ప్రపంచంపై మరో ‘ప్రపంచ యుద్ధం’.. జమిలి అమల్లోకి వచ్చినా, ఎన్నికలు జరిగేది 2029లోనే- చంద్రబాబు.. మరోసారి మీడియా ముందుకు అల్లు అర్జున్‌.. కోట్లలో భారీ స్కామ్‌.. గుంటూరు కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ముద్దాయి అరెస్టు..

⭐⭐ ప్రపంచంపై మరో ‘ప్రపంచ యుద్ధం’.. ఇరాన్ పై ట్రంప్ గురి?😲😲😲 తైవాన్ జోలికి వస్తే సహించేది లేదనేది దాని సిద్ధాంతం.ఇప్పటికే దాదాపు మూడేళ్లుగా సాగుతోంది ఉక్రెయిన్-రష్యా యుద్ధం.. దీంట్లోకి ఉత్తర కొరియా, యెమెన్ సైనికులు.. 14 నెలలుగా నడుస్తోంది హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం.. దీనికితోడు సిరియాలో ప్రభుత్వం మార్పు.. ఇజ్రాయెల్ పై ఇరాన్ దూకుడు.. తైవాన్ ప్రస్తావన తెచ్చినా చైనా సహించడం లేదు.. దాని చుట్టూ 30 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా విన్యాసాలు చేసింది.. తైవాన్ జోలికి వస్తే సహించేది లేదనేది దాని సిద్ధాంతం.
ఇవీ ప్రస్తుతం ప్రపంచం ముందున్న సవాళ్లు.. ఇలాంటి సమయంలో మరో యుద్ధం వస్తే..? అది ప్రపంచ యుద్ధంగా మారే ప్రమాదం పొంచి ఉంటే..? యుద్ధం ఆపేస్తానని.. ‘వారం రోజుల్లో ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాన్ని ఆపేస్తా’.. ‘ఉక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని ముగించేలా చేస్తా’ ఇవీ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు. కానీ, ఆయన గెలిచాక మాత్రం మాట మారుస్తున్నారా? అని అనిపిస్తోంది. తనను గెలిపించిన ‘శాంతి’ ప్రవచనాలను తానే ఉల్లంఘిస్తున్నారు. ఇరాన్ అంటే రోగ్ కంట్రీ.. అమెరికాకు ఇరాన్ అంటే పడదు. దానిని రోగ్ (ధూర్త) దేశంగా అమెరికా అధ్యక్షులు నిందిస్తుంటారు. ఇక ఇరాన్ పూర్తిగా రష్యాకు మిత్ర దేశం. ఇప్పటికే ఇరాన్ పై అమెరికా ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలోనే ఇరాన్‌ తో భవిష్యత్తులో యుద్ధం జరిగే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు స్పందించిన ‘ఏదైనా జరగొచ్చు’ అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు.
టైమ్‌ మేగజీన్.. ‘పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డుకు ఎంపిక అనంతరం ఆ మేగజీన్ కు ట్రంప్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇరాన్ విషయంలో భవిష్యత్తులో ఏదైనా జరగొచ్చని.. పరిస్థితులు చాలా అస్థిరంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇరాన్‌ మేజర్‌ జనరల్ ఖాసీం సులేమానీ హత్య 2020లో ట్రంప్ హయాంలోనే జరిగింది. ఆయన ఇచ్చిన ఆదేశాలతోనే అమెరికా దళాలు వైమానిక దాడులకు దిగి సులేమానీని హత్య చేశాయనే ఆరోపణ ఉంది. దీనికి ప్రతీకారం తీర్చుకునేందుకు ఇరాన్‌.. ట్రంప్‌ పై దాడులకు కుట్ర చేస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఎన్నికల సమయంలో హత్యాయత్నం వెనుక కూడా ఇరాన్‌ ఉందనే అనుమానాలు వచ్చాయి. దీంతో అమెరికా గట్టి హెచ్చరికలు చేసింది. ట్రంప్‌ నకు హాని తలపెట్టాలని చూస్తే.. దాన్ని యుద్ధాన్ని ప్రేరేపించే చర్యగా చూస్తామని స్పష్టం చేసింది. ఇరాన్ జోలికెళ్తే రష్యా సహిస్తుందా? ఇప్పటికే అమెరికా అంటే అగ్గి మీద గుగ్గిలం అవుతోంది రష్యా. ఇక చిరకాల మిత్ర దేశం ఇరాన్ జోలికివెళ్తే ఊరుకుంటుందా? అనేది చర్చనీయాంశం. బైడెన్ ప్రభుత్వం ఉక్రెయిన్ కు దీర్ఘ శ్రేణి క్షిపణులను ప్రయోగించే అనుమతివ్వడమే పెద్ద తప్పు అనుకుంటే.. ట్రంప్ వచ్చి ఇరాన్ మీద యుద్ధానికి దిగితే అది ప్రపంచంపై మరో ‘ప్రపంచ యుద్ధం’ అవుతుంది.
