దగా డిఎస్సి వద్దు.. కనిగిరిలో నిరసన

దగా డిఎస్సి వద్దు మెగా డీఎస్సీ కావాలి..  

మెగా డీఎస్సీ ద్వారా 25వేల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాలని డివైఎఫ్ఐ కనిగిరి కమిటీ కార్యదర్శి అధ్యక్షతన కనిగిరి పట్టణంలోని సుందరయ్య భవనం నుంచి నిరుద్యోగులు భారీగా నిరసన ర్యాలీ నిర్వహించారు. పామూరు బస్టాండు సెంటర్ లో మానవహారం నిర్వహించగా ట్రాఫిక్ నిలిచిపోయింది. అనంతరం ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నా చేయడానికి వీలు లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో డివైఎఫ్ఐ నాయకులకు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ధర్నా వద్దకు వచ్చిన ఆర్డీవో ఆర్డిఓ జాన్ ఇర్విన్ కు వినతి పత్రం అందజేశారు . ప్రభుత్వం దృష్టికి నిరుద్యోగుల సమస్యలను నివేదిక రూపం ద్వారా పంపించడం జరుగుతుందని హామీ ఇచ్చారు. అందజేశారు.

ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న, యుటిఎఫ్ రాష్ట్ర నాయకులు మీగడ.వెంకటేశ్వరరెడ్డి లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగేళ్లుగా అదిగో డీఎస్సీ ఇదిగో డీఎస్సీ అంటు నిరుద్యోగులను నిరంతరం మోసం చేసిందన్నారు.రాష్ట్రంలో 1.88లక్షల ఉపాధ్యాయులు ఉండాల్సిన చోట కేవలం 1. 69లక్షలు మాత్రమే ఉన్నారని దాదాపు 18,520 ఖాళీగా ఉన్నాయని ఇవే కాక ఈనెల చివరి నాటికి మరో 5వేలమంది ఉపాధ్యాయులు రిటైర్డ్ అవుతున్నారని తెలిపారు. కేంద్రం చేబుతున్న లెక్కలు ప్రకారం 40వేల ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 117జీవో పేరుతో మరో 10వేల ఉపాధ్యాయ పోస్టులను రద్దు చేసిందని గుర్తు చేశారు. తెలుగు మిడియం తీసివేసి 15వేల ఉపాధ్యాయ పోస్టులను రద్దు చేసిన ఘనత జగన్మోహనరెడ్డి ప్రభుత్వానిదే అన్నారు. జగనన్న ప్రభుత్వంలో 2వేల పాఠశాలలు మూసివేసిందని ఇప్పటికే రాష్ట్రంలో ఏకోపాద్యాయ పాఠశాలలు 9వేలు ఉన్నాయని ఇప్పుడు ప్రభుత్వం ఖాళీలు లేవని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.

డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కె ఎఫ్ బాబు,అధ్యక్షులు కె వి పిచ్చయ్య , సిఐటియు జిల్లా కార్యదర్శి పీసీ కేశవరావు లు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేక విద్యార్థులు డ్రాపౌట్ కావడం లేదా ప్రైవేటు స్కూళ్లలో జాయిన్ అవ్వడం జరుగుతుందని దాదాపు రెండేళ్లలో 6లక్షల మంది విద్యార్థులు ఇలా డ్రాపౌట్ అయ్యారని గుర్తుచేశారు. రాష్ట్రంలో దాదాపు 10 లక్షల మంది నిరుద్యోగులు డీఎస్సీ కోసం నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీ ప్రకటించాలని దీక్షలు అనంతరం ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు నారాయణ, శ్రీను, మహమ్మద్ డీఎస్సీ అభ్యర్దులు కళ్యాణ్, రవి, జాస్మిని తదితరులు పాల్గొన్నారు.

7k network
Recent Posts

అసెంబ్లీలో వైకాపా పై ధ్వజమెత్తిన సీఎం చంద్రబాబు.. ఫుడ్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తిన నకిలీ విలేఖరులు..పోలీస్ స్టేషన్లో రెచ్చిపోయిన నకిలీ విలేఖరి.. వివేకా హత్య కేసులో దస్తగిరి పేరు తొలగింపు.. పొదిలి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ..రాష్ట్ర తరగతులను జయప్రదం చేయండి..పీ డీ ఎస్ యూ..

కొత్త ప‌థ‌కాల‌కే రేవంత్ జై!..అమరావతిలో ల్యాండ్ పూలింగ్ షురూ..మోడీ మాయతో ఏపీకి అన్యాయం.. • ప్రజలు మోసపోతున్న మాట్లాడలేని జగన్ ..సమస్యలపై మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లిన మార్కాపురం ఎమ్మెల్యే కందుల..ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన పొదిలి సీఐ.. వైకాపా కార్యకర్తను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే అన్నా.. ప్రకాశం జిల్లా కలెక్టర్ పర్యటన.. రషీద్ హత్య కేసులో నిందితుల అరెస్టు..

ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన చంద్రబాబు..అసెంబ్లీ హైలెట్స్..లిక్క‌ర్ పాల‌సీపై విచార‌ణ‌..జ‌గ‌న్‌ను అరెస్టు చేస్తారా?..ఉద్యోగులకు త్వరలోనే పెండింగ్ డీఏలు: భట్టి..బడ్జెట్లో మైనార్టీలపై వివక్షత పై అవాజ్ కమిటీ ఆగ్రహం..ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆధ్వర్యంలో కొనసాగుతున్న మెగా డీఎస్సీ ఉచిత కోచింగ్ సెంటర్..ప్రకాశంలో తూనికలు కొలతల శాఖ దాడులు.

కుర్చీని కాపాడుకొనే బడ్జెట్- కాంగ్రెస్,సీపీఎం..నీతి ఆయోగ్ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీలు దూరం-సీఎం స్టాలిన్ మద్దతు..ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట..జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత డీఎస్సీ కోచింగ్..కరకట్టలో రైతుల ఆందోళన..డెలివరీ బాయ్ ముసుగులో గంజాయి విక్రయాలు

పెద్దన్న అంటే ..ఇచ్చింది గుండుసున్నా !..కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణపై కక్ష చూపించారు..అన్ని రూపాల్లో నిరసన తెలియజేస్తాం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించాలి..సీఎం రేవంత్.. హర్షం వ్యక్తం చేసిన ఏపీ మంత్రులు..పొదిలి నగర పంచాయితీలోని మున్సిపల్ కార్మికులకు 6నెలల హెల్త్ అలవెన్స్ బకాయిలను చెల్లించాలి..రాష్ట్రస్థాయి బండలాగుడి పోటీలను ప్రారంభించిన ఎంపీపీ అమూల్య…