నల్ల చొక్కాలు బేడీలు వేసుకొని బిఆర్ఎస్ ఎమ్మెల్యేల విన్నూత నిరసన* … ఇది లోకేష్ టీడీపీ !..నేను చంద్రబాబు అంతటి మంచివాడిని కాదు…మంగళగిరి చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ మంత్రి లోకేష్ .. నారాయణ స్కూల్లో 7వ తరగతి విద్యార్థి ఆత్మహత్య…శబరి సన్నిధానంలో అయ్యప్ప భక్తుడి ఆత్మహత్య? ..సముద్ర నీటితో విధ్యుత్ వుత్పత్తిపై పార్లమెంటులో మాగుంట ప్రశ్న… పలు కార్యక్రమాలలో పాల్గొన్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల

👉భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కు విమానాశ్రయంలో ఘనంగా వీడ్కోలు ….
గుంటూరు జిల్లా మంగళగిరి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) స్నాతకోత్సవంలో పాల్గొని మంగళవారం సాయంత్రం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి భారత వాయుసేన ప్రత్యేక విమానంలో హైదరాబాద్ హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కు బయలుదేరి వెళ్లారు. విమానాశ్రయం వద్ద అధికారులు వీడ్కోలు పలికారు.వీడ్కోలు పలికిన వారిలో
రాష్ట్ర గవర్నర్ గౌరవనీయ అబ్దుల్ నజీర్, రాష్ట్ర గిరిజన సంక్షేమ, ఐసిడిఎస్ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, డిజిపి సిహెచ్. ద్వారక తిరుమలరావు, కమాండింగ్ ఆఫీసర్ 22 ఆంధ్రా బెటాలియన్ ఎన్ సిసి లెఫ్ట్నెంట్ కన్నల్ జే. మహేష్, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, కృష్ణాజిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావు, గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు ఉన్నారు.
👉 మంగళగిరి ఎయిమ్స్ డైరెక్టర్, మరొక 10 ఎకరాలు కావాలని అడిగారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరుపున, వెంటనే ఆ భూమి ఇస్తున్నాం. గతంలో నీటి కోసం మీరు ఇబ్బంది పడ్డారు, ఇప్పుడు మా ప్రభుత్వంలో మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మీకు పూర్తి సహకారం అందిస్తాం. మంగళగిరి ఎయిమ్స్ దేశంలోనే నంబర్ వన్ అవడానికి, ఎలాంటి సహకారం అయినా మా ప్రభుత్వం ఇస్తుందని
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.

👉మంగళగిరి చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ మంత్రి లోకేష్*
*రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు మంగళగిరి శాలువా బహుకరణ*…*మంత్రి లోకేష్ బాటలోనే భార్య బ్రాహ్మణి, తల్లి భువనేశ్వరి* అమరావతి: మంగళగిరి చేనేతలంటే ఆయనకు వల్లమాలిన అభిమానం. చేనేతలు తమ ఆత్మబంధువులని చెప్పే మంత్రి నారా లోకేష్ కేవలం మాటలకు మాత్రమే పరిమితం కాకుండా ఆచరణలో అభిమానాన్ని చూపుతుంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే మంగళగిరి చేనేతలకు మంత్రి నారా లోకేష్ తోపాటు ఆయన భార్య బ్రాహ్మణి, తల్లి భువనేశ్వరి అనధికార బ్రాండ్ అంబాసిడర్లుగా మారారు. అవకాశం వచ్చిన ప్రతిసారీ మంగళగిరి చేనేత వస్త్రాలను ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎయిమ్స్ లో కాన్వకేషన్ కార్యక్రమానికి విచ్చేశారు. ఈ సందర్భంగా మంగళగిరి చేనేతలు నేసిన శాలువను ఆమెకు బహుకరించారు. గతంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఇతర ప్రముఖులను కలిసినపుడు కూడా ఆయన మంగళగిరి శాలువాలతోనే వారిని సత్కరించారు. లోకేష్ భార్య బ్రాహ్మణి, తల్లి భువనేశ్వరి మంగళగిరి చీరలను ధరిస్తూ వాటి ప్రాశస్త్యాన్ని ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. ఇదిలావుండగా ప్రతిపక్షంలో ఉండగానే మంత్రి లోకేష్ మంగళగిరిలో వీవర్స్ శాలను ఏర్పాటుచేసి, ఇక్కడి చేనేతలు తయారుచేసిన వస్త్రాల మార్కెటింగ్ కోసం టాటా టనేరియాతో అనుసంధాన వ్యవస్థను ఏర్పాటు చేశారు. పతనావస్థకు చేరుతున్న మంగళగిరి చేనేతను పునరుజ్జీవింప జేసేందుకు మంత్రి లోకేష్ చేస్తున్న కృషి మంగళగిరిలోని చేనేతలు మురిసిపోతున్నారు.
