ఐకాన్ స్టార్ ఐతే ఏంటి?.. సీఎంకు అల్లు అర్జున్ సారీ చెప్పాల్సిందే! : మంత్రి కోమటిరెడ్డి ..”అల్లు అర్జున్ ఏమైనా తీస్ మార్ ఖాన్ అనుకుంటున్నాడా! : సీపీ సీవీ ఆనంద్ సీరియస్ వార్నింగ్… అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి?.. బీడీ కార్మికులకు శుభవార్త … కర్నూలు జిల్లాలో….కలకలం….క్లాస్‌రూమ్‌లో ఉండగానే టీచర్‌ కిడ్నాప్‌.. అన్నమయ్య జిల్లాలో కాల్పులు కలకలం .. పేద‌ల‌ను కేంద్రంగా చేసుకుని పార్టీలు ఇస్తున్న ఉచిత హామీల‌తో దేశం అల్ల‌క‌ల్లోలం అవుతోంద‌న్న ఆర్బిఐ … ఇన్స్‌పెక్టర్‌కే టోకరా ఇచ్చిన సైబర్ నేరగాళ్లు..! .. రాష్ట్ర స్థాయి క్యారమ్స్ పోటీలు ప్రారంభించిన మంత్రి డా.డోలా …

👉 అల్లు అర్జున్ ఏమైనా తీస్ మార్ ఖాన్ అనుకుంటున్నాడా!…
అసలు అల్లు అర్జున్ కి తెలంగాణలో ఆధార్ కార్డు ఉందా!
పోలీస్ అధికారులు నాకు చెప్పలేదు అంటున్నావు.. నీకు ఎందుకు చెప్పాలి నువ్వు ఏమన్నా తీస్ మార్ ఖాన్ అనుకుంటున్నావా…నువ్వు మామూలు పౌరుడివి.. నీకు ఆధార్ కార్డు ఆంధ్రలో ఉందా తెలంగాణలో ఎక్కడ ఉందో కూడా తెలియదు…అసెంబ్లీలో నీ వల్ల గంట సమయం పోయింది.. నీ గురించి మేము ఎందుకు బాధపడాలి..
తెలంగాణ సమాజం సౌమ్యులు కాబట్టి మీరు ఇంకా ఇక్కడ నాటకాలు చేస్తున్నారు – ఏసీపీ సబ్బతి విష్ణు మూర్తి
👉హీరో అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి?**
హైదరాబాద్:
పుష్ఫ 2 సినిమా హీరో అల్లు అర్జున్ ఇంటిపై కొద్దిసేపటి క్రితంరాళ్ల దాడి జరిగినట్లు తెలుస్తోంది.
జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంపై కొందరు జేఏసీ నాయకులు రాళ్ల దాడికి పాల్పడినట్లు సమాచారం. సంథ్య థియేటర్ వద్ద తోపులాట ఘటన కేసులో అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడం, ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో అల్లు అర్జున్ ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా అసెంబ్లీలో సంథ్య థియేటర్ వద్ద తోపులాట ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి,స్పందించడం, అల్లు అర్జున్ వైఖరిని తప్పుపట్ట డంపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన అల్లు అర్జున్ తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని, శాసనసభలో రేవంత్ చెప్పినవన్నీ అవాస్తవాలని సీఎం పేరు ప్రస్తావించ కుండా చెప్పారు.
తనపై ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందన్నారు. అల్లు అర్జున్ కాంగ్రెస్ ప్రభు త్వంపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలంటూ కాంగ్రెస్ శ్రేణులు తెలంగాణ వ్యాప్తంగా నిరసన కార్యక్ర మాలు నిర్వహిస్తున్నారు.
ఈ దశలో కొద్దిసేపటి క్రితం అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగిందనే ప్రచారం జరుగుతోంది. దాడి జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేరనే సమాచారం..
👉బౌన్సర్లు పబ్లిక్‌ను ఎక్కడైనా తోసివేస్తే తాటతీస్తాం..
