పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సీఎం చంద్రబాబు … సీఎం రేవంత్‌ రెడ్డి సహా వంద మందికి భోజనాల ఖర్చు రూ.32 లక్షలు !..డబ్బులు కట్టాలని వేములవాడ రాజన్న ఆలయానికి బిల్లులు.. టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సర్పంచుల పెండింగ్ బిల్లులను పట్టించుకోలేదే – టిపిసిసి రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ నాయకులు మోహన్ రెడ్డి … అసెంబ్లీలో ఫిర్యాదు తర్వాత కూడా చెరువులోకి అరబిందో వ్యర్థాలు …నిజాలు చెప్తే వాకౌట్ చేస్తారా.. టిపిసిసి రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ నాయకులు మోహన్ రెడ్డి… స్మగ్లర్ అరెస్టు…6ఎర్రచందనం దుంగలు స్వాధీనం.. క్యాన్సర్ వ్యాధిని ప్రాథమిక దశలో గుర్తిస్తే నివారణ సాధ్యం – డాక్టర్ పివి.దివాకర్…నర్సరీ నీటి కుంటలో పడి స్కూల్ విద్యార్థి ,క్లీనర్ మృతి .. కేంద్ర కార్పోరేట్ సంస్థల సామాజిక భాధ్యతలపై మాగుంట ప్రశ్న .. నిలిపివేసిన మెడికల్ కళాశాల నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలి – సిపిఎం ధర్నా… ఆటోలతో భారీ ర్యాలీ, సైబర్ నేరాల పట్ల. అవగాహన (మార్కాపురం) .. గంజాయి, ట్రాన్స్ఫార్మర్లు రాగి తీగల చోరీల కేసులో ముద్దాయిలను పట్టుకున్న పొదిలి పోలీసులు..

⭐పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సీఎం చంద్రబాబు నాయుడు*ఏలూరు జిల్లా:డిసెంబర్ 26
ఏపీ సీఎం చంద్రబాబు నేడు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఏరియల్ వ్యూ ద్వారా పోలవరం ప్రాజెక్టు పరిశీలించారు. హిల్ వ్యూ పాయింట్ నుంచి కూడా పోలవరం డ్యామ్ ను పరిశీలించారు.
గ్యాప్-1, గ్యాప్-2 పనులతో పాటు డయాఫ్రం వాల్ నిర్మాణ పనులను కూడా చంద్రబాబు పరిశీ లించారు. తన పర్యటన సందర్భంగా ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను తిలకించారు.
ఇక, పనులు జరుగుతున్న తీరుపై అధికారులను అడిగి వివరాలు తెలుసు కున్నారు. అధికారులు, పోలవరం ప్రాజెక్టు ఇంజినీర్లతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతటి ప్రాధా న్యతా అంశమో వారికి వివరించారు. పోలవరం ప్రాజెక్టు భవిష్యత్ నిర్మాణాల షెడ్యూల్ ను చంద్రబాబు విడుదల చేయను న్నారు.పర్యటన లో చంద్రబాబు వెంట రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఉన్నారు.
👉 రేవంత్ రెడ్డికి ప్లేటు భోజనం ధర రూ.32 వేలు…
సీఎం రేవంత్‌ రెడ్డి సహా వంద మందికి భోజనాల ఖర్చు రూ.32 లక్షలు..
ఈ డబ్బులు కట్టాలని వేములవాడ రాజన్న ఆలయానికి బిల్లులు..డబ్బులన్నీ ఆలయం నుండే కట్టాలని రాజన సిరిసిల్ల జిల్లాకు చెందిన ఓ ఉన్నతాధికారి ఒత్తిడులు..
వేములవాడలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవాలకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డికి, పలువురు మంత్రులకు ఇతర వీఐపీలకు 100 మందికి తాజ్‌కృష్ణ నుండి భోజనాలు..
ఈ భోజన బిల్లు రూ.32 లక్షలు కట్టాలని వేములవాడ రాజన్న ఆలయ అధికారులకు బిల్లు పంపిన తాజ్‌కృష్ణ నిర్వాహకులు..భోజన బిల్లు కాకుండా ఇతర ఖర్చులు మొత్తం కలిపి రూ.1 కోటి 70 లక్షలు..ఇంత మొత్తం కట్టలేమన్న రాజన్న ఆలయ అధికారులు..జిల్లా కలెక్టర్ దగ్గరికి పంచాయితీ చేరడంతో బట్టబయలు ***
⭐నవతెలంగాణ నూతన సంవత్సరం 2025 క్యాలెండర్ ఆవిష్కరించిన కూకట్ పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్.. కార్యక్రమం లో సప్పిడి భాస్కర్, రిపోర్టర్ భాస్కర్, ఎండీ నయీమ్, గోకర్ల లక్ష్మి నారాయణ శ్రీధర్ గౌడ్, దుర్గా సింగ్,సయద్ పాషా పాల్గొన్నారు
👉మోహన్‌బాబు వివాదంపై స్పందించిన రాచకొండ సీపీ..