👉 తిరుపతి..బ్యాంకు ఉద్యోగిపై కత్తితో ఓ వ్యక్తి హల్చల్.
తిరుపతి రూరల్ మండలంలోని ఓ బ్యాంకులో ఘటన.
బ్యాంకులో క్యాషియర్ వద్దకు మంగళవారం సాయంత్రం ఓ వ్యక్తి కత్తి చూపించి డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్.
ఇబ్బంది అప్రమత్త తో వ్యక్తిని పట్టుకొని గేటుకు కట్టేసిన వైనం..వ్యక్తిని విచారించి పోలీసులకు అప్పగించే పనిలో బ్యాంకు సిబ్బంది.
👉 ఇది లోకేష్ టీడీపీ !…నేను చంద్రబాబు అంతటి మంచివాడిని కాదు. ఖచ్చితంగా దెబ్బకు దెబ్బతీస్తానని” లోకేష్ యువగళం పాదయాత్రలో పదే పదే చెప్పేవారు. ఎందుకంటే చంద్రబాబు కక్ష సాధింపులకు పాల్పడరని… తప్పులు చేసినా పెద్దగా పట్టించుకోరని శిక్షలు వేయరని ఎక్కువ మంది నమ్మకం. బయట పార్టీల వాళ్లకే కాదు.. సొంత పార్టీలో కూడా అంతే. అది టీడీపీకి మంచి చేసిందా.. చెడు చేసిందా అన్నది పక్కన పెడితే ఇప్పుడు సీన్ మారింది. అప్పటి టీడీపీ వేరు… ఇప్పటి టీడీపీ వేరు. దానికి తాజాగా జోగి రమేష్‌తో కలిసి టీడీపీ నేతలు వేదిక పంచుకోవడం.. అనంతరం జరిగిన పరిణామాలే సాక్ష్యం. ఒక్క మాటలో చెప్పాలంటే అప్పుడు చంద్రబాబు టీడీపీ… ఇప్పుడు లోకేష్ టీడీపీ!ఇప్పుడు టీడీపీలో చల్తే.. చల్తే కాదు
తెలుగుదేశం అంటే ఆ పార్టీలో ఉండే నేతలకు ఓ అభిప్రాయం ఉంది. పార్టీలో ఉంటే ఏమైనా చేయవచ్చు.. ఏమైనా అంటే చంద్రబాబు పిలిచి “తమాషాగా ఉందా?” అని ఓ మాట అని చెప్పి పంపేస్తారు. తర్వాత మన పని మనం చేసుకోవచ్చు అని లీడర్లు అనుకుంటారు. అందుకే ఇతర పార్టీల నేతలతో కలిసి బోలెడన్ని రాజకీయాలు చేస్తూంటారు. అదే సమయంలో తాము అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినా టీడీపీ వచ్చినా తమను ఏమీ చేయలేరని అనుకుంటూ ఉంటారు. అందుకే చంద్రబాబు పై అసువుగా ఎటాక్ చేసేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. సొంతపార్టీ నేతుల పార్టీ లైన్ దాటిపోయినా క్షమించడం లేదు. మంత్రి పార్థసారధి, గౌతు శిరీష .. జోగి రమేష్ తో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొనడంపై క్షమాపణలు చెప్పాల్సి రావడమే దీనికి సంకేతం.
