కార్తీక మాసం శివునికి ప్రత్యేకమైన మాసంగా ఈశ్వరుని దర్శనం కోసం భక్తులు ప్రసిద్ధ శివాలయ క్షేత్రలకు తరలి వెళ్తుంటారు. కార్తీక మాస పంచారామ దర్శనం కోసం ఏపీఎస్ ఆర్టీసీ అవనిగడ్డ నుంచి పంచారామ యాత్రకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ వాసులు ఈ కార్తీక మాస పంచారామ యాత్రను ఉపయోగించుకోవాలి ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు తెలిపారు.
కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఏ.పి.ఎస్.ఆర్.టి.సి డిపో నుండి పుణ్య క్షేత్రాలకు ప్రత్యేక స్పెషల్ బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ కె హనుమంతురావు తెలిపారు. ప్రతి శని, ఆదివారాలు పంచారామాలకు ఒకే రోజున దర్శించుకునే విధంగా ఈ నెల 18వ తేది శనివారం రాత్రి 12గంటలకు ఆల్ట్రా డీలక్స్ బస్సు సర్వీసును ఏర్పాటు చేయడం జరిగిందని ప్రతి శనివారం ప్రసిద్ధ శైవ క్షేత్రాలైన అహోబిలం, మహానంది, బ్రహ్మం గారి మఠం, యాగంటి, మంత్రాలయం, అలంపూర్, శ్రీశైలం, త్రిపురాంతకం కలుపుకుని స్పెషల్ సూపర్ లగ్జరీ బస్సులు నడపనున్నట్లు చెప్పారు.
ఈ గుడిలో జ్యోతి వెలిగిస్తే.. మీ జీవితం కాంతి వలె ప్రకాశిస్తుందట!
కార్తీక మాసంలో పౌర్ణమికి యథవిధిగా అవనిగడ్డ నుండి ఈ నెల 25వ తేది శనివారం సాయంత్రం 5 గంటలకు అరుణాచలంకు కాణిపాకం, సిరిపురం, అర్ధవీడు, కంచి, తిరుతుని, శ్రీకాళహస్తి, పుణ్యక్షేత్రాలను కలుపుకుని ప్రత్యేక బస్సును నడుపుతున్నట్లు. ఈ ప్రాంత భక్తులు మరియు ప్రజలు ఈ సర్వీసులను వినియోగించుకుని కార్తీక మాసంలో దేవాలయాలను దర్శించుకోవాలని హనుమంతురావు కోరారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..