*మోహన్ బాబు కేసు విచారణ కొనసాగుతుంది..*
*మోహన్ బాబుకు నోటీసులు జారీ చేశాము.. ఈనెల 24 వరకు టైం అడిగారు.*
*హైకోర్టు ఈ నెల 24 వరకు మోహన్ బాబుకు టైం ఇచ్చింది.. హైకోర్టు ఉత్తర్వులను గౌరవిస్తాం.*
*అప్పటివరకు రెస్పాన్స్ కాకపోతే మరోసారి మోహన్ బాబుకు నోటీసులు జారీ చేస్తాం..*
*మంచు ఫ్యామిలీకి సంబంధించి మొత్తం మూడు FIRలు నమోదయ్యాయి – రాచకొండ సీపీ సుధీర్‌బాబు*
👉ఆంధ్రప్రదేశ్ నుంచి నూతనంగా ఎన్నిక కాబడిన రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్రావు,సానా సతీష్ బాబు,భాజపా నుంచి ఆర్. కృష్ణయ్య ప్రమాణ స్వీకారానికి హాజరు అయిన ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి ⭐కార్యక్రమంలో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధనఖర్ మరియు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా మరియు రామ్మోహన్ నాయుడు మరియు సహచర పార్లమెంట్ సభ్యులు పాల్గొన్నారు.
👉రాజ్యాంగపరిరక్షణ,దేశప్రజల సమానత్వం,జాతీయ ఐక్యత,దేశసమగ్రత కోసం జమీయతుల్ ఉలమా-ఎ-హింద్ ఆధ్వర్యంలో కడప నగరంలో జైరాజ్ గార్డెన్స్ నందు నిర్వహించిన సదస్సులో జమీయతుల్ ఉలమా-ఎ-హింద్ జాతీయ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదనీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
⭐ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణ కోసం,దేశప్రజల సమానత్వం కోసం దేశప్రజలందరూ పాటుపడాలని,దేశసమగ్రత,జాతీయ ఐక్యత కోసం,పరస్పర సోదరభావంతో మెలుగుతూ,కలహాలను,ద్వేషభావాన్ని వీడాలని దేశప్రజలందరికీ పిలుపునిచ్చారు,*
⭐ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావలసిన యువత చెడువ్యసనాలకు బానిసలై గంజాయి,మద్యం లాంటి మత్తు పదార్థాలతో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు పేర్కొన్నారు.*
⭐పల్నాడు జిల్లా గురజాల..*నర్సరీ నీటి కుంటలో
పడి స్కూల్ విద్యార్థి ,క్లీనర్ మృతి* గురజాల మండలం పులిపాడు లో ఘటన…నీటి కుంటలో పడి ఐదో తరగతి చదువుతున్న విద్యార్థి బస్సు క్లీనర్ మృతి.. శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యానికి ఈ ఘటన..
శ్రీ చైతన్య స్కూల్లో ఐదో తరగతి చదువుతున్న పులిపాడు కు చెందిన సుభాష్(11)…నిత్యం లానే స్కూల్ బస్సు ఎక్కించి సుభాష్ తల్లి తండ్రులు… రేడియేటర్లో నీళ్లు అయిపోవడంతో మార్గ మధ్యలో ఆగిన స్కూల్ బస్.. రోడ్డు పక్కన ఉన్న నర్సరీలో నీటి కుంటలో నీళ్లు తీసుకురావాల్సిందిగా కోరిన డ్రైవర్..
నర్సరీ నీటి కుంటలో నీళ్ళ కోసం దిగి మునిగి పోయిన శుభాష్ .సుభాష్ మునకతో కాపాడేందుకు నీటి కుంటలో దిగిన క్లీనర్ కోటేశ్వరరావు…ఈత రాకపోవడంతో సుభాష్ క్లీనర్ ఇద్దరూ మృతి..ఇదే బస్సు డ్రైవర్ గతంలో స్కూలు బస్సు ఆపి మద్యం సేవిస్తూ ఉండడంతో పిల్లలు,తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు.. తప్పు మళ్ళీ జరగదు అని చెప్పి అదే డ్రైవర్ని కొనసాగించిన యాజమాన్యం..ఈ ఘటన నిర్లక్ష్యానికి పూర్తి బాధ్యత స్కూల్ యాజమాన్యానిదే ప్రజా సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు…
👉కేంద్ర కార్పోరేట్ సంస్థల సామాజిక భాధ్యతలపై మాగుంట ప్రశ్న ***
దేశంలో కేంద్ర ప్రభుత్వ కార్పోరేట్ సంస్థలు, రైల్వేలు మరియు ఇతర సంస్థల సహాకారంతో చేపట్టిన సామాజిక భాధ్యతలు, ప్రస్తుత స్థితి, నిధులు, ఎదుర్కొన్న సవాళ్లు, నివారణ చర్యలు, కార్యాచరణ ప్రణాళికలు మరియు నెరవేర్చని వాటిపై చర్యల గురించి ప్రస్తుత పార్లమెంటు సమావేశాలలో ఒంగోలు పార్లమెంటు సభ్యులు, మాగుంట శ్రీనివాసులురెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర రైల్వేలు, సమాచార మరియు ప్రసార, ఎలక్ట్రానిక్స్ మరియు సాంకేతిక సమాచార శాఖ మంత్రి అశ్విని వైశ్నవ్ సమాధానమిస్తూ –
