👉భారత్ కు ఆ హోదా రద్దు చేసిన స్విస్ సర్కారు..!!!కారణం ఇదే తాజాగా స్విట్జర్లాండ్ ప్రభుత్వం.. భారతదేశానికి ఇచ్చిన ‘అత్యంత సానుకూల దేశం’ హొదాను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కొన్ని పరిణామాల్ని కొన్ని దేశాలు చాలా సీరియస్ గా తీసుకుంటాయి. తమ దేశానికి కంపెనీ ప్రయోజనాన్ని దెబ్బ తీసే పరిణామాల్ని ఆయా దేశాలు స్పందించే తీరు చూసినప్పుడు కాస్తంత ఆశ్చర్యంతో పాటు.. విస్మయానికి గురి చేస్తుంది. కంపెనీల విషయంలో ఏదైనా దేశం అడ్డగోలుగా వ్యవహరిస్తే.. వారికి దన్నుగా నిలవటంలో అర్థముంది. కానీ.. కోర్టు తీర్పుపై గుర్రుతో సదరు దేశంతో తాము వ్యవహరించే తీరును మార్చుకోవటం చూస్తే.. తమ కంపెనీలకు ఆయా దేశాలు ఎంత దన్నుగా నిలుస్తాయన్న విషయం ఇట్టే అర్థమవుతుంది.
తాజాగా స్విట్జర్లాండ్ ప్రభుత్వం.. భారతదేశానికి ఇచ్చిన ‘అత్యంత సానుకూల దేశం’ హొదాను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనికి కారణం తమ దేశానికి చెందిన బహుళ జాతి సంస్థ ప్రయోజనాల విషయంలో భారత్ కు చెందిన న్యాయస్థానం ఇచ్చిన తీర్పు కావటం ప్రధాన కారణంగా చెప్పాలి. ఇంతకూ ఆ కంపెనీ ఏమిటంటారా? అక్కడికే వస్తున్నాం.*మన దేశంలోని దాదాపు ప్రతి ఇల్లు ఆ సంస్థ ఉత్పత్తుల్ని వాడుతుంది. అదేనండి.. నెస్లే. కాఫీ.. న్యూడిల్స్.. కిట్ కాట్ చాక్లెట్ మొదలు ఎన్నో ఉత్పత్తులతో సుపరిచితమైన నెస్లే సంస్థకు సంబంధించి ఒక కేసులో కోర్టు ఇచ్చిన ఆదేశాలు ఆ సంస్థకు ఇబ్బందికరంగా మారాయి. అంతే.. ఆ సంస్థ మాతృ దేశ సంస్థ సీరియస్ అయ్యింది. కేసు విషయానికి వెళితే.. నెస్లే సంస్థపై నమోదైన కేసులో 2021లో ఢిల్లీ హైకోర్టు ఆ కంపెనీకి సానుకూలంగా తీర్పును ఇచ్చింది. డీటీఏఏలోని ఎంఎఫ్ఎన్ క్లాజును పరిగణలోకి తీసుకొని పన్ను రేట్లు వర్తిస్తాయని పేర్కొంది. అయితే.. 2023 అక్టోబరు 19న ఇదే కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు మాత్రం హైకోర్టు తీర్పును మార్చింది. ఆదాయపన్ను చట్టం సెక్షన్ 90 ప్రకారం.. నోటిఫికేషన్ లేకుండా ఎంఎఫ్ఎన్ క్లాజును నేరుగా అమలు చేయలేమని తేల్చింది. దీంతో.. ఆ సంస్థపై పన్ను భారం పడుతుంది. అంతే.. దీనిపై తాజాగా స్విస్ ప్రభుత్వం స్పందించింది. ఇరుe దేశాల మధ్య కుదిరిన ద్వంద్వ పన్ను నివారణ ఒప్పందంలో భాగంగా ఇచ్చిన హోదాను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో భారత్ లో స్విస్ పెట్టుబడులపై ప్రభావం చూపనుంది. దీంతో.. స్విస్ లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న భారత కంపెనీలపై అధిక పన్ను భారం పడే ఛాన్సు ఉంది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి స్విట్జర్లాండ్ లో ఉండే భారత కంపెనీలు ఆర్జించే డివిడెండ్లపై పది శాతం పన్ను విధిస్తారు. ఇది.. స్విస్ లో కార్యకలాపాలు నిర్వహించే భారత కంపెనీలకు అదనపు భారంగా మారనుంది. మరి.. దీనిపై భారత సర్కారు ఎలా రియాక్టు అవుతుందో చూడాలి.
