రాహుల్ గాంధీపై కేసు నమోదు…అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు బీజేపీ అహంకారానికి నిదర్శనం.. వైఎస్ షర్మిల … అమిత్ షా వ్యాఖ్య‌ల‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి సీతక్క, త‌మిళ‌ న‌టుడు విజ‌య్‌, నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి, భీమ్ ఆర్మీ (తెలంగాణ),సిపిఐ (యం యల్ ) లిబరేషన్ పార్టీ…

👉రాహుల్ గాంధీపై కేసు నమోదు*
పార్లమెంట్ తోపులాట ఘటనలో బీజేపీ ఎంపీలు అనురాగ్ సింగ్ ఠాకూర్, బన్సూరి స్వరాజ్ ఫిర్యాదు మేరకు.. రాహుల్ గాంధీపై పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్టేషన్లో కేసు నమోదు చేసిన పోలీసులు.
👉ఈ దేశంలో అదాని ,మోడీ ,బీజేపీ మాత్రమే ఉండాలని బీజేపీ చూస్తుంది …హైదరాబాద్…*మంత్రి సీతక్క*
ప్రతీ పౌరుడి సమానత్వం కోసం రాహుల్ గాంధీ పోరాడుతున్నారు.మను ధర్శశాస్త్రం ను బీజేపీ పాటిస్తుంది.
కుల ,మత , ధనిక అంతరాలను సూచించే మను ధర్మశాస్త్రం ను బీజేపీ అనుసరిస్తుంది.
అంబెడ్కర్ పేరు తలచడాన్ని అమిత్ షా తప్పుపట్టడం అంటే.. అంబెడ్కర్ ను అవమానించడమే.
దేశ ప్రజలకు అమిత్ షా క్షమాపణ చెప్పాలి.
అట్టడుగు వర్గాలకు దేవుడు అంబెడ్కర్..
రాజ్యంగం ను తొలగించాలనే బీజేపీ కుట్ర బయటపడింది.
అంబెడ్కర్ ఔనత్యాన్ని చాటింది నెహ్రూ.గాంధీ కుటుంబం పార్టీ అంటుంన్న మోడీ..మూడు సార్లు సీఎం గా ,మూడు సార్లు పీఏం గా ఎందుకు ఉన్నారు..అంబెడ్కర్ పేరు లేకుండా చేసే కుట్ర చేస్తుంది.భవిష్యత్ లో ఓకే ఎన్నిక ,ఓకే పార్టీ ,ఓకే వ్యక్తి అనే కుట్ర కు బీజేపీ తెరలేపిందని ఆరోపించారు.
👉బాబాసాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు బీజేపీ అహంకారానికి నిదర్శనం..
వైఎస్ షర్మిలా రెడ్డి APCC చీఫ్
-భారత రాజ్యాంగానికి ఇది ఘోర అవమానం.
-దళిత, గిరిజన, బీసీ, మైనారిటీ ప్రజల మనోభావాలు తీవ్రంగా దెబ్బతీసినట్లే. -అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని రద్దు చేసి మనుస్మృతిని ..-అమలు చేసేందుకు సంఘ్ పరివార్ కుట్రలో భాగమే ఇదంతా. -మనుస్మృతిని బీజేపీ విశ్వసిస్తుంది కాబట్టే అనుక్షణం రాజ్యాంగంపై దాడి చేస్తోంది.
-రాజ్యాంగ నిర్మాతను ప్రతి సారి హేళన చేస్తోంది.
-మన రాజ్యాంగం మీద, మన జాతీయ జెండా మీద బీజేపీకి గౌరవం లేదని మరోసారి నిరూపితం అయ్యింది.
-అంబేద్కర్ ను అవమానించినందుకు అమిత్ షా వెంటనే క్షమాపణలు చెప్పాలి.
*మంత్రి పదవికి తక్షణం రాజీనామా చేయాలి.
-అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా AICC పిలుపు మేరకు ఇవ్వాళ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు పెద్దఎత్తున నిరసనలు వ్యక్తం చేయాలని కోరుతున్నా.
👉అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై స్పందించిన *తెలంగాణ రాష్ట్ర ఎంపీల ఫోరం రాష్ట్ర కన్వీనర్, నాగర్కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి
భారత రాజ్యాంగ నిర్మాత మహా గొప్ప వ్యక్తి అంబేద్కర్ ని అవమానించడం సిగ్గు చేటని ఘాటుగా స్పందించారు .
అమిత్ షా వెంటనే యావత్ భారతదేశానికి క్షమాపణలు చెప్పి మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
