👉గిద్దలూరు ,ఎర్రగొండపాలెం, మార్కాపురం ,కనిగిరి ,దర్శి నియోజకవర్గాలను కలిపి మార్కాపురం జిల్లాగా చేయాలని సిపిఎం పార్టీ 14వ మహాసభల సందర్భంగా ఈరోజు మహాసభలో తీర్మానం చేయడం జరిగింది.
ఈ తీర్మానాన్ని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు గుమ్మా బాల నాగయ్య ప్రవేశపెట్టడం జరిగింది.
*మార్కాపురం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలి*
* గుమ్మా బాల నాగయ్య, జిల్లా కమిటి సభ్యులు*
*జిల్లా 14వ మహాసభలో తీర్మానం*
ప్రకాశం జిల్లాలో అత్యంత వెనుకబడిన ప్రాంతంగా మార్కాపురం, కనిగిరి రెవిన్యూ డివిజన్స్ ఉ న్నాయి. ఈ ప్రాంతాన్ని గతంలో వెనుకబడిన పాత రాయలసీమ జిల్లా అయినటువంటి కర్నూలు జిల్లా నుంచి కొంత భాగం, నెల్లూరు జిల్లా నుండి కొంత భాగం పశ్చిమ ప్రకాశం ప్రాంతంగా ఉన్నది. ప్రకాశం జిల్లాలో చివరగా ఉన్నటువంటి గిద్దలూరు, యర్రగొండపాలెం నియోజకవర్గాల నుండి ఒంగోలు రావాలంటే సుమారు 180 కిలోమీటర్ల దూరం ఒక రోజంతా ప్రయాణం పడుతుంది. ప్రజలకు అవసరమైనటువంటి ఆరోగ్య సమస్యలను పరిష్కరించుకోవాలన్న కనీస హాస్పటల్ సౌకర్యం కూడా లేదు. రెవెన్యూ పరమైనటువంటి రికార్డులు పరిశీలించుకోవడానికి ఒంగోలు వెళ్లాలంటే సుమారుగా వేల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అలాగే మార్కాపురంలో ప్రాంతం పలకల తో పాటుగా వ్యవసాయ రంగంపై ఆధారపడి ఈ ప్రాంత ప్రజల జీవనోపాధి సాగిస్తున్నారు. గిద్దలూరు, ఎర్రగొండపాలెం, దర్శి, కనిగిరి ప్రాంతాల నుండి వ్యవసాయదారులు తాము పండించుకున్నటువంటి పంటలను గుంటూరు, కర్నూలు వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉంది. మార్కాపురం అటవీ ప్రాంతమైనటువంటి నల్లమల ఫారెస్ట్ మార్కాపురం పక్కనే ఉంది. సాగర జలాలు మార్కాపురం ప్రాంతము నుండే ఒంగోలు వెళ్తున్నాయి. మిర్చి, పొగాకు, పత్తి, పండ్ల తోటలు ఈ ప్రాంతంలోనే ఎక్కువగా పండిస్తున్నారు. ప్రసిద్ధిగాంచిన పలకల పరిశ్రమ కూడా మార్కాపురం ప్రాంతంలోనే ఉన్నది. జిల్లా కేంద్రానికి అవసరమైనటువంటి అన్ని రకాల గవర్నమెంట్ ఆఫీసులు అందుబాటులో ఉన్నాయి. జిల్లా కేంద్రానికి కావలసిన అన్ని అవకాశాలు మార్కాపురానికి ఉన్నాయి. ప్రాధాన్యత కలిగిన మార్కాపురం ప్రాంతాన్ని గతంలో బ్రిటిష్ ప్రభుత్వమే జిల్లా కేంద్రంగా పరిపాలన చేసినటువంటి ఆనవాళ్లు ఉన్నాయి. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 1964 సంవత్సరం ప్రాంతంలో మార్కాపురం పార్లమెంట్గా ఉండేది. ఇలాంటి ప్రాంతాన్ని రాజకీయ నాయకులు తమ స్వార్థం ప్రయోజనం కోసం మార్కాపురం ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో, జిల్లా చేయడంలో వివక్ష చూపించడంతో అన్ని రకాల సౌకర్యాలు, వనరులు ఉన్న వెనుకబడిన ప్రాంతంగా మార్కాపురం ప్రాంతం ఉంది. మార్కాపురం ప్రాంతం ఏ రకంగా చూసిన జిల్లా అవ్వడానికి అన్ని రకాలైనటువంటి అవకాశాలు ఆర్థిక వనరులు అవసరమైనటువంటి ఆఫీసులో ఉన్నప్పటికీ ఈ ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించకపోవడంలో ఇక్కడున్నటువంటి స్వార్థపూరిత రాజకీయ నాయకుల కారణంగానే జిల్లాగా ఏర్పడలేదు. మార్కాపురం ప్రాంతాన్ని జిల్లా ప్రకటించడం వల్ల నిధులు పెరగటం, వనరులను ఉపయోగించుకొనే అవకాశం ఉంటుంది. జిల్లా కేంద్రం పశ్చిమ ప్రాంత ప్రజలందరికీ అందుబాటులో ఉంటుంది. అన్ని రకాల వసతులు కల్పించి మార్కాపురం జిల్లాగా ప్రకటించాలని ప్రకాశంజిల్లా 14వ మహాసభ డిమాండ్ చేస్తుంది.