⭐⭐⭐మీడియాతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇష్టాగోష్టి*
*జమిలి అమల్లోకి వచ్చినా, ఎన్నికలు జరిగేది 2029లోనే..ఒక దేశం, ఒకే ఎన్నిక విధానానికి ఇప్పటికే మా మద్దతు ప్రకటించా…వైసీపీ పబ్బం గడుపుకోవడానికి ఏదిపడితే అది మాట్లాడుతోంది…
వైసీపీ నేతలు ప్రజల్లో ఎప్పుడో విశ్వసనీయత కోల్పోయారు – వైసీపీ చేసే నాటకాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు…
రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతోంది …
స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ ను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి…వర్సిటీలు, కళాశాలలు, పాఠశాలలతో పాటు ప్రతిచోటా చర్చ జరగాలి…విజన్ 2020 సాకారమైన తీరు నేటి తరం తెలుసుకోవాలి…
గత పరిస్థితులను బేరీజు వేస్తే విప్లవాత్మక మార్పులు అందరికి కనిపిస్తున్నాయి…2047లోనూ ఇదే పునరావృతం అవుతుంది…స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ ఒక రోజు పెట్టి వదిలేసేది కాదు …
భవిష్యత్ తరాల బాగు కోసం చేసే ప్రయత్నంలో అందరు భాగస్వామ్యం కావాలి…
రేపటి తరం భవిష్యత్తు కోసమే విజన్ 2047…
సాగునీటి సంఘాలు, సహకార, ఇతరత్రా ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే..ఈసారి కలెక్టర్ల సదస్సులో ఎన్నో మార్పులు తీసుకొస్తాం..సుదీర్ఘ సమీక్షలకు తావివ్వకుండా ప్రశ్నలు..
సమాధానాల రూపంలో నిర్వహిస్తాం…
ముందుగానే కలెక్టర్లు, ఎస్పీలకు చర్చ అంశాలు పంపి సమాధానాలు కోరతాం..సమయం సద్వినియోగం, మంత్రులు..అధికారుల మధ్య సమన్వయం పెరుగుతుంది
ఆస్పత్రిలో చేరిన అద్వానీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా..అద్వానీ నాకు దశాబ్దాలుగా అనుబంధం ఉంది..ఆనాడు ఏపీ అభివృద్ధిలో అద్వానీ సహకారం మరువలేనిది..*సీఎం చంద్రబాబు*
* *విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ స్క్రోలింగ్ పాయింట్లు*. *ప్రకాశం జిల్లా*
మేదరమెట్లలో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పర్యటన …
రైతుల నుంచి చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేస్తాం…ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతులకు డబ్బు చెల్లిస్తున్నాం…వైసీపీ హయంలో ఉన్న ధాన్యం బకాయిలను కూటమి ప్రభుత్వం చెల్లించింది..బియ్యం, ఇసుక అక్రమ రవాణాపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది..ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే పనులు ఎవరు చేసినా ఉపేక్షించం..*– మంత్రి గొట్టిపాటి రవి కుమార్*
👉గుంటూరు కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ముద్దాయి అరెస్టు…ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తున్న ముద్దాయి అరెస్టు చేసిన పోలీసులు…
ముద్దాయి వద్ద నుండి 11 ద్విచక్ర వాహనాలు 3 ఆటోలని స్వాధీన పరచుకున్న కొత్తపేట పోలీసులు…
ముద్దాయి పేరు పరికల సాగారు పిడుగురాళ్ల వాసిగా వెల్లడించిన ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్…
ప్రస్తుతం గుంటూరు శ్రీనివాస్ పేట లో నివాసం వుంటునట్లుగా వెల్లడి…ముద్దాయి దగ్గర నుండి స్వాధీన పరచుకున్న వాహనాల విలువ సుమారు పది లక్షల యాభై వెలు వుంటుందన్న డీఎస్పీ…
