👉 ఇది సంవిధాన్.. సంఘ్ బుక్ కాదు.. తొలి ప్రసంగంలోనే ఎంపీ ప్రియాంక నిప్పులు! ప్రియాంక తన తొలి ప్రసంగంలోనే తనదైన ముద్ర చూపారు. అది కూడా రాజ్యాంగంపై చర్చలో ఆమె పాల్గొన్నారు. గాంధీల కుటుంబం నుంచి కాంగ్రెస్ తరఫున 40 ఏళ్ల తర్వాత ఓ మహిళ లోక్ సభ లో అడుగుపెట్టారు. సోనియా గాంధీ కూడా లోక్ సభలో సభ్యురాలిగా చేసినప్పటికీ.. ఆమె గాంధీ కుటుంబం కోడలు. కాబట్టి ఇందిరా గాంధీ తర్వాత ఈ ఇంటి నుంచి మహిళలు లోక్ సభ సభ్యులు కానట్టే. అయితే, మేనకా గాంధీ ఎంపీగా, కేంద్ర మంత్రిగా కూడా చేసినా ఆమె సొంత పార్టీ, బీజేపీ నుంచి అడుగుపెట్టారు. అయితే, ఇన్నాళ్లకు గాంధీ కుటుంబ వారసురాలిగా ఇటీవల ఎంపీగా ఎన్నికయ్యారు ప్రియాంకా గాంధీ. దీంతోపాటు లోక్ సభ సమావేశాలు ప్రారంభం కావడంతో ఆమె ఏం మాట్లాడతారు? అనే ఆసక్తి నెలకొంది.
తొలి ప్రసంగంలోనే ముద్ర.. ప్రియాంక తన తొలి ప్రసంగంలోనే తనదైన ముద్ర చూపారు. అది కూడా రాజ్యాంగంపై చర్చలో ఆమె పాల్గొన్నారు. మోదీ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. రాజ్యాంగం ఆమోద ముద్ర పొంది 75 వ ఏడాదిలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో లోక్ సభలో ప్రత్యేక చర్చ జరుగుతోంది. గమనార్హం ఏమంటే.. విపక్షాల తరఫున చర్చను ప్రియాంకనే ప్రారంభించడం. ఆమెకిదే తొలి ప్రసంగం కావడం. అయితే, అన్న రాహుల్ గాంధీ బాటలోనే సాగుతూ.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ లపై నిప్పులు చెరిగారు. రాజ్యాంగం అంటే సంఘ్ (ఆరెఎస్సెస్ ను ఉద్దేశిస్తూ) పుస్తకం కాదని.. సంవిధాన్ (రాజ్యాంగం) పుస్తకం అని ప్రియాంక పేర్కొన్నారు. అన్నిటికీ మా ముత్తాతనే కారణమా..? ఆర్ఎస్ఎస్, బీజేపీ తరచూ నెహ్రూ విధానాలను విమర్శిస్తూ ఉంటాయి. దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితికి నెహ్రూనే కారణం అంటూ నిందిస్తాయి. దీంతో ప్రియాంక తన తొలి ప్రసంగంలోనే దీనిని ప్రస్తావించారు. ఎప్పుడూ గతమే మాట్లాడే బీజేపీ.. ఇప్పుడేం చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో జరిగే అన్నిటికీ నెహ్రూనే కారణమా? ఆయనపేరును, ఆయన ప్రసంగాలను మీరు పుస్తకాల నుంచి తొలగించగలరేమో.. కానీ, స్వాతంత్ర్య పోరాటం, జాతి నిర్మాణంలోని పాత్రను చెరిపేయలేరు అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ స్థానం ఎంతంటే..? 