పార్థసారధి కూడా ఎన్నికల ముందు వరకూ వైసీపీ నేత. ఆయనను టీడీపీలో చేర్చుకుని టిక్కెట్ ఇచ్చారు. మంత్రి పదవి కూడా ఇచ్చారు. టీడీపీ క్యాడర్ ఎప్పుడూ అసంతృప్తి వ్యక్తం చేయలేదు. స్వాగతించారు కూడా. ఎందుకు .. ఆయన రాజకీయాన్ని రాజకీయంలాగానే చేశారు. బూతులు అందుకోలేదు. చంద్రబాబు కుటుంబాన్ని టార్గెట్ చేయలేదు. కానీ జోగి రమేష్ నీడ కూడా టీడీపీపై పడితే క్యాడర్ అంగీకరించడం లేదు. ఎందుకంటే ఆయన అంత ఘోరంగా వ్యవహరించారు. ఇలాంటి వాళ్లు రెడ్ బుక్ లో ఉంటారు. వాళ్ల సంగతి చూస్తారు కానీ.. వాళ్లతో టీడీపీ నేతలు కనీసం టచ్ లో ఉన్నా క్షమించే పరిస్థితి ఉండదు. నిజానికి పార్టీపై చంద్రబాబు హోల్డ్ ఉన్నట్లయితే.. జోగి రమేష్ ఏంటి.. కొడాలి నాని లాంటి వాళ్లతో కూడా కార్యక్రమాల్లో పాల్గొనేవాళ్లు చాలా మంది ఉంటారు. కానీ ఇప్పుడు నడుస్తోంది లోకేష్ పార్టీ. అందుకే ఇలాంటివి సహించేది లేదని సంకేతాలు పంపుతున్నారు.
పార్టీ నేతలైనా జాగ్రత్తగా ఉండాల్సిందే !
పార్థసారధి, గౌతు శిరీష .. క్యాడర్ కు సారీ చెప్పాల్సి వచ్చింది. ఇది టీడీపీలోని ఇతర నేతలకు గట్టి సంకేతాలను పంపుతోంది. పార్టీని, పార్టీ అధినేతను.. ఆయన కుటుంబాన్ని గత పదేళ్ల కాలంలో జగన్ రెడ్డికి మానసిక ఆనందం కోసం వేధించిన.. మాటలతో రెచ్చిపోయిన ఏ ఒక్కరితో వ్యక్తిగత సంబంధాలు పెట్టుకున్నా.. సహించే పరిస్థితులు ఉండవని సంకేతాలు పంపారు. వ్యక్తిగత సంబంధాలు ఏమైనా ఉన్నా బయటపడితే క్యాడర్ నుంచి ఈ స్థాయి వ్యతిరేకతను ఎంచుకోవాల్సి ఉంటుంది. లేకపోతే మొదటికే వస్తుంది. లోకేష్ చాలా గట్టిగా ఈ సంకేతాన్ని పార్టీ నేతల్లోకి పంపించేశారు. అందుకే ఇప్పుడు టీడీపీ కూడా పూర్తిగా మారుతోంది. లోకేష్ ముద్ర కనిపిస్తోంది. దానికి తగ్గట్లుగా నేతలు కూడా మారాల్సి ఉంది.
👉నారాయణ స్కూల్లో 7వ తరగతి విద్యార్థి ఆత్మహత్య..
హైదరాబాద్ – హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నారాయణ స్కూల్ హాస్టల్లో 7వ తరగతి చదువుతున్న లోహిత్ అనే విద్యార్థి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.పాఠశాల సిబ్బంది కారణంగానే లోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తున్న కుటుంబ సభ్యులు.
👉శబరి సన్నిధానంలో అయ్యప్ప భక్తుడి ఆత్మహత్య?
హైదరాబాద్:డిసెంబర్ 17
ఈ సీజన్‌లో అయ్యప్ప భక్తులతో కిటకిటలాడు తోన్న శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో సోమవారం రాత్రి తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సన్నిధానం వద్ద ఓ భక్తుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
సోమవారం రాత్రి నెయ్యాభిషేకం టిక్కెట్ కౌంటర్ వద్ద ఉన్న ఫ్లైఓవర్ పై నుంచి దూకి భక్తుడు మృతి చెందాడు. అతడ్ని కర్ణాటకకు చెందిన కుమార స్వామి (40)గా గుర్తిం చారు. ఫ్లైఓవర్‌పై నుంచి దూకడంతో కుమార స్వామి కి కాళ్లు, చేతులకు తీవ్రగాయాలయ్యాయి.