కంపెనీల చట్టం 2013 ప్రకారం, నిఖర విలువ రూ.500 కోట్లు ఆపై గాని లేక వ్యాపారం మొత్తం రూ.1,000 కోట్లు ఆపై గాని లేక నిఖర లాభం రూ. 5 కోట్లు ఆపై గాని వున్న కంపెనీలన్నియు వాటి సరాసరి నిఖర లాభంలో కనీసం 2 శాతం ప్రతి సంవత్సరం సామాజిక సంక్షేమ ప్రాజెక్టులకు ఖర్చుచేయవలసి ఉంటుందని తెలిపారు. దేశంలో గత 5 సంవత్సరాలలో సామాజిక సంక్షేమం క్రింద ఆరోగ్యం మరియు పుష్టికర ఆహారానికి సంబందించిన వాటికి 60 శాతం ఖర్చు చేయబడగా, 40 శాతం ఇతర కార్యకలాపాలకు ఖర్చు చేయడం జరిగిందని తెలిపారు. సామాజిక సంక్షేమ నిధులలో స్థానిక ప్రాంతాల కార్యకలాపాలకు మరియు ఆకాంక్ష జిల్లాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వబడిందని తెలిపారు. దేశంలో అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, రైల్వేలు మరియు అనుబంధ సంస్థలు కార్పోరేట్ సామాజిక భాధ్యతల నియమాలను మరియు మార్గదర్శకాలను పాటిస్తున్నాయని కేంద్ర మంత్రి తెలియజేశారు. ⭐జిల్లా స్టాఫ్ రిపోర్టర్ రహిమాన్..
👉 నిలిపివేసిన మెడికల్ కళాశాల నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలి..డాక్టర్ల బదిలీలను నిలుపుదల చేయాలి..మార్కాపురం మెడికల్ కాలేజీ అవసరాన్ని, ప్రాధాన్యతను గుర్తిస్తూ ప్రభుత్వానికి సబ్ కలెక్టర్ రిపోర్టును వెంటనే పంపించాలి.. సిపిఎం ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు సోమవారం ధర్నా జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి సోమయ్య మాట్లాడుతూ నిలిపివేసిన మెడికల్ కళాశాల నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని డాక్టర్ల బదిలీలను నిలుపుదల చేయాలని ఆయన అన్నారు. వెనుకబడిన పశ్చిమ ప్రకాశం జిల్లా కేంద్రంగా ఉన్న మార్కాపురంలో నిర్మాణం జరుగుతున్న మెడికల్ కళాశాల నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిలుపుదల చేయటం, కళాశాలకు అనుబంధంగా ఉన్న సర్వజన ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్లను బదిలీ చేయటాన్ని ఆయన వ్యతిరేకించారు. పశ్చిమ ప్రకాశం ప్రజలకు ఉచిత వైద్యం అందని ద్రాక్ష పండులా ఉందని, తీవ్రమైన జబ్బుల బారిన పడిన రోగులు వైద్యం కొరకు వందల కిలోమీటర్ల దూరంలోని కర్నూలు, గుంటూరు, హైదరాబాదు ఒంగోలు ప్రాంతాలకు తీవ్రమైన వ్యయ, ప్రయాసలకు ఓర్చి వెళుతున్నారు. ప్రయాణంలో నే ప్రాణాలు వదులుతున్న దయనీయమైన పరిస్థితి కొనసాగుతున్నదని అన్నారు. మార్కాపురంలో ఉన్న జిల్లా ఆసుపత్రిలో నిరంతరం వైద్యుల, కొరత మందులు కొరత వల్ల వైద్యం పేదలకు అందుబాటులో ఉండటం లేదు.పెద్ద సంఖ్యలో ఉన్న దళితులు, గిరిజన ప్రజలకు వైద్యం అందక బ్రతుకు భారంగా నడుస్తున్న పరిస్థితులు కొనసాగుతున్నాయి. సబ్ కలెక్టర్ మార్కాపురం ప్రాంతానికి మెడికల్ కాలేజీ అవసరాన్ని గుర్తించి ప్రాధాన్యతను వివరిస్తూ ప్రభుత్వానికి వెంటనే రిపోర్టు పంపించాలని ఆయన అన్నారు. మెడికల్ కళాశాల నిర్మాణాన్ని నూతనంగా ఏర్పడిన టిడిపి కూటమి ప్రభుత్వం నిర్మాణాన్ని నిలిపి వేయటం, డాక్టర్లను బదిలీ చేయటం వంటి చర్యలు మానుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మార్కాపురంలో నడుస్తున్న జిల్లా ఆసుపత్రి స్థానంలో మెడికల్ కళాశాల సిబ్బంది నియామకంలో భాగంగా పెద్ద సంఖ్యలో డాక్టర్ల నియామకం జరిగింది .