2017 నాటి యూపీ ఉన్నావ్ అత్యాచార ఘటనను ప్రియాంక ప్రస్తావించారు. ఇలాంటి సందర్భాల్లో బాధితులకు పోరాడే హక్కును రాజ్యాంగమే కల్పించిందన్నారు. ఒక వ్యక్తి (అదానీ) కాపాడేందుకు 142 కోట్ల మంది భారతీయుల ప్రయోజనాలను పక్కనపెట్టారని అదానీని ఉద్దేశిస్తూ ప్రియాంక ఆరోపించారు. సంపద, రోడ్లు, పోర్టులు, గనులు అన్నీ అదానీకేనా? అని నిలదీశారు. దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్షాల గొంతును అణచివేసేందుకు తప్పుడు కేసులు పెడుతున్నారని దుయ్యబట్టారు. సత్యం, అహింస పునాదులుగా సాగిన భారత స్వాతంత్ర్య పోరాటం ఇతర దేశాల కంటే ప్రత్యేకమైనదని.. అది ప్రజాస్వామ్య గళం అని ప్రియాంక పేర్కొన్నారు. దాన్నుంచి పుట్టినదే రాజ్యాంగం అని వివరించారు. బీఆర్ అంబేడ్కర్, మౌలానా ఆజాద్, రాజగోపాలాచారి, నెహ్రూ వంటి ఎందరో నేతలు ఏళ్లపాటు జీవితాలను అంకితం చేసి రాజ్యాంగాన్ని రూపొందించారని.. ఇది ప్రజలను కాపాడే ‘సురక్షా కవచం’ అని ప్రియాంక తెలిపారు. దీన్ని బద్దలుకొట్టేందుకు ఎన్డీయే ప్రభుత్వం పదేళ్లలో ఎన్నో ప్రయత్నాలు చేసిందని ఆరోపించారు. రిజర్వేషన్లను బలహీనపర్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని విమర్శించారు. లోక్ సభ ఎన్నికల్లో ఎక్కువ మెజార్టీ వచ్చి ఉంటే రాజ్యాంగాన్ని మార్చాలని చూశారని.. అది జరగకపోవడంతో ఆ ప్రతిపాదనలపై వెనక్కతగ్గారని ప్రియాంక దుమ్మెత్తి పోశఆరు. ‘‘ఇది సంవిధాన్ (రాజ్యాంగం).. సంఘ్ రూల్ బుక్ కాదు’’ అని దుయ్యబట్టారు.
👉స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంటును అవిష్కరించిన సీఎం చంద్రబాబు*…విజయవాడ: డిసెంబర్ 13
స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్‌ను సీఎం చంద్రబాబు ఆవిష్కరిం చారు. పది సూత్రాలు ఒక విజన్ పేరిట డాక్యుమెంట్ రూపొందించారు. జాతికి, రాష్ట్ర ప్రజలకు అంకితమం టూ విజన్ డాక్యుమెంట్‌పై సీఎం చంద్రబాబు సంతకం చేశారు.
సీఎంతో పాటు విజన్ డాక్యుమెంట్‌పై ఉపముఖ్య మంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ సంతకం చేశారు.స్వర్ణాంధ్ర 2047 విజన్ను 10 సూత్రాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమంలో వివిధ వర్గాల ప్రజలు తమ అభిప్రాయాలు పంచు కున్నారు.
ఆక్వా ఉత్పత్తుల రవాణా లో ఇబ్బందులు పరిష్కరిం చాలని ఆక్వా రైతులు కోరారు. మహిళా ఆర్థికాభి వృద్ధికి ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటా మని డ్వాక్రా మహిళ సుహాసిని తెలిపారు. 2047 నాటికి ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో నిలవాలని ఇంటర్మీడియట్ విద్యార్థిని ఆకాంక్షించారు. విజన్ స్వర్థాంధ్ర 2047పై ప్రభుత్వం ప్రత్యేక వీడియో విడుదల చేసింది.
స్వచ్ఛాంధ్ర అంటే స్వచ్ఛ మైన ఆలోచనలు ఉండాలంటూ స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ కార్యక్రమం స్టాల్స్ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు ఛలోక్తులు విసిరారు. పరీక్షలకు ఎలా సిద్ధమవు తున్నారంటూ విద్యార్థుల తో సీఎం ముచ్చటించారు. మహిళా రైతులతో ముఖ్య మంత్రి, ఉపముఖ్యమంత్రి ముఖాముఖి మాట్లాడారు.
