ఈ మధ్య కాలంలో మహిళలకు గోల్డ్ కన్నా… స్టోన్స్ ఉన్న ఆర్నమెంట్స్‌పై ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. ఎందుకంటే.. ఇవీ
బంగారు ఆభరణాల
కంటే తమ దుస్తుల రంగుకు తగ్గట్టుగా మ్యాచింగ్ ఉంటాయి.. తద్వారా తమ అందాన్ని రెట్టింపు చేస్తాయని వీటిని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అయితే మన విజయవాడలో ఓ దుకాణంలో బీడెడ్ స్టోన్ జ్యూవలరీ (Beaded Stone Jewellery) మహిళలకు కావాల్సిన అన్ని రంగు రంగుల స్టోన్ జ్యూవలరీని అందిస్తుంది. దీనిపై న్యూస్ 18 ప్రత్యేక స్టోరీ…!!
బీడెడ్ స్టోన్ జ్యువలరీ అంటే ఏమిటి అని ఆలోచిస్తున్నారా…..?? ఎంతో ఆకర్షణీయంగా, అందమైన రంగు రాళ్లతో ఆడవారి అందాన్ని కచ్చితంగా పెంచుతాయని చెప్పవచ్చు.ఎన్నో ఆకర్షణీయమైన డిజైన్లతో బంగారు ఆభరణాలకు ధీటుగా బీడెడ్ స్టోన్ ఆభరణాలు ఇక్కడ దర్శనమిస్తాయి. ఈ ఆభరణాలు ఎలా ఉంటాయంటే…రంగు రంగులతో మెరిసే ముత్యపు రాళ్లతో తయారు చేస్తారు. వీటిల్లో ఎన్నో రకాల రాళ్లు అచ్చం ముత్యాల్లా మెరుస్తూ ఉంటాయి.
Snake: గణపతి ఆలయంలోకి చొరబడిన తాచుపాము… ఆ తర్వాత ఏం జరిగిందంటే
ఈ ముత్యపు రాళ్లు రకరకాల ఆకారల్లో అందరికి నచ్చే విధంగా ఉంటాయి. బంగారు ఆభరణాలకు ఏమాత్రం తక్కువ కాకుండా అందరిని ఆకర్షించే విధంగా ఉంటాయి. వీటిని చీరల మీద అనే కాకుండా డ్రెస్సుల మీద కూడా ధరించ వచ్చు. అంతే కాకుండా ఏశుభకార్యాల కైనా వెళ్లినప్పుడు.. ఇవి ధరించి వెళ్తే.. అందరినిఆకర్షించే విధంగా ఈ ఆభరణాలు మెరుస్తూ ఉంటాయి. శుభకార్యాలకే కాకుండా రోజు వారిగాకూడా వీటిని ధరించవచ్చు.
ఈ క్వాలిఫైడ్ బీడెడ్ స్టోన్ జ్యువలరీ గురించి ఇంత చెప్తున్నారు… ఎక్కడ దొరుకుతాయి అని అనుకుంటున్నారా…?? మన విజయవాడలోనే అలంకార్ థియేటర్ ఎదురుగా ఎం.జీ బీడెడ్ స్టోన్ జ్యువలరీ దుకాణంలో లభ్యమవుతాయి. ఈ బీడెడ్ స్టోన్ జ్యువలరీ వాటిని పరిశోధించి క్వాలిఫైడ్ అని సర్టిఫై చేసిన తర్వాతే ఆభరణాను తయారు చేస్తారు. ఈ క్వాలిఫైడ్ బీడెడ్ గోల్డ్ స్టోన్ జ్యువలరీ ఆభరణం వివిధ రకాలు అయిన చిన్నపాటి బియ్యపు గింజ స్టోన్స్ తో డిజైన్ చేసి తయారు చేస్తారు.
ఈ మొక్కల్ని మీ ఇంట్లో పెంచుకుంటే… ఆరోగ్యం మీ సొంతం
వీటిలో 5 గ్రామ్ గోల్డ్ స్టోన్ లాకెట్ పెట్టి బియ్యపు గింజ ఆకారం, వజ్ర ఆకారం వంటి రకరకాల బీడెడ్ స్టోన్స్ తో ఈ ఆభర్ణలను తయారు చేస్తారు. ఈ ఆభర్ణాల ప్రత్యేకత ఒక లైన్ నుంచి నాలుగు లైన్ల చైన్స్ గా వీటిని తయారు చేసుకోవచ్చు. ఈ బీడెడ్ స్టోన్స్ తో పాటు వాటి లాకెట్స్ ను కూడా తెప్పిస్తామని డిజైనర్ తేజ తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..