దీంతో అతడికి సన్నిధానం వద్ద ఉన్న ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేశారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కొట్టయాం మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలి స్తుండగా మార్గంమధ్యలో కుమారస్వామి మృతిచెంది నట్టు అధికారులు తెలిపారు.
తీవ్రగాయాలు కావడంతో గుండెపోటుకు గురైనట్టు చెప్పారు. అయితే, కుమారస్వామి మానసిక సమస్యతో బాధపడుతు న్నట్టు అతడి వెంట వచ్చిన ఇతర భక్తులు తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
👉నల్ల చొక్కాలు బేడీలు వేసుకొని బిఆర్ఎస్ ఎమ్మెల్యేల విన్నూత నిరసన* హైదరాబాద్
లఘు చర్ల రైతులకు బేడీలు వేసిన అంశంపై టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు పట్టు పట్టడం తో సోమవారం అసెంబ్లీలో గందరగోళం ఏర్పడింది,
అదే అంశంపై తెలంగాణ అసెంబ్లీ లోఈరోజు మళ్ళీ బీఆర్ఎస్ నాయకులు వినూత్న నిరసన చేపట్టారు. నల్ల చొక్కాలు బేడీలు ధరించి అసెంబ్లీ కి వచ్చారు. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి.
అయితే ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు లగచర్ల రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా అసెంబ్లీలో నిరసన చేపట్టారు. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ హరీష్ రావు,సహా ఎమ్మెల్యే లంతా నల్ల చొక్కాలు, చేతులకు బేడీలు ధరించి అసెంబ్లీకి వచ్చారు. ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం.. లాఠీ రాజ్యం లూటీ రాజ్యం.. రైతులకు బేడీల సిగ్గు సిగ్గు..అంటూ పలు రకాల నినాదాలు చేస్తూ అసెంబ్లీలో ఆందోళనకు దిగారు. కాగా అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు సభలో లగచర్ల, దిలావర్ పూర్, రామన్న పేట సహా పలు ఘటనలపై చర్చ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.
👉రైతు బజార్ కేంద్రంను ప్రారంభించిన జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్, ఎరిక్షన్ బాబు*.. యర్రగొండపాలెం :- ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పట్టణంలోని మార్కెట్ యార్డ్ అనుసంధానమైన నూతనంగా ఏర్పాటు చేసిన రైతు బజార్ ను జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, సబ్ కలెక్టర్ వెంకట త్రివినాగ్, యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ప్రతి రైతు పండించిన పంటలను నేరుగా వారికి కేటాయించిన షాపులలో అమ్ముకునే వెసులుబాటు కల్పించిట్లు తెలిపారు. రైతు బజార్ ద్వారా ప్రజలకు తాజా కూరగాయలు అందించడమే కాకుండా, తక్కువ రేటుకు నాణ్యమైన కూరగాయలు లభిస్తాయని తెలిపారు. అలాగే రైతు బజార్ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. దోర్నాలలో కూడా రైతు బజార్ ఏర్పాటు కు చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ తెలిపారు. ప్రజలు రైతు బజార్ ను సద్వినియోగ పరచుకోవాలని ఎరిక్షన్ బాబు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏ.డి ఉపేంద్ర కుమార్, మండల టీడీపీ అధ్యక్షులు చేకూరి సుబ్బారావు, అధికారులు, రైతులు, టీడీపీ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు…
👉 సముద్ర నీటితో విధ్యుత్ వుత్పత్తిపై పార్లమెంటులో మాగుంట ప్రశ్న
దేశంలో సముద్ర నీటితో విధ్యుత్ ఉత్పత్తి సాధ్యత, అంచనాలు, ఆర్ధిక సాధ్యత, ఉపయోగం, ఆదాయం, పరిశోధన – అభివృద్ధికి కేటాయించిన నిధులు, విధ్యుత్ ప్లాంట్ల పర్యావరణ ప్రభావం మరియు క్రొత్త ప్లాంట్ల పధకాల గురించి ప్రస్తుత పార్లమెంటు సమావేశాలలో ఒంగోలు పార్లమెంటు సభ్యులు, మాగుంట శ్రీనివాసులురెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర క్రొత్త మరియు పునరుత్పాదక శక్తి మరియు విధ్యుత్ శాఖ మంత్రి, శ్రీపాద్ ఎస్సో నాయక్ సమాధానమిస్తూ
సముద్రపు నీటి ఆటు – పొట్ల శక్తిని విధ్యుత్ గా మార్చడమే టైడల్ ఎనర్జీ అని, బొగ్గు, చమురు ఇంధనాలు – గాలి – సౌరశక్తి వలె కాక ఖచ్చితమైన అంచనాలు వేయవచ్చునని, అయితే ఈ విధ్యుత్ ప్లాంట్ల వలన లాభంపై అంచనా వేయలేదని, నిధులు ఏమీ కేటాయించలేదని మరియు సముద్ర నీటితో విధ్యుత్ ప్లాంట్ల ఏమీ ఏర్పాటుచేయలేదని తెలిపారు.