ఫలితంగా జిల్లా ఆస్పత్రి నడుస్తున్న కాలంలో 300 గా ఉన్న ఓపి మెడికల్ కళాశాల డాక్టర్లు పెద్ద సంఖ్యలో రావడం వల్ల ఓపి ఒక్కసారిగా 700 పైగా చేరింది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ జపం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ ఆధీనంలో నిర్మాణం జరుగుతున్న మెడికల్ కళాశాలను నిలుపుదల చేయటం,భవిష్యత్తులో ప్రైవేట్ భాగస్వామ్యంతో కళాశాలను నడుపుతామని ప్రకటించడం .అన్ని రంగాల్లో వెనుకబడిన పశ్చిమ ప్రకాశం ప్రజలకు ఉచిత వైద్యం దూరం చేయడమే అవుతుందని ఇటువంటి చర్యలు ప్రభుత్వం మానుకోవాలని పేదలకు వైద్యం అందుబాటులో ఉంచాలని ఆయన అన్నారు. లేకుంటే కలిసొచ్చే పార్టీలతో పోరాటాన్ని వృద్ధుతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి డీకేఎం రఫీ,మండల కార్యదర్శి గుమ్మ బాలనాగయ్య,నాయకులు పి రూబెన్, జవాజి రాజు, షేక్ నన్నేసా,జై నాగరాజు, కాశయ్య, వై సురేష్ కుమార్, కట్ట సుబ్బారావు,పొదిలి మల్లికార్జున, వై ఏసేబు తదితరులు పాల్గొన్నారు..
👉గంజాయి, ట్రాన్స్ఫార్మర్లు రాగి తీగల చోరీల కేసులో ముద్దాయిలను పట్టుకున్న పొదిలి పోలీసులు.ఇటీవల కాలం లో పొదిలి ప్రాంతంలో జరుగుతున్న ట్రాన్స్ఫార్మర్ల దొంగతనాల్లో ముద్దాయిలుగా ఉన్న వారిని అక్రమంగా గంజాయి అమ్ముతున్న వారిని పొదిలి పోలీసులు అరెస్టు చేశారు .వివరాలను దర్శి డీఎస్పీ బి లక్ష్మీ నారాయణ మీడియాకు వెల్లడించారు.. జిల్లా స్టాఫ్ రిపోర్టర్ రహమాన్…
👉ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించి సైబర్ నేరాల పట్ల. అవగాహన కల్పించిన మార్కాపురం డిఎస్పి యు. నాగరాజు సీఐ సుబ్బారావు* మార్కాపురం.. ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశాల మేరకు సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించేందుకు మార్కాపురం పట్టణంలోని స్థానిక కంభం సెంటర్ నుండి 250 ఆటో లతో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సబ్ డివిజన్ పోలీస్ అధికారి యు. నాగరాజు హాజరయ్యారు అనంతరం ర్యాలీని ప్రారంభించి మార్కాపురం పట్టణంలోని ప్రధాన రహదారి గుండా దోర్నాల బస్టాండ్ మీదుగా సెవెన్ హిల్స్ వరకు ర్యాలీని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొందరు కేటుగాళ్లు ఫేక్ వెబ్సైట్లను,లింకులను ఓపెన్ చేసి నేరాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు.ఈమధ్య కాలంలో డివిజన్ పరిధిలోని ప్రతి కళాశాల, ప్రతి స్కూల్ లో కూడా ఈ సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించడం జరిగిందని అన్నారు. ఈ సైబర్ నేరాలు అనేవి విస్తృతంగా పెరిగాయని వీటి పట్ల అవగాహన అవసరమని తెలుపుతూ,డీఎస్పీ కొన్ని సూచనలు చేశారు.***మీకు ప్రధానమంత్రి బీమా యోజన కింద లబ్ధి చేకూరిందని,మీ పేరు మీద లోన్ వచ్చిందని, మీ ఆధార్ అప్డేట్ చేయాలని,మీ అకౌంట్ కు పాస్వర్డ్ ఇవ్వాలని, డిజిటల్ పోలీసులమని పోలీస్ యూనిఫాంలో ఫోటోలు పంపించి మీ మీద కేసు నమోదు అయిందని బెదిరించి మీ దగ్గర నుండి డబ్బులు తీసుకునే ప్రయత్నం చేస్తారు. మీ ఫోన్ నెంబర్ హ్యాక్ చేసి సమాచారాన్ని తీసుకొని మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తారని హెచ్చరించారు.ఎవరైనా సైబర్ నేరాలకు గురవుతే మీ దగ్గరలోని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు.కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ పి సుబ్బారావు, పట్టణ ఎస్సై సైదుబాబు, డాక్టర్ రాజ మోహన్ రావు,రూరల్ ఎస్సై అంకమ్మరావు, పోలీస్ సిబ్బంది ఆటో యూనియన్ నాయకులు అందే నాసరయ్య ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.
