👉ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ అనుకూలమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరోమారు స్పష్టం చేశారు.* హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన *గ్లోబల్ మాదిగ డే-2024* కార్యక్రమానికి సీఎం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. *చేవెళ్ల డిక్లరేషన్ ద్వారా ఎస్సీ వర్గీకరణపై పార్టీ వైఖరిని ఖర్గే వెల్లడించారని* సీఎం గుర్తు చేశారు. ” *ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పులో మా ప్రభుత్వం కీలకపాత్ర పోషించింది. వారం రోజుల్లో ఎస్సీ వర్గీకరణపై షమీమ్ అక్తర్ కమిషన్ నివేదిక వచ్చే అవకాశముంది. ఇబ్బందులు రాకుండా వర్గీకరణ ప్రక్రియ చేపడతాం.* రాజకీయ, అధికార నియామకాల్లో *మాదిగలకు ప్రాధాన్యం ఇస్తున్నాం.* చరిత్రలో తొలిసారి *ఓయూ వీసీగా మాదిగ వర్గానికి చెందిన వ్యక్తిని నియమించాం”* అని సీఎం వివరించారు.
***తెలంగాణ ఇంచార్జ్ హైదర్ అలీ..
👉 భార్య భర్తల గొడవలో తలదూర్చిన ఎస్ఐ.. రూ.20 వేలు లంచం ఇవ్వలేదని గిరిజన యువకుడిపై దాడి😲😲😲
మహాబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలంలో భార్యా భర్తల పంచాయితీలో రూ.20 వేలు డిమాండ్ చేసిన ఎస్ఐ క్రాంతి కిరణ్.అంతకు ముందే రూ.15 వేలు తీసుకున్నారని, తన దగ్గర డబ్బులు లేవని వేడుకున్న యువకుడు.
డబ్బులు ఇవ్వలేదని పోలీసులు దారుణంగా కొట్టినట్టు గిరిజన యువకుడి ఆరోపణ.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు.. న్యాయం చేయాలని బాధిత కుటుంబసభ్యుల డిమాండ్.
👉 దక్షిణ అబుజ్మద్ ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య కొన్ని గంటలపాటు ఎన్‌కౌంటర్ కొనసాగింది.
ఈ ఎన్‌కౌంటర్‌లో 07 మంది సాయుధ యూనిఫాం ధరించిన మావోయిస్టుల మృతదేహాలు, 05 మంది పురుషులు మరియు 02 మంది మహిళల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.దీంతో పాటు పెద్ద సంఖ్యలో నక్సలైట్లు గాయపడే అవకాశం బలంగా ఉంది. మరణించిన మావోయిస్టులను ఎస్‌సిఎం కార్తీక్ అలియాస్ దస్రు, ఎసిఎం రాయిని అలియాస్ రమిలా మడ్కంతో పాటు సోమారి ఓయం, గుడ్సా కుచా, రైను పోయాం, కమలేష్ అలియాస్ కోహ్లా మరియు సోమారు అలియాస్ మోటుగా గుర్తించారు.