మహిళా ఆర్థికాభివృద్ధికి అందుతున్న తోడ్పాటుపై నేతలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. విజయవాడ మున్సిపల్ స్టేడియంలో స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీలు, హెచ్ఓడీలు తదితరులు పాల్గొన్నారు.
⭐⭐⭐ అల్లు అర్జున్ కేసు… అధికారులకు ఆర్జీవీ నాలుగు ప్రశ్నలు! ఇందులో భాగంగా… పుష్కరాలు, బ్రహ్మోత్సవాల్లాంటి ఉత్సవాల్లో తోపులాటలో భక్తులు పోతే దేవుళ్లని అరెస్ట్ చేస్తారా..? అని ఆర్జీవీ తన తొలి ప్రశ్నతో అధికారులను ప్రశ్నించారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఈ ఎపిసోడ్ లో ఎన్నో ట్విస్టులు, మరెన్నో జలక్కులు చోటు చేసుకున్నాయని అంటున్నారు. ఈ సమయంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు.
అవును… సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేసిన కేసులో ఆరు గంటల్లో ఎన్నో కీలక పరిణామాలు, సంచలనాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడం.. దీంతో.. పోలీసులు బన్నీని చంచల్ గూడ జైలుకు తరలించడం జరిగిపోయింది. ఈ సమయంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇందులో భాగంగా… అల్లు అర్జున్ కు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇందులో భాగంగా… రు.50,000 ల వ్యక్తిగత పూచీకత్తుతో బెయిల్ మంజూరూ చేసింది! ఈ సమయంలో దర్శకుడు ఆర్జీవీ స్పందిస్తూ.. అధికారులకు నాలుగు ప్రశ్నలు సంధించారు. ఇందులో భాగంగా… పుష్కరాలు, బ్రహ్మోత్సవాల్లాంటి ఉత్సవాల్లో తోపులాటలో భక్తులు పోతే దేవుళ్లని అరెస్ట్ చేస్తారా..? అని ఆర్జీవీ తన తొలి ప్రశ్నతో అధికారులను ప్రశ్నించారు. ఇదే సమయంలో… ఎన్నికల ప్రచారాల తొక్కిసలాటలలో ఎవరైనా పోతే రాజకీయ నాయకులను అరెస్ట్ చేస్తారా..? అంటూ రెండో ప్రశ్న సంధించారు. ఇదే క్రమంలో.. మూడో ప్రశ్నగా… ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ లో ఎవరైనా పోతే.. హీరో, హీరోయిన్స్ ని అరెస్ట్ చేస్తారా..? అని ప్రశ్నించిన ఆర్జీవీ.. భద్రతా ఏర్పాట్లు పోలీసులు, ఆర్గనైజర్లు తప్ప ఫిలిం హీరోలు, ప్రజా నాయకులు ఎలా కంట్రోల్ చేయగలరు? అంటూ నాలుగో ప్రశ్నను సంధించారు.
👉 జొమాటోకు షాక్.. రూ.803 కోట్ల జీఎస్‌టీ కట్టాలని నోటీసులు..
ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోకు మరోసారి జీఎస్‌టీ నోటీసులు జారీ చేసింది. జీఎస్‌టీకి సంబంధించిన బకాయిలు చెల్లించాల్సి ఉందంటూ పేర్కొనింది. మొత్తం రూ.803.4 కోట్ల జీఎస్‌టీ కట్టాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపింది. 2019 – 2022 మధ్య కాలంలో డెలివరీ ఛార్జీలపై జీఎస్‌టీ బకాయిలు రూ.401.70 కోట్లుగా పేర్కొనింది. దీనికి వడ్డీ, పెనాల్టీ కింద మరో రూ.401.70కోట్లు చెల్లించాలని ఆదేశించింది.