👉ఈ నెల 19కి వాయిదా పడిన పేర్ని నాని సతీమణి జయసుధ ముందస్తు బెయిల్ పిటీషన్…కృష్ణాజిల్లా, మచిలీపట్నం :
185 టన్నుల రేషన్ బియ్యాన్ని మాయం చేశారని పేర్ని నాని సతీమణి జయసుధపై బందరు తాలుకా పీఎస్ కేసు నమోదు.. ఈ కేసులో గత శుక్రవారం జిల్లా కోర్టులో ముందస్తు బెయిల్ పిటీషన్ దాఖలు చేసిన పేర్ని జయసుధ..బెయిల్ పిటీషన్ ను తొమ్మిదవ అదనపు జిల్లా కోర్టుకు బదిలీ చేసిన జిల్లా జడ్జి…తొమ్మిదవ అదనపు జిల్లా జడ్జి కోర్టులో విచారణకు వచ్చిన బెయిల్ పిటీషన్..
పోలీసుల నుండి సీడీ ఫైల్ రాకపోవటంతో విచారణను 19కి వాయిదా వేసిన న్యాయమూర్తి..
గత వారం రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లిన పేర్ని నాని కుటుంబం..పేర్ని నాని కుటుంబ సభ్యుల కోసం విస్తృతంగా గాలిస్తున్న పోలీసులు..వారి ఆచూకీ కోసం ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్టు సమాచారం..పేర్ని నాని సన్నిహితుల కాల్ డేటాలను పరిశీలిస్తున్నట్టు సమాచారం..
👉అసెంబ్లీలో ఫిర్యాదు తర్వాత కూడా చెరువులోకి అరబిందో వ్యర్థాలు😲😲😲
• పత్రికల్లో వచ్చినా పట్టించుకోని కాలుష్య మండలి
• కలుషిత జలాలను అరికట్టే చర్యలు తీసుకోవాలి
• అసెంబ్లీలో గళమెత్తిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
జడ్చర్ల, డిసెంబర్ 16: జడ్చర్ల సెజ్ లోని అరబిందో ఫార్మా కలుషిత జలాలను ముదిరెడ్డిపల్లి చెరువులోకి వదులుతోందనే విషయాన్ని తాను ఇదివరకే అసెంబ్లీ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చినా ఆ కంపెనీ కలుషిత జలాలను వదలడం ఆపలేదని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి చెప్పారు. ఈ విషయంగా కాలుష్యమండలి చర్యలు తీసుకోవాలని కోరారు.
సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో అనిరుధ్ రెడ్డి పోలేపల్లి సెజ్ లోని అరబిందో ఫార్మా కంపెనీ ముదిరెడ్డిపల్లి చెరువులోకి కాలుష్య జలాలను వదులుతున్నందున పంటలు దెబ్బతింటున్నాయని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారనే విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందా? అని వేసిన ప్రశ్నకు ముందుగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమాధానం ఇస్తూ, కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో గతంలోనూ, ఇటీవల జరిగిన తనిఖీల్లో అరబిందో తో పాటుగా ఆమ్నెల్, ఏపిఎల్ హెల్త్ కేర్ పరిశ్రమల నుంచి ఎలాంటి వ్యర్థాలు విసర్జించడం లేదని, పరిశ్రమలు వదిలే జలాల కారణంగా భూసారానికి ఎలాంటి నష్టం జరగలేదని తేల్చడం జరిగిందని చెప్పారు. ఆ తర్వాత అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ, అరబిందో పరిశ్రమ నుంచి వర్షపు నీటితో పాటు కలుషిత జలాలను ముదిరెడ్డిపల్లి చెరువులోకి వదులుతున్న కారణంగా చెరువులో చేపలు మరణిస్తున్నాయని, పంటలు దెబ్బతింటున్నాయని, ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారనే విషయాన్ని గత జూలై 30 న జరిగిన అసెంబ్లీ సమావేశంలోనూ చెప్పడం జరిగిందని గుర్తు చేసారు. అయితే తాను సభలో ఈ విషయాన్ని గురించి ఫిర్యాదు చేసిన తర్వాత కూడా అరబిందో పరిశ్రమ ముదిరెడ్డిపల్లి చెరువులోకి కలుషిత జలాలను వదలడం జరిగిందని, ఆగష్టు, అక్టోబర్ మాసాల్లో దీనికి సంబంధించిన వార్తలు ఆధారాలు, ఫోటోలతో సహా ప్రముఖ మీడియాలోనూ వచ్చాయని ప్రస్తావిస్తూ వాటికి సంబంధించిన క్లిప్పింగ్ లను స్పీకర్ కు చూపించారు. అయినా కాలుష్య మండలి అధికారులు ఈ విషయాన్ని పట్టించుకోలేదని చెప్పారు. అరబిందో పరిశ్రమ నుంచి కలుషిత జలాలు చెరువులోకి వస్తున్నప్పుడు ముద్దిరెడ్డిపల్లి గ్రామస్తులు ఈ విషయం గురించి కాలుష్య మండలికి ఫిర్యాదు చేస్తే వారు వెంటనే వచ్చి ఆ విషయాన్ని పరిశీలించకుండా ఆ నీళ్లు ఆగిపోయి, ఆనవాళ్లన్నీ ఎండిపోయిన తర్వాత