వైకాపా పాలనలోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం అని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు,కొండపి నియోజకవర్గ సమన్వయ కర్త డాక్టర్ ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. ఆదివారం టంగుటూరు మండలం అనంతవరం గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సచివాలయ భవనాల ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం చేపడుతున్న పలు కార్యక్రమాల గురించి వివరించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం ఆయనతోపాటు మాజీ మంత్రి వర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణల చేతుల మీదగా జరిగింది కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు వైకాపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.