*బౌన్సర్ల తీరుకు సెలబ్రిటీలదే బాధ్యత..
*బౌన్సర్లకు సీపీ సీవీ ఆనంద్ సీరియస్ వార్నింగ్*
👉 పేద‌ల‌ను కేంద్రంగా చేసుకుని పార్టీలు ఇస్తున్న ఉచిత హామీల‌తో దేశం అల్ల‌క‌ల్లోలం అవుతోంద‌ని ఆర్బిఐ తెలి పింది. ఉచిత విద్యుత్తు, ఉచిత ప్ర‌జార‌వాణా(ఆర్టీసీ), ఉచిత వంట‌గ్యాస్ సిలిండ‌ర్లు, యువ‌త‌కు నిరుద్యోగ భృతి, రైతుల‌కు రుణ మాఫీ, పెట్టుబ‌డి సాయం, మ‌హిళ‌ల‌కు నిధులు.. ఇలాంటి వాటి వ‌ల్ల రాష్ట్రాల పెట్టు బ‌డి వ్య‌యం త‌గ్గిపోయిందని తెలిపింది. ఇది మున్ముందు కూడా సాగితే.. రాష్ట్రాలు మ‌రిన్ని అప్పులు చేయాల్సి ఉంటుంద‌ని పేర్కొంది. ఈ క్ర‌మంలో వాటిని త‌క్ష‌ణ‌మే వ‌దిలి పెట్టేందుకు ప్ర‌య‌త్నించాల‌ని సుద్దులు చెప్పింది.
👉 నెటిజ‌న్ల కామెంట్లు ఇవీ.. పేద‌ల‌కు ఉచితాలు, నిరుద్యోగుల‌కు భృతి ఇవ్వ‌డాన్ని త‌ప్పుబ‌ట్టిన ఆర్బీఐపై నెటిజ‌న్లు నిప్పులు చెరిగారు. 4 లక్షల కోట్ల రూపాయల కార్పొరేట్ల రుణాలు మాఫీ చేస్తే ఏమీ కాదా?.. బడా కార్పొరేట్ల టాక్స్ తగ్గిస్తే ఏమీ కాదా? వాళ్లకు ఉచితంగా భూములు, బ్యాంకుల్లో డబ్బులు, మౌలిక సదుపాయాల పేరుతో అన్ని కట్టబెడితే ఏమి కాదా? అని నెటిజ‌న్లు ప్ర‌శ్నించారు. సమాజంలో చేయూత ఇవ్వాల్సిన మహిళలకు ఇస్తే మాత్రం వనరులు తగ్గిపోతాయా? పకృతి సంపదను కార్ఫోరేట్ సంస్థలకు అప్పన్నంగా అప్ప‌గిస్తే మాత్రం.. దేశానికి, రాష్ట్రాలకు ఏమీ కాదా? అని ప్ర‌శ్నించ‌డం గ‌మ‌నార్హం. కాగా, గ‌తంలో ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్‌గా రంగ‌రాజ‌న్ ఉన్న‌ప్పుడు కూడా.. ఉచిత ప‌థ‌కాలు ఇచ్చే రాష్ట్రాల‌కు అప్పులు ఇవ్వ‌డం త‌గ్గిస్తామ‌ని పేర్కొన్నారు. ఇది అప్ప‌ట్లో పెను దుమారానికి దారి తీసింది. ఆయ‌న మంచి సంస్క‌ర‌ణ‌లు చేయాల‌ని అనుకున్నా.. రాజ‌కీయ నేత‌లు ముందుకు సాగ‌కుండా.. కాళ్ల‌కు బంధం విధించార‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి .
👉ఐకాన్ స్టార్ ఐతే ఏంటి?.. సీఎంకు అల్లు అర్జున్ సారీ చెప్పాల్సిందే!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సినీనటుడు అల్లు అర్జున్ వెంటనే క్షమాపణలు చెప్పాలని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. తన ఇమేజ్ దెబ్బతీశారంటూ ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై ఎదురుదాడిగా మాట్లాడటం సరికాదన్నారు. శనివారం మీడియా సమావేశంలో అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తాజాగా స్పందించారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు లీగల్ టీమ్ ఒప్పుకోలేదనడం హాస్యాస్పదం. అసెంబ్లీలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తే ఇమేజ్ దెబ్బతిన్నదని అంటున్నారని మండిపడ్డారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా చెబుతున్నా.. ఇక నుంచి బెనిఫిట్ షోలు ఉండవని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తేల్చి చెప్పారు. త్వరలో సినీ ఇండస్ట్రీ పెద్దలతో భేటీ అయి చర్చిస్తామని మంత్రి తెలిపారు. మంచి సినిమాలు తీస్తే ప్రోత్సహిస్తాం.. సినీరంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను అల్లు అర్జున్ తప్పుబట్టడం సరికాదని.. అల్లు అర్జున్ వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్ క్షమాపణలు చెప్పాలన్నారు. తొక్కిసలాటపై అసెంబ్లీ తన ఇమేజ్ దెబ్బతీశారని అల్లు అర్జున్ అంటున్నారు.. కానీ, సీఎం వ్యక్తిగతంగా ఎవరి గురించి మాట్లాడలేదని.. ఆరోజు జరిగిన ఘటనను పూర్తిగా వివరించి చెప్పారన్నారు. రేవతి మరణానికి అల్లు అర్జున్ కారణమయ్యాడని మంత్రి అన్నారు.
👉పోలీసులు వద్దని చెప్పినా.. అల్లు అర్జున్ రావడం వల్లే తొక్కిసలాట జరిగిందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. అల్లు అర్జున్ పోలీసులతో దురుసుగా ప్రవర్తించారన్నారు. ఈ ఘటన జరిగిన తర్వాత ఆయన వెళ్లి కనీసం బాధితులను పరామర్శించలేదని మండిపడ్డారు. అరెస్ట్ సమయంలో పోలీసులు ఎంతో సహనంతో వ్యవహరించారన్నారు. ఒక వ్యక్తి ప్రాణం పోవడం మామూలు విషయం కాదన్నారు. అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ అయితే ఏంటీ? చట్టం ముందు అందరూ సమానులేనని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు. స్టార్లకు ప్రత్యేక మినహాయింపులు ఏమీ ఉండవన్నారు. తప్పు చేస్తే నటుడికైనా.. ఎమ్మెల్యేకైనా శిక్ష తప్పదన్నారు.
అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేస్తే కేటీఆర్,హరీశ్ రావు ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని.. వారికి మెంటల్ బ్యాలెన్స్ తప్పిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. ఒక వ్యక్తి ప్రాణం పోతే అరెస్టు చేయరా? అని ప్రశ్నించారు. ఐకాన్ స్టార్? సూపర్ స్టార్ అయితే ఏంటని నిలదీశారు. చట్టం ఎవరికీ చుట్టం కాదన్నారు. పుష్ప-2కు 2 నుంచి 3వేల కోట్లు వచ్చాయంటున్నారని… రేవతి కుటుంబానికి రూ. 20 కోట్లు ఇస్తే ఏంటని అన్నారు.
👉బీడీ కార్మికులకు శుభవార్త*…
*తాడిపత్రి కడప రోడ్డులో 1994లో పట్టాలు పొందిన బీడీ కార్మికులకు శుభవార్త* గతంలో స్థలాలు రద్దు చేయడానికి YSRCP నాయకులు ప్రయత్నించగా మున్సిపల్ చైర్మన్ *జెసి ప్రభాకర్ రెడ్ది* గారు బీడీ కార్మికుల తరపున కోర్టుకి వెళ్లి స్థలాలు నిలబెట్టించారు. తాజాగా ఆ స్థలాల్లో పక్కా గృహాలు కట్టించేందుకు MLA *జెసి అష్మిత్ రెడ్డి* గారు శ్రీకారం చుట్టారు. కావున 1994లో పట్టాలు పొందిన బీడీ కార్మికులు తక్షణమే పట్టాతో పాటు సంబందించిన పత్రాలు ఇవ్వాలని తెలియజేశారు. పట్టా ఉన్న ప్రతి ఒక్కరూ ఈ కింది పత్రాలను రెండు రోజుల్లోగా MLA గారి కార్యాలయంలో అందజేయగలరు.