వచ్చారని విమర్శించారు. మరోసారి కూడా ముదిరెడ్డిపల్లి గ్రామస్తులు కాలుష్య మండలి అధికారుల వద్దకు వెళ్లి ఫిర్యాదు చేస్తే వారి ఫిర్యాదుపై చర్యలు తీసుకోకపోగా అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సలహా ఇచ్చారని అనిరుధ్ రెడ్డి వెల్లడించారు. కాలుష్య మండలి పరిశ్రమల కాలుష్యాన్ని నియంత్రించడానికి రూపొందించిన నిబంధనల్లో 90 శాతం అమలు చేసినా కలుషిత జలాల సమస్య పరిష్కారమౌతుందన్నారు. గతంలో రెడ్ కేటగిరీకి చెందిన ఒక పరిశ్రమ విషయంగా తాను కోర్టుకు వెళ్లి దాన్ని తరలించాలని కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చినా వాటిని అమలు చేయలేదని పేర్కొన్నారు. అరబిందో కలుషిత జలాల విషయంగా చర్యలు తీసుకోవాలని, దాని కారణంగా నష్టపోతున్న ముదిరాజ్ బిడ్డలకు న్యాయం చేయాలని అనిరుధ్ రెడ్డి కోరారు. దీనిపై మంత్రి శ్రదర్ బాబు స్పందిస్తూ, అనిరుధ్ రెడ్డి చెప్పిన విధంగా ఆగష్టు 24, అక్టోబర్ 26న అరబిందో కలుషిత జలాలపై వచ్చిన వార్తల విషయాన్ని పరిశీలిస్తామని, ఈ విషయంగా వ్యవసాయ శాఖ నుంచి నివేదిక కోరుతామని చెప్పారు. కాలుష్య మండలి నిబంధనలు అమలు చేయడంలో ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే వాటిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
👉తిరుపతి,*క్యాన్సర్ వ్యాధిని ప్రాథమిక దశలో గుర్తిస్తే నివారణ సాధ్యం*
*-బిఎన్.కండ్రిగ వైద్యాధికారి డాక్టర్ పివి.దివాకర్*
*స్విమ్స్ ఆధ్వర్యంలో కంపాళెం, కారణిలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ ⭐ ప్రాథమిక దశలో క్యాన్సర్ ను గుర్తిస్తే తగిన చికిత్స అందించడం ద్వారా నివారించవచ్చని బిఎన్.కండ్రిగ వైద్యాధికారి డాక్టర్ పివి.దివాకర్ తెలిపారు. ప్రతి ఒక్కరూ పింక్ బస్సుల్లో ఉచితంగా స్క్రీనింగ్ చేయించుకోవాలని కోరారు. స్విమ్స్, శ్రీ బాలాజీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ ఆధ్వర్యంలో సోమవారం బిఎన్ కండ్రిగ పిహెచ్ సి పరిధిలోని కంపాళెం ఎంపిపి పాఠశాల, కారణి గ్రామంలో ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో తిరుపతి జిల్లాలో రెండు పింక్ బస్సుల ద్వారా మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వేగవంతంగా జరుగుతోంది. పింక్ బస్సులో మహిళలు, పురుషులకు నోటి క్యాన్సర్ పరీక్షలు, మహిళలకు రొమ్ము క్యాన్సర్ కోసం మామోగ్రామ్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కోసం పాప్ స్మియర్ పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. మహిళలు, పురుషులు విశేషంగా విచ్చేసి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకున్నారు.
కాగా, బిఎన్ కండ్రిగ పిహెచ్ సి పరిధిలో డిసెంబర్ 17న కాటూరు, విఎస్.పురం, డిసెంబర్ 19న పల్లమాల, పార్లపల్లి, డిసెంబర్ 20న తలారివెట్టు, వెస్ట్ వరత్తూరు, డిసెంబర్ 23న ఆర్.అనంతపురంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు జరుగనున్నాయి. కార్యక్రమంలో బిఎన్ కండ్రిగ పిహెచ్ సి వైద్యాధికారులు డాక్టర్ దివాకర్, డాక్టర్ విద్యాసాగర్, స్విమ్స్ శ్రీ బాలాజీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ పద్మావతి, డాక్టర్ చైతన్య భాను, సిహెచ్ఓ డిఎన్.వెంకటేశులు, సర్పంచులు మునిరాజ, ఢిల్లీప్రసాద్, పద్మమ్మ, పంచాయతీ కార్యదర్శులు గురవయ్య, లోకమూర్తి, స్థానిక నాయకులు సత్యం, సుధాకర్ నాయుడు, హెల్త్ విజిటర్ జ్యోతి,ఎంల్ హెచ్ పిలు చెల్సియా, మీనాక్షి, ఏఎన్ఎంలు లత,హేమమాలిని, స్థానిక వైద్య సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది,ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
👉ఆర్ఎస్ఎఎస్టీఎఫ్ ( *RSASTF* )
అన్నమయ్య జిల్లా అటవీ ప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లర్లు..