👉ప్రకాశం జిల్లా కొండేపి లో అర్ధరాత్రి *ఎస్బిఐ ఏటీఎంను ధ్వంసం చేశాడు ఓ దుండగుడు
సుత్తితో ఏటీఎంను ధ్వంసం చేశాడు..ఘటన సీసీటీవీ ఫుటేజ్ లో లైవ్ రికార్డు అవుతుండడంతో హైదరాబాద్ హెడ్ ఆఫీస్ లో సైరన్ మోగింది…బ్యాంక్ సిబ్బంది హుటాహుటిన జిల్లా ఎస్పీ దామోదర్ కు సమాచారం అందించారు.. ఎస్పీ ఆదేశాలతో అలర్ట్ అయిన ఎస్సై ప్రేమ్ కుమార్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నాడు..పోలీసులు వచ్చేది గమనించిన దుండగుడు అక్కడి నుండి పారిపోయాడు.నిందితుడి కోసం గాలిస్తున్నారు ..పోలీసులు అలర్ట్ అవటంతో చోరి విఫలయత్నం ఏటీఎంలో నగదు 33 లక్షలు సేఫ్ .. ఊపిరి పీల్చుకున్న బ్యాంక్ అధికారులు
👉పొదిలి మండలం ఆముదాలపల్లి గ్రామపంచాయతీ లోని తీగదుత్తిపాడు నీటి సంఘ ఎన్నికల్లో విజయం సాధించిన టిడిపి నాయకులు చైర్మన్ వైస్ చైర్మన్లు నెంబర్లు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డిని మర్యాదపురం కలిసి శాలువా కప్పి పూలమాలేసి మా విజయానికి కృషిచేసిన ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు తెలిపారు చైర్మన్ నిడమనూరి వెంకటేశ్వర్లు బలరాం వైస్ చైర్మన్ దరిమడుగు కేదేశ్వర రావు నెంబర్స్ ఆవుల కోటేశ్వరరావు ఉల్లిపాయలు వెంకటరమణయ్య భోగిసం పేద సుబ్బారావు నీలం వీరమ్మ రాష్ట్ర తెలుగు రైతు కార్యదర్శి ఆవులూరి ఎలమంద మండల అధ్యక్షులు ఓబుల్ రెడ్డి పట్టణ అధ్యక్షులు ముల్లా కుదుస్ పొదిలి మండల యూత్ అధ్యక్షులు పోపూరి నరేష్ బాబతదితరులు పాల్గొన్నారు
👉భార్యను అడవిలో వదిలి వెళ్లిన భర్త!*
తెలంగాణ : సిద్దిపేట(D) ములుగు(M) వంటిమామిడి అడవిలో ఓ యువతిని వదిలివెళ్లాడు. మహారాష్ట్రకు చెందిన విక్రమ్ మన్వర్ ఉద్యోగరీత్యా బెంగళూరులో ఉంటున్నాడు. అక్కడ రబియా అనే యువతితో పరిచయం ఏర్పడటంతో కలిసి ఉంటూ ఈనెల 4న పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. HYDకు వచ్చాక శనివారం మళ్లీ గొడవ జరగడంతో రబియా పెయిన్ కిల్లర్ మాత్రలు మింగింది. దీంతో విక్రమ్ ఆమెను తీసుకొచ్చి అడవిలో వదిలి వెళ్లాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఆస్పత్రికి తరలించారు.
👉‘పుష్ప-2’ తొక్కిసలాట ఘటన.. బాలుడి హెల్త్ అప్డేట్* ..‘పుష్ప-2’ ప్రీమియర్ సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో గాయపడిన బాలుడు శ్రీతేజ్‌కు పీఐసీయూలో చికిత్స కొనసాగుతోందని వైద్యులు తెలిపారు. ఇంకా వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నట్లు బులిటెన్ విడుదల చేశారు. అప్పుడప్పుడు జ్వరం వస్తోందని, బాలుడు ఇంకా స్పృహలోకి రాలేదని పేర్కొన్నారు. ఇదే ఘటనలో శ్రీతేజ్ తల్లి రేవతి చనిపోయిన విషయం తెలిసిందే. కాగా ఈ కేసులో హీరో అల్లు అర్జున్ అరెస్టై బెయిల్‌పై విడుదలయ్యారు.
👉భార్య భర్తల గొడవలో తలదూర్చిన ఎస్ఐ.. రూ.20 వేలు లంచం ఇవ్వలేదని గిరిజన యువకుడిపై దాడి
మహాబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలంలో భార్యా భర్తల పంచాయితీలో రూ.20 వేలు డిమాండ్ చేసిన ఎస్ఐ క్రాంతి కిరణ్.
అంతకు ముందే రూ.15 వేలు తీసుకున్నారని, తన దగ్గర డబ్బులు లేవని వేడుకున్న యువకుడు.
