ఎలక్ట్రికల్ షాప్ పై తూనికలు కొలతల శాఖ ఆకస్మిక తనిఖీ.. కేసు నమోదు
ప్రకాశం జిల్లా కంభం పట్టణంలోని మహాలక్ష్మి ఎలక్ట్రికల్ షాప్ తోపాటు మరికొన్ని ఎలక్ట్రికల్ షాపులపై మంగళవారం తూనికల కొలతల శాఖ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. దుకాణం లో విక్రయిస్తున్న వస్తువులు, బిల్లులు తనిఖీ చేశారు. బిల్లులు లేకుండా విక్రయిస్తున్న వివరాలు నమోదు చేసుకున్నారు. ఇటీవల రాజస్థాన్ కు చెందిన వారు నిర్వహిస్తున్న ఎలక్ట్రికల్ షాపుల్లో డూప్లికెట్ ఎలక్ట్రీకల్ వస్తువులు, వైర్ల విక్రయం పెరిగిపోతుందని ఆరోపణలు వినవస్తున్నాయి . లక్షల రూపాయలు పెట్టి గృహలు నిర్మించుకుంటున్న ప్రజలు నకిలీ వస్తువులు కొనుగోలు చేసుకొని తీవ్రంగా నష్టతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు . డూప్లికెట్ వస్తువులు, బిల్లులు లేకుండా విక్రాయిస్తున్న నకిలీ వస్తువులను అరికట్టెందుకు అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎలక్ట్రీకల్ వస్తువులు కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్త వహించాలని తూనికలు,కొలతల శాఖ అధికారి రియాజ్ కోరారు . మహాలక్ష్మి ఎలక్ట్రీకల్ షాపుపై రెండు కేసులతో పాటు పట్టణం లో మరో మూడు కేసు లు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.
Recent Posts