కృష్ణా జిల్లాలో సుప్రసిద్ధ ఆలయాలలో ఒకటి అయిన శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం అవనిగడ్డ నియోజకవర్గంలోని మోపిదేవి గ్రామంలో ఉంది. ఈ ఆలయంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శ్రీ వల్లీ దేవసేన సమేతంగా కొలువైనది. భక్తుల కష్టాలను తీర్చే దైవంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మోపిదేవి ప్రసిద్ధి. ఈ ఆలయంలో శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కల్పవల్లి గా ప్రసిద్ధి చెందాడు. నూతనంగా వివాహం అయిన వధువరులు శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సంతాన సుబ్రమణ్య స్వామిగా సంతాన ప్రాప్తి కలుగుతున్నాడని భక్తుల నమ్మకం.
నాగుల చవితి పర్వదినాన్ని మోపిదేవి శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో రంగా రంగా వైభవంగా పురస్కరించారు. ప్రతీ సంవత్సరం నాగుల చవితి రోజున భక్తులు అధిక సంఖ్యలో ఆలయాన్ని సందర్శించి తమ మొక్కులను చెల్లించుకుంటారు.
Snake: గణపతి ఆలయంలోకి చొరబడిన తాచుపాము… ఆ తర్వాత ఏం జరిగిందంటే
అదే విధంగా ఈ సంవత్సరం నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకోవటానికి మోపిదేవి ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. పోలీస్ అధికారులతో పాటు, రెవెన్యూ డిపార్ట్మెంట్ సిబ్బంది సహాయంతో శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోటానికి వచ్చే భక్తుల మంచి నీటి, మజ్జిగ పంపిణి సహాయక చర్యలు నిర్వహించారు.
మోపిదేవి ఆలయాన్ని సందర్శించే భక్తుల కోసం ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ, మచిలీపట్నం మరియు అవనిగడ్డ డిపోలా నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు. తెల్లవారుజాము నుంచే మోపిదేవి శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించేందుకు భక్తులు వెంచేసారు.
Karthika Masam: వివాహం కావట్లేదా? కార్తీక మాసంలో ఇలా చేస్తే పెళ్లి కుదిరే ఛాన్స్
ఆలయ పండితులు కల్పవల్లి స్వామికి 2:30 గంటలకే ప్రత్యేక పూజలు నిర్వహించారు. మునుపు ఎన్నడులేని విధంగా రికార్డు స్థాయిలో నాగుల పంచమి సందర్భంగా 70 వేల మందికి పైగా భక్తులు మోపిదేవి శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్నట్టు ఆలయ అధికారులు చెప్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..