నిషేధిత అటవీ ప్రాంతంలో కనిపించగా చట్టుముట్టిన టాస్క్ ఫోర్సు పోలీసులు…కొందరు పారిపోగా ఒక స్మగ్లర్ అరెస్టు…6ఎర్రచందనం దుంగలు స్వాధీనం..
అన్నమయ్య జిల్లా చెయ్యేరు నదీ ప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న ఒకరిని టాస్క్ ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి ఆరు చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్సు ఇన్చార్జి, తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బారాయుడు ప్రత్యేక కార్యాచరణ మేరకు టాస్క్ ఫోర్సు ఎస్పీ పీ.శ్రీనివాస్ అధ్వర్యంలో డీఎస్పీలు జి. బాలిరెడ్డి,వి.శ్రీనివాసరెడ్డి మార్గనిర్దేశకత్వంలో కడప సబ్ కంట్రోల్ సానిపాయ బేస్ ఆర్ఐ చిరంజీవులుకు చెందిన ఆర్ఎస్ఐ వై విశ్వనాథ్ టీమ్ ఆదివారం నుంచి జాండ్రపెంట ఎఫ్ బీవో కలసి గుర్రపు బాట తూర్పు వైపున గల చెయ్యేరు వైపు కూంబింగ్ చేపట్టారు.సోమవారం తెల్లవారు జామున వీరు మేకల కోన వద్దకు చేరుకోగా,అక్కడ కొందరు వ్యక్తులు ఎర్రచందనం దుంగలను మోసుకుని వెళుతూ కనిపించారు. దీంతో వారిని చుట్టుముట్టేందుకు ప్రయత్నించగా,వారు దుంగలు పడేసి పారిపోసాగారు.అయితే టాస్క్ ఫోర్సు పోలీసులు వెంటపడి,ఒకరిని పట్టుకోగలిగారు.ఆ ప్రాంతంలో పరిశీలించి చూడగా, ఆరు ఎర్రచందనం దుంగలు లభించాయి. వీటిని స్వాధీనం చేసుకుని, పట్టుబడిన వ్యక్తిని తిరుపతి టాస్క్ ఫోర్సు పోలీసు స్టేషన్ కు తరలించారు. టాస్క్ పోర్సు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
👉👉నిజాలు మాట్లాడితే దొరలకు నచ్చదు…
సర్పంచులను ముంచింది దొరలే కానీ అది చెప్పొద్దు
నిజాలు చెప్తే వాకౌట్ చేస్తారా..పత్రికా సమావేశంలో టిపిసిసి రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ నాయకులు మోహన్ రెడ్డి తలకొండపల్లి మండలం..
◾ టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సర్పంచుల పెండింగ్ బిల్లుల గురించి పట్టించుకోని అప్పటి ఆర్థిక మంత్రి హరీష్ రావు ఇప్పుడు అసెంబ్లీలో సర్పంచుల పెండింగ్ బిల్లులపై ముసలి కన్నీరు కార్చడం హాస్య స్పందన ఉందని సర్పంచులను అరిగోస పెట్టి..
వాళ్ల ఆత్మహత్యలకు కారణమైనవాళ్లు
ప్రజా ప్రభుత్వానికి నీతులు చెప్పడం హాస్యాస్పదం…
◾ప్రతి నెలా రూ. 270 కోట్లు విడుదల చేసిన తర్వాత బకాయిలు ఉంటాయా..
