మహిళలుఏదైనా సాదించాలి అనే తపన, పని చేయాలి అనే భావనఉండాలే ఎందులోనైనా ఈజీగా రాణించగలరు. కానీఒక కుటుంబం ముందుకు రావాలంటే ఆడవారి పాత్ర ఎంతో ఆదర్శంగా పోషించాలి. ఎంతో ఉన్నతంగా ఆలోచిస్తూ పిల్లలను వృద్ధి లోకి ఎలా తేవాలో అన్ని రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. ప్రస్తుత కాలంలో ఆడవారు కొన్ని గ్రామాలలో లేదా కొన్ని ఇళ్లలో ఆడవారు చేస్తే వ్యవసాయ లేదంటే గృహిణులుగా ఉండిపోతున్నారు. కొంతమంది అయితే పేదరికంతో సరిపోయి సరిపోని డబ్బులతో రోజు వారి పనులకు వెళ్తున్నారు.
కష్టపడాలి అనే ఆలోచనతో ఉన్న ప్రతి ఒక్కరికి పని చేయాలి ఆలోచన, తనకంటూ తాను పని చేసుకోవాలి అనే తపన ఉన్నట్లయితే జన శిక్షణ సంస్థాన్. భారత ప్రభత్వ వారిచే నిర్వహించాపడుతున్న జన శిక్షణ సంస్థాన్ ఆడవారికి ఉపయోగపడేలా కుట్టుపని (ఎంబ్రాయిదారి వర్క్), బ్యూటిషిన్ వంటి చేతిపనులను నేర్పుతున్నారు.
రూ.20కే మాల్పూరిని టేస్ట్ చేయండి.. ఎలా చేస్తారంటే..
విజయవాడలో జన శిక్షణ సంస్థాన్ 1985లో భారత దేశ ప్రభుత్వం వారిచే మొదలుయింది. ప్రస్తుతం ఈ జన శిక్షణ సంస్థాన్ విజయవాడ నగరంలోని మొగలరాజపురంలో నిర్వహిస్తున్నారు. ఈ జన శిక్షణ సంస్థాన్ వారి ముఖ్య ఉద్దేశం ఇంట్లో ఒంటరిగా ఉంటున్న మహిళలకు ఉచిత కుట్టు మిషన్, బ్యూటిషన్ పనిని నేర్పి, మహిళలు అందరు తమ సొంత కళ్ళమీద తాము నిలబడాలన్నేది వీరి ధ్యేయం.
ఈ గుడిలో జ్యోతి వెలిగిస్తే.. మీ జీవితం కాంతి వలె ప్రకాశిస్తుందట!
ఏ కష్టం వచ్చిన ధైర్యంగా ఎదుర్కోవాలి అన్నది దీని ప్రధాన ఆలోచన. మహిళలు కష్టపడి పని చేసే ప్రతిఒకరికి వారు కౌన్సిలింగ్ ఇచ్చి ఏ వృత్తి మీద ఆసక్తి ఉందొ తెలుసుకొని వారికిఆ విషయంలో సహకరిస్తూ పనిని నేర్పిస్తారు. జన శిక్షణ సంస్థాన్ వారు మహిళలకు కుట్టు మిషన్, జూట్ బ్యాగ్ ల తయారీ లను, బ్యూటిషన్ వంటి వృత్తులకి సంబదించిన పనులను నేర్పుతారు.
జన శిక్షణ సంస్థాన్ నిర్వాహకులు ఊర్మిళ మాట్లాడుతూ మహిళలలో కష్టపడాలి అనే గుణం, పని చేసి సాధించాలి అనే పట్టుదల ప్రతి ఒక్కరిలో ఉండాలి అని, చదువుకొని ఉద్యోగం చేయలేని మహిళలలు /చదువుకో లేక పెళ్లి చేసుకున్న మహిళలలు ఇంట్లోనే ఉండకుండా పని చేసిఆదర్శంగా నిలవాలి అని చెప్పారు. జన శిక్షణ సంస్థాన్ శిక్షణలో శిక్షణ ఇచ్చే ప్రతీ ఒక్కరు చాలా స్పష్టంగా అందరికి అర్థమయ్యేలా వివరిస్తూ శిక్షణ ఇస్తారు, బయట ఎక్కడ కూడా ఇలా చెప్పరని శిక్షణ తీసుకుుంటున్న మహిళలు తెలుపుతున్నారు.. తాను కష్టపడి తన సొంత కాళ్ళపై నిలబడి ఇంకో 10 మందికి సహాయపడాలని అనుకున్నట్లు శిక్షణ తీసుకుంటున్న మాల్విక తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..