డబ్బులు ఇవ్వలేదని పోలీసులు దారుణంగా కొట్టినట్టు గిరిజన యువకుడి ఆరోపణ.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు.. న్యాయం చేయాలని బాధిత కుటుంబసభ్యుల డిమాండ్.
👉షాద్ నగర్ ట్రాఫిక్ పోలీసుల ఔదార్యం..!*
*పరీక్షకు ఆలస్యం అవుతుందని పెట్రోలింగ్ వాహనంలో మహిళను పరీక్షా కేంద్రానికి చేర్చిన పోలీసులు*
*గ్రూపు 2 పరీక్షల సందర్బంగా ట్రాఫిక్ ఎస్సై రవీందర్ సాయం..*
గ్రూప్ 2 పరీక్షల సందర్భంగా అభ్యర్థులు పరీక్షల కోసం సరైన సమయంలో హాజరు కావలసి ఉంటుంది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో గ్రూప్ 2 మహిళ అభ్యర్థి పరీక్ష కేంద్రానికి వెళ్లేందుకు కొన్ని నిమిషాలే మిగిలి ఉండడంతో ఆందోళన చెందుతుండగా సదరు మహిళ ట్రాఫిక్ పోలీసులను ఆశ్రయించింది. స్థానికంగా దేవి గ్రాండ్ సమీపంలో మహిళా ఆందోళనకు గురై కనిపించింది. ఓ కళాశాలకు తొందరగా వెళ్లాలని అక్కడే ఉన్న ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ రవీందర్ ను వేడుకోవడంతో ఆయన వెంటనే పెట్రోలింగ్ వాహనంలో ఆమెను సకాలంలోనే కళాశాల పరీక్షా కేంద్రం వద్ద వదిలిపెట్టారు. దీంతో ఆ మహిళ ట్రాఫిక్ పోలీసు సేవలకు కృతజ్ఞతలు తెలిపింది. డిసెంబర్ 15న ఉదయం 10 నుంచి 12:30 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు, 16వ తేదీన ఉదయం 10 నుంచి 12:30 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5:30 గంట ల వరకు పరీక్షలు ప్రారంభం అయ్యాయి. పరీక్ష కేంద్రంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సూచనల ప్రకారం అభ్యర్థులు వ్యవహరించాల్సి ఉంటుంది.
మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్స్, స్మార్ట్ వాచీలు వంటి వస్తువులతో రాకూడదన్నారు. కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్ విధించడంతోపాటు జీరాక్స్ సెంటర్లను మూసివేయాలన్నారు. కేంద్రాల్లో విద్యుత్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని, టాయిలెట్స్, తాగునీరు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, పొరపాట్లకు తావు లేకుండా సజావుగా పరీక్షలు నిర్వహించేలా అధికారులు అందరూ సమన్వయంతో పని చేయాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది.._
👉 కంభం సీఐ ఫోన్ హ్యాక్ అయింది సిఐ గారి వాట్సాప్ నుంచి వచ్చే మెసేజ్ లు కూడా ఎవరు ఓపెన్ చేయొద్దు అలా ఓపెన్ చేస్తే మీ అకౌంట్ లో మీ అకౌంట్లో నుంచి మీ డేటా వాళ్లకి వెళ్ళిపోతుంది అమౌంట్ కూడా పోయే ఛాన్స్ ఉంది కావున ఎవరూ ఓపెన్ చేయవద్దని కంభం ఎస్సై బి నరసింహారావు తెలిపారు
👉 మోహన్ బాబు చేసిన దాడిని ఖండిస్తున్నాం… తప్పు చేస్తే శిక్షపడాలి: మంత్రి సీతక్క…
తప్పు ఎవరు చేసినా ఉపేక్షించేది లేదన్న మంత్రి సీతక్క
జర్నలిస్ట్ వైద్య ఖర్చులను మోహన్ బాబు
భరించాలన్న మంత్రి
జర్నలిస్ట్‌ల రక్షణకు నిర్ణయాలు
తీసుకుంటామన్న మంత్రి
జర్నలిస్ట్ రంజిత్‌పై సినీ నటుడు మోహన్ బాబు చేసిన దాడిని ఖండిస్తున్నామని, తప్పు ఎవరు చేసినా ఉపేక్షించేది లేదని తెలంగాణ మంత్రి సీతక్క అన్నారు. తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందే అన్నారు. ఇటీవల మోహన్ బాబు తన ఇంట్లో ఓ జర్నలిస్ట్‌పై దాడి చేశారు. ఈ ఘటనపై మంత్రి స్పందించారు.
దాడిలో గాయపడిన జర్నలిస్ట్ వైద్య ఖర్చులను మోహన్ బాబు భరించాలన్నారు. జర్నలిస్ట్ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తమది ప్రజా ప్రభుత్వమని, జర్నలిస్ట్‌లపై దాడులకు చోటు లేదన్నారు. జర్నలిస్ట్‌ల రక్షణకు నిర్ణయాలు తీసుకుంటామన్నారు.