👉 : రైతులకు అండగా అనంతపురం జిల్లాలో వైయస్‌ఆర్‌సీపీ నేతలు పోరుబాట.అన్నదాతల సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్ వరకూ రైతులతో కలిసి వైయస్‌ఆర్‌సీపీ నాయకులు ర్యాలీ..ర్యాలీలో పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామి రెడ్డి అన్న, YSRCP రాష్ట్ర కార్యదర్శి కొనుదుల రమేష్ రెడ్డి.
👉పుష్ప-2* సినిమా యూనిట్ తమ థియేటర్ వద్దకు 4వ తేదీ 9:30pm కు వస్తున్నారని… బందోబస్త్ ఎర్పాటు చేయాలని చిక్కడపల్లి పోలీసులను 2వ తేదీనే కోరిన *సంధ్య70m.m* యాజమాన్యం…
అయితే… ముందస్తు సమాచారం లేకుండా… థియేటర్ వద్దకు వచ్చి తొక్కిసలాటలో… ఓ మహిళ మృతికి కారణమైయ్యారని… అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసిన పోలీసులు
👉 అలా చేస్తే సగం మంది నేతలు జైల్లో ఉంటారు: నటుడు బ్రహ్మాజీ..😲😲😲
అలా చేస్తే సగం మంది నేతలు జైల్లో ఉంటారు: నటుడు బ్రహ్మాజీ
అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడంపై నటుడు బ్రహ్మాజీ మండిపడ్డారు. ‘దేశంలో చాలా చోట్ల తొక్కిసలాటలు జరుగుతుంటాయి. ఎవరినైనా అరెస్ట్ చేశారా? అలా చేస్తే సగం మంది రాజకీయ నేతలు లోపల ఉండాలి’ అని ట్విట్టర్ ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. బన్నీని అరెస్టు చేయడంపై పలువురు సినీ నటులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
👉 గుకేశ్‌కు రూ.5 కోట్ల నజరానా ప్రకటించిన స్టాలిన్
ఫిడే ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ టైటిల్ గెలిచిన దొమ్మరాజు గుకేశ్‌కు రూ.5 కోట్లు క్యాష్ ప్రైజ్ ఇవ్వనున్నట్లు తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రకటించారు. సింగపూర్‌లో జరిగిన వరల్డ్ చెస్ టోర్నీలో గుకేశ్ విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే. గుకేశ్‌తో ఫోన్‌లో మాట్లాడిన సీఎం ఆయనను మెచ్చుకున్నారు. ‘తమిళనాడు మిమ్మల్ని చూసి గర్విస్తోంది. చెన్నై ప్రపంచ చెస్ క్యాపిటల్‌గా తన స్థానం నిలబెట్టుకుంది’ అని స్టాలిన్ అన్నారు.
👉న్యూఇయర్ వేడుకలపై పోలీస్ కండీషన్స్.. గైడ్‌లైన్స్ విడుదల.😂😂😂
*న్యూఇయర్ వేడుకలు రాత్రి ఒంటి గంట వరకే*
*పది తర్వాత సౌండ్ సిస్టం బంద్ పెట్టాలి*
*ఈవెంట్స్ జరిగే చోట సీసీ కెమెరాలు,సెక్యూరిటీ పెట్టుకోవాలి*
*డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడితే రూ.10 వేలు ఫైన్, జైలు శిక్ష*
*న్యూఇయర్ వేడుకలపై పోలీస్ కండీషన్స్*
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌పై పోలీసులు ఆంక్షలు విధించారు. డిసెంబర్ 31న నిర్వహించే ఈవెంట్స్‌కు కచ్చితంగా అనుమతులు తీసుకోవాలని చెప్పారు. పోలీసులు ఆంక్షలకు అనుగుణంగా నిర్వహించే వేడుకలకు మాత్రమే అనుమతులు ఇవ్వనున్నారు.
అర్ధరాత్రి దాటాక ఒంటి గంట వరకే ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయాలని సీపీ సీవీ ఆనంద్ ఆదేశించారు. ఈ మేరకు గురువారం గైడ్‌లైన్స్ జారీ చేశారు. త్రీస్టార్ హోటల్స్, పబ్స్, బార్లు, రెస్టారెంట్స్‌లో నిర్వహించే వేడుకలకు అనుమతులు తప్పనిసరి చేశారు. ఇందుకోసం 15 రోజుల ముందే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈవెంట్స్ నిర్వహిచే ప్రాంతాల్లో చేపట్టాల్సిన భద్రతా చర్యలకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు.