దేశంలో సముద్ర నీటితో 12,455 మెగా వాట్ల విధ్యుత్ వుత్పత్తి మరియు సముద్ర అలల ఆటు పోట్లతో 41,300 మెగా వాట్ల విధ్యుత్ వుత్పత్తి సాధ్యతపై 2014 లో కేంద్ర విధ్యుత్ శాఖ అంచనా మాత్రం వేసిందని తెలిపారు.
సముద్ర నీటితో విధ్యుత్ ఉత్పత్తికి కేంద్ర విధ్యుత్ మంత్రిత్వ శాఖకు 22 ప్రతిపాదనలు రాగా, 2 ప్రతిపాదనలు ఆమోదించడినవని తెలిపారు.క్రొత్త – పునరుత్పాదక మరియు సముద్ర నీటితో విధ్యుత్ ఉత్పత్తి విస్త్రుత విస్తరణకు దేశీయ సాంకేతిక అభివృద్ధికి “పునరుత్పాదక శక్తి పరిశోధన మరియు సాంకేతిక అభివృద్ధి కార్యక్రమం (RE – RTD Programme)” క్రింద ఆర్ధిక సహాయం ప్రభుత్వ సంస్థలకు 100 శాతం, ప్రైవేటు సంస్థలకు 70 శాతం అందించబడునని కేంద్ర మంత్రి తెలియజేశారు.
👉 ఎన్దీయే పాలనలో ఉద్యోగుల సంక్షేమానికి కృషి*
పెన్షనర్స్ డే కార్యక్రమంలో పాల్గోన్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల*
గిద్దలూరు పట్టణంలోని విట్టా సుబ్బరత్నం కల్యాణ మండపంలో విశ్రాంత ఉద్యోగులు నిర్వహించిన పెన్షనర్స్ డే కార్యక్రమంలో గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గోన్నారు..*
*సభలో విశ్రాంత ఉద్యోగులకు ఎమ్మెల్యే అశోక్ రెడ్డికి శాలువా వేసి ఘనంగా సన్మానించారు..*
*ఈ సందర్బంగా సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ నాడు వైసీపీ హయాంలో ఉద్యోగులకు జీతాలు, విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్ల చెల్లింపులో అలసత్వం ప్రదర్శిందని, ప్రభుత్వ ఉద్యోగుల సహకారంతో అధికారంలోకి వచ్చిన వైసీపీ పాలకులు ఉద్యోగులను అగౌరవ పరిచారన్నారు.*
*నేడు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, అదే విధంగా ఉద్యోగులకు, పెన్షనర్లకు సకాలంలో వేతనాలు అందుతున్నాయన్నారు.*
పెన్షనర్లకు అందవలసిన 12వ PRC చెల్లింపులు, మరియు విశ్రాంత ఉద్యోగులకు ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు..గిద్దలూరు నియోజకవర్గంలో విశ్రాంత ఉద్యోగుల సంఘ అభివృద్ధికీ మరియు వ్యక్తిగతంగా తమకు ఏ అవసరం ఉన్న తన ద్రుష్టికీ తీసుకొస్తే తన పూర్తి సహకారం అందిస్తానన్నారు..కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రవీంద్రా రెడ్డి మరియు విశ్రాంత ఉద్యోగులు తదితరులు పాల్గోన్నారు.
