పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన దేశముదురు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మిల్క్ బ్యూటీ హన్సిక. తెలుగు, తమిళ్, మలయాళం మరియు హిందీ అగ్ర కథనాయకులతో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కథానాయకి హన్సిక. సినిమాలతో బిజీగా ఉండే సినీ నటి హన్సిక వివాహం చేసుకున్న తరువాత కొద్ది రోజులు సినిమాలకు దూరంగా ఉంది.
వివాహం అయిన తరువాత మిల్క్ బ్యూటీ హన్సికను వెండి తెరపై చూసే అవకాశం చాలా రోజులు తరువాత హన్సిక అభిమానులకి కలిగింది. తాజాగా హన్సిక మై నేమ్ ఇస్ శృతి అనే హీరోయిన్ ఓరియెంటెడ్ క్రైమ్, థ్రిల్లర్ సినిమాలో నటించింది. ఈ సినిమా ప్రేక్షకులకు ముందుకు నవంబర్ 17 రానున్నది.
నిరుద్యోగులకు సువర్ణావకాశం.. శ్రీరామ్ చిట్స్ లో ఉద్యోగ అవకాశాలు..
మై నేమ్ ఇస్ శృతి సినిమా ప్రొమోషన్స్ భాగంగా విజయవాడకు వచ్చిన మిల్క్ బ్యూటీ హన్సిక మరియు హన్సిక తల్లి ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నారు.మై నేమ్ ఇస్ శృతి మూవీ టీమ్ని అతిధి మర్యాదలతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు.అమ్మవారి దర్శనానంతరం వేద పండితుల చేతుల మీదుగా మూవీ డైరెక్టర్, ప్రొడ్యూసర్ మరియు హన్సికను పండితులు ఆశీర్వచనం చేశారు.అమ్మవారి చిత్రపటాన్ని లడ్డు ప్రసాదాన్ని అందజేసిన ఆలయ అధికారులు.
ఆరు నెలలు దేవుడి దర్శనం.. మరో ఆరు నెలలు మాయం.. ఆ గుడి ఎక్కడుందంటే..
మిల్క్ బ్యూటీ హన్సిక మాట్లాడుతూ….
విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది.గాజుల అలంకరణలో అమ్మవారిని దర్శించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను.మై నేమ్ ఇస్ శృతి మూవీ ప్రమోషన్స్ లో భాగంగా విజయవాడ వచ్చాను.నవంబర్ 17వ తేదీన వరల్డ్ వైస్ గా నా చిత్రం రిలీజ్ కానుంది. ప్రేక్షకులందరూ తన చిత్రాన్ని ఆదరించాలని అమ్మవారిని కోరుకున్నాను అని హన్సిక తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..