అంబేద్కర్ ఆశయాల పరిరక్షణకే పోరాడుతామన్నారు.
అంబేద్కర్ కేవలం రాజ్యాంగ శిల్పి మాత్రమే కాకుండా, సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్యానికి ప్రాణం పోసిన మహానేత అని గుర్తుకు చేశారు.
ఇటువంటి మహానేతపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మన దేశ ప్రజాస్వామ్య భావాలను అవమానించే చర్య నే అని అన్నారు.అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా పార్లమెంట్ ఆవరణలో న్యాయబద్ధమైన పోరాటం చేస్తామన్నారు
*నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి * కాంగ్రెస్ ఎంపీలతో కలిసి ఈ అంశాన్ని పార్లమెంట్‌ సమీపంలో గళమెత్తి ప్రశ్నించారు.
డాక్టర్ అంబేద్కర్ ప్రతిష్ఠను కాపాడటానికి కాంగ్రెస్ పార్టీ నిరంతరంగా పోరాటం చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
*డాక్టర్ మల్లు రవి *, రాహుల్ గాంధీ తో కలిసి నిరసన కార్యక్రమంలో పాల్గొని కేంద్ర ప్రభుత్వ దురహంకార విధానాలను ఎండగట్టారు.ఇది కేవలం వ్యక్తిగత వ్యాఖ్యల వ్యతిరేకత మాత్రమే కాదు, అంబేద్కర్ ఆశయాలను కాపాడటానికి దేశ వ్యాప్తంగా ప్రజల గళాన్ని సమీకరించేందుకు చర్చించడానికి సంబంధించినదిగా ఆయన పేర్కొన్నారు.
సమాజంలో అట్టడుగు వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వడంలో అంబేద్కర్ చూపిన దిశలోనే నడవడం మన బాధ్యత..
ప్రజాస్వామ్య రక్షణే ద్యేయంగా అందరూ ముందుండాలి అన్ని *నాగర్కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి * అన్నారు.. తెలంగాణ ఇన్చార్జ్ హైదర్ అలీ..
👉 అమిత్ షా వ్యాఖ్య‌ల‌పై త‌మిళ‌ న‌టుడు విజ‌య్‌ విమ‌ర్శ‌.. కొంత‌మందికి అంబేద్క‌ర్ పేరు అంటే గిట్ట‌దంటూ ట్వీట్‌!…ఇటీవల అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై దుమారం..
అంబేద్కర్ పేరును పదే పదే చెప్పుకునే ఫ్యాషన్ ఇప్పుడు ఉందన్న అమిత్ షా..ఆయ‌న వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుబ‌డుతూ టీవీకే అధ్యక్షుడు విజ‌య్ ట్వీట్‌
ఇటీవల పార్లమెంటులో రాజ్యాంగ నిర్మాత‌ బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై తమిళ సూపర్ స్టార్, తమిళగ వెట్రి కళ‌గం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ విమర్శలు గుప్పించారు. కొంతమందికి అంబేద్కర్ పేరు అంటే అలెర్జీ అని విమ‌ర్శించారు. ఇంకా చెప్పాలంటే గిట్ట‌దు అని అన్నారు. ఈ మేర‌కు ఎక్స్ (ట్విట్ట‌ర్‌)లో విజయ్ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఓ పోస్టు చేశారు.
అంబేద్కర్ భారత పౌరులందరికీ స్వాతంత్ర్య స్ఫూర్తిని ర‌గిలించిన సాటిలేని రాజకీయ మేధావి అని విజ‌య్‌ కొనియాడారు. అంబేద్కర్ వారసత్వం అట్టడుగు వర్గాలకు ఆశాజ్యోతి అని, సామాజిక అన్యాయానికి, వ్యతిరేక ప్రతిఘటనకు ప్రతీక అని విజయ్ పేర్కొన్నారు.
ఆయ‌న‌ పట్ల తనకున్న ప్రగాఢ అభిమానాన్ని నొక్కి చెబుతూ, నిరంతరం అంబేద్కర్ నామాన్ని జపిస్తానని ఈ సంద‌ర్భంగా విజ‌య్ అన్నారు. “అంబేద్కర్.. అంబేద్కర్.. అంబేద్కర్.. మన హృదయాలలో, మన పెదవులపై ఆనందంతో ఆయన నామాన్ని జపించుదాం” అని టీవీకే అధ్యక్షుడు పిలుపునిచ్చారు.
