మన తెలుగు వారు చేసే రుచికరమైన
స్వీట్స్
మరెవరు చేయలేరు.
ఆంధ్రప్రదేశ్‌లోని
తెలుగువారు చేసే స్వీట్లలో ప్రధానమైనవి అరిసెలు, కొబ్బరి బూరెలు, కజ్జికాయలు. ఇవే కాదు రకరకాల స్వీట్లను తయారు చేస్తూ ఉంటారు. వాటిలో ఒకటి నేతి బొబ్బట్లు. బొబ్బట్లు చూడటానికి చపాతీ, పుల్కాల కనిపించే రుచికరమైన స్వీట్. ఈ
బొబ్బట్లను
అసలు ఎలా తయారు చేస్తారు? వీటి తయారీలో ఏమేమి వాడతారో తెలుసుకుందాం.
బొబ్బట్లను ముందుగా మైదా పిండి లేదా గోధుమ పిండి సహాయంతో తయారు చేస్తారు. ముందుగా గోధుమ పిండిని కలుపుకొని వాటిని చపాతీలా తయారు చేసుకుంటారు. తరువాత పప్పు, బెల్లం పాకం రెండిటిని కలిపి ఒక ముద్దగా తయారు చేసి ఉండలుగా తయారు చేస్తారు. ముందుగా తయారు చేసి పెట్టుకున్న చపాతీ పిండిని చపాతీలు రుద్దుకొని, దానీలో పప్పు బెల్లం ముద్దను ఉంచి మళ్ళీ చపాతీగా తయారు చేసి చపాతీ పాన్ మీద కలుస్తారు.ఇలా కాల్చిన వాటినే బొబ్బట్లు అని అంటారు.
స్టైలిష్ షర్ట్స్… ట్రెండింగ్ జీన్స్… జస్ట్ రూ.300 మాత్రమే… ఈ షాప్ ఎక్కడో తెలుసా?
ప్రతి ఫుడ్ స్ట్రీట్‌లో, కర్రీస్ పాయింట్, బేకరీల్లో ప్యాకెట్లలో బొబ్బట్లను అమ్ముతున్నారు. ఇలా ప్యాకెట్లలో కాకుండా మన కళ్లముందే రుచికరమైన బొబ్బట్లను తయారు చేసి విక్రయాలు జరుపుతున్నారు కొందరు. విజయవాడ సత్యనారాయణపురం బీఆర్టీఎస్ రోడ్డు ఫుడ్ స్ట్రీట్‌లో విజయ డైరీ ఎదురుగా నేతి బొబ్బట్ల దుకాణం ఉంది. ప్రతి రోజు సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఎంతో రుచికరమైన నేతి బొబ్బట్లు, కోవా బొబ్బట్లు విక్రయాలు జరుపుతున్నారు.
Seasonal Business: వీళ్ల పని బాగుంది… జస్ట్ ఒక నెల వ్యాపారం… లక్షల్లో ఆదాయం
ఈ బొబ్బట్ల ధర రూ.20 నుంచే ప్రారంభం అవుతుంది. వీరు సుమారు 6 సంవత్సరములుగా ఈ బొబ్బట్ల తయారీ, విక్రయాలు చేస్తున్నారు. సుమారు రోజుకు 200 మంది నుంచి 300 మంది దాకా ఈ బొబ్బట్లను రుచి చూసి తీసుకెళ్తూ ఉంటారు. ప్రతీ రోజూ సుమారు రూ.5000 వరకు బిజినెస్ చేస్తుండటం విశేషం. ఈ లెక్కన నెలకు రూ.1,50,000 బిజినెస్ జరుగుతోంది ఇక్కడ.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..