• దరఖాస్తు దారుని ఆధార్ కార్డు,
• రేషన్ కార్డు,
• ఇంటి స్థలం పత్రాలు లేదా డి.పట్టా లేదా స్థల ధ్రువీకరణ పత్రం,
• పాన్ కార్డు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు,
• ఆధార్ లింక్ అయిన బ్యాంక్ ఖాతా పాసు పుస్తకం నకలు,
• దరఖాస్తుదారుని తల్లిదండ్రుల, భార్య, భర్తల ఆధార్ కార్డుల నకలు,
గమనిక : సమయం లేదు.. రెండు రోజుల్లో పత్రాలు ఇచ్చిన వారికి మాత్రమే ఇళ్లు మంజూరు అవుతాయి అన్న విషయం గమనించగలరు.
మరిన్ని వివరాలకు
కిరణ్ 7998799499,
జమీర్ 9985792111 ,
సోము 9441145966 లను సంప్రదించగలరు.
👉 నేడు (22/12/2024) తాడిపత్రి పట్టణం, సంజీవ్ నగర్ లో వెలసిన గాయత్రి మాత ఆలయం వద్ద దాదాపు 5 కోట్ల వ్యయంతో కల్యాణ మండప నిర్మాణానికి భూమిపూజ చేసిన మున్సిపల్ చైర్ పర్సన్ జెసి ప్రభాకర్ రెడ్డి, జెసి ఉమమ్మ దంపతులు.ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన ప్రముఖులు పాల్గొన్నారు…
👉ఏపీ లో కర్నూలు జిల్లాలో….కలకలం….క్లాస్‌రూమ్‌లో ఉండగానే టీచర్‌ కిడ్నాప్‌..కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేసిన ***
కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం అల్లుగుండు ప్రభుత్వ పాఠశాలలో టీచర్ మునీర్ అహ్మద్ కిడ్నాప్ అయ్యారు. క్లాస్‌రూమ్‌లో ఉండగానే దుండగులు కిడ్నాప్ చేయడం కలకలం రేపుతోంది. ఉదయం 10 గంటల నుంచి ఆచూకీ లేకపోవడంతో కుటుంబసభ్యుల ఆందోళనకు గురయ్యారు.
పోలీసులే కిడ్నాప్ చేసారని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మునీర్ అహ్మద్ కిడ్నాప్ కావడం ఇది మూడవసారి అని కుటుంబ సభ్యులు అంటున్నారు.
కర్నూలు సెంట్రల్ స్కూల్ వెనుక 20 కోట్ల రూపాయల విలువ చేసే భూవివాదంలో కిడ్నాప్ చేశారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. భూవివాదంపై మునీర్ అహ్మద్ ఫిర్యాదుదారుగా ఉన్నారు. భూమిపై హైకోర్టులో విచారణ కొనసాగుతోందని.. వెల్దుర్తి పీఎస్‌లో బాధితుని భార్య ఫిర్యాదు చేశారు.
మునీర్ అహ్మద్ సోదరుడు, రిటైర్డ్ ఎస్బీఐ అధికారి మక్బూల్ బాషా కూడా కనిపించడం లేదని కుటుంబ సభ్యులు అంటున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు వెల్దుర్తి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
👉అన్నమయ్య జిల్లాలో కాల్పులు కలకలం రేపాయి వ్యాపారులే టార్గెట్‌గా దుండగులు రెచ్చిపోయా రు. ఒక్కసారిగా కాల్పులు జరిపారు. దీంతో అక్కడు న్న వారు తీవ్ర భయాందో ళనలకు గురయ్యారు.
ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. అన్నమయ్య జిల్లాలో ఇద్దరు పాత సామాన్ వ్యాపారులపై తుపాకులతో దాడి చేయడం సంచలనం కలిగించింది. పోలీసులు రంగంలోకి దిగి దుండగుల కోసం గాలింపు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే…
అన్నమయ్య జిల్లాలో ఇవాళ ఉదయం రాయచోటి మండలం మాధవరంలో ఇద్దరిపై దుండగులు కాల్పులకు దిగారు. విచక్షణ రహితంగా తుపాకులతో దాడులకు పాల్పడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
పాత సామాగ్రి వ్యాపా రులపై గుర్తుతెలియని దుండగులు తుపాకీతో కాల్పులు జరపడంతో అన్నమయ్య జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దుండగుల కాల్పుల్లో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
పోలీసులకు సమచారం అందండతో సంఘటన జరిగిన స్థలానికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతు న్నారు. దుండగుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
వారి కదలికల కోసం దగ్గరలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. కాల్పులు జరిపిన ఇద్దరికి ఎవరితో నైనా గొడవలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నా రు. అసలు దుండగులు ఎక్కడి నుంచి వచ్చారు. కాల్పులు జరపడానికి గల కారణాలు ఏంటనే దానిపై పోలీసులు సీరియస్‌గా దర్యాప్తు జరుపుతున్నారు.
👉వీళ్ళు మామూలోలు కాదు బాబోయ్…… ఇన్స్‌పెక్టర్‌కే టోకరా ఇచ్చిన సైబర్ నేరగాళ్లు..!*
ఇటీవల కాలంలో నెట్టింట్లో బూచోళ్లు ఎక్కువయ్యారు. అడ్డమైన లింకులు పెట్టి, డిజిటల్ అరెస్ట్‌ల పేరుతో అడ్డంగా దోచుకుని సైబర్ ముఠాలు.. వైఫైలా మన చుట్టూరా ఉన్నాయి. అలాంటి వాళ్ల ఉచ్చులో పడుతున్న బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
విజయవాడకు చెందిన ఒక సీఐ వ్యక్తిగత పనుల మీద ముంబై వెళ్లారు.
అక్కడ ఒక హోటల్లో ఆధార్‌ కార్డు, ఫోన్ నెంబర్ ఇచ్చి గదిలోకి దిగారు. ఐదు రోజుల తర్వాత డిసెంబర 19వ తేదీన గురువారం విమానంలో విజయవాడకు వచ్చేశారు. శుక్రవారం ఉదయం ఒక గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి బెదిరించాడు. మీరు ముంబై వచ్చారా అని ఆరా తీశారు. అక్కడ ఒక రోడ్డు యాక్సిడెంట్ చేశారని.. మీ వల్ల ఒక వ్యక్తి చనిపోయాడని బెదిరించడం ప్రారంభించారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో వచ్చే ఎన్నో కేసులను డీల్ చేసిన సీఐకే అదే తరహా ఫోన్ రావడంతో కంగుతిన్నారు. ఫోన్ చేసిన వ్యక్తికి తనదైన శైలిలో ప్రశ్నలు వేసి క్లాస్ తీసుకోవడంతో నేరగాళ్లు ఫోన్ పెట్టేశారు.
మాస్డ్క్ ఆధార్ ఇస్తే మేలు.. హోటల్లో ఇస్తున్న ఆధార్ కార్డు ఇతర వివరాలు ఎలా దుర్వినియోగం అవుతున్నాయనటానికి ఇది ఒక ఉదాహరణ. ప్రతి ఒక్కరూ మాస్డ్క్ ఆధార్ కార్డు ఇస్తే బాగుంటుందని పోలీసులు సూచిస్తున్నారు. ఆధార్ కార్డులోని 12 అంకెల స్థానంలో చివరి 4 అంకెలు మాత్రమే కనిపిస్తాయి మిగిలిన వాటి స్థానంలో ఎక్స్ గుర్తు ఉంటుంది. ఇలాంటి ఆధార్ కార్డులతో చాలా వరకు మోసాలు నివారించవచ్చని పోలీసులు చెబుతున్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ హోటల్లో బ్యాంకింగ్, ఆధార్ నెంబర్లతో సంబంధంలేని ఫోన్ నెంబర్లు ఇస్తే మేలని చెప్తున్నారు. మరీ ముఖ్యంగా సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తున్నారు.