👉 తెలంగాణ ప్రభుత్వం గురుకులాల్లో ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి హాస్టళ్లను సందర్శించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను, రాజకీయ నేతలను ఆదేశించారు.ఇందులో భాగంగా హైదరాబాద్ పోలీస్ కమీషనర్ సి.వి.ఆనంద్ ఐపిఎస్ హైదరాబాద్ తెలంగాణ మైనార్టీస్ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్ ముషీరాబాద్ బాగ్ లింగంపల్లిని సందర్శించారు. అక్కడి విద్యార్థుల సమస్యలను, వారికి అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు.విద్యార్థులకు అందజేస్తున్న అల్పాహారం, మధ్యాహ్న భోజనం,రాత్రి భోజనంపై ప్రిన్సిపాల్‌తో చర్చించి విద్యార్థులకు అందిస్తున్న ఆహారంపై ఆరా తీశారు. వంటశాల,శానిటరీ ఏరియా, సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, రోబోటిక్ ల్యాబ్, స్పోర్ట్స్ రూమ్, విద్యార్థుల వసతి గృహాలను సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు కె.వాణిశ్రీ ప్రిన్సిపాల్, డా.కె.చల్లాదేవి పోలీస్ కమిషనర్‌కు చూపించారు. పోలీస్ కమీషనర్ ఆనంద్ పాఠశాలలో బోధనా విధానంపై ఆరా తీయడంతో పాటు గురుకుల పాఠశాలలోని అన్ని అంతస్తులను క్షుణ్ణంగా పరిశీలించి అక్కడ అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు.ఈ సందర్భంగా సీవీ ఆనంద్,ఐపీఎస్ సీపీ హైదరాబాద్,విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, విద్యార్థులు ప్రతిరోజు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని, క్రీడలు వంటి పాఠ్యేతర కార్యక్రమాల్లో పాల్గొనాలని, తద్వారా ఆరోగ్యవంతమైన వ్యక్తిత్వ నిర్మాణానికి దోహదపడుతుందన్నారు. ఇది జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడంలో మరియు విభిన్న వ్యక్తుల ఆలోచనలతో వ్యవహరించడంలో సహాయపడుతుంది. ఈ సంస్థ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు, సౌకర్యాలు (విద్య, ఆహారం, క్రీడలు, మౌలిక సదుపాయాలు తదితరాలు) అభినందనీయమని, అన్ని సాంఘిక, మైనారిటీ సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలలను మరింత పౌష్టికాహారంగా తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. 500 కోట్ల బడ్జెట్‌తో సౌందర్య ఉత్పత్తులు.NEET వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలలో మీలో కొందరు ఉత్తీర్ణత సాధించినందుకు విద్యార్థులను నేను అభినందిస్తున్నాను. ఈ విద్యాసంస్థ ఉపాధ్యాయుల కృషి వల్లనే విద్యార్థులు ఇంతటి ఘనత సాధించారన్నారు.ఈ సంస్థల విద్యార్థులు సివిల్ సర్వీసెస్ పరీక్షలకు కూడా ప్రయత్నించాలి. “ఆరోగ్యంగా ఉండండి, సురక్షితంగా ఉండండి,కష్టపడి చదువుకోండి మరియు మీ తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల కోరికలను నెరవేర్చండి మరియు వారి ఆశలకు అనుగుణంగా జీవించండి.”అని ఆయన కోరారు.
👉👉 బాలయ్యకు ఝలక్ ఇచ్చిన రేవంత్..😲😲😲 సొంత పార్టీ నేతలకూ రేవంత్ రెడ్డి సర్కార్ బాలయ్య బాబుకు షాక్ ఇవ్వనుంది. తనపై వచ్చే విమర్శలకు రేవంత్ చెక్ పెట్టనున్నారు. జూబ్లీహిల్స్ లోని హిందూపురం ఎమ్మెల్యే, సినీహీరో బాల కృష్ణ నివాసం సగ భాగాన్ని అధికారులు తమ పరం చేసుకోదలిచారు.ఈ మేరకు మార్కింగ్ కు కూడా వేశారు. కాసు బ్రహ్మానందరెడ్డి పార్కు విస్తరణ పనుల్లో భాగంగా అనేక మంది ప్రముఖుల నివాసాలు తమ భూమిని కోల్పోనున్నారు. మహారాజ అగ్రసేన కూడలి నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వరకూ ఉన్న ప్రధానభవనాలకు సంబంధించి మార్కింగ్ పూర్తయింది. తమ నివాసం భూమిని కోల్పోయే వారిలో మాజీ మంత్రి జానారెడ్డి, అల్లు అర్జున్ మామ కె.చంద్రశేఖర్ రెడ్డితో పాటు రెండు మీడియాసంస్థలకు చెందిన భవనాలున్నాయి.అనేక మంది పారిశ్రామికవేత్తలు కూడా తమ భూమిని కోల్పోనున్నారు.