◾బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సర్పంచ్ లు,
ఉపసర్పంచ్ లు ఆత్మహత్యలు చేసుకున్నారు
◾గత ప్రభుత్వం మా నెత్తిపై బకాయిలు పెట్టి ఈరోజు సభను వాకౌట్ చేయడం విడ్డూరంగా ఉందని టి పి సి సి రాష్ట్ర కిసాన్ సెల్ నాయకులు మోహన్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో ఆమనగల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అజీమ్ డిసిసి కార్యదర్శి రవీందర్ యాదవ్,బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి డిగ్రీ కృష్ణ,టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రమేష్ శేఖర్ అంజిరెడ్డి యూత్ కాంగ్రెస్ నాయకులు శ్రీను తదితరులు

7k network
Recent Posts

ప్రియాంక గాంధీపై బీజేపీ నేత ర‌మేష్ బిధూరి చేసిన అనుచిత వ్యాఖ్య‌ల ప‌ట్ల‌ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన మంత్రి సీత‌క్క‌*.. *నవీన్ కి చెక్ పెట్టినట్లే కేజ్రీవాల్ కి కూడా ?.. *ఈ ఫార్ములా రేసులో కొన్ని నిజాలు *.. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఛైర్మెన్ జంగా రాఘవ రెడ్డి … ఏపీ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, మంత్రి సత్య కుమార్ యాదవ్* …ప్రభుత్వ ఆస్తిని అప్పనంగా దోచుకున్న ఓం నారాయణ పై చర్యలు : లంబాడి హక్కుల పోరాట సంఘం.. *పొదిలి మాదిరెడ్డిపాలెం వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షులుగా ఎర్రం రెడ్డి

👉ఎంఎస్‌పీ పంజాబ్‌కే కాదు.. దేశమంతటికీ అవసరమే ..*తెలుగు తమ్ముళ్లకు సంక్రాంతి పండుగ ముందే వచ్చిందా.😲 ..హుస్నాబాద్ మైనార్టీ గురుకుల బాలికల పాఠశాల లో ఆకస్మిక తనిఖీలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ … ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాటులను పర్యవేక్షించిన జిల్లా అధికారులు ..*ఆత్మకూరులో ఇస్తేమ పనులను పర్యవేక్షించిన మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్ .. *

👉ఏపీలో రేపటి నుంచి ఉచిత ఓపీ సేవలు బంద్ …* విశాఖ పోర్టులో పట్టుకున్న బియ్యానికి కలెక్టర్ క్లీన్ చిట్..😲… *విశాఖ సెంట్రల్‌ జైల్ ను సందర్శించిన రాష్ట్ర హోం మంత్రి .. అగ్ని ప్రమాదాల పై అవగాహన సదస్సు.. *ఉచిత బస్సు కంటే ఇతర సంక్షేమ పథకాలకు ఖర్చు పెడితే బెటరేమో ! .. *అధికారులను సత్కరించిన పొదిలి పట్టణ టిడిపి అధ్యక్షుడు. . *నిలిచిపోయిన కాపు భవనాలను పునఃప్రారంభించాలి: బలిజ సేవ సంఘం డిమాండ్ .

2700 కోట్ల ఇల్లు.. రూ.10 లక్షల సూట్ ధరించే వారా విమర్శించేది? .. *పవన్ ఆదేశాలు.. సముద్ర తీరంలో రెండు బోట్లు సీజ్* .. *విజయవాడలో వెలుగు చూసిన అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారం .. *చంద్రగిరి ‘బీసీ’ విద్యార్థినులకు మెరుగైన వైద్యం* *తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ కు మంత్రి సవిత ఆదేశం*.. *ఆర్మీ వాహనం లోయలో పడి ఇద్దరు సైనికులు మృతి.. *పుత్తూరు సబ్ డివిజన్ పోలీసులు హెల్మెట్ వాడకంపై అవగాహన కార్యక్రమాలు … మైలవరం లో మిక్సీంగ్ రాజకీయ సెగలు…! ..*రాజకీయ దుమారం రేపిన పాలడుగు దుర్గా ప్రసాద్, ఎమ్మెల్యే వసంత కలయిక… *ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తూ పోలీస్ సిబ్బంది జీవన విధానం ఉండాలి : ఐజి వి సత్యనారాయణ.. *పోలీసుల వేధింపులు తట్టుకోలేక హుజూర్‌ నగర్ పోలీస్ స్టేషన్ ముందు యువకుడి ఆత్మహత్యాయత్నం .. * డిగ్రీ విద్యార్థులకు కూడా తక్షణమే వర్తింప చేయండి..మాజీ ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు పివి శేషయ్య.

*రెవిన్యూ అధికారులకు పై సియం సీరియస్*…*ప్రభుత్వ ఉద్యోగులపై ఆరోపణలు, కేసులు పెట్టే వారికి రక్షణ కల్పించేలా సర్కార్‌ చర్యలు.. *పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు పటిష్ట చర్యలు ; రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా…*కాంస్య పతకం సాధించి దేశ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన ఓరుగ‌ల్లు ముద్దుబిడ్డ .. *నితీష్ కి కన్ను గీటిన లాలూ..ఎన్డీయేలో కలవరమేనా ? ..*అమెరికాలో విచిత్రం ఇస్తున్న నోరో వైరస్ …*చైనాలో మరోసారి హెల్త్ ఎమర్జెన్సీ

⭐సూపర్-6 హామీలు కచ్చితంగా అమలు చేస్తాం..గత పాలనంతా విధ్వంసం…మేము రిపేర్లు చేస్తూ వెళ్తున్నాం..తప్పుడు పనులు చేయొద్దు.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు హెచ్చరిక : సీఎం చంద్రబాబు ..*మాదాపూర్ పేస్ హాస్పిటల్‌లో దారుణం.. *ఒక్క పైసా కూడా అవినీతి లేదు. -కేటీఆర్‌ ..*.. ఫారిన్‌లో ఎడ్యుకేషన్‌ పేరుతో మోసాలు. బోగస్‌ కన్సల్టెన్సీ ప్రతినిధులను అరెస్ట్‌ చేసిన పోలీసులు… సైబర్ నేరాలకు అడ్డా ‘వాట్సప్’.. హోంశాఖ నివేదిక.*.. యాపిల్ పండ్ల మాటున మద్యం అక్రమ తరలింపు …*తిరుపతిలో మత్తు వదిలించిన పోలీస్