👉దేశ సైనికుల సంక్షేమానికి కృషి చేస్తాను..*దేశ రక్షణ కోసం సరిహద్దులో పోరాడే సైనికులు ఉండడం గిద్దలూరు నియోజకవర్గానికే గర్వకారణం…గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల…

oppo_0

*దేశ సైనికుల సంక్షేమానికి తాను ఎల్లప్పుడూ కృషి చేస్తానని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పేర్కొన్నారు.*
*కంభం పట్టణంలోని ప్రభుత్వ కళాశాల సమీపంలో ఏర్పాటు చేసిన కంభం మాజీ సైనికుల కార్యాలయాన్ని మంగళవారం ఉదయం గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ దేశ రక్షణ కోసం ప్రాణాలకు తెగించి సేవలు అందించే సైనికులు ఉండటం మన గిద్దలూరు నియోజకవరర్గానికే గర్వ కారణం అన్నారు.*
ఇటీవల కాలంలో జమ్మూలో తాను ప్రాణాలు కోల్పోతాడని తెలిసి కూడా, మరో 30 మంది ప్రాణాలు కాపాడిన అమర వీరుడు మన రావిపాడు గ్రామానికి చెందిన వరికుంట్ల వెంకట సుబ్బయ్య అని, వారి ప్రాణ త్యాగం దేశానికే గర్వ కారణమని అమరులైన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.*ప్రకాశం జిల్లాలోనే అత్యధికంగా దేశ సైనికులు గిద్దలూరు నియోజకవర్గంలో ఉన్నారని వారి సంక్షేమానికి అభివృద్ధికి ఎన్దీయే ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తుందని గిద్దలూరు నియోజకవర్గంలో సైనిక్ స్కూల్ ఏర్పాటుకు తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు.కార్యక్రమంలో మాజీ సైనికుల జిల్లా వెల్ఫేర్ అధికారిని రజిని కుమారి, మరియు మాజీ సైనికులు, తెలుగుదేశం నాయకులు తదితరులు పాల్గోన్నారు.
👉రెవిన్యూ సదస్సులను రైతులంతా సద్వినియోగం చేసుకోవాలి…గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల…
*గ్రామాల్లో నిర్వహిస్తున్న రెవిన్యూ సదస్సులను రైతులంతా సద్వినియోగం చేసుకోవాలని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి సూచించారు. మంగళవారం నాడు అర్ధవీడు మండలం,నాగులవరం గ్రామంలో నిర్వహించిన రెవిన్యూ సదస్సులో పాల్గోన్న ఎమ్మెల్యే అశోక్ రెడ్డికి గ్రామ నాయకులు, మేళాతాళాలతో ఘన స్వాగతం పలికారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే సభలో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అత్యధికముగా భూ సమస్యలతో సతమతమవుతున్నారని తెలుసుకున్న సీఎం చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెవిన్యూ సదస్సులను ప్రారంభించటం జరిగిందని గ్రామాల్లో రైతులు ఎదుర్కోనుచున్న భూ సమస్యలను అర్జీ ద్వారా అధికారులకు తెలియచేస్తే నిర్ణిత సమయంలో వాటిని పరిష్కారం చేయటం జరుగుతుందన్నారు.సభ అనంతరం ప్రజలు ఇచ్చిన అర్జీలను స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.కార్యక్రమంలో మండల తహసీల్దార్ నాగార్జున రెడ్డి,మండల అధికారులు,పాల్గోన్నారు.*
👉పేదలకు సంక్షేమం అందించటమే ఎన్దీయే ధ్యేయం*
*సంక్షేమ పథకాలను అర్హులకు అందించటంలో సచివాలయ ఉద్యోగులదే కీలక పాత్ర…గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల…
*ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులకు అందించటంలో సచివాలయ ఉద్యోగులదే కీలక పాత్ర అని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం సాయంత్రం కంభం పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సచివాలయ ఉద్యోగులతో నిర్వహించిన సమావేశంలో పాల్గోన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల పట్ల ఉద్యోగులు బాధ్యతాయుతంగా ఉండాలని, అర్హులను గుర్తించి వారికీ ప్రభుత్వం కల్పించే సంక్షేమ పథకాలను అందించటంలో వారధిల పని చేయాలని సూచించారు.గ్రామ సచివాలయాల్లో ఉద్యోగులు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో మండల ఎంపీడీఓ, మండల అధికారులు, తెలుగుదేశం నాయకులు, సచివాలయ ఉద్యోగులు పాల్గోన్నారు.*
👉నష్ట పోయిన ప్రతి ఎకరాకు, నష్ట పరిహారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలి..వ్యవసాయ అధికారులతో సమావేశమైన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల..