👉 ఇటీవల నూతనంగా ప్రారంభించబడిన మెడిక్యూర్ మల్టీ స్పెషాలిటీ హాస్పటల్ ను సందర్శించిన పార్లమెంటు సభ్యులు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ,డాక్టర్ శ్రీధర్ బాబు,డాక్టర్ శ్రీనాథ్,డాక్టర్ రవళి,తాత ప్రసాద్ అయిన బత్తిన ఘన శ్యామ్ కొల్లా ప్రభాకర్ తదితరులు.
👉 ఒంగోలులో పాత బైపాస్ రోడ్డులో రిలయన్స్ మార్ట్ ప్రక్కన గల శ్రీ సరస్వతి విధ్యా సంస్థల చైర్మన్, ఏ.వి. రమణారెడ్డిగారి విందు భోజనం హోటల్ ప్రారంబోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నపార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి , నగర మేయర్ గంగాడ సుజాత కమిషనర్ వెంకటేశ్వరులు,సంతనూతలపాడు శాసనసభ్యులు బి.ఎన్ విజయకుమార్,ఏపీ టూరిజం చైర్మన్ నూకసాని బాలాజీ,జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ, తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
⭐ ఒంగోలులో హౌసింగ్ బోర్డు కాలనీలోని కేంద్రీయ విద్యాలయంలో జరుగు కె.వి.ఎస్. వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొన్నపార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి , ప్రిన్సిపల్ శ్రీ మనీష్ , రిటైర్డ్ కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ సూర్య ప్రకాష్ రావు , కార్పొరేటర్ ఈదర్ సురేష్ బాబు తాత ప్రసాద్, అయినబత్తిన ఘన శ్యామ్, కొల్లా ప్రభాకర్ తదితరులు.
⭐ ఇటీవల నూతనంగా ప్రారంభించబడిన కర్నూల్ రోడ్ లోని సౌత్ ఇండియ షాపింగ్ మాల్ ను సందర్శించిన పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, డాక్టర్ సీతారామయ్య తాత ప్రసాద్ అయినా బత్తిన ఘనశ్యామ్ కోలా ప్రభాకర్ తదితరులు.
** ఒంగోలులోని మాగుంట కార్యాలయంలో విజయవాడ రైల్వే డివిజన్ యూసర్స్ క్యాాన్సల్టేటివ్ కమిటీ సభ్యునిగా నాదెండ్ల సుధాకరరావు నియామక పత్రాన్ని ఆయనకు ఒంగోలు పార్లమెంటు సభ్యులు,మాగుంట శ్రీనివాసులురెడ్డి అందజేశారు. దానికి తనను నాదెండ్ల సుధాకరరావు మాగుంట సదరు సభ్యునిగా నియమింపజేసినందుకు శ్రీనివాసులురెడ్డి,మాగుంట రాఘవరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రెండు సంవత్సరాలు ఈ పదవీ కాలంలో యం.పి. సహకారంతో ఈ డివిజన్ లో ప్రయాణీకుల వసతుల కల్పన మరియు మెరుగు పరచుటలో తప్పక కృషి చేస్తానని నాదెండ్ల సుధాకరరావు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అయినాబట్టిన ఘనశ్యాం,బెల్లం సత్యనరా యణ కండే శ్రీనివాసరావు కుప్పా రంగనాయకులు,తాతా ప్రసాదు అయినబత్తిన రాము చదలవాడ చంద్రశేఖర్ కోటపాటి వెంకటేశ్వర్లు చెంచురామయ్య పాల్గొన్నారు.* స్టాఫ్ రిపోర్టర్ ఎస్ రెహమాన్..
* ఒంగోలు రైలు పేటలోని పెద్దిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి మరియు ధనలక్ష్మి ల కుమార్తె వివాహం ఇటీవల అయిన సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించిన పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి .
* ఒంగోలు సంతపేటలోని నల్లపురెడ్డి అనిల్ కుమార్ రెడ్డి కుమారుని వివాహం ఇటీవల అయిన సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించిన పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి బెల్లం సత్యనారాయణ , తిరుమల శెట్టి శ్రీనివాసరావు శీనారెడ్డి తదితరులు.
* ఒంగోలు లోని సంఘమిత్ర హాస్పిటల్ ప్రక్కన వున్న ఎస్.జి.వి.ఎస్. కన్వెన్షన్ హాలులో తల్లపనేని శ్రీహరి , రాధా పుత్రిక చి. ల. సౌ. గాయత్రి ను మరియు చి। అరవింద్ స్వామి ల వివాహ మహోత్సవం లో పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించిన ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి .
👉 :అల్లు అర్జున్‌కు ఏపీ సీఎం ఫోన్*
*👉ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ చేశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్టై బెయిల్‌పై జైలు నుంచి విడుదలైన ఆయన్ను ఫోన్‌లో సీఎం పరామర్శించారు. నిన్న అల్లు అరవింద్‌కు కూడా ఫోన్ చేసిన చంద్రబాబు ధైర్యంగా ఉండాలని సూచించిన సంగతి తెలిసిందే.*
👉 కలుగులో దాక్కున్న ఎలుకలు బయటకొచ్చి కీస్ కీస్ మంటున్నాయి..*గత ఐదేళ్లలో ఎవరైనా రైతుల కష్టాల మీద స్పందించారా..*వైసీపీ రైతు పోరుబాటుపై ఎమ్మెల్యే పరిటాల సునీత ఫైర్*
*వ్యవసాయాన్ని, సాగునీటి రంగాన్ని నాశనం చేశారు*
*ఆరు నెలల తర్వాత నిద్ర మేల్కొని డ్రామాలు వేస్తున్నారు
ఆరు నెలల పాటు కలుగులో దాక్కున్న ఎలుకలన్నీ ఇప్పుడు బయటకొచ్చి కీస్ కీస్ మంటున్నాయంటూ రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ చేపట్టిన రైతు పోరుబాటపై ఆమె తీవ్రంగా స్పందించారు. అనంతపురంలోని క్యాంప్ కార్యాలయంలో కన్వీనర్ జింకా సూర్యనారాయణ, మాజీ ఎంపిపి రంగయ్య గార్లతో కలసి ఆమె మాట్లాడుతూ అసలు వైసీపీ నాయకులకు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా అని నిలదీశారు. మరీ ముఖ్యంగా కరవు ప్రాంతమైన అనంతపురం జిల్లా రైతులకు చేసిన ద్రోహం అంతా ఇంతా కాదన్నారు. అసెంబ్లీ సాక్షిగా రైతులకు 2,378 కోట్ల పరిహారం ఇస్తున్నాం అని ప్రకటించి ఆ తర్వాత దానిని ఎగ్గొట్టింది మీరు కాదా అని నిలదీశారు. రైతులకు ఇంత అన్యాయం జరుగుతుంటే.. ఈ జిల్లాలో ఉన్న 12మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరైనా ప్రశ్నించారా అని మండిపడ్డారు. అనంతపురం జిల్లాలో సాగునీటి వనరులు తక్కువగా ఉన్న నేపథ్యంలో సూక్ష్మ సేద్యంకు గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో సహకారం అందించారని గుర్తు చేశారు. అందుకే రైతులు విరివిగా పండ్ల తోటలు సాగు చేశారన్నారు. కానీ అదే గత ఐదేళ్లలో ఎంత మంది రైతులకు డ్రిప్పు, స్ప్రింక్లర్లు ఇచ్చారో ధైర్యం ఉంటే సమాధానం చెప్పాలన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ అన్ని వర్గాలకు మంచి చేస్తోందన్నారు. ప్రస్తుతం పంటలకు గిట్టుబాటు ధరలు లేని నేపథ్యంలో.. మద్దతు ధర ఇచ్చి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది మీకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆరునెలలుగా కనిపించని వారంతా.. ఇప్పుడు బయటకొచ్చి రైతులపై ప్రేమ ఉన్నట్టు డ్రామాలు చేస్తున్నారన్నారు. ఇలాంటి డ్రామాలను రైతులే కాదు ఏ ఒక్కరు నమ్మే పరిస్థితుల్లో లేరన్నది వైసీపీ నేతలు గుర్తుంచుకోవాలని ఎమ్మెల్యే పరిటాల సునీత సూచించారు…
👉 అన్నమయ్య జిల్లా
నిమ్మనపల్లె సాగునీటి సంఘాల ఎన్నికల్లో ఘర్షణ..
నిమ్మనపల్లె జడ్పీ హైస్కూల్లో శనివారం జరిగిన సాగు నీటి సంఘాల ఎన్నికల్లో ఘర్షణ జరిగింది. టీడీపీకి చెందిన రెండు వర్గాలు బాహాబాహీకి దిగారు. బహుద ప్రాజెక్టుకు ఎన్నికల అధికారి, తహసిల్దార్ ధనంజయులు ఆధ్వర్యంలో ఎన్నికలు జరగక ఓవర్గం బలపరిచిన వ్యక్తికి భారీ మెజార్టీ వచ్చింది. టిడిపికి చెందిన మదనపల్లె ప్రముఖ నేత ఆదేశాలతో బలపరిచిన మరోవర్గానికి ఒక్క ఓటు రాలేదని గొడవ జరిగి బహ బహికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది