేపీ ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను నేటికీ నెరవేర్చలేదన్నారు. వీరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వలేదు, వేరే చోటికి మారుస్తామన్న హామీ కూడా నెరవేరలేదు..
బాధిత కుటుంబానికి న్యాయం చేయకుండా ప్రభుత్వం వారిని నానా రకాలుగా చిత్రహింసలకు గురిచేస్తోంది.. మరోవైపు నిందితులు స్వేచ్ఛగా తిరుగుతున్నారు..
ఈ కుటుంబంలోని నిరాశ, నిస్పృహలు దళితులపై బీజేపీ చేస్తున్న దౌర్జన్యాల్లోని నిజాన్ని తెలియజేస్తున్నాయి..
కానీ ఈ కుటుంబాన్ని ఇలా బతకనివ్వం. వారికి న్యాయం చేయడానికి పోరాటం చేస్తామన్నారు..
👉’ఉపాధి’ నిధులున్నా బిల్లులు ఎందుకు చెల్లించట్లేదు?: సీఎం చంద్రబాబు ఆగ్రహం..
అమరావతి: రానున్న 3 నెలల్లో ప్రతి పింఛన్‌ను జిల్లా కలెక్టర్లు పరిశీలించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. చాలామంది అనర్హులకు పింఛన్లు వెళ్తున్నాయని మంత్రి నాదెండ్ల మనోహర్‌ చేసిన వ్యాఖ్యలకు ఆయన ఈ విధంగా స్పందించారు..
సచివాలయంలో రెండో రోజు కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడారు. ఉపాధి హామీ పథకాన్ని డిమాండ్‌కు అనుగుణంగా నిర్వహించాలన్నారు. వంద రోజుల పనిదినాలు సరిగా నిర్వహిస్తే మెటీరియల్‌ కాంపోనెంట్‌ వస్తుందని చెప్పారు. కానీ పని దినాలు, మెటీరియల్‌ కాంపోనెంట్‌ను పూర్తి చేయలేకపోతున్నారని సీఎం అన్నారు.
పల్లె పండగలో 14.8 శాతమే పనులు చేశారన్నారు. ఇంకా నెలన్నర సమయమే ఉందని గుర్తుచేశారు. అల్లూరి జిల్లాలో 54 శాతమైతే.. మరో జిల్లాలో 1.6 శాతమే పనులు కావడంపై సీఎం ప్రశ్నించారు. పని పూర్తయ్యాక బిల్లులు ఎందుకు చెల్లించట్లేదని అడిగారు. కలెక్టర్లు ఎందుకు నిర్లిప్తంగా ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి వద్ద ఉపాధి హామీ డబ్బులున్నా బిల్లులు ఎందుకు చెల్లించట్లేదని ప్రశ్నించారు..”జల్‌జీవన్‌ మిషన్‌ను గత ప్రభుత్వం దెబ్బతీసింది.
👉ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతికి గుడ్ న్యూస్:
అమరావతి రాజధానికి ఆసియా అభివృద్ధి బ్యాంక్ 15000 కోట్లు రుణాలు మంజూరు చేస్తూ క్లియరెన్స్ ఇచ్చింది.
👉 ఏపీలో అనర్హులకు పెన్షన్లు!*
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనర్హులు కూడా పెన్షన్లు అందుకుంటున్నట్టు స్పష్టం అవుతోంది.ప్రతీ
10వేల మంది లో ఏకంగా దాదాపు 500 మంది అనర్హులే పెన్షన్లు తీసుకుంటున్నట్టు గుర్తించారు. రెండోరోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్ పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖలపై ఆ శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నికలకు ముందు 6లక్షల మందికి హడావుడిగా పెన్షన్లు ఇచ్చారని మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు.
👉 రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బాంబు బెదిరింపులు
ముంబైలోని ఆర్బీఐ ప్రధాన కార్యాలయాన్ని పేల్చివేస్తామంటూ ఆగంతుకులు బెదిరించారు.
ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్‌కు బెదిరింపు మెయిల్ చేశారు. రష్యన్ భాషలో ఈ మెయిల్ వచ్చినట్లు తెలుస్తోంది.
దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
*హీరో అల్లు అర్జున్ అరెస్ట్*
*పుష్ప 2 రిలీజ్ సందర్భంగా సంధ్యా థియేటర్లకు షో చూసేందుకు అల్లు అర్జున్ వెళ్లిన సందర్భంగా తొక్కిసలాట్ల జరగటంతో ఘటనలో మహిళ మృతి చెందగా కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హీరో అల్లు అర్జున్ ని సంధ్య థియేటర్ యాజమాన్యాని బాధ్యతలుగా పరిగణించి ఈరోజు 12 గంటల 40 నిమిషాలకు అల్లు అర్జున్ ని స్టార్ స్పోర్ట్స్ అధికారులు అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరలించిన అధికారులు*
