విజయవాడ ప్రాంత వాసులకి ఆదివారం, సెలవుల సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటున్నారా?
విజయవాడలోని
మొగాల్రాజ్ పురంలో ప్రసిద్ధ శైవక్షేత్రం శివగిరి క్షేత్రం. ఈ శివగిరి క్షేత్రంలో ఈశ్వరుడు 40 అడుగుల లింగా కారంలో భక్తులకు దర్శనమిస్తారు. ప్రశాంతతకు ఈ శివగిరి క్షేత్రం ప్రసిద్ధి చెందింది. ప్రతి రోజు ఈశ్వరునికి నిత్యాభిషేకాలు చేస్తూ ఉంటారు. ఈ శివగిరి క్షేత్రాన్ని మల్లికార్జున శర్మ న్యాయవాది 15 సంవత్సరాముల కిందట వారి మాతృదేవతకు ప్రతీకగా నిర్మాణం చేశారు.
ఈ శివగిరి క్షేత్రంలో ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో శివ పరివారం,18 జ్యోతిర్లింగలు మరియు శ్రీ పార్వతి దేవి అష్టదశ అమ్మవారి రూపాలు భక్తులకు దర్శనమిస్తాయి. నిరంతరం ఈ శివగిరి క్షేత్రంలోని 36 అడుగుల ఈశ్వరుని లింగకారం నుంచి నీటి చుక్కలు జారీ పడుతూ ఉంటాయి. ఈ శివగిరి క్షేత్రం దర్శించుకోవటం వలన మానసిక బాధలు తొలగి ఆనందకరమైన మానసిక వికాసం పొందుతారు.
Seasonal Business: వీళ్ల పని బాగుంది… జస్ట్ ఒక నెల వ్యాపారం… లక్షల్లో ఆదాయం
ఈ శివగిరి క్షేత్రం నందు 36 అడుగుల శివలింగం వాటి చుట్టూ 18 జ్యోతిర్లింగలు, శ్రీ చక్ర ఆకారములో అష్టదశ శక్తి పిఠాములలో కూడిన అమ్మవారి ప్రతి రూపాలు, శివ పరివారం అయిన విగ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యం స్వామి, పార్వతి సమేత ఈశ్వరుడు భక్తులకు దర్శనం ఇస్తూ ఉంటారు.
స్టైలిష్ షర్ట్స్… ట్రెండింగ్ జీన్స్… జస్ట్ రూ.300 మాత్రమే… ఈ షాప్ ఎక్కడో తెలుసా?
ఈ శివగిరి క్షేత్రం స్థాపించి ఈ కార్తీక మాసానికి 14 సంవత్సరాములు నిండి 15 సంవత్సరములు పూర్తి అవుతాయని, కార్తీక మాసం, మాస శివరాత్రులలో శైవక్షేత్రమైన శివగిరి క్షేత్ర పార్వతి పమేశ్వరులకు విశిష్టంగా కళ్యాణం నిర్వహిస్తారని, శివగిరి క్షేత్రము నందు లింగప్రదక్షణ చేయటం ద్వారా భక్తుల కోరికలు నెరవేరుతాయని నమ్మకం. ఈ శైవక్షేత్రమునకు విజయవాడలోని సిద్దార్థ కళాశాల సమీపంలో అమ్మ కల్యాణ మండపం ఎదురు వీధి నుంచి మార్గం ఉంటుందని శివగిరి క్షేత్ర స్థాపకులు న్యాయవాది మల్లికార్జున శర్మ తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..