మోహన్ బాబు కుటుంబంలో వివాదం నేపథ్యంలో ఈ వార్తను కవర్ చేసేందుకు జర్నలిస్టులు జల్‌పల్లిలోని మోహన్ బాబు నివాసానికి వెళ్లారు. ఈ సమయంలో జర్నలిస్ట్‌పై మోహన్ బాబు దాడి చేశారు. ఈ ఘటనలో జర్నలిస్ట్ రంజిత్ గాయపడ్డారు. దీనికి సంబంధించి మోహన్ బాబుపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా హైకోర్టు కొట్టివేసింది.
👉 ఢిల్లీ నేరాలకూ రాజధానిగా మారింది: అమిత్ షాకు కేజ్రీవాల్ లేఖ..డ్రగ్స్ నేరాలు 350 శాతం పెరిగాయని ఆందోళన..మహిళలపై నేరాలు, హత్యల్లో ఢిల్లీదే మొదటి స్థానమని వ్యాఖ్య…నేరాల కారణంగా రేప్ క్యాపిటల్, క్రైమ్ క్యాపిటల్ అంటున్నారన్న కేజ్రీవాల్
ఢిల్లీలో పెరుగుతున్న నేరాలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాశారు. ఢిల్లీ నేరాలకు కూడా రాజధానిగా మారిందని ఆ లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో డ్రగ్స్ నేరాలు 350 శాతం పెరిగాయన్నారు. మహిళలపై నేరాలు, హత్యల్లో ఢిల్లీదే మొదటి స్థానమన్నారు. ఢిల్లీలో బాంబు బెదిరింపులు నిత్యకృత్యంగా మారాయన్నారు.
బాంబు బెదిరింపుల కారణంగా విద్యార్థుల తల్లిదండ్రులు భయపడుతున్నారని పేర్కొన్నారు. ఢిల్లీ శాంతిభద్రతలపై తక్షణమే చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. శాంతిభద్రతల సమస్యను వివరించేందుకు తనకు అపాయింట్ మెంట్ ఇవ్వాలని కోరారు. భారత్‌లోని మెట్రో నగరాలతో పోలిస్తే ఢిల్లీలోనే అత్యధికంగా నేరాలు జరుగుతున్నాయని విమర్శించారు. నేరాల కారణంగా ఢిల్లీకి ‘రేప్ క్యాపిటల్’, ‘క్రైమ్ క్యాపిటల్’ అనే కొత్త పేర్లు వస్తున్నాయన్నారు.
👉 ఏపీలో నియోజకవర్గాల పెంపు.. లోక్‌సభలో టీడీపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు…
దేశవ్యాప్తంగా లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అంశం చర్చకు వచ్చింది. టీడీపీ పార్లమెంటరీ పార్టీనేత లావు శ్రీకృష్ణదేవరాయలు దక్షిణాది రాష్ట్రాల్లో తక్కువ సీట్లు పెరుగుతున్నాయని.. ఉత్తరాదిలో మాత్రం సీట్లు భారీగా పెరుగుతున్నాయన్నారు. ఉత్తరాదిలో 155 సీట్లు పెరుగుతుంటే.. దక్షిణాదిలో కేవలం 35 సీట్లు మాత్రమే పెరుగుతున్నాయన్నారు. ఇది సరికాదని.. దక్షిణాది రాష్ట్రాలకు కూడా న్యాయం చేయాలని కోరారు. ఈ క్రమంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలను ప్రస్తావించారు.
దేశంలో లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం చేయాలని టీడీపీ పార్లమెంటరీ పార్టీనేత లావు శ్రీకృష్ణదేవరాయలు డిమాండ్ చేశారు. ఉత్తరాది రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాలు భారీగా పెంచుతున్నారని.. కానీ దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం చాలా తక్కువ పెంచుతున్నారని చెప్పుకొచ్చారు. లోక్‌సభలో నియోజకవర్గాల పునర్విభజనను ప్రస్తావించారు.. భవిష్యత్తులో జరిగే నియోజకవర్గాల పునర్విభజనలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, రాజస్థాన్‌లలో ఇప్పుడున్న 174 ఎంపీ సీట్లు 329కు పెరిగే అవకాశం ఉందన్నారు. అంటే ఆ రాష్ట్రాలన్నీ కలిపి అక్కడ 155 సీట్లు పెరుగనున్నాయంటున్నారు.
అదే దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటకల్లో సీట్లు 129 నుంచి 164కు మాత్రమే పెరిగే అవకాశం ఉందన్నారు శ్రీకృష్ణదేవరాయలు. ఇక్కడ ఐదు రాష్ట్రాల్లో కలిపి కేవలం 35 సీట్లు మాత్రమే పెరుగుతాయని.. ఇది సమాఖ్య వ్యవస్థకు ఏమాత్రం సరికాదన్నారు. ఆర్థిక క్రమశిక్షణ పాటించని రాష్ట్రాలకు రాజకీయంగా ప్రయోజనం కల్పిస్తున్నట్లు అవుతుందన్నారు. దక్షిణాది రాష్ట్రాలకూ లబ్ధిచేకూర్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రాజ్యాంగ రూపకల్పనలో తెలుగువారు అందించిన చేయూత గురించి గుర్తు చేశారు. రాజ్యాంగ నిర్మాణ సభలో దేశంలోని విభిన్న ప్రాంతాలకు చెందిన 389 మంది సభ్యులున్నారన్నారు.
