ఆరుగురు ముద్దాయిలు అరెస్ట్
గూడూరు
ఎలక్షన్ కోడ్ సమీపిస్తున్న తరుణంలోలో భాగంగా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు గూడూరు డిఎస్పి సూర్యనారాయణ రెడ్డి పర్యవేక్షణలో గూడూరు రూరల్ సీఐ గూడూరు వన్ టౌన్ సి గూడూరు రూరల్ ఎస్సై మరియు చిలుకూరు ఎస్సైలు సిబ్బందితో కలిసి గురువారం వాహనాలను తనిఖీలు చేపట్టారు. నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైనఏర్పాట్లు చేస్తున్నారు. గూడూరు నియోజకవర్గం వ్యాప్తంగా చెక్పోస్టులు పెట్టివిస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో పోలీసులు భారీగా నగదు పట్టుకున్నారు. ఐదు కోట్ల 12 లక్షల 91 వేల 180 రూపాయలను భారీ నగదును పోలీసులు సీజ్ చేశారు. ఆరుగురు ముద్దాయిలను అరెస్టు చేశారు. గురువారం గూడూరు పట్టణంలోని గూడూరు సర్కిల్ కార్యాలయంలో గూడూరు డిఎస్పి సూర్యనారాయణ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిలకలు పోలీస్ స్టేషన్ పరిధిలో వరంగల్ క్రాస్ రోడ్ వద్ద గూడూరు రూరల్ సీఐ ఎస్సై వారి సిబ్బందితో కలిసి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని మూడు కోట్ల 67 లక్షల 41 వేల 180 రూపాయలను నగదును స్వాధీనం చేసుకొని ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గూడూరు రూరల్ పరిధిలోని చిలకలూరి బైపాస్ రోడ్ జంక్షన్ వరద గూడూరు రూరల్ ఎస్సై మనోజ్ కుమార్ ఇబ్బందితో కలిసి 95 లక్షల 80 వేల రూపాయలను నగదును స్వాధీనం చేసుకొని, ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. గూడూరు వన్ టౌన్ పరిధిలో ముబారక్ బిర్యాని షాప్ వద్ద బిఎస్సార్ లాడ్జి ఎదురుగా గూడూరు వన్ టౌన్ సీఐ ఆధ్వర్యంలో వారి సిబ్బందితో కలిసి 50,00,000, నగదును స్వాధీనం చేసుకుని ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు గుర్తుతెలియని వ్యక్తులు నగదును తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగి అటుగా వెళ్తున్న వారిని తనిఖీ చేశారు. ఆ సంచుల్లో ఐదు కోట్ల 12 లక్షల 91 వేల 150 రూపాయలను తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించి ఆ నగదును సీజ్ చేసేమని తెలిపారు . సందర్భంగా ఆయన గూడూరు రూరల్ సీఐ వేణుగోపాల్ రెడ్డి , గూడూరు వన్ టౌన్ సిఐ పాపారావు , రూరల్ ఎస్సై మనోజ్ కుమార్, చిలుకూరు ఎస్సై అంజిరెడ్డి సిబ్బందిని డిఎస్పి ప్రత్యేకంగా అభినందించారు.