ఇక ఉత్తర తమిళనాడులోని విక్రవాండిలో తన పార్టీ మొదటి ర్యాలీ సందర్భంగా టీవీకే సైద్ధాంతిక గురువులలో అంబేద్కర్‌ను విజయ్ పేర్కొన్న విష‌యం తెలిసిందే. ఈ ప్రాంతం గణనీయమైన దళిత జనాభాను కలిగి ఉంది. అలాగే విదుతలై చిరుతైగల్ కట్చి (వీసీకే) అధ్యక్షుడు తిరుమావళవన్ థోల్ కంచు కోటగా పరిగణించబడుతుంది. తిరుమావళవన్ స్థాపించిన వీసీకేని గతంలో దళిత్ పాంథర్స్ ఆఫ్ ఇండియా అని పిలిచేవారు.
కాగా, డిసెంబర్ 17న రాజ్యసభలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలను దేశవ్యాప్తంగా విపక్షాలు కూడా తీవ్రంగా ఖండించాయి. అంబేద్కర్ పేరును పదే పదే చెప్పుకునే ఫ్యాషన్ ఇప్పుడు ఉందని, ప్రతిపక్షాలు తరచూ దేవుడి పేరు జ‌పిస్తే స్వర్గానికి చేరుకునేవారని ఆయ‌న‌ అన్నారు. దీంతో అమిత్ షా వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
👉👉 బాబా సాహెబ్ అంబేద్కర్ అభిమానులకు ఖచ్చితంగా స్వర్గం కాదు. స్వరమే కావాలి..వనం మహేందర్..
భీమ్ ఆర్మీ (భారత్ ఏక్తా మిషన్) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రాజ్యాంగ నిర్మాత పట్ల ఇటువంటి అసహ్యకరమైన ఆలోచన బిజెపి మరియు ఆర్‌ఎస్‌ఎస్ పాఠశాల నుండి ఉద్భవించింది.
సమానత్వం, సామ్యవాదం, లౌకికవాదం, సోదరభావం మరియు రాజ్యాంగంపై నమ్మకం ఉన్న దేశంలోని 100 కోట్ల మందికి పైగా నిరాశ్రయులైన, అణచివేయబడిన, దోపిడి, అపహాస్యం, దళిత, వెనుకబడిన, పేద, మైనారిటీ మరియు న్యాయాన్ని ప్రేమించే ప్రజలకు బాబా సాహెబ్ అంబేద్కర్ దేవుడు. బాబా సాహెబ్ కోట్లాది ప్రజలను నరక జీవితం నుండి విముక్తి చేసి ఈ జన్మలోనే వారికి మోక్షాన్ని అందించారు.
రాజ్యాంగ నిర్మాత పట్ల హోం మంత్రికి ఉన్న సంకుచిత మనస్తత్వాన్ని మేము ఖండిస్తున్నామనీ మరియు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
👉అమిత్ షా ను మంత్రి పదవి నుంచి తొలగించాలి*
*సిపిఐ (యం యల్ ) లిబరేషన్ పార్టీ*
*జిల్లా నాయకుడు గాలి రవిరాజ్…
మనువాద మతోన్మాద కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పార్లమెంటులో ఎగతాళి చేసి అహంకారంగా మాట్లాడటం దుర్మార్గమైన దారుణమైన అహంకార చర్య అని సిపిఐ (యం యల్ ) లిబరేషన్ పార్టీ జిల్లా నాయకుడు గాలి రవిరాజ్ అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ మతోన్మాద చర్యను సిపిఐ (యం యల్ ) లిబరేషన్ పార్టీ ఖండిస్తుందన్నారు. ప్రజలు, ప్రజాతంత్ర వాదులందరూ ఖండించాలన్నారు. అమిత్ షా క్షమాపణ చెప్పాలన్నారు.
ఎన్నిసార్లు అంబేద్కర్ అని పదే పదే అతడిని స్మరించుకుంటారు దానికి బదులుగా ఏదో ఒక హిందూ దేవుడిని స్మరించుకుంటే మీకు ఏడు జన్మలకు స్వర్గం దక్కుతుంది కదా అనటమే కాకుండా మాటి మాటికీ అంబేద్కర్ పేరు ఎత్తడం వీళ్లకు పెద్ద ఫ్యాషన్ అయిపోయిందని ఏగతాళిగా మాట్లాడటం సరికాదన్నారు
ఎన్పికల ముందు అంబేద్కర్ పేరు జపం చేసి అధికారం లోకి వచ్చాక ఆయన పేరు ఎత్తకూడదని చెప్పటం సిగ్గు చేటని నేటి మనువాద మతోన్మాద ప్రభుత్వంలో రాజ్యాంగం పై, ప్రభుత్వరంగ సంస్ధలపై దాడి చేస్తున్నారన్నారు. ఈ దాడులను వ్యతిరేకిస్తూ రాజ్యాంగాన్ని కాపాడుకోవలిసిన అవసరం ఎంతయినా ఉందన్నారు. అమీషాను మంత్రి పదవి నుంచి తొలగించాల్సిని వారు డిమాండ్ చేశారు

