భారత్ న్యూజిలాండ్ ప్రపంచ కప్ సెమీ ఫైనల్స్ జరిగిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ ప్రపంచ కప్ సెమీ ఫైనల్స్ మ్యాచ్ వీక్షించేదుకు విజయవాడలోని ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన స్క్రీన్‌పై సుమారు 10 వేల మంది క్రికెట్ అభిమానులు భారత్ vs న్యూజిలాండ్ మ్యాచ్ వీక్షించారు. ఇందిరాగాంధీ స్టేడియంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన భారత్ న్యూజిలాండ్ ప్రపంచ కప్ సెమీ ఫైనల్స్ మ్యాచ్ లైవ్ స్ట్రీమ్ వీక్షించేందుకు క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున వచ్చారు.
విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రపంచ కప్ భారత్ మరియు న్యూజిలాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్ లైవ్ స్ట్రీమ్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ సెమీ ఫైనల్ మ్యాచ్ వీక్షించడానికి విజయవాడ నగర వాసులు పెద్ద ఎత్తున కదిలివచ్చారు. సుమారు ఇందిరాగాంధీ స్టేడియంలో బ్లూ జెర్సీలు మరియు జాతీయ జెండాలతో క్రికెట్ అభిమానులు పోటేత్తారు. మ్యాచ్ వీక్షించటానికి వచ్చిన క్రికెట్ అభిమానులు మ్యాచ్ గడుస్తునంత సేపు సంబరాలు చేశారు. పోటాపోటీగా సాగిన ప్రపంచ కప్ సెమీ ఫైనల్ విజేతగా నిలవగా క్రికెట్ అభిమానులు బాణాసంచా కలుస్తూ పండుగ వాతావరణం తీసుకువచ్చారు.
మహిళలకు శుభవార్త.. ఇక్కడ శారీస్ కుచ్చులు, పూసలు, స్టోన్స్ తక్కువ ధరకే దొరుకుతాయి..!!
క్రికెట్ అభిమాని మాట్లాడుతూ…
విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన సెమీ ఫైనల్ మ్యాచ్ లైవ్ స్ట్రీమ్, నిజమైన క్రికెట్ స్టేడియంలో కుర్చొని వీక్షిస్తునట్టు ఉందన్నారు. క్రికెట్ అభిమానులు. కింగ్ అఫ్ క్రికెట్.. గాడ్ అఫ్ క్రికెట్ సచిన్ రికార్డు బద్దలు కొట్టడం చాలా ఆనందంగా ఉందని, ఇంత మంది క్రికెట్ అభిమానుల మధ్య మ్యాచ్ వీక్షించటం చాలా సరదాగా ఉందని తెలిపారు.వరల్డ్ కప్ ఫైనల్ కు ఇండియా చేరటంపై అందరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..