మార్కాపురం నియోజకవర్గ సమన్వయకర్త అన్నా వెంకట రాంబాబును , మార్కాపురం శాసనసభ్యులు కే నాగార్జున రెడ్డి, సాదరంగా స్వాగతం పలుకుతూ ఆదివారం నియోజకవర్గం పరిధిలోని నాయకులను , కార్యకర్తలను, పేరుపేరునా పరిచయం చేసే కార్యక్రమము ఏర్పాటు చేశార. మార్కాపురం శాసనసభ్యులు కే. నాగార్జున రెడ్డి మాట్లాడుతూ వైకాపా కార్యకర్తలందరూ సమిష్టి కృషిచేసి మన ప్రియతమ నేత ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పెద్దలు మార్కాపురం సమన్వయకర్త అన్న వెంకట రాంబాబును అఖండ మెజార్టీతో గెలిపించే బాధ్యత మనందరిపై ఉందని సభాముఖంగా కార్యకర్తల హర్షద్వానాల మధ్య ప్రకటించారు .
మార్కాపురం సమన్వయకర్త అన్నా వెంకటరాంబాబు మాట్లాడుతూ మార్కాపురంనియోజకవర్గంలో తాను అందరిలో ఒకడినై అందరికి పూర్తిస్థాయిలో అండగా ఉంటానని అక్కడికొచ్చిన కార్యకర్తలకు నాయకులకు పూర్తిస్థాయిలో హామీ ఇచ్చారు