ఆరు రోడ్డ నిర్మాణానికి…
కేబీఆర్ పార్కు చుట్టూ ఆరు రోడ్ల కూడలిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ ప్రాంతంలో తరచూ ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేబీఆర్ పార్క్ విస్తరణకు రేవంత్ రెడ్డి మంత్రి వర్గం విస్తరణకు పూనుకుంది. అందులో భాగంగా నందమూరి బాలకృష్ణతో పాటు అనేక మంది ప్రముఖుల నివాసాలు, భవనాలకు సంబంధించి మార్కింగ్ వేశారు. అయితే వారిని ఒప్పించి భవిష్యత్ ప్రయోజనాలను, నగర అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వానికి సహకరించాలని కోరనన్నారు. వారిని ఒప్పించి స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. అయితే వీరిలో ఎవరైనా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే దానికి సంబంధించి న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.** ఫ్లై ఓవర్ల నిర్మాణానికి…
ఈ విస్తరణలో భాగంగా బాలకృష్ణ నివాస భవనం స్థలంలో సగం కోల్పోయే అవకాశముందని తెలిసింది. అలాగే జానారెడ్డికి చెందిన భవనానికి సంబంధించి 700 గజాల స్థలాన్ని కోల్పోయే అవకాశం ఏర్పడింది. దీంతో పాటు కేబీఆర్ పార్క్ వద్ద చుట్టూ ప్రభుత్వం ఫ్లై ఓవర్ల నిర్మాణం చేపట్టనుంది. పర్యావరణ వేత్తలకు సంబంధించి అభ్యంతరం రాకుండా ఫ్లైఓవర్ల నిర్మాణం చేస్తే ట్రాఫిక్ ను చాలా వరకూ అరికట్టవచ్చని భావిస్తుంది. దీంతో ప్రముఖుల నివాస భవనాల స్థల సేకరణ అనివార్యమయింది. అందులో భాగంగానే బాలకృష్ణతో పాటు జానారెడ్డి ఇతర ప్రముఖుల సంస్థలకు చెందిన స్థలం కూడా కోల్పోయే అవకాశముంది. అధికారులయితే మార్కులు వేశారు కానీ, పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయన్నది చూడాలి.
**హైదరాబాద్ ఇంచార్జ్ షేక్ అమీర్..
👉 కేటీఆర్ అరెస్టుకి రేవంత్ రెడ్డి ముహూర్తం పెట్టేశారా?
చట్టం ముందు అందరూ సమానమే అని, తప్పు చేసినవారు ఎంత పెద్దవారైనా విడిచిపెట్టవద్దని పోలీసులకు తాను సూచించాని, అల్లు అర్జున్ అరెస్ట్ తన అనుమతితోనే జరిగిందని సిఎం రేవంత్ రెడ్డి ఇటీవల చెప్పారు.
గవర్నర్ అనుమతి లభించగానే కేటీఆర్‌ని లోపల వేస్తామని రేవంత్ రెడ్డి చెప్పగా,అందుకు తాను కూడా సిద్దంగానే ఉన్నానని కేటీఆర్ జవాబిచ్చారు.అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేయించడం ద్వారా కేటీఆర్‌ని అరెస్ట్ చేసేందుకు వెనకాడబోమని సిఎం రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీకి బలమైన సందేశమే పంపారనుకోవచ్చు.
కేటీఆర్‌ని విచారించేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతించిన్నట్లు తెలుస్తోంది. కనుక రేపు (సోమవారం) లేదా వచ్చే వారంలో ఎప్పుడైనా ఏసీబీ అధికారులు ఫార్ములా-1 రేసింగ్ వ్యవహారంలో కేసు నమోదు చేసి కేటీఆర్‌కి నోటీస్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
లగచర్ల దాడి కేసులో బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఆ కేసులో కేటీఆర్ పేరు కూడా జోడించే అవకాశం ఉందని సమాచారం. ఈ రెండింటి విచారణ సాగుతున్న తీరుని పరిశీలించిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా కేటీఆర్ పేరు చేర్చే ఆలోచనలో రేవంత్ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. కనుక వచ్చే వారం నుంచి బిఆర్ఎస్ పార్టీకి దాని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కి కష్టాలు మొదలయ్యే అవకాశం ఉంది.
👉వాట్సప్‌లోనూ వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేయొచ్చు*👌👌👌
ఎమ్మార్పీ(MRP) కంటే ఎక్కువ ధరకు వస్తువులు విక్రయిస్తున్నారా? నాసిరకం ఉత్పత్తులు అంటగట్టి సేవాలోపానికి పాల్పడ్డారా? అయితే ఇక నుంచి మీ ఇంటి నుంచే వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేయొచ్చు. కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ ఇందు కోసం ‘వాట్సప్ చాట్‌బాట్’ సేవలను తీసుకొచ్చింది.