ఇప్పుడు లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించడానికి వీలుగా రాజ్యాంగ సవరణ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైందన్నారు శ్రీకృష్ణదేవరాయలు. అదే సమయంలో స్థానిక సంస్థలకూ ఎన్నికలు నిర్వహించి అవి స్వయంపాలనలో కొనసాగేలా చూడాలని కోరారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలుచేసే బిల్లులకు గవర్నర్‌లు ఆమోదముద్ర వేసేందుకు గరిష్ఠంగా ఆరునెలల సమయం ఇవ్వాలని కూడా ప్రస్తావించారు. ఈ విషయంలో గడువు విధిస్తూ రాజ్యాంగ సవరణ చేయాలని.. ఏడో షెడ్యూల్‌లో ఏఐ, సైబర్ సెక్యూరిటీ, డేటా రక్షణ, ఈ కామర్స్, ఆన్‌లైన్‌గేమింగ్‌లను కేంద్ర, రాష్ట్ర జాబితాల్లో ఏదో ఒక దాంట్లో చేర్చాలి అన్నారు.
ప్రతిపక్ష కాంగ్రెస్ రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నట్లు ఆరోపిస్తోందని.. కానీ వాళ్లు ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో, ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూల్చివేత సమయంలో ఎలా వ్యవహరించారో ఒకసారి గుర్తుచేసుకుంటే మంచిదన్నారు శ్రీకృష్ణదేవరాయలు. వాళ్లు విభజన బిల్లును రాష్ట్ర అసెంబ్లీకి పంపితే దాన్ని భారీ మెజార్టీతో తిరస్కరించి పంపిన విషయాన్ని గుర్తు చేశారు. అయినా సరే ఆ బిల్లును పార్లమెంటుకు తెచ్చారన్నారు. అప్పుడు పార్లమెంటులో ఏం జరిగిందన్నది అందరూ చూశారని.. విభజన బిల్లుకి వ్యతిరేకంగా ఎంతమంది, అనుకూలంగా ఎంతమంది ఓటేశారన్న లెక్కలు ఇప్పటికీ లేవు అన్నారు. మహనీయుడు ఎన్టీఆర్ పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చారని.. కానీ ఏడాదిలోపే 1984లో అప్పటి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన ప్రభుత్వాన్ని కూల్చేసిందని వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీకి ఆరోజు రాజ్యాంగం, ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా అంటూ ప్రశ్నించారు.
👉 విడదల రజిని, అప్పిరెడ్డి మనుషులే నా కూతురిని చంపేశారు!😲😲😲
మాజీ మంత్రి విడదల రజిని, వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి దగ్గరగా ఉండే వ్యక్తులే తన కూతురిని చంపడంతోపాటు ఎదురు తమపైనే హత్య కేసు పెట్టారని ఓ యువతి తల్లి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎదుట బోరుమన్నారు.పైగా మాపైనే హత్య కేసు పెట్టి వేధిస్తున్నారు
రెండేళ్లుగా కోర్టు చుట్టూ తిరుగుతున్నాం
టీడీపీ గ్రీవెన్సులో చంద్రబాబుకు మొరపెట్టుకొన్న తల్లి
నిందితులు ఎంతటివారైనా వదిలిపెట్టబోమన్న సీఎం
శనివారం ఆయన ఇక్కడి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. గుంటూరు నగరం గుజ్జనగుళ్ల ప్రాంతానికి చెందిన నిశంకర శంకర లీల అనే మహిళ.. తన కుమార్తె హత్యోదంతంపై చంద్రబాబుకు వినతి పత్రం అందజేశారు. ‘మాజీ మంత్రి విడదల రజిని, లేళ్ల అప్పిరెడ్డి వద్ద పనిచేస్తున్నామని చెప్పే వ్యక్తులు.. డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న నా కూతురిని వంచించి లోబర్చుకొన్నారు. వారితో తీసుకువెళ్లిపోయారు. 13 నెలల తర్వాత కిరాతకంగా హత్య చేసి నా కూతురి శవాన్ని మా ఇంటికి పంపారు. హంతకులపై చర్య తీసుకోవాలని మేం రెండేళ్లుగా పోరాడుతుంటే ఎదురు మాపైనే హత్య కేసు పెట్టారు. కూతురు పోయిన దుఃఖంతోపాటు.. అక్రమ కేసులో ఇరుక్కొని రెండేళ్లుగా కోర్టు చుట్టూ తిరుగుతున్నాం. న్యాయం చేయాలని అప్పటి నల్లపాడు సీఐని కలిసి కోరితే నోటికొచ్చినట్లు అసభ్య పదజాలంతో తిట్టి పంపించారు. నిందితులను ఇప్పటికైనా శిక్షించి మాకు న్యాయం చేయండి సార్’ అంటూ ఆమె చంద్రబాబు ఎదుట బోరుమన్నారు. ఆమెను చంద్రబాబు ఓదార్చారు.