👉 హాస్పిటల్లో ఉన్న శ్రీతేజను చిరంజీవి ఎందుకు పరామర్శించట్లేదు
సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మొత్తం ఇలాగే మానవత్వం లేకుండా ఉంటారా – మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
👉 ఇమామ్‌కు రూ.10,000.. మౌజన్‌కు రూ.5,000 గౌరవ వేతనం చెల్లించేందుకు ఉత్తర్వులు జారీ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు
👉 ప్రకాశం జిల్లా శిoగరాయకొండ మండలం పాకలలో రాష్ట్ర స్థాయి క్యారమ్స్ పోటీలు ప్రారంభించిన మంత్రి డా. డోలా …
వివిధ జిల్లాల నుంచి పాల్గొన్న 400 మంది పాఠశాల, ఇంటర్ విద్యార్థులు…వైసీపీ హయాంలో క్రీడల్ని, క్రీడాకారులను పట్టించుకున్న పాపాన పోలేదు…మేం పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలు పెంపొందిస్తాం…జిల్లాలో ఇండోర్, ఔట్ డోర్ స్టేడియాల నిర్మాణాలు పూర్తి చేస్తాం …సింగరాయకొండ గురుకుల పాఠశాలలో రూ. 95 లక్షలతో ఇండోర్ స్టేడియం నిర్మిస్తున్నాం…దివ్యాంగుల కోసం రూ.200 కోట్లతో విశాఖలో 20 ఎకరాల్లో స్టేడియం నిర్మిస్తున్నాం…
పేద కుటుంబాల్లోని మెరికల్లాంటి క్రీడాకారుల్ని వెలికితీసి ప్రోత్సాహిస్తాం…డా.డోలా శ్రీ బాలవీరాంజ నేయస్వామి
రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి

7k network
Recent Posts

ప్రియాంక గాంధీపై బీజేపీ నేత ర‌మేష్ బిధూరి చేసిన అనుచిత వ్యాఖ్య‌ల ప‌ట్ల‌ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన మంత్రి సీత‌క్క‌*.. *నవీన్ కి చెక్ పెట్టినట్లే కేజ్రీవాల్ కి కూడా ?.. *ఈ ఫార్ములా రేసులో కొన్ని నిజాలు *.. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఛైర్మెన్ జంగా రాఘవ రెడ్డి … ఏపీ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, మంత్రి సత్య కుమార్ యాదవ్* …ప్రభుత్వ ఆస్తిని అప్పనంగా దోచుకున్న ఓం నారాయణ పై చర్యలు : లంబాడి హక్కుల పోరాట సంఘం.. *పొదిలి మాదిరెడ్డిపాలెం వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షులుగా ఎర్రం రెడ్డి

👉ఎంఎస్‌పీ పంజాబ్‌కే కాదు.. దేశమంతటికీ అవసరమే ..*తెలుగు తమ్ముళ్లకు సంక్రాంతి పండుగ ముందే వచ్చిందా.😲 ..హుస్నాబాద్ మైనార్టీ గురుకుల బాలికల పాఠశాల లో ఆకస్మిక తనిఖీలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ … ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాటులను పర్యవేక్షించిన జిల్లా అధికారులు ..*ఆత్మకూరులో ఇస్తేమ పనులను పర్యవేక్షించిన మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్ .. *

👉ఏపీలో రేపటి నుంచి ఉచిత ఓపీ సేవలు బంద్ …* విశాఖ పోర్టులో పట్టుకున్న బియ్యానికి కలెక్టర్ క్లీన్ చిట్..😲… *విశాఖ సెంట్రల్‌ జైల్ ను సందర్శించిన రాష్ట్ర హోం మంత్రి .. అగ్ని ప్రమాదాల పై అవగాహన సదస్సు.. *ఉచిత బస్సు కంటే ఇతర సంక్షేమ పథకాలకు ఖర్చు పెడితే బెటరేమో ! .. *అధికారులను సత్కరించిన పొదిలి పట్టణ టిడిపి అధ్యక్షుడు. . *నిలిచిపోయిన కాపు భవనాలను పునఃప్రారంభించాలి: బలిజ సేవ సంఘం డిమాండ్ .