*** కోట్లలో భారీ స్కామ్‌.. బాధితుల్లో భారతీయులు..
ఈ స్కామ్‌పై దర్యాప్తు చేపట్టిన రష్యా అధికారులు ప్రధాన నిందితులను అరెస్టు చేశారు. ఈ కాల్‌ సెంటర్ల ముఠాకు లండన్‌లో నివాసముంటున్న జార్జియా మాజీ రక్షణ మంత్రి డి కజెరాశ్‌విలితో సంబంధాలున్నాయని రష్యా ఎఫ్‌ఎస్‌బీ అధికారులు వెల్లడించారు.
ఈ కాల్‌సెంటర్లలో పనిచేసే ఆపరేటర్లు రోజూ అనేక మందికి ఫోన్‌ చేసి పెట్టుబడుల స్కీమ్‌లు అంటూ ఆశ పెడుతున్నారు. భారీ లాభాలు వస్తాయంటూ వారిని బుట్టలో వేసుకుంటున్నారు.
ఇలాంటి మోసపూరిత చర్యలతో బాధితుల నుంచి రోజుకు కనీసం 1 మిలియన్‌ డాలర్ల మేర, అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.8కోట్లకు పైమాటే దోచుకుంటున్నారని అధికారులు పేర్కొన్నారు.
* *నల్గొండ జిల్లా దామచర్ల మండల కేంద్రంలో ఎస్బిఐ బ్యాంకు ఏటీఎం లూటీ చేసిన దుండగులు.*
*నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఘటన స్థలానికి చేరుకొని పరిశీలన.*దాదాపు 20 లక్షల నుంచి 30 లక్షల చోరీ.**సీసీ కెమెరాకు పెప్పర్స్ కొట్టిన ఆనవాళ్లు*
*నాలుగు బంధాలుగా, క్లూస్ టీం, డాగ్స్ స్క్వాడ్ తో పరిశీలన చేస్తున్న పోలీసులు*
*దామరచర్ల మండల కేంద్రాన్ని చుట్టుముట్టిన పోలీస్ యంత్రాంగం*
👉🔸హైదరాబాద్‌: మరోసారి మీడియా ముందుకు అల్లు అర్జున్‌.. నాకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.. నేను బాధిత కుటుంబానికి క్షమాపణ చెబుతున్నా.. ఒకరు చనిపోవడం దురదృష్టకరమైన ఘటన.. నేను ఆ కుటుంబానిఇక అన్ని విధాలా అండగా ఉంటా-అల్లు అర్జున్‌*
⚡సంధ్య థియేటర్‌ దగ్గర జరిగిన ఘటన మా కంట్రోల్‌లో లేదు.. 20 ఏళ్లుగా నేను సంధ్య థియేటర్ లో సినిమా చూస్తున్నాను.. అది అనుకోకుండా జరిగింది.. రేవతి కుమారుడు శ్రీ తేజని పరామర్శిస్తాను-అల్లు అర్జున్*
👉అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి సంఘీభావం తెలిపిన నటులు నాగ చైతన్య, ఆర్ నారాయణమూర్తి, సుధీర్ బాబు, అల్లు బాబీ, సుకుమార్, బ్రహ్మాజీ, కీరవాణి, బీవీఎస్ఎన్ ప్రసాద్, హరీష్ శంకర్, రానా దగ్గుబాటి, మైత్రి ప్రొడ్యూసర్ నవీన్, కొరటాల శివ, అవంతి శ్రీనివాస్._*
👉విజన్ 2047 పేరుతో చంద్రబాబు మళ్ళీ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు..వైఎస్ షర్మిలా రెడ్డి
APCC అధ్యక్షురాలు.. ఆంధ్రప్రదేశ్ దశ – దిశ మారాలంటే తక్షణం కావాల్సింది విజన్లు కాదు.. విభజన హామీలు.
రాష్ట్రాన్ని నెంబర్ 1 గా నిలపాలంటే నెరవేరాల్సింది కేంద్రం ఇచ్చిన హామీలు. దశాబ్ద కాలంగా విభజన హామీలను గాలికి వదిలేశారు. పూర్తిగా అటకెక్కించారు. రాష్ట్ర విభజన సమయంలో అనాడు UPA సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా హామీ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చింది. నూతన రాజధానికి పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం ఇవ్వాలని సూచించింది.
బుందేల్ ఖండ్ తరహాలో వెనుక బడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటన చేసింది.. మౌలిక సదుపాయాల కల్పన, పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని షెడ్యూల్ 13 లో పొందపరించింది. కడప స్టీల్, దుగ్గరాజుపట్నం పోర్టులను నిర్మిస్తామని విభజన చట్టంలో పొందపరించింది. నూతన రైల్వే జోన్, పెట్రోలియం యూనివర్సిటీ, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, విజయవాడ, విశాఖలో మెట్రో రైల్,హైదరాబాద్ నుంచి విజయవాడకు ర్యాపిడ్ రైల్, ఇలా ఎన్నో హామీలు నేటికీ కలగానే మిగిలాయి..ఇవ్వాళ్టికి ఒక్క హామీకి దిక్కులేకుండా పోయింది..గడిచిన 10 ఏళ్లలో ప్రత్యేక హోదా వచ్చి ఉంటే పన్నుల్లో రాయితీలు ఉండేవి..వేల సంఖ్యలో కొత్త పరిశ్రమలు వచ్చేవి. లక్షల్లో ఉపాధి అవకాశాలు లభించేవి.
పోలవరం ప్రాజెక్టు పూర్తి అయ్యి ఉంటే రాష్ట్రం సస్యశ్యామలం అయ్యేది.. విజయవాడ, విశాఖలో మెట్రో రైల్ నిర్మాణం జరిగితే ప్రధాన నగరాలుగా అభివృద్ధి చెందేవి.. వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీలు అంది వుంటే పేదరిక నిర్మూలన సాధ్యం అయ్యేది.
విభజన హామీలు అమలయ్యి ఉంటే రాష్ట్రం దిశ – దశ పూర్తిగా మారేది.
దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ విరాజిల్లేది.
విభజన చట్ట హామీలు బుట్టదాఖలు చేయడంలో ప్రధాన ముద్దాయి ప్రధాని నరేంద్ర మోడీ అయితే *రెండో ముద్దాయి చంద్రబాబు.. మూడో ముద్దాయి జగన్ మోహన్ రెడ్డి.
ముగ్గురు కలిసి రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారు.
-హోదా 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు ఇస్తామని మోడీ నమ్మబలికితే.. హోదా ఏమైనా సంజీవనా అని చంద్రబాబు చెవుల్లో పూలు పెట్టారు.. 25 మంది ఎంపీలు ఇస్తే ఎందుకు ఇవ్వరో చూస్తా అని శపథాలు చేసిన జగన్ రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేశారు.
*చంద్రబాబు ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఎప్పటికైనా రాష్ట్ర అభివృద్ధికి సంజీవని ప్రత్యేక హోదా మాత్రమే..హోదాతోనే రాష్ట్రానికి విజన్. మోడీ పిలక మీ చేతుల్లో ఉంది..విభజన హామీలపై ప్రధానిని నిలదీయండి. కేంద్రం గల్లా పట్టి రాష్ట్ర హక్కులను సాధించండి అన్నారు.

7k network
Recent Posts

ప్రియాంక గాంధీపై బీజేపీ నేత ర‌మేష్ బిధూరి చేసిన అనుచిత వ్యాఖ్య‌ల ప‌ట్ల‌ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన మంత్రి సీత‌క్క‌*.. *నవీన్ కి చెక్ పెట్టినట్లే కేజ్రీవాల్ కి కూడా ?.. *ఈ ఫార్ములా రేసులో కొన్ని నిజాలు *.. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఛైర్మెన్ జంగా రాఘవ రెడ్డి … ఏపీ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, మంత్రి సత్య కుమార్ యాదవ్* …ప్రభుత్వ ఆస్తిని అప్పనంగా దోచుకున్న ఓం నారాయణ పై చర్యలు : లంబాడి హక్కుల పోరాట సంఘం.. *పొదిలి మాదిరెడ్డిపాలెం వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షులుగా ఎర్రం రెడ్డి

👉ఎంఎస్‌పీ పంజాబ్‌కే కాదు.. దేశమంతటికీ అవసరమే ..*తెలుగు తమ్ముళ్లకు సంక్రాంతి పండుగ ముందే వచ్చిందా.😲 ..హుస్నాబాద్ మైనార్టీ గురుకుల బాలికల పాఠశాల లో ఆకస్మిక తనిఖీలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ … ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాటులను పర్యవేక్షించిన జిల్లా అధికారులు ..*ఆత్మకూరులో ఇస్తేమ పనులను పర్యవేక్షించిన మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్ .. *

👉ఏపీలో రేపటి నుంచి ఉచిత ఓపీ సేవలు బంద్ …* విశాఖ పోర్టులో పట్టుకున్న బియ్యానికి కలెక్టర్ క్లీన్ చిట్..😲… *విశాఖ సెంట్రల్‌ జైల్ ను సందర్శించిన రాష్ట్ర హోం మంత్రి .. అగ్ని ప్రమాదాల పై అవగాహన సదస్సు.. *ఉచిత బస్సు కంటే ఇతర సంక్షేమ పథకాలకు ఖర్చు పెడితే బెటరేమో ! .. *అధికారులను సత్కరించిన పొదిలి పట్టణ టిడిపి అధ్యక్షుడు. . *నిలిచిపోయిన కాపు భవనాలను పునఃప్రారంభించాలి: బలిజ సేవ సంఘం డిమాండ్ .