కేసులో ఎంతటివారున్నా వదిలిపెట్టబోమని, తప్పక న్యాయం చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. అలాగే, కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న మాజీ జవాన్ అక్కల జ్ఞానానందం, తన భార్యతో కలిసి చంద్రబాబుకు ఒక వినతిపత్రం ఇచ్చారు. ‘విజయవాడ నగరంలో మా ఇంటిని గత వైసీపీ ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయలేదు. రూ.కోటిన్నరతో కట్టిన ఇంటిని తక్కువకు అమ్ముకోవాల్సి వచ్చింది. రూ.98 లక్షలకు కొనుగోలు చేస్తామని ముందుకు వచ్చిన వ్యక్తి చివరికి రూ.82 లక్షలు చేతిలో పెట్టి మమ్మల్ని పొమ్మన్నాడు. అదేమంటే తన రౌడీ మామూలు అని దబాయించాడు. గత ప్రభుత్వంలో మాకు ఎవరూ సాయం చేయలేదు. మీరైనా విచారణ జరిపించి మోసగాడిపై చర్య తీసుకొని, మా డబ్బు మాకు ఇప్పించండి’ అని భార్యాభర్తలు తమ గోడు వెల్లబోసుకున్నారు. తాను కొనుగోలు చేసిన పొలంలోకి తనను రానివ్వకుండా అడ్డుకొంటున్నారని, తనకు న్యాయం చేయాలని రాజమహేంద్రవరం రూరల్ మండలం హుకుంపేటకు చెందిన బొప్పన సురేష్ బాబు విజ్ఞప్తి చేశారు.
👉 అసెంబ్లీకి వెళ్లని 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలంటూ టీడీపీ నేత బుద్దా వెంకన్న డిమాండ్ 😲😲😲..టీడీపీ నేత బుద్దా వెంకన్న
ఎమ్మెల్యేలకు అసెంబ్లీ అంటే ఒక దేవాలయం..
ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులుగా ఆయా నియోజకవర్గాల సమస్యలను ప్రస్తావించాలి..11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం అసెంబ్లీకి రాకుండా ఆ ప్రజలనే అవమానిస్తున్నారు
అసెంబ్లీకి రాకున్నా ఆ 11 మందికి ప్రతినెలా లక్షా 75వేల రూపాయలు వారి ఎకౌంట్లోకి పడుతున్నాయి
ప్రజల గురించి ఒక్కరోజు కూడా అసెంబ్లీలో మాట్లాడలేదు.. అసలు వెళ్లనేలేదు… ఇక నుంచి ఆ 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలను మేము మేకలుగా పరిగణిస్తాం..వైసీపీలో 11 మంది మేకలు ఉన్నాయి.. ప్రజాధనాన్ని శుభ్రంగా మేస్తున్నాయని చెప్పాల్సి ఉంది..వారిలో ఒక పెద్ద మేక ఉంది… ఎప్పుడు ఏం మాట్లాడతారో, ఏం చెబుతారో తెలియదు..గతంలో సీఎం గా పని చేసిన ఆ వ్యక్తికి ప్రజలు తగిన బుద్ది చెప్పడంతో.. బెంగుళూరుకు పారిపోయారు..
ప్రజల సమస్యలను పరిష్కరించాలని మిమ్మలను ఎమ్మెల్యేగా గెలిపించారు..అసెంబ్లీకి వెళ్లని మీకు ఎమ్మెల్యేలుగా కొనసాగే అర్హత లేదు.. వెంటనే రాజీనామా చేయాలి
గతంలో చంద్రబాబు అసెంబ్లీ నుంచి బయటకు వచ్చారంటే.. దానికి ఒక కారణం ఉంది…
ఆరోజు మీరు నిండు సభలో ఆయన్ను , ఆయన కుటుంబాన్ని అవమానించారు కాబట్టి వచ్చారు
మిగతా సభ్యులంతా అసెంబ్లీకి వెళ్లి.. ప్రజల తరపున గళం విప్పారు…వారివారి నియోజకవర్గాలలో ప్రజా సమస్యలపై ప్రస్తావించారు…జగన్ తల్లిని, భార్యను ఎవరైనా ఏమన్నారా.. మీలాగా బూతులు తిట్టారా..
జగన్ కు ప్రజలే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు.. దానికి మీ పార్టీ ఎమ్మెల్యేలను కూడా అసెంబ్లీకి రానివ్వడం లేదు
18 సీట్లు ఇస్తే.. ప్రతిపక్ష హోదా వచ్చేది.. ఇదే విషయాన్ని గతంలో జగనే చెప్పాడు కదా..11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లి.. ప్రజల తరపున మాట్లాడాలి..
