తెలుగు చిత్ర పరిశ్రమలో ట్రెండ్ సెట్ హీరోగా పేరు తెచ్చుకున్న సూపర్ స్టార్ కృష్ణ(Krishna)ను అభిమానులు మర్చిపోలేకపోతున్నారు.సుమారు ఐదు దశాబ్దాల పాటు హీరో, నిర్మాత, దర్శకుడిగా అన్నీ పాత్రలు పోషించిన కృష్ణ 300పైగా చిత్రాల్లో నటించారు. కృష్ణ విగ్రహాన్ని విజయవాడ(Vijayawada)లో ఆవిష్కరించారు. విలక్షణ నటుడు కమల్‌హాసన్(Kamalhasan) ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా హాజరై అభిమానుల సమక్షంలో విగ్రహన్ని ఆవిష్కరించారు. ఈకార్యక్రమంలో వైసీపీ నాయకుడు దేవినేని అవినాష్‌తో పాటు విజయవాడ డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గతో పాటు కృష్ణ, మహేష్‌బాబు అభిమానులు పాల్గొన్నారు. తన తండ్రిపై చూపించిన అభిమానానికి మహేష్‌బాబు సోషల్ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. విగ్రహం ఫోటోతో పాటు ఆవిష్కరించిన వీడియోని ఎక్స్‌లో షేర్ చేశారు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబు(Maheshbabu).
బెజవాడలో కృష్ణ విగ్రహం..
సినిమా ఇండస్ట్రీలో ఎందరో నటులు వస్తుంటారు..పోతుంటారు. కాని తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా వందలాది సినిమాల్లో నటించారు సూపర్ స్టార్ కృష్ణ. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకున్న కృష్ణ విగ్రహాన్ని శుక్రవారం విజయవాడలోని గురునానక్ కాలనీలోని కేడీజీవో పార్కులో ఏర్పాటు చేశారు. ఈవిగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా లోకనాయకుడు కమలహాసన్ వచ్చారు. నటశేఖరుడి విగ్రహాన్ని కమల్‌హాసన్ ఆవిష్కరించారు. ఈకార్యక్రమంలో విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జ్ దేవినేని అవినాష్‌తో పాటు పలువురు నేతలు, కృష్ణ, మహేష్ అభిమానులు పాల్గొన్నారు.
Andhra Pradesh: ఏపీ సీఎం కారుకు ప్రమాదం..జగన్‌కు తప్పిన ముప్పు
ఫ్యాన్స్‌కి మహేష్ కృతజ్ఞతలు..
తన తండ్రి విగ్రహాన్ని ఆవిష్కరించినందుకు ప్రిన్స్ మహేష్‌బాబు సోషల్ మీడియా వేదికగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడలో నాన్నగారు (కృష్ణ)విగ్రహాన్ని ఆవిష్కరించడానికి హాజరైనందుకు కమల్‌హాసన్ రావడం నిజంగా గర్వకారణమని ట్విట్ చేశారు. ఆయన నటవారసుడిగా తాను నివాళులు ఆర్పిస్తున్నట్లుగా తెలిపారు. ఈ ఈవెంట్‌ను సాధ్యం చేసిన అభిమానులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ అందరికి ప్రేమతో కృతజ్ఞతలు తెలిపారు మహేష్‌బాబు.
Heartfelt gratitude to @ikamalhaasan Sir and @DevineniAvi Garu for gracing the inaugural event of Krishna garu’s statue in Vijayawada. Truly honoured to have them unveil Nanna garu’s statue, a homage to the legacy he left behind. Also, a big thank you to all the fans from the… pic.twitter.com/4YUOidCR8d
— Mahesh Babu (@urstrulyMahesh) November 10, 2023
పొలిటికల్‌గా చర్చ..
ఏపీలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించడంపై ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ కార్యక్రమాన్ని వైసీపీ నేత దేవినేని అవినాష్‌తో పాటు వైసీపీ నేతలు హాజరవడంపై చర్చ జరుగుతోంది. గతంలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు రజనీకాంత్ వచ్చి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును పొగిడారు. ఇప్పుడు కృష్ణ విగ్రహాన్ని కమల్‌హాసన్ చేతుల మీదుగా ప్రారంభించడం వెనుక రాజకీయ కోణం ఉందా అని సందేహ పడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..