*న్యూఇయర్ సెలబ్రేషన్ గైడ్‌లైన్స్..*
➡️హోటల్స్, పబ్, క్లబ్ నిర్వాహకులు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలి.
➡️ఈవెంట్స్ జరిగే ప్రాంతాల్లో ఎంట్రీ, ఎగ్జిట్స్, పార్కింగ్ ప్లేసెస్‌లో సీసీ టీవీ కెమెరాలు తప్పనిసరిగా పెట్టాలి.
➡️పరిమితికి మించి పాసెస్ అమ్మకాలు, టికెట్స్, కూపన్స్ ఇవ్వరాదు. మైనర్స్‌కు ఇలాంటి పార్టీల్లో అనుయమతి లేదు.
➡️సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేయాలి. ట్రాఫిక్ మానిటరింగ్ చేయాలి.
➡️మ్యూజికల్ ఈవెంట్స్ ఇండోర్‌లో మాత్రమే జరుపుకోవాలి.
➡️45 డెసిబుల్స్‌కి మించి సౌండ్ పొల్యూషన్ ఉండరాదు.
➡️రాత్రి 10 గంటల వరకు మ్యూజిక్ నిలిపివేయాలి.
➡️అసభ్యకర డ్యాన్సులకు, డ్రెస్సింగ్‌ను అనుమతించరాదు.
➡️డ్రగ్స్, మత్తు పదార్థాల యాక్టివిటీ చేసే నిర్వాహకులపై చర్యలు.
➡️వెహికల్ మూవ్‌మెంట్, పార్కింగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి.
➡️డ్రంకెన్ కండిషన్‌లో ఉన్న వారు వెహికల్ డ్రైవ్ చేయకూడదనే సైన్ బోర్డులు పెట్టాలి.
➡️డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడే వారికి రూ.10,000 ఫైన్ లేదా 6 నెలల జైలు శిక్ష విధిస్తాం. అలాగే, లైసెన్స్ 3 నెలలు గరిష్టంగా లేదా పర్మినెంట్‌గా రద్దు చేస్తాం.
➡️ఈవెంట్స్ పరిసర ప్రాంతాల్లో స్థానిక పోలీసులు, షీ టీమ్స్ నిఘా పెడతాయి.
➡️మహిళలను వేధించే వారిని స్పాట్‌లోనే అరెస్ట్ చేస్తాయి.
👉 రాష్ట్రవ్యాప్తంగా వివిధ సమస్యలతో బాధపడుతున్న వారు.. వాటి పరిష్కారం కోసం ప్రజాదర్బార్ కు తరలివచ్చారు.
ఉండవల్లిలోని నివాసంలో నిర్వహించిన 51వ రోజు ప్రజాదర్బార్ లో పెన్షన్ మంజూరు చేయాలని, వైద్యం సాయం అందించాలని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని, కబ్జాదారుల నుంచి తమ భూములు కాపాడాలని, ఉద్యోగులు తాము ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. వేధింపులతో తన కుమారుడి ఆత్మహత్యకు కారణమైన వైసీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని సత్యసాయి జిల్లా బుక్కపట్నానికి చెందిన ఎమ్.ఓబులమ్మ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మించి మోసం చేశారని ఎన్టీఆర్ జిల్లా ఏ.కొండూరు మండలం గోపాలపురానికి చెందిన ఓర్సు జగదీష్ కుమార్ ఫిర్యాదు చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు నా దృష్టికి వచ్చాయి. ఆయా విజ్ఞప్తులను సత్వరం పరిష్కరించి, బాధితులకు అండగా ఉంటాను.
👉సుభాషిని హత్య కేసులో సంచలనమైన విషయాలు రాబట్టిన పోలీసులు*గిద్దలూరు..