వెళ్లేది లేదంటే.. ఇప్పటి వరకు తీసుకున్న జీతాలు కూడా వెనక్కి ఇచ్చి, రాజీనామాలు చేయాలి..అసలు అసెంబ్లీకి వెళ్లని మిమ్మలను ఎమ్మెల్యేలుగా ఎలా పరిగణించాలి..ప్రజల తరపున నిలబడని మీకు అసలు ఎమ్మెల్యేలుగా కొనసాగే అర్హత కూడా లేదు…చంద్రబాబు కు జరిగిన అవమానంతోనే ఆనాడు అసెంబ్లీ కి రానని శపదం చేశారు.
మళ్లీ సీఎంగా మాత్రమే అడుగు పెడతానని చెప్పి వెళ్లిన చంద్రబాబుకు ప్రజలు కూడా పట్టం కట్టారు..
నేడు అసెంబ్లీలో సీఎంగా ఆయన పని తీరును ప్రజలే హర్షిస్తున్నారు..మంగమ్మ శపధం అంటూ ఆనాడు నోరు పారేసుకున్న కొడాలి నాని ఇప్పుడు ఎక్కడ
చంద్రబాబుది చాణక్య శపధం కాబట్టే.. ప్రజలు కూడా అండగా నిలబడ్డారు..అడ్రస్ లేకుండా పోయినా కొడాలి నాని, వల్లభనేని వంశీల ఆచూకి తెలియ చేస్తే 1116 బహుమానం ఇస్తాం…వారి ఆచూకీ తెలిసి, పోలీసులకు అప్పగిస్తే.. తప్పకుండా బహుమానం ఉంటుంది…
జగన్ విధానాలు, పోకడనలు నచ్చక అనేక మంది వైసీపీని వీడి బయటకు వస్తున్నారు..
వైసీపీ త్వరలో పూర్తిగా ఖాళీ అయిపోవడం ఖాయం
తన పని అయిపోయిందని భావించిన జగన్.. బెంగుళూరుకు పూర్తిగా మకాం మార్చాలని చుూస్తున్నారు
జగన్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్షలాది మందిని ఇబ్బందులు పెట్టారు..అయినా చంద్రబాబుకు అండగా నిలబడి.. ఎన్నో కేసులు ఎదుర్కొన్నారు…
నేను దమ్ముగా నిలబడ్డా… ప్రజల పక్షాన పోరాటం చేస్తూ.. పార్టీకోసం, చంద్రబాబుకోసం పని చేశాను
అధికారం కోల్పోగానే మీలాగా పారిపోయి మేము దాక్కోలేదు
చంద్రబాబు గతంలో ఓటమి చెందినా.. ప్రజల కోసం నిలబడ్డారు..ఒక్క ఓటమితోనే జగన్, తో పాటు, ఆరోజు నోరు పారేసుకున్న వారంతా తోక ముడిచారు..
మీకు అధికారం, పదవులు ఉంటే.. రంకెలు వేస్తారా..
పదవులు పోగానే.. ప్రజలను పట్టించుకోకుండా పారిపోతారా..చంద్రబాబు కుటుంబాన్ని అవమానించిన రోజే వైసీపీ పతనం ఖాయం అని వారి పార్టీ నేతలే చెప్పారు..
కొడాలి నాని విర్రవీగిన రోజే వైసీపీ పని అయ్యిందని చెప్పారు..ఇటువంటివి జగన్ పట్టించుకోకుండా నియంతలా వ్యవహరించారు..జగన్ చేసిన పాపాలకు.. ప్రజలు తగిన బుద్ది చెప్పారుఇంకా సిగ్గు లేకండా ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామంటున్నారు…11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలి..ఇప్పటి వరకు రాని మీరంతా నెలనెలా ఇచ్చే లక్షా 25వేలు ఎలా తీసుకుంటున్నారు…
వెంటనే వాటిని వెనక్కి ఇచ్చి, రాజీనామాలు చేయాలి
లేదంటే ప్రజలు ఓట్లు వేసి గెలిపించినందుకు అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి..అసెంబ్లీలో మీ గళం విప్పాలని, ఎటువంటి అవమానం ఉండదని స్వయంగా స్పీకరే చెప్పారు
అయినా నీతో పాటు, నీ పార్టీ ఎమ్మెల్యేలను రానివ్వకుండా అడ్డుకుంటున్నావు…ప్రజలు కూడా మీ నియోజవర్గాలలో వైసీపీ ఎమ్మెల్యేలను నిలదీయండి..ఓట్లు వేసి గెలిపిస్తే.. అసెంబ్లీకి వెళ్లి సమస్యలను ఎందుకు అడగరని ప్రశ్నించండి..ప్రజల తీర్పుకు ఎవరైనా కట్టుబడి ఉండాలి.. 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లండి. లేదా రాజీనామా చేయండనీ ఆయన డిమాండ్ చేశారు..
👉 విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, సహచర మంత్రులతో కలిసి పాల్గొని
పొట్టి శ్రీరాములు ఆత్మార్పణదినం, భాషా ప్రయోక్త రాష్ట్రాల ఆవిర్భావ సభ కార్యక్రమంలో పాల్గొని అమరజీవి పొట్టి శ్రీరాములు,సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి చిత్రపటాలకు నివాళులర్పించిన రాష్ట్ర వ్యవసాయ, పాడి పరిశ్రమ, పశుసంవర్ధక, సహకార ,మార్కెటింగ్, మత్స్య శాఖా మంత్రి వర్యులు అభివృద్ది ప్రధాత కింజరాపు అచ్చెన్నాయుడు
👉 రైతు కళ్ళల్లో ఆనందం చూడాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయం..ప్రతి ఎకరా కు సాగు నీరు అందించాలి…రైతుల సంక్షేమం కోసం చిత్త శుద్ధితో పని చేయండి..ఏకగ్రీవమైన సాగునీటి సంఘ అధ్యక్షులను డైరెక్టర్లను ప్రత్యేకంగా అభినందించిన ఎమ్మెల్యే,మాజీమంత్రి…సాగునీటి సంఘాల పాలక వర్గం సభ్యులతో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ,మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి వెల్లడి.. పుట్టపర్తి
రైతు కళ్ళల్లో ఆనందం చూడాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయమని పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డిలు పేర్కొన్నారు. పుట్టపర్తి నియోజకవర్గం లో ఏకగ్రీవమైన 15 సాగునీటి సంఘాల పాలకవర్గం సభ్యులతో పుట్టపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశానికి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి,మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డిలు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఏకగ్రీవమైన 15 సాగునీటి సంఘాల అధ్యక్షులు ఉపాధ్యక్షులు డైరెక్టర్లకు ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డిలు అభినందనలు తెలుపుతూ శుభాకాంక్షలు తెలిపారు. పుట్టపర్తి నియోజకవర్గం లో నూతనంగా ఎన్నికైన సాగునీటి సంఘం అధ్యక్షులు ,ఉపాధ్యక్షులు డైరెక్టర్లు ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డికి పుష్పగుచ్చం అందించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మాట్లాడుతూ , రైతు సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని తెలిపారు అదే బాటలో సాగునీటి సంఘ పాలకవర్గం రైతుల సంక్షేమం కోసం పాటుపడాలని సూచించారు .రైతులు ఎంతో బాధ్యతతో ఉన్నతమైన పదవిని మనకు అప్పగించారని వారి సంక్షేమం కోసం అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేయాల్సిన అవసరం మనందరిపై ఉందని గుర్తు చేశారు. ప్రతి ఎకరాకు సాగునీటిని అందించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా మనందరిపై ఉందని తెలిపారు. సాగినీటి సంఘాల అభివృద్ధికి ప్రతి ఒక్కరు చిత్తశుద్ధితో పనిచేయాలని ఎలాంటి భేషజాలకు పోకుండా కలిసికట్టుగా ముందుకు సాగాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతుల సంక్షేమానికి పెద్దపీట వేశారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు 90% డ్రిప్పు ,స్ప్రింకర్లను అందించిన విషయాన్ని గుర్తు చేశారు .అదేవిధంగా వ్యవసాయానికి పెద్ద పీట్ వేసి అధిక బడ్జెట్ ను కేటాయించిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. 2025 ఏప్రిల్ లో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వ్యవసాయ పెట్టుబడి సహాయాన్ని ఏడాదికి 20000 రైతులకు అందజేస్తామని తెలిపారు రైతుల సంక్షేమంతో పాటు అభివృద్ధి చేసే ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే అని పేర్కొన్నారు. నూతనంగా ఎన్నికైన సాగునీటి సంఘాల పాలకవర్గ సభ్యులు చిత్తశుద్ధితో రైతుల సంక్షేమం కోసం పనిచేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో పుట్టపర్తి నియోజకవర్గ సాగునీటి సంఘాల అధ్యక్షులు ఉపాధ్యక్షులు డైరెక్టర్లు ఆయా మండలాల కన్వీనర్లు ప్రజాప్రతినిధులు కూటమి పార్టీల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
మార్కాపురం జిల్లాగా చేయాలని సిపిఎం పార్టీ 14వ మహాసభలో తీర్మానం.. ఏపీలో నియోజకవర్గాల పెంపు.. లోక్‌సభలో టీడీపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు…భార్య భర్తల గొడవలో తలదూర్చిన ఎస్ఐ.. రూ.20 వేలు లంచం ఇవ్వలేదని గిరిజన యువకుడిపై దాడి…షాద్ నగర్ ట్రాఫిక్ పోలీసుల ఔదార్యం…మోహన్ బాబు చేసిన దాడిని ఖండిస్తున్నాం… తప్పు చేస్తే శిక్షపడాలి: మంత్రి సీతక్క… కంభం సీఐ ఫోన్ హ్యాక్ 😲…ఢిల్లీ నేరాలకూ రాజధానిగా మారింది: కేజ్రీవాల్.. విడదల రజిని, అప్పిరెడ్డి మనుషులే నా కూతురిని చంపేశారు!😲…రైతు కళ్ళల్లో ఆనందం చూడాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయం…అసెంబ్లీకి వెళ్లని 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలి -టీడీపీ నేత బుద్దా వెంకన్న డిమాండ్ 😲
Recent Posts