👉ఆర్ఎస్ఏఎస్టీఎఫ్* ( RSASTF)
సానిపాయ రోడ్డులో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు అరెస్టు..
10 ఎర్రచందనం దుంగలు, కారు స్వాధీనం..
అన్నమయ్య జిల్లా రాయచోటి సమీపంలోని సుండుపల్లి- సానిపాయ మార్గం లో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు స్మగ్లర్లు ను అరెస్టు చేసి, వారి నుంచి 10ఎర్రచందనం దుంగలు, ఒక కారును టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ ఇంచార్జి, తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు కార్యాచరణ అమలులో భాగంగా టాస్క్ ఫోర్స్ ఎస్పీ పీ. శ్రీనివాస్ ఆధ్వర్యంలో డీఎస్పీ జి. బాలిరెడ్డి మార్గనిర్దేశత్వంలో ఆర్ ఐ (రిజర్వ్) కె. సురేష్ కుమార్ రెడ్డి కి చెందిన ఆర్ ఎస్ ఐ కేఎస్ కె. లింగాధర్ టీమ్ గురువారం ఉదయం సుండుపల్లి-సానిపాయ మార్గం లో వాహనాలు తనిఖీ చేపట్టారు. ఒక వాహనం అతి వేగంగా వస్తూండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కారులో ఉన్న వ్యక్తులు దిగి పారిపోతుండగా వెంబడించి పట్టుకున్నారు. వారిని అన్నమయ్య జిల్లా వాసులుగా గుర్తించారు. వారితో పాటు పట్టుబడిన 10 ఎర్రచందనం దుంగలు, కారును తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ కు తరలించారు. సీఐ సురేష్ కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
👉 పల్నాడు జిల్లా..నరసరావుపేటలో వైసీపీ మాజీ ఎమ్మెల్యేల మీడియా సమావేశం..
*మాజీమంత్రి విడదల రజిని మాట్లాడుతూ..
కూటమి ప్రభుత్వంలో చెప్పిన ఒక్క హామీని కూడా ప్రభుత్వం నెరవేర్చలేదు.కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఒకమాట ఎన్నికల తర్వాత మరో మాటలా ఉంది.
రైతులకు వైసీపీ ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంది.
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతులకు నేనున్నాను అని ఎప్పటికప్పుడు భుజం తట్టారు.
ఇకపై రైతులకు సంభందించిన ప్రతి అంశంలో వారికి పూర్తిగా అండగా నిలుస్తాం..
*మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ*
కూటమి ప్రభుత్వం రైతులను మోసం చేసింది
కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు దాటినా రైతులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు
రైతు సమస్యలపై నరసరావుపేటలో రేపు కలెక్టర్ కి వినతిపత్రం అందజేస్తాం
వైసీపీ ప్రభుత్వంలో రైతులకు అన్ని రకాలుగా న్యాయం జరిగింది.
కేవలం వైసీపీ నేతలపై కేసులు పెట్టడానికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్లుగా ఉంది
*వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మానాయుడు మాట్లాడుతూ*
రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
సీఎం చంద్రబాబు,డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఒకప్పుడు రైతులను అన
👉ట్రిపుల్ ఐటి విద్యార్ధి మృతి నివేదిక కోరిన ఎస్టీ కమీషన్ చైర్మన్ డాక్టర్ డివిజి శంకరరావు*
శ్రీకాకుళంలో ట్రిపుల్ ఐటి విద్యార్ధి ప్రవీణ్ నాయక్ మృతి పట్ల రాష్ట్ర ఎస్టీ కమీషన్ చైర్మన్ డాక్టర్ డి వి జి శంకరరావు విచారం వ్యక్తం చేసారు.విద్యార్ధి మృతిపై కళాశాల యాజమాన్యం, జిల్లా యంత్రాంగంతో గురువారం ఆయన మాట్లాడారు.విద్యార్ధి మృతికి గల కారణాలపై సమగ్ర నివేదిక అందజేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఈ సందర్భంగా కోరారు. ప్రవీణ్ నాయక్ కుటుంబానికి కమీషన్ చైర్మన్ డివిజి శంకరరావు సంతాపం తెలిపారు.

