చంద్రబాబు, పవన్‌ మధ్య సీట్ల పంచాయితీ తేలేది కాదు’- అంబటి రాంబాబు

చంద్రబాబు, పవన్‌ మధ్య సీట్ల పంచాయితీ తేలేది కాదని మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.

రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ సిద్ధమైందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. వైఎస్సార్‌సీపీ పార్టీ ఎన్నికల్లో గెలిచి అధికారంలో వస్తుందని.. అప్పటివరకు టీడీపీ, జనసేన సీట్ల పంచాయితీ తేలదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, పవన్‌ మధ్య నోట్లు తేల్చుకుంటే తప్ప సీట్లు తేలే పరిస్థితి లేదని దుయ్యబట్టారు. చంద్రబాబు అద్దె ఇంట్లో పవన్ కల్యాణ్-చంద్రబాబు భేటీ అయ్యారని.. వారు అలా భేటీ అవుతునే ఉంటారని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారో తెలియదని.. చంద్రబాబు కూడా కుప్పంలో పోటీ చేస్తారో? మరోచోట నుంచి పోటీ చేస్తారో? తెలియదని అన్నారు. అసలు వారు ముందు ఎక్కడ పోటీ చేయాలో తేల్చుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో తాము ఇప్పటికే ఎన్నికలకు సిద్ధమయ్యామని.. యుద్ధం కూడా అయిపోయిందన్నారు.

పవన్ కల్యాణ్‌ను నమ్మిన వారు కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్టేనని మంత్రి అంబటి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పవన్ కల్యాణకు ఇచ్చేది ముష్టి సీట్లు మూడో, ముప్పైయో, ఇరవైఐదో ఏమో ముష్టివేస్తూ.. క్యాష్ ఏమో బలంగా ఇస్తారని విమర్శలు చేశారు.

7k network
Recent Posts

పదేళ్లలో పెరిగిన ఈడీ దూకుడు..సీఎం జగన్ సమక్షంలో చేరికలు..నామినేషన్ వేసిన మాగుంట..రేపే కుందూరు నామినేషన్..రాజీనామా చేస్తే 15 వేలు!!!..బస్సులో అమ్మాయి అసభ్య ప్రవర్తన..సోదరుడి కోసం సోదరి ప్రచారం

టిడిపిని వాలంటీర్లే ఓడిస్తార?..పవన్ సీట్లు అమ్ముతున్నారని..పిఠాపురంలో డబ్బులు పంచుతున్నారని ఫిర్యాదు..సీతారాముల కళ్యాణంలో మాగుంట,ముత్తుముల దంపతులు..గిద్దలూరు వైకాపా టీడీపీలలో చేరికలు

సీఎం జగన్ సమక్షంలో హేమాహేమీల చేరికలు..ఓర్వలేకనే దాడులు..1400 కిలోల బంగారం స్వాధీనం..విస్తృత ప్రచారంలో మాగుంట తనయుడు..కంభంలో ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డిఆత్మీయ సమ్మేళనం.. త్రిబుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య..

ఇజ్రాయిల్ పై ఇరాన్ క్షిపణి దాడులు..సీఎం జగన్ పై జరిగిన దాడిని ఖండించిన షర్మిల..పవన్ కళ్యాణ్ పై నాన్ బైయిలబుల్ కేసు!!! సల్మాన్ ఖాన్ఇంటి వద్ద కాల్పులు..పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట..ఎమ్మెల్యే అన్నా సతీమణి,కోడలు ప్రచారం..