2700 కోట్ల ఇల్లు.. రూ.10 లక్షల సూట్ ధరించే వారా విమర్శించేది? .. *పవన్ ఆదేశాలు.. సముద్ర తీరంలో రెండు బోట్లు సీజ్* .. *విజయవాడలో వెలుగు చూసిన అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారం .. *చంద్రగిరి ‘బీసీ’ విద్యార్థినులకు మెరుగైన వైద్యం* *తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ కు మంత్రి సవిత ఆదేశం*.. *ఆర్మీ వాహనం లోయలో పడి ఇద్దరు సైనికులు మృతి.. *పుత్తూరు సబ్ డివిజన్ పోలీసులు హెల్మెట్ వాడకంపై అవగాహన కార్యక్రమాలు … మైలవరం లో మిక్సీంగ్ రాజకీయ సెగలు…! ..*రాజకీయ దుమారం రేపిన పాలడుగు దుర్గా ప్రసాద్, ఎమ్మెల్యే వసంత కలయిక… *ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తూ పోలీస్ సిబ్బంది జీవన విధానం ఉండాలి : ఐజి వి సత్యనారాయణ.. *పోలీసుల వేధింపులు తట్టుకోలేక హుజూర్‌ నగర్ పోలీస్ స్టేషన్ ముందు యువకుడి ఆత్మహత్యాయత్నం .. * డిగ్రీ విద్యార్థులకు కూడా తక్షణమే వర్తింప చేయండి..మాజీ ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు పివి శేషయ్య.

*రెవిన్యూ అధికారులకు పై సియం సీరియస్*…*ప్రభుత్వ ఉద్యోగులపై ఆరోపణలు, కేసులు పెట్టే వారికి రక్షణ కల్పించేలా సర్కార్‌ చర్యలు.. *పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు పటిష్ట చర్యలు ; రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా…*కాంస్య పతకం సాధించి దేశ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన ఓరుగ‌ల్లు ముద్దుబిడ్డ .. *నితీష్ కి కన్ను గీటిన లాలూ..ఎన్డీయేలో కలవరమేనా ? ..*అమెరికాలో విచిత్రం ఇస్తున్న నోరో వైరస్ …*చైనాలో మరోసారి హెల్త్ ఎమర్జెన్సీ

⭐సూపర్-6 హామీలు కచ్చితంగా అమలు చేస్తాం..గత పాలనంతా విధ్వంసం…మేము రిపేర్లు చేస్తూ వెళ్తున్నాం..తప్పుడు పనులు చేయొద్దు.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు హెచ్చరిక : సీఎం చంద్రబాబు ..*మాదాపూర్ పేస్ హాస్పిటల్‌లో దారుణం.. *ఒక్క పైసా కూడా అవినీతి లేదు. -కేటీఆర్‌ ..*.. ఫారిన్‌లో ఎడ్యుకేషన్‌ పేరుతో మోసాలు. బోగస్‌ కన్సల్టెన్సీ ప్రతినిధులను అరెస్ట్‌ చేసిన పోలీసులు… సైబర్ నేరాలకు అడ్డా ‘వాట్సప్’.. హోంశాఖ నివేదిక.*.. యాపిల్ పండ్ల మాటున మద్యం అక్రమ తరలింపు …*తిరుపతిలో మత్తు వదిలించిన పోలీస్