వాట్సప్ నంబర్ 88000 01915 లో మొదట హాయ్ అని టైప్ చేయాలి. అక్కడి సూచనల ఆధారంగా వివరాలు నమోదు చేస్తే జాతీయ వినియోగదారుల కమిషన్ హెల్ప్‌లైన్‌లో ఫిర్యాదు నమోదవుతుంది. అనంతరం కేసు పరిష్కారం కోసం ఈ వివరాలు ఆయా జిల్లా వినియోగదారుల కమిషన్‌కు పంపుతారు. కేసు పరిష్కారం అయ్యే వరకు అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తారు. దీంతో పాటు 1800114000 లేదా 1915 నంబర్‌కు కాల్ చేసి సైతం (ఉదయం 8గంటల నుంచి రాత్రి 8గంటల వరకు) ఫిర్యాదు చేయొచ్చు.
ప్రతి రోజూ వేల ఫిర్యాదులు నమోదవుతుండగా, అందులో పరిష్కారమైన కేసులకు సంబంధించిన వివరాలను కేంద్ర వినియోగదారుల మంత్రిత్వశాఖ
https:/consumerhelpline.gov.in/
వెబ్‌సైట్‌లో ఎన్‌సీహెచ్ సక్సెస్ స్టోరీస్’ పేరుతో పొందుపరుస్తోంది.
👉 ఓటుకు నోటు కేసును ఉద్దేశిస్తూ సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు !!!
సీఎం రేవంత్ రెడ్డి పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్విటర్ వేదికగా ఓ జాతీయ మీడియా ఛానల్ తో రేవంత్ మాట్లాడుతున్న వీడియోను కేటీఆర్ పోస్టు చేశారు. ఆ వీడియోలు రేవంత్ మాట్లాడిన వ్యాఖ్యలపై విమర్శలు గుప్పించారు.‘ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడి జైలుకెళ్లిన రేవంత్ రెడ్డి తనలాగే అందరూ జైలుకు వెళ్లాలని కోరుకుంటున్నట్లుగా అనిపిస్తోందని కేటీఆర్ ఆరోపించారు. తమ సంస్థపై ప్రభావం చూపిన ప్రభుత్వ పథకంపై అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకుగాను ఎల్ అండ్ టి వంటి ప్రఖ్యాత సంస్థకు చెందిన సీఈవో ను జైలుకు పంపిస్తాననడం కరెక్టేనా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి నిర్లక్ష్యమైన వ్యాఖ్యలతో పెట్టుబడిదారులకు ఏం సందేశం పంపుతున్నారు.. పెట్టుబడులను ఆకర్షించేందుకు రాహుల్ గాంధీ తమ సీఎంలకు ఇదే నేర్పిస్తున్నారా? అంటూ కేటీఆర్ ప్రశ్నించారు…ఇదిలాఉంటే.. గత రెండు రోజుల క్రితం సినీ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సమయంలోనూ కేటీఆర్ రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు…
‘‘సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట బాధితులకు పూర్తిగా సానుభూతి తెలుపుతాను. కానీ, ఘటనలో నిజంగా తప్పుచేసింది ఎవరని కేటీఆర్ ప్రశ్నించారు.ఘటనకు నేరుగా బాధ్యుడు కాని అల్లు అర్జున్ ను సాధారణ నేరగాడిలా ట్రీట్ చేయడం సరికాదని కేటీఆర్ అన్నారు. ప్రభుత్వ తీవ్ర చర్యను ఖండిస్తున్నానని తెలిపారు. హైడ్రా కూల్చివేతలతో ఇద్దరి చావుకు బాధ్యుడైన రేవంత్ రెడ్డిని కూడా ఇదే లాజిక్ తో అరెస్టు చేయాలని కేటీఆర్ అన్నారు.