7k network
Recent Posts

బీజేపీ నేతలు వారే కొట్టుకుని..నెపం రాహుల్‌గాంధీపై నెడుతున్నారు : వైఎస్‌ షర్మిల … “గుజరాత్ లో గుండె సమస్యలు లేని వారికి వైద్యం చేసి వీరిపై బిల్లులు పెట్టిన 17 మందిలో 5 మంది ICU లో ఇద్దరు మృతి !… ఎపి హైకోర్టులో మెత్తం 2,47,097 కేసులు,జిల్లా,సబార్డినేట్‌ కోర్టుల్లో 9,04,462 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి😱 :కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌* … పుత్రికోత్సాహంలో లిబ‌రేష‌న్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు ద‌ళాధిప‌తి విజయ్ కుమార్ …డ్రగ్స్ వద్దు బ్రో పోస్టర్ ను ఆవిష్కరించిన సినీ నటి శ్రీ లీల … పొరుమామిళ్ళ బంగారు వ్యాపారస్తులకు 60 లక్షలు కుచ్చు టోపీ పెట్టిన గోల్డ్ షాప్ యజమాని ..నేర సమీక్షా సమావేశం నిర్వహించిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు .. రోడ్డు పక్కన 52 KGల బంగారం,రూ.10 కోట్ల డబ్బు.. జగనన్నకు ముందస్తు జన్మదిన వేడుకలు (మార్కాపురం)..

ఎంపీల తోపులాట.. అంబేడ్కర్ పై షా వ్యాఖ్యలను కప్పిపుచ్చేందుకే – షర్మిల… బీజేపీని వణికించిన శీతాకాలం! … ప్రైవేట్ బస్సు ఢీకొని విద్యార్థి మృతి…అల్లూరి జిల్లా గొలుగొండలో 450 కేజీల గంజాయి పట్టివేత … మానవత్వం చాటుకున్న ఖమ్మం జిల్లా కలెక్టర్…తిరుపతిలో‌ వ్యభిచార రాకెట్ పై పోలీసుల దాడి..

రాహుల్ గాంధీపై కేసు నమోదు…అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు బీజేపీ అహంకారానికి నిదర్శనం.. వైఎస్ షర్మిల … అమిత్ షా వ్యాఖ్య‌ల‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి సీతక్క, త‌మిళ‌ న‌టుడు విజ‌య్‌, నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి, భీమ్ ఆర్మీ (తెలంగాణ),సిపిఐ (యం యల్ ) లిబరేషన్ పార్టీ…

ఆపరేషన్ వైసీపీ.. బాబు మాస్టర్ ప్లాన్?…ప్రియాంక గాంధీకి తొలి సవాల్! … కరోనా కంటే 7 రెట్లు ఎక్కువ ప్రాణాంతకమైన అంటువ్యాధి రాబోతోంది..! – WHO హెచ్చరిక!…టీడీపీలో ఆళ్ల నాని చేరిక వాయిదా… ధ్రువపత్రాలపై జగన్ ఫోటో- హైకోర్టులో విచారణ.. శ్రీ తేజ్ ను పరామర్శించిన అల్లు అరవింద్ .. ఉద్యోగాల పేరుతో మోసం చేశాడంటూ బాధితుల ర్యాలీ … అల్లు అర్జున్ చెప్పేవన్నీ అబద్ధాలా ? .. గద్దర్ జాతీయ సేవ పురస్కారం అందుకున్న మోతే కృష్ణ* … శారీరకంగా వాడుకొని యువతిని మోసం చేసిన ప్రియుడు… పెళ్లి పేరుతో 50 మంది యువతులను మోసం చేసిన వ్యక్తి..

అదానీ, మణిపూర్ అంశాలపై ప్రధానమంత్రి మోడీ మౌనం వీడాలని డిమాండ్ చేస్తూ ఏఐసీసీ దేశవ్యాప్త నిరసన .. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఒంగోలు ఎంపీ మాగుంట, ఎమ్మెల్యే ముత్తుముల.. కంభం మండలంలో పొలం బడి

నేతలకు ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక సూచన ..వక్ఫ్ బోర్డును కాపాడే సత్తా తెలుగుదేశం పార్టీకే ఉంది: మొహమ్మద్ ఫతావుల్లా… వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి తిరుగుబాటు! … ఏసీబీకి చేరిన గవర్నర్ అనుమతి పత్రం..వాట్ నెక్ట్స్ !…ఆ ముగ్గురు లో ఎవరు ఆ బిడ్డ కి తండ్రి ? .. సెల్ ఫోన్ల రికవరీలో రాష్ట్రంలోనే ప్రధమ స్థానంలో తిరుపతి జిల్లా … .