గ్రామీణ వైద్యుల్ల సమస్యల పరిష్కారం నా బాధ్యత
..రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం ఫిబ్రవరి 5 : గ్రామాలలో పేద ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ విధులు నిర్వహిస్తున్న గ్రామీణ వైద్యుల సమస్యల పరిష్కారం తన బాధ్యతని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. సోమవారం ఖమ్మం నగరంలోని ఎస్ ఆర్ కన్వెన్షన్ హాలులో తెలంగాణ మైనార్టీ గ్రామీణ వైద్యుల సంఘం పదవ మహాసభ సంఘం జిల్లా అధ్యక్షుడు హసన్ అధ్యక్షతన జరిగింది. సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి తుమ్మల ప్రసంగిస్తూ గ్రామాలలో మంచి పేరు సంపాదించుకుంటున్న మైనార్టీ గ్రామీణ వైద్యులు తన గెలుపుకూ చేసిన సహాయ ,సహకారాలు మరువలేనివి అన్నారు. ఖమ్మం జిల్లా తెలంగాణ మైనార్టీ గ్రామీణ వైద్యుల సంఘం డిమాండ్లు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న గ్రామీణ వైద్యుల సమస్యలకు అద్దం పడుతున్నాయన్నారు. వృత్తికి సంబంధించిన సమస్యలు ,గ్రామీణ వైద్యుల కార్యాలయాలకు స్థలాలు అంశంపై దృష్టి సారిస్తానని హామీ ఇచ్చారు. భవిష్యత్తు అవసరాలకు సంఘాలకు సంఘ భవనాల అవసరం ఉంటుందని, ఒక రోజు ముందు హైదరాబాదుకు వస్తే సమస్యలు కొన్ని ఇతర మంత్రులకు చెందినవని, వాటిని అయా మంత్రుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి ప్రయత్నిస్తానన్నారు. తన పర్యటనలో మహాసభ కార్యక్రమం లేదని ,వెళుతూ మార్గమధ్యలో సభకు వచ్చానన్నారు. తన గెలుపులో భాగస్వాములైన మైనార్టీ గ్రామీణ వైద్యుల కు ఈ సందర్భంగా తన కృతజ్ఞతలు తెలిపారు. తొలుత ఆయన నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు. అనంతరం సంఘం జిల్లా అధ్యక్షుడు షేక్ . హసన్ మాట్లాడుతూ తమ సంఘం ప్రధానంగా గ్రామీణ వైద్యుల సమస్యల పరిష్కారానికి పాటుపడుతుందని, ఇదే సమయంలో సంఘం బలోపేతం మే లక్ష్యంగా కార్యాచరణ పెట్టుకుంటామన్నారు. అన్నివేళలా గ్రామీణ వైద్యులకు అండదండలుగా ఉంటామని తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్. జానీ మియా మాట్లాడుతూ తమ ఆర్ఎంపీల డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా స్పందించి అమలు చేయాలని కోరారు.మాట్లాడుతూ ప్రణాళిక బద్ధంగా వెళుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు షేక్ హసన్ ( నేరడ) , సంఘం వ్యవస్థాపకులు షేక్ . నజిరుద్దీన్ , జిల్లా కోశాధికారి షేక్. బాబు సాహెబ్, జిల్లా ఉపాధ్యక్షులు షేక్. ఖాసిం , షేక్. చాంద్ పాషా , జిల్లా జాయింట్ సెక్రటరీ షేక్ . అషా, ప్రచార కార్యదర్శులు షేక్. అమీర్ , షేక్ జానీ (శ్రిరాంగిరి), కార్యదర్శులు షేక్. అబ్జల్ ,షేక్ .మస్తాన్ పా షా, జిల్లా ఎగ్జిక్యూటివ్ సభ్యులు షేక్ అహ్మద్ పాష , షేక్. వలి , షేక్ .షాజహాన్ , షేక్. నబి , షేక్. మన్సూర్ అలీ, మహిముధ్ , షేక్ . బాజీ , షేక్. రబ్బాని , షేక్. నబీ , ఈశాక్ , షాక్ పాషా , డివిజన్ అధ్యక్షుడు షేక్. జానీమియా , షేక్. రంజాన్ పా షా,షేక్. మౌలానా ,షేక్. అఖిల్ అహ్మద్ , షేక్ . పా షా , షేక్. అజిముద్దిన్ తదితరులు పాల్గొన్నారు.

7k network
Recent Posts

“ఫైర్‌మెన్ పాసింగ్ అవుట్ పరేడ్‌ లో సీఎం రేవంత్..”జగన్ ను కొలంబియన్ డ్రగ్ లార్డ్ తో పోల్చిన బాబు..”రెడ్ బుక్ తెరవకముందే గగ్గోలు పెడుతున్న జగన్- లోకేష్..”తిరుపతిలో కిలాడి దంపతుల అరెస్ట్..”బెంగళూరులో యువతిపై దాడి..

అసెంబ్లీలో వైకాపా పై ధ్వజమెత్తిన సీఎం చంద్రబాబు.. ఫుడ్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తిన నకిలీ విలేఖరులు..పోలీస్ స్టేషన్లో రెచ్చిపోయిన నకిలీ విలేఖరి.. వివేకా హత్య కేసులో దస్తగిరి పేరు తొలగింపు.. పొదిలి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ..రాష్ట్ర తరగతులను జయప్రదం చేయండి..పీ డీ ఎస్ యూ..

కొత్త ప‌థ‌కాల‌కే రేవంత్ జై!..అమరావతిలో ల్యాండ్ పూలింగ్ షురూ..మోడీ మాయతో ఏపీకి అన్యాయం.. • ప్రజలు మోసపోతున్న మాట్లాడలేని జగన్ ..సమస్యలపై మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లిన మార్కాపురం ఎమ్మెల్యే కందుల..ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన పొదిలి సీఐ.. వైకాపా కార్యకర్తను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే అన్నా.. ప్రకాశం జిల్లా కలెక్టర్ పర్యటన.. రషీద్ హత్య కేసులో నిందితుల అరెస్టు..

ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన చంద్రబాబు..అసెంబ్లీ హైలెట్స్..లిక్క‌ర్ పాల‌సీపై విచార‌ణ‌..జ‌గ‌న్‌ను అరెస్టు చేస్తారా?..ఉద్యోగులకు త్వరలోనే పెండింగ్ డీఏలు: భట్టి..బడ్జెట్లో మైనార్టీలపై వివక్షత పై అవాజ్ కమిటీ ఆగ్రహం..ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆధ్వర్యంలో కొనసాగుతున్న మెగా డీఎస్సీ ఉచిత కోచింగ్ సెంటర్..ప్రకాశంలో తూనికలు కొలతల శాఖ దాడులు.

కుర్చీని కాపాడుకొనే బడ్జెట్- కాంగ్రెస్,సీపీఎం..నీతి ఆయోగ్ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీలు దూరం-సీఎం స్టాలిన్ మద్దతు..ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట..జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత డీఎస్సీ కోచింగ్..కరకట్టలో రైతుల ఆందోళన..డెలివరీ బాయ్ ముసుగులో గంజాయి విక్రయాలు