7k network
Recent Posts

ప్రియాంక గాంధీపై బీజేపీ నేత ర‌మేష్ బిధూరి చేసిన అనుచిత వ్యాఖ్య‌ల ప‌ట్ల‌ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన మంత్రి సీత‌క్క‌*.. *నవీన్ కి చెక్ పెట్టినట్లే కేజ్రీవాల్ కి కూడా ?.. *ఈ ఫార్ములా రేసులో కొన్ని నిజాలు *.. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఛైర్మెన్ జంగా రాఘవ రెడ్డి … ఏపీ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, మంత్రి సత్య కుమార్ యాదవ్* …ప్రభుత్వ ఆస్తిని అప్పనంగా దోచుకున్న ఓం నారాయణ పై చర్యలు : లంబాడి హక్కుల పోరాట సంఘం.. *పొదిలి మాదిరెడ్డిపాలెం వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షులుగా ఎర్రం రెడ్డి

👉ఎంఎస్‌పీ పంజాబ్‌కే కాదు.. దేశమంతటికీ అవసరమే ..*తెలుగు తమ్ముళ్లకు సంక్రాంతి పండుగ ముందే వచ్చిందా.😲 ..హుస్నాబాద్ మైనార్టీ గురుకుల బాలికల పాఠశాల లో ఆకస్మిక తనిఖీలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ … ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాటులను పర్యవేక్షించిన జిల్లా అధికారులు ..*ఆత్మకూరులో ఇస్తేమ పనులను పర్యవేక్షించిన మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్ .. *

👉ఏపీలో రేపటి నుంచి ఉచిత ఓపీ సేవలు బంద్ …* విశాఖ పోర్టులో పట్టుకున్న బియ్యానికి కలెక్టర్ క్లీన్ చిట్..😲… *విశాఖ సెంట్రల్‌ జైల్ ను సందర్శించిన రాష్ట్ర హోం మంత్రి .. అగ్ని ప్రమాదాల పై అవగాహన సదస్సు.. *ఉచిత బస్సు కంటే ఇతర సంక్షేమ పథకాలకు ఖర్చు పెడితే బెటరేమో ! .. *అధికారులను సత్కరించిన పొదిలి పట్టణ టిడిపి అధ్యక్షుడు. . *నిలిచిపోయిన కాపు భవనాలను పునఃప్రారంభించాలి: బలిజ సేవ సంఘం డిమాండ్ .

2700 కోట్ల ఇల్లు.. రూ.10 లక్షల సూట్ ధరించే వారా విమర్శించేది? .. *పవన్ ఆదేశాలు.. సముద్ర తీరంలో రెండు బోట్లు సీజ్* .. *విజయవాడలో వెలుగు చూసిన అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారం .. *చంద్రగిరి ‘బీసీ’ విద్యార్థినులకు మెరుగైన వైద్యం* *తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ కు మంత్రి సవిత ఆదేశం*.. *ఆర్మీ వాహనం లోయలో పడి ఇద్దరు సైనికులు మృతి.. *పుత్తూరు సబ్ డివిజన్ పోలీసులు హెల్మెట్ వాడకంపై అవగాహన కార్యక్రమాలు … మైలవరం లో మిక్సీంగ్ రాజకీయ సెగలు…! ..*రాజకీయ దుమారం రేపిన పాలడుగు దుర్గా ప్రసాద్, ఎమ్మెల్యే వసంత కలయిక… *ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తూ పోలీస్ సిబ్బంది జీవన విధానం ఉండాలి : ఐజి వి సత్యనారాయణ.. *పోలీసుల వేధింపులు తట్టుకోలేక హుజూర్‌ నగర్ పోలీస్ స్టేషన్ ముందు యువకుడి ఆత్మహత్యాయత్నం .. * డిగ్రీ విద్యార్థులకు కూడా తక్షణమే వర్తింప చేయండి..మాజీ ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు పివి శేషయ్య.

*రెవిన్యూ అధికారులకు పై సియం సీరియస్*…*ప్రభుత్వ ఉద్యోగులపై ఆరోపణలు, కేసులు పెట్టే వారికి రక్షణ కల్పించేలా సర్కార్‌ చర్యలు.. *పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు పటిష్ట చర్యలు ; రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా…*కాంస్య పతకం సాధించి దేశ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన ఓరుగ‌ల్లు ముద్దుబిడ్డ .. *నితీష్ కి కన్ను గీటిన లాలూ..ఎన్డీయేలో కలవరమేనా ? ..*అమెరికాలో విచిత్రం ఇస్తున్న నోరో వైరస్ …*చైనాలో మరోసారి హెల్త్ ఎమర్జెన్సీ

⭐సూపర్-6 హామీలు కచ్చితంగా అమలు చేస్తాం..గత పాలనంతా విధ్వంసం…మేము రిపేర్లు చేస్తూ వెళ్తున్నాం..తప్పుడు పనులు చేయొద్దు.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు హెచ్చరిక : సీఎం చంద్రబాబు ..*మాదాపూర్ పేస్ హాస్పిటల్‌లో దారుణం.. *ఒక్క పైసా కూడా అవినీతి లేదు. -కేటీఆర్‌ ..*.. ఫారిన్‌లో ఎడ్యుకేషన్‌ పేరుతో మోసాలు. బోగస్‌ కన్సల్టెన్సీ ప్రతినిధులను అరెస్ట్‌ చేసిన పోలీసులు… సైబర్ నేరాలకు అడ్డా ‘వాట్సప్’.. హోంశాఖ నివేదిక.*.. యాపిల్ పండ్ల మాటున మద్యం అక్రమ తరలింపు …*తిరుపతిలో మత్తు వదిలించిన పోలీస్