*ఇటీవల కురిసిన తుఫాన్ల కారణంగా గిద్దలూరు నియోజకవర్గంలో రైతులకు జరిగిన పంట నష్టం పై గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి వ్యవసాయ అధికారులతో సమావేశం అయ్యారు.ఈ సందర్బంగా నియోజకవర్గంలో ఏఏ మండలంలో ఎంత మేరకు పంట నష్టం జరిగింది, ఏఏ పంటలు నీట మునిగాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి గ్రామంలో పంట నష్ట పోయిన రైతులను వివరాలు సేకరించి, నష్టపోయిన ప్రతి ఎకరాకు నష్టపరిహారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని నష్టపోయిన రైతులను ఆదుకోవటం ఎన్దీయే ప్రభుత్వం యొక్క బాధ్యత అన్నారు. గ్రామాల్లోని రైతులకు వ్యవసాయ అధికారులు ఎల్లవేళల అందుబాటులో ఉంటూ, ప్రభుత్వం సబ్సిడీ ద్వారా అందించే పథకాలను తెలియచేస్తూ, పంటలు దిగుబడి అధికముగా వచ్చేందుకు తగిన సూచనలిస్తూ రైతులకు సహకరించాలని సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారి బాలాజీ నాయక్, మరియు విజయభాస్కర్ రెడ్డి, రఫీక్, మెర్సీ, స్వరూప, మహమ్మద్,రాజశ్రీ, విష్ణుప్రియ,శ్వేతా,మహబూబ్ బాషా తదితరులు పాల్గోన్నారు.*

7k network
Recent Posts

ప్రియాంక గాంధీపై బీజేపీ నేత ర‌మేష్ బిధూరి చేసిన అనుచిత వ్యాఖ్య‌ల ప‌ట్ల‌ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన మంత్రి సీత‌క్క‌*.. *నవీన్ కి చెక్ పెట్టినట్లే కేజ్రీవాల్ కి కూడా ?.. *ఈ ఫార్ములా రేసులో కొన్ని నిజాలు *.. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఛైర్మెన్ జంగా రాఘవ రెడ్డి … ఏపీ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, మంత్రి సత్య కుమార్ యాదవ్* …ప్రభుత్వ ఆస్తిని అప్పనంగా దోచుకున్న ఓం నారాయణ పై చర్యలు : లంబాడి హక్కుల పోరాట సంఘం.. *పొదిలి మాదిరెడ్డిపాలెం వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షులుగా ఎర్రం రెడ్డి

👉ఎంఎస్‌పీ పంజాబ్‌కే కాదు.. దేశమంతటికీ అవసరమే ..*తెలుగు తమ్ముళ్లకు సంక్రాంతి పండుగ ముందే వచ్చిందా.😲 ..హుస్నాబాద్ మైనార్టీ గురుకుల బాలికల పాఠశాల లో ఆకస్మిక తనిఖీలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ … ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాటులను పర్యవేక్షించిన జిల్లా అధికారులు ..*ఆత్మకూరులో ఇస్తేమ పనులను పర్యవేక్షించిన మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్ .. *

👉ఏపీలో రేపటి నుంచి ఉచిత ఓపీ సేవలు బంద్ …* విశాఖ పోర్టులో పట్టుకున్న బియ్యానికి కలెక్టర్ క్లీన్ చిట్..😲… *విశాఖ సెంట్రల్‌ జైల్ ను సందర్శించిన రాష్ట్ర హోం మంత్రి .. అగ్ని ప్రమాదాల పై అవగాహన సదస్సు.. *ఉచిత బస్సు కంటే ఇతర సంక్షేమ పథకాలకు ఖర్చు పెడితే బెటరేమో ! .. *అధికారులను సత్కరించిన పొదిలి పట్టణ టిడిపి అధ్యక్షుడు. . *నిలిచిపోయిన కాపు భవనాలను పునఃప్రారంభించాలి: బలిజ సేవ సంఘం డిమాండ్ .