👉 ప్రజలకు మతస్వేచ్ఛ ఉందని ఆర్టికల్ 26 చెబుతోంది: ప్రధాని మోదీపై అసదుద్దీన్ ఆగ్రహం
వక్ఫ్ బోర్డుతో రాజ్యాంగానికి సంబంధం లేదనడంపై ఆగ్రహం
రాజ్యాంగంలోని ఆర్టికల్ 26 చదవాలని ప్రధానికి సూచన
మైనార్టీలు అధికారం కలిగి ఉండడాన్ని ఎవరూ ఇష్టపడడం లేదంటూ విమర్శ…
* దేశ ప్రజలకు మతస్వేచ్ఛ ఉందని ఆర్టికల్ 26 చెబుతోందని, మతపరమైన, స్వచ్ఛంద సేవా కార్యకలాపాల కోసం సంస్థలను ఏర్పాటు చేసే స్వేచ్ఛను ఈ ఆర్టికల్ దేశ ప్రజలకు ఇచ్చిందని హైదరాబాద్ ఎంపీ, మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. కానీ ప్రధాని మోదీ మాత్రం వక్ఫ్ బోర్డుతో రాజ్యాంగానికి సంబంధం లేదని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
* ప్రధాని మోదీ ఇలాంటి వ్యాఖ్యలు చేసేముందు ఒకసారి రాజ్యాంగంలోని ఆర్టికల్ 26ను చదువుకోవాలని సూచించారు. ఇంతకీ ప్రధానికి రాజ్యాంగ పాఠాలు చెబుతోంది ఎవరో చెప్పాలని ఎద్దేవా చేశారు. బలముంది కదా అని వక్ఫ్ ఆస్తులను బలప్రయోగంతో దోచేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
*బీజేపీ భుజానికి ఎత్తుకున్న జాతీయవాదమనేది సాంస్కృతికపరమైది కాదని… అది మతపరమైనదన్నారు. మసీదుల వ్యవహారాన్ని తెరపైకి తెచ్చి… మూకదాడుల ద్వారా దేశంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే కుట్రలు జరుగుతున్నాయని మండిపడ్డారు. మైనార్టీలు అధికారాన్ని కలిగి ఉండడాన్ని ఎవరూ ఇష్టపడడం లేదని వాపోయారు.
👉జాతీయ మెగా లోక్ అదాలత్ లో మొత్తం (7079) కేసులు పరిష్కారం…*65 సైబర్ క్రైమ్ కేసులలో బాధితులకు రూ. 33,73,943/- తిరిగి అందజేత*
జాతీయ మెగా లోక్ అదాలత్ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా పోలీస్ పరిధిలో ఉన్న వివిధ పోలీసు స్టేషన్లలో నమోదై అండర్ ఇన్వెస్టిగేషన్ మరియు కోర్టు విచారణలో ఉన్న ఐపిసి కేసులు (294)
డ్రంక్ అండ్ డ్రైవ్, MV Act యాక్ట్ కేసులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన కేసులు (4882).
ఈపెట్టి కేసులు, బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించిన మరియు తదితర పెట్టి కేసులు (1903).
*మొత్తం కేసులు (7079) పరిష్కరించబడినాయి*,
జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ మాట్లాడుతూ పోలీస్ అధికారులు, కోర్టు సిబ్బంది గత 15 రోజుల నుండి కేసులలో ఉన్న కక్షిదారులను స్వయంగా కలిసి రాజీ మార్గం రాజ మార్గమని, లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం జరుగుతుందని, మరియు ఇరు వర్గాలకు న్యాయం జరుగుతుందని అవగాహన కల్పించినందున టార్గెట్ కు మించి కేసులు పరిష్కరించబడినాయి తెలిపారు. కేసుల పరిష్కారానికి కృషి రాష్ట్రంలో మంచి స్థానంలో నిలిచినందుకు జిల్లా పోలీస్ అధికారులను సిబ్బందిని ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ అభినందించారు.త్వరలో కోర్టు సిబ్బందికి, ప్రతిరోజు మానిటర్ చేసిన ఇన్స్పెక్టర్ లకు , త్వరలో రివార్డ్స్ అందజేస్తామని తెలిపారు.
