టిడిపి జనసేనతో పొత్తుపై బీజేపీకి నో క్లారిటీ???

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్ది.. విపక్షాల పొత్తుపై సస్పెన్స్‌ అనేది ఇంకా కొనసాగుతూ ఉంది. వరుస భేటీలు, చర్చోచపర్చలు జరుగుతున్నా కూడా టీడీపీ, జనసేన కూటమిలోకి బీజేపీ ఎంట్రీపై క్లారిటీ రావడం లేదు.ఇటువంటి పరిస్థితుల్లో బీజేపీ అగ్రనేత అమిత్‌షా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. ఓ కాంక్లెవ్‌లో పాల్గొన్న ఆయన… ఉత్తరాదిలో ఒంటరిగానే పోటీచేస్తున్న తాము.. దక్షిణాదిలో నమ్మదగిన మిత్రులతోనే కలిసి వెళ్తామని చెప్పడం జరిగింది. ఎన్డీఏలోకి పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయన్న అమిత్ షా… ఆంధ్రప్రదేశ్ లో పొత్తులపై త్వరలోనే క్లారిటీ వస్తుందని చెప్పారు.ఆంధ్రప్రదేశ్ లో విపక్షాల పొత్తుపై రకరకాల ప్రచారం జరుగుతున్న వేళ.. పార్టీ నేతలకు బహిరంగలేఖ రాశారు జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌. పొత్తుపై నాయకులెవరూ బహిరంగంగా వ్యాఖ్యలు చేయొద్దని అన్నారు. భిన్నాభిప్రాయాలుంటే తన దృష్టికి తీసుకురావాలన్న పవన్‌ కళ్యాణ్ మరో 2 రోజుల్లో కూటమి పోటీ చేసే స్థానాలపై క్లారిటీ వస్తుందని లేఖలో తెలిపారు.

పార్టీ శ్రేణులంతా జాగ్రత్తగా ఉండాలని పవన్‌ కళ్యాణ్ హెచ్చరించారు.పొత్తులపై తెలుగుదేశం పార్టీ నుంచి కూడా.. త్వరలోనే అన్న మాటే ఎక్కువగా వినిపిస్తోంది. కూటమిపై కీలక వ్యాఖ్యలు చేసిన తెలుగు దేశపు పార్టీ సీనియర్‌ నేత బుచ్చయ్యచౌదరి బీజేపీతో పొత్తు ఇంకా ఖరారు కాలేదని చెప్పారు. ఒకవేళ పొత్తు కనుక కుదిరితే… 175 అసెంబ్లీ సీట్లలో ఎక్కువ త్యాగం టీడీపీనే చేయాల్సి వస్తుందని అన్నారు. జనసేన క్యాడర్ పరంగా ఇంకా బలపడాల్సి ఉందన్న బుచ్చయ్య… ప్రజల్లో పవన్‌ కళ్యాణ్ బలంగానే ఉన్నారన్నారు. ఎప్పటికైనా రాజ్యాధికారమే లక్ష్యంగా పవన్‌ కళ్యాణ్ పనిచేస్తున్నట్టు కనిపిస్తోందన్నారు.ఓ వైపు అధికార వైసీపీ ఒంటరిగా రెడీ అవుతుంటే ప్రతిపక్షాలు పొత్తుకు ఇంకెంత దూరం? అనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే టీడీపీ, జనసేన ఒక అవగాహనకు రావడం జరిగింది కాబట్టి… ఇక కూటమిపై తుది నిర్ణయం బీజేపీదేనని సమాచారం తెలుస్తోంది. అయితే, దీనిపై హైకమాండ్‌ ఎలా చెబితే అలా అంటోంది ఏపీ బీజేపీ. మరి, అమిత్‌ షా మాటల ప్రకారం త్వరలోనే ఏపీ పొత్తులపై క్లారిటీ వస్తుందా? లేదా ? అనేది చూడాలి.

7k network
Recent Posts

సీఎం చంద్రబాబు సమీక్ష..చిరు పవన్ లఫై జగ్గారెడ్డి ఘాటు విమర్శలు..రొట్టెల పండుగ ఉత్సవంలో మంత్రి పొంగూరు..ఎవరైనా దళారులుగా ప్రవర్తిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు..!! తిరుపతి జిల్లా ఎస్పీ..ఉమెన్స్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ దామోదర్..మరిన్ని వార్తా విశేషాలత

మోదీది ఉత్త డప్పు..సీఎం రేవంత్..వైసీపీకి విజయసాయిరెడ్డి గుడ్ బై ?..ప్రకాశం జిల్లాలో 28ఎర్రచందనం దుంగలు స్వాధీనం..వినుకొండ మర్డర్ వెనుక బ్యాక్ గ్రౌండ్?..వైద్యాధికారి రంగారావుకు ప్రమాదం..కమిషనర్ శాంతి అక్రమాలు..

మోడీ మీద ఉక్రెయిన్ భారం మోపిన అమెరికా..న‌డిరోడ్డుపై వైసీపీ కార్య‌కర్త దారుణ హ‌త్య‌..రాష్ట్ర‌ప‌తికి ఫిర్యాదు..! ఎంపీడీవో మిస్సింగ్ పవన్..మార్కాపురంలో ఖైదీ పరారీ.. ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం..విద్యార్థులకు ఫాతిమాసంస్థ చేయూత..బాలుడిపై వీధి కుక్క దాడి…

విద్యాదీవెన,వసతిదీవెన స్థానంలో పాత విధానం: నారా లోకేశ్..వైసీపీకి విజయమ్మ కూడా ప్రత్యర్థిగానే..?గుంటూరు కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం.. గుంటూరు ఎస్పీగా సతీష్ కుమార్..ప్రకాశం ఎస్పీగా ఏ.ఆర్ దామోదర్.. మొహర్రం వేడుకలలో మాజీ ఎమ్మెల్యే అన్నా

పూరీ భాండాగారం కింద సీక్రెట్ రూమ్?..ముగిసిన ఏపీ క్యాబినెట్ సమావేశం..ప్రకాశం జిల్లా ఎస్పీకి ఘనంగా వీడ్కోలు..బాలినేని వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన దామచర్ల..అభివృద్ధి కోసం పని చేస్తా- ముత్తుముల..అడ్డంగా బుక్కైన వజ్రకరూరు తహసీల్దార్..