2700 కోట్ల ఇల్లు.. రూ.10 లక్షల సూట్ ధరించే వారా విమర్శించేది? .. *పవన్ ఆదేశాలు.. సముద్ర తీరంలో రెండు బోట్లు సీజ్* .. *విజయవాడలో వెలుగు చూసిన అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారం .. *చంద్రగిరి ‘బీసీ’ విద్యార్థినులకు మెరుగైన వైద్యం* *తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ కు మంత్రి సవిత ఆదేశం*.. *ఆర్మీ వాహనం లోయలో పడి ఇద్దరు సైనికులు మృతి.. *పుత్తూరు సబ్ డివిజన్ పోలీసులు హెల్మెట్ వాడకంపై అవగాహన కార్యక్రమాలు … మైలవరం లో మిక్సీంగ్ రాజకీయ సెగలు…! ..*రాజకీయ దుమారం రేపిన పాలడుగు దుర్గా ప్రసాద్, ఎమ్మెల్యే వసంత కలయిక… *ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తూ పోలీస్ సిబ్బంది జీవన విధానం ఉండాలి : ఐజి వి సత్యనారాయణ.. *పోలీసుల వేధింపులు తట్టుకోలేక హుజూర్‌ నగర్ పోలీస్ స్టేషన్ ముందు యువకుడి ఆత్మహత్యాయత్నం .. * డిగ్రీ విద్యార్థులకు కూడా తక్షణమే వర్తింప చేయండి..మాజీ ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు పివి శేషయ్య.

*రెవిన్యూ అధికారులకు పై సియం సీరియస్*…*ప్రభుత్వ ఉద్యోగులపై ఆరోపణలు, కేసులు పెట్టే వారికి రక్షణ కల్పించేలా సర్కార్‌ చర్యలు.. *పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు పటిష్ట చర్యలు ; రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా…*కాంస్య పతకం సాధించి దేశ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన ఓరుగ‌ల్లు ముద్దుబిడ్డ .. *నితీష్ కి కన్ను గీటిన లాలూ..ఎన్డీయేలో కలవరమేనా ? ..*అమెరికాలో విచిత్రం ఇస్తున్న నోరో వైరస్ …*చైనాలో మరోసారి హెల్త్ ఎమర్జెన్సీ

⭐సూపర్-6 హామీలు కచ్చితంగా అమలు చేస్తాం..గత పాలనంతా విధ్వంసం…మేము రిపేర్లు చేస్తూ వెళ్తున్నాం..తప్పుడు పనులు చేయొద్దు.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు హెచ్చరిక : సీఎం చంద్రబాబు ..*మాదాపూర్ పేస్ హాస్పిటల్‌లో దారుణం.. *ఒక్క పైసా కూడా అవినీతి లేదు. -కేటీఆర్‌ ..*.. ఫారిన్‌లో ఎడ్యుకేషన్‌ పేరుతో మోసాలు. బోగస్‌ కన్సల్టెన్సీ ప్రతినిధులను అరెస్ట్‌ చేసిన పోలీసులు… సైబర్ నేరాలకు అడ్డా ‘వాట్సప్’.. హోంశాఖ నివేదిక.*.. యాపిల్ పండ్ల మాటున మద్యం అక్రమ తరలింపు …*తిరుపతిలో మత్తు వదిలించిన పోలీస్