జిల్లా పోలీసు వ్యవస్థతో వివిధ సమావేశాలు ఏర్పాటు చేస్తూ లోక్ అదాలత్ విజయవంతం కావడానికి కృషి చేసిన జిల్లా ప్రధాన న్యాయమూర్తికి ,జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు పోలీస్ శాఖ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతిరోజు శాంతి భద్రతల సమస్యలను పరిరక్షిస్తూ అదేవిధంగా కోర్టు డ్యూటీ విధులను పర్యవేక్షిస్తూ లోక్ అదాలత్ విజయవంతం కావడానికి కృషిచేసిన అధికారులు ,సిబ్బంది తదితరులను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
👉అల్లు అర్జున్ కేసు… అధికారులకు ఆర్జీవీ నాలుగు ప్రశ్నలు! ఇందులో భాగంగా…పుష్కరాలు, బ్రహ్మోత్సవాల్లాంటి ఉత్సవాల్లో తోపులాటలో భక్తులు పోతే దేవుళ్లని అరెస్ట్ చేస్తారా..? అని ఆర్జీవీ తన తొలి ప్రశ్నతో అధికారులను ప్రశ్నించారు.సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఈ ఎపిసోడ్ లో ఎన్నో ట్విస్టులు,మరెన్నో జలక్కులు చోటు చేసుకున్నాయని అంటున్నారు. ఈ సమయంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు.
అవును… సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేసిన కేసులో ఆరు గంటల్లో ఎన్నో కీలక పరిణామాలు, సంచలనాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడం.. దీంతో.. పోలీసులు బన్నీని చంచల్ గూడ జైలుకు తరలించడం జరిగిపోయింది.ఈ సమయంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇందులో భాగంగా… అల్లు అర్జున్ కు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇందులో భాగంగా… రు.50,000 ల వ్యక్తిగత పూచీకత్తుతో బెయిల్ మంజూరూ చేసింది!
** ఈ సమయంలో దర్శకుడు ఆర్జీవీ స్పందిస్తూ.. అధికారులకు నాలుగు ప్రశ్నలు సంధించారు. ఇందులో భాగంగా… పుష్కరాలు, బ్రహ్మోత్సవాల్లాంటి ఉత్సవాల్లో తోపులాటలో భక్తులు పోతే దేవుళ్లని అరెస్ట్ చేస్తారా..? అని ఆర్జీవీ తన తొలి ప్రశ్నతో అధికారులను ప్రశ్నించారు.ఇదే సమయంలో…ఎన్నికల ప్రచారాల తొక్కిసలాటలలో ఎవరైనా పోతే రాజకీయ నాయకులను అరెస్ట్ చేస్తారా..? అంటూ రెండో ప్రశ్న సంధించారు.ఇదే క్రమంలో.. మూడో ప్రశ్నగా…ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ లో ఎవరైనా పోతే.. హీరో, హీరోయిన్స్ ని అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించిన ఆర్జీవీ.. భద్రతా ఏర్పాట్లు పోలీసులు,ఆర్గనైజర్లు తప్ప ఫిలిం హీరోలు, ప్రజా నాయకులు ఎలా కంట్రోల్ చేయగలరు? అంటూ నాలుగో ప్రశ్నను సంధించారు.
**సాంస్కృతిక రంగ ఇంచార్జ్ వి శ్రీనివాస్ రెడ్డి..
ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ అనుకూలం … ప్రభుత్వం గురుకులాల్లో ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి హాస్టళ్లను సందర్శించాలి – సీఎం రేవంత్ రెడ్డి …కేటీఆర్ అరెస్టుకి రేవంత్ రెడ్డి ముహూర్తం పెట్టేశారా? .. బాలయ్యకు ఝలక్ ఇచ్చిన రేవంత్ !.. ప్రజలకు మతస్వేచ్ఛ ఉందని ఆర్టికల్ 26 చెబుతోంది: ప్రధాని మోదీపై అసదుద్దీన్ ఆగ్రహం .. జాతీయ మెగా లోక్ అదాలత్ లో మొత్తం (7079) కేసులు పరిష్కారం…భార్య భర్తల గొడవలో తలదూర్చిన ఎస్ఐ.. రూ.20 వేలు లంచం ఇవ్వలేదని గిరిజన యువకుడిపై దాడి …వాట్సప్‌లోనూ వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేయొచ్చు.. “అల్లు అర్జున్ కేసు … అధికారులకు ఆర్జీవీ నాలుగు ప్రశ్నలు!
Recent Posts