నిజం నిప్పులాంటిది కాలం ఎవరిని వదలదు
డీఎస్పీ నాగరాజు.
విలేకరుల సమావేశంలో కేసు వివరాలు తెలిపిన మార్కాపురం డి యస్పీ యు. నాగరాజు.*.
తీగలాగితే డొంక కదిలింది అన్న ఛందంగా ఒకటి కాదు రెండు హత్యల్లో ముద్దాయిగా మారిన ప్రియుడు. చిన్ననాటి మధుర స్మృతులు.. అక్రమ సంబంధంగా మారి విషాదంగా ముగిసిన ప్రేమ.అక్రమ సంబంధాలు ఎప్పుడూ తియ్యగా మొదలవుతాయి.. కానీ విషాదంగా ముగుస్తాయనడానికి ఉదాహరణ..తన 34 ఏళ్ల సర్వీసులో ఇలాంటి ఘటన చూడలేదంటున్న డియస్పీ నాగరాజు.
మర్డర్ మిస్టరీని ఛేదించిన గిద్దలూరు అర్బన్ సీఐ సురేష్ వారి బృందం.*
**శారీరక సుఖ సంబంధాలే ‘ప్రేమ’ అనే భ్రమలో యువత.. ఉడుకు రక్తంతో ఉన్మాదిగా మారికటకటాలపాలవుతున్న ప్రియుడు..ప్రియుడుతో కలిసి భర్తను చంపి, తాను కూడా ప్రియుడు చేతిలో హతమైన ప్రియురాలు. ఫలితంగా తల్లితండ్రుల ఆలనా పాలనకు దూరమైన పిల్లలు,జైలు పాలవుతున్న ప్రియుడు.వివరాల్లోకి వెళితే* ఈ నెల 6వ తేదీన గిద్దలూరు పట్టణం ఒక షాపులో పనిచేస్తున్న పాకిన సుభాషిణి (24) రజక వీధిలోఉన్న తన ఇంటికి భోజనానికి ఇంటికి రాగా మధ్యాహ్నం సుమారు 2:50 సమయంలో శ్రీకర్ @నాని (24) కూరగాయలు కోసే కత్తితో సుభాషిణి మెడ కోశాడు. తప్పించుకోబోయిన సుభాషిణి ఛాతీ పై, వీపు పై పొడిచాడు.రక్తం మడుగులో ఉన్న సుభాషిణిని గిద్దలూరు లోని ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం మార్కాపురం తరలిస్తుండగా మార్గ మధ్యలో సుభాషిణి మృతి చెందింది. విషయం తెలుసుకొన్న నాని తప్పించుకొని తిరుగుతూ హైదరాబాద్ వెళ్లే ఉద్దేశ్యంతో డబ్బుకోసం తన తాతయ్య ఇంటికి రాచర్లకు రాగా పోలీసులు మధ్యవర్తుల సమక్షంలో శ్రీఖర్ @నానీని అరెస్ట్ చేసి, కోర్టులో హాజరు పరచనున్నారు.:సుభాషిణి, శ్రీకర్ లు ఒకే స్కూల్ లో పదవ తరగతి వరకు కలిసి చదువుకున్నారు. సుభాషిణికి బాలకృష్ణ అనే వ్యక్తితో వివాహం అయింది. వారికి ఇద్దరు పిల్లలు. కొంతకాలానికి ఆటో తోలుకుంటూ జీవనం సాగిస్తున్న శ్రీకర్, సుభాషిణిల మధ్య పరిచయం పెరిగి, వారి మధ్య అక్రమ సంబంధానికి దారి తీసింది. విషయం బాలకృష్ణ కు తెలిసి సుభాషిణి పై అనుమానం మొదలయింది. దీంతో మద్యానికి అలవాటుపడి తరచూ సుభాషిణిని కొట్టేవాడు. సభాషిణి, శ్రీకర్ లు కలిసి బాలకృష్ణ ను అడ్డు తొలగించు కోవాలని పథకం వేశారు. తేది : 04-04-2023 రాత్రి మద్యం తాగి వచ్చిన బాలకృష్ణకు మజ్జిగలో నిద్ర మాత్రలు కలిపి ఇచ్చింది. బాలకృష్ణ మజ్జిగ త్రాగి మత్తులో ఉండగా తన ప్రియుడైన శ్రీకర్ ను పిలుచుకొని, బాలకృష్ణకు ఊపిరి ఆడకుండా గుడ్డతో మొహం పై గట్టిగా ఒత్తగా, శ్రీకర్ ప్లాస్టిక్ త్రాడుతో మెడను బిగించి చంపి వేశారు. మరుసటి రోజు ఉదయానికి ఆత్మ హత్యగా చిత్రీకరించారు. బాలకృష్ణ పెద్దఖర్మ అయిన మరుసటి రోజు ఇద్దరూ హైదరాబాద్ వెళ్లి సహజీవనం చేశారు. ఇలా కొంత కాలం గడిశాక సుభాషిణి మరొకరితో తరచూ ఫోన్ లో మాట్లాడుతూండగా ఇద్దరి మధ్య విభేదాలు ఏర్పడి గొడవలు జరిగాయి. సుభాషిణి శ్రీకర్ ని వదిలి ఒక్కతే రాచర్ల వచ్చింది. తరువాత తన పిల్లలను తీసుకొని గిద్దలూరు టౌన్ లో ఒక ఫ్యాషన్ షాప్ లో పని చేస్తూ జీవనం సాగిస్తోంది. కొందరు పెద్దలు ఇక సుభాషిణి జోలికి రావొద్దని శ్రీఖర్ కి చెప్పి ఉన్నారు. శ్రీకర్ సుభాషినితో మాట్లాడాలని ఎంత ప్రయత్నించినా కుదరలేదు. ఆమె మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో సుభాషిణిని హత్య చేశాడు.ఈ కేసుకు సంబంధించి మిస్టరీని ఛేదించిన గిద్దలూరు అర్బన్ సీఐ కే. సురేష్ ను వారి బృందాన్ని మార్కాపురం డియస్పీ యు.నాగరాజు అభినందించారు.
👉 కంభంలో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
ప్రకాశం జిల్లా..
మార్కాపురం డివిజన్ పరిధిలో దొంగతనాలకుపాల్పడుతున్న ఓ దొంగను కంభం పోలీసులుఅదుపులోకి తీసుకున్నారు. పట్టుపడ్డ దొంగ నుంచిరూ..5 లక్షల విలువచేసే బంగారం, వెండి స్వాధీనంచేసుకున్నట్లు మార్కాపురం డీఎస్పీ నాగరాజు శుక్రవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. భూపతి పల్లికి చెందిన ఈశ్వర్ రెడ్డి తర్లు పాడు లో ఒకచోట ,కంభంలోరెండు చోట్ల దొంగతనాలు చేసినట్లుగా డీఎస్పీ తెలిపారు.ఈ విలేకర్ల సమావేశంలో సీఐమల్లికార్జున్, ఎస్సై నరసింహారావు పాల్గొన్నారు.
ఇది సంవిధాన్.. సంఘ్ బుక్ కాదు.. తొలి ప్రసంగంలోనే ఎంపీ ప్రియాంక నిప్పులు!….స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంటును అవిష్కరించిన సీఎం చంద్రబాబు*..ప్రజాదర్బార్ లో పలు సమస్యల పరిష్కారం…అల్లు అర్జున్ కేసు… అధికారులకు ఆర్జీవీ నాలుగు ప్రశ్నలు! …రైతులకు అండగా అనంతపురం జిల్లాలో వైయస్‌ఆర్‌సీపీ నేతలు పోరుబాట… న్యూ ఇయర్ వేడుకలపై పోలీస్ కండీషన్స్.. గైడ్‌లైన్స్ విడుదల..సుభాషిని హత్య కేసులో సంచలనమైన విషయాలు రాబట్టిన పోలీసులు(గిద్దలూరు)…*కంభంలో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
Recent Posts