2700 కోట్ల ఇల్లు.. రూ.10 లక్షల సూట్ ధరించే వారా విమర్శించేది? .. *పవన్ ఆదేశాలు.. సముద్ర తీరంలో రెండు బోట్లు సీజ్* .. *విజయవాడలో వెలుగు చూసిన అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారం .. *చంద్రగిరి ‘బీసీ’ విద్యార్థినులకు మెరుగైన వైద్యం* *తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ కు మంత్రి సవిత ఆదేశం*.. *ఆర్మీ వాహనం లోయలో పడి ఇద్దరు సైనికులు మృతి.. *పుత్తూరు సబ్ డివిజన్ పోలీసులు హెల్మెట్ వాడకంపై అవగాహన కార్యక్రమాలు … మైలవరం లో మిక్సీంగ్ రాజకీయ సెగలు…! ..*రాజకీయ దుమారం రేపిన పాలడుగు దుర్గా ప్రసాద్, ఎమ్మెల్యే వసంత కలయిక… *ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తూ పోలీస్ సిబ్బంది జీవన విధానం ఉండాలి : ఐజి వి సత్యనారాయణ.. *పోలీసుల వేధింపులు తట్టుకోలేక హుజూర్‌ నగర్ పోలీస్ స్టేషన్ ముందు యువకుడి ఆత్మహత్యాయత్నం .. * డిగ్రీ విద్యార్థులకు కూడా తక్షణమే వర్తింప చేయండి..మాజీ ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు పివి శేషయ్య.

*రెవిన్యూ అధికారులకు పై సియం సీరియస్*…*ప్రభుత్వ ఉద్యోగులపై ఆరోపణలు, కేసులు పెట్టే వారికి రక్షణ కల్పించేలా సర్కార్‌ చర్యలు.. *పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు పటిష్ట చర్యలు ; రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా…*కాంస్య పతకం సాధించి దేశ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన ఓరుగ‌ల్లు ముద్దుబిడ్డ .. *నితీష్ కి కన్ను గీటిన లాలూ..ఎన్డీయేలో కలవరమేనా ? ..*అమెరికాలో విచిత్రం ఇస్తున్న నోరో వైరస్ …*చైనాలో మరోసారి హెల్త్ ఎమర్జెన్సీ

⭐సూపర్-6 హామీలు కచ్చితంగా అమలు చేస్తాం..గత పాలనంతా విధ్వంసం…మేము రిపేర్లు చేస్తూ వెళ్తున్నాం..తప్పుడు పనులు చేయొద్దు.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు హెచ్చరిక : సీఎం చంద్రబాబు ..*మాదాపూర్ పేస్ హాస్పిటల్‌లో దారుణం.. *ఒక్క పైసా కూడా అవినీతి లేదు. -కేటీఆర్‌ ..*.. ఫారిన్‌లో ఎడ్యుకేషన్‌ పేరుతో మోసాలు. బోగస్‌ కన్సల్టెన్సీ ప్రతినిధులను అరెస్ట్‌ చేసిన పోలీసులు… సైబర్ నేరాలకు అడ్డా ‘వాట్సప్’.. హోంశాఖ నివేదిక.*.. యాపిల్ పండ్ల మాటున మద్యం అక్రమ తరలింపు …*తిరుపతిలో మత్తు వదిలించిన పోలీస్