కేజ్రీవాల్ అరెస్టుపై ఆయన భార్య స్పందన వైరల్..లౌకిక వాదులను గెలిపించాలి ఆవాజ్ రాష్ట్ర కమిటీ పిలుపు..ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే అన్నా, కేపీ..

👉 కేజ్రీవాల్ అరెస్టుపై ఆయన భార్య స్పందన వైరల్!!!

”మోడీ గారూ..కేజ్రీవాల్ మీరు అనుకుంటున్న‌ట్టుగా దొంగ కాదు.ఆయ‌న జనార్ద‌నుడు. విష్ణుమూర్తి,ప‌రోప‌కారి.. అని ఆయ‌న‌కు ద్రోహం త‌ల‌పెట్టిన వారు ఎవ‌రూ ప్ర‌జాభిమానం సొంత చేసుకోలేక పోయారు” అని కేజ్రీవాల్ స‌తీమ‌ణి సునీత వ్యాఖ్యానించారు.ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ అధికారులు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. అన్ని వ‌ర్గాల నుంచి ఆయ‌న‌కు మ‌ద్ద‌తు ల‌భిస్తోంది.పార్టీల‌కు అతీతంగా కొంద‌రు మేధావులు కూడా కేజ్రీవాల్‌కు మ‌ద్ద‌తు ప‌లికారు.ఇప్ప‌టికే ఆమ్ ఆద్మీ పార్టీ నాయ‌కులు ఢిల్లీలో నిర‌స‌న కూడా చేప‌ట్టారు. తాజాగా కేజ్రీవాల్ స‌తీమ‌ణి సునీతా కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు.ఢిల్లీ వర్సెస్ పంజాబ్… కొత్త మైదానంలో సరికొత్త పోరు! ఆమె ప్రధాని మోడీని లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోడీ గారూ..మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికైన వ్యక్తిని మీరు అధికార అహంకారంతో అరెస్ట్ చేశారని మండిపడ్డారు. ”ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప్రతి ఒక్కరినీ అణచివేయాలని చూస్తున్నారు.సీఎం కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయడం ద్వారా ఢిల్లీ ప్రజలకు ద్రోహం తలపెట్టారు. ఢిల్లీ ప్రజలారా…మీ ముఖ్యమంత్రి ఎప్పుడూ మీ పక్షానే ఉంటారు.ఆయన బయట ఉన్నా,జైల్లో ఉన్నా ఆయన జీవితం ఎప్పుడూ దేశానికే అంకితం. ఆయన జనార్దనుడు(విష్ణువు, పరోపకారి) అని ప్రజలందరికీ తెలుసు” అని అని స్పష్టం చేశారు.👉 ఈడీ సంచ‌ల‌న అఫిడ‌విట్‌ మ‌మ‌త హాట్ కామెంట్స్‌ కేజ్రీవాల్ అరెస్టుపై ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ కూడా తీవ్ర‌స్థాయిలో నిప్పులు చెరిగారు. ఈడీ ఆయ‌న‌ను అరెస్టు చేయ‌డాన్ని మ‌మ‌త దుయ్య‌బ‌ట్టారు. బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ అరెస్ట్ ప్రజాస్వామ్యంపై దాడి అని మండిపడ్డారు. ”ప్రతిపక్షంలో ఉన్న, బీజేపీకి అనుకూలంగా లేని.. వారిని విమ‌ర్శిస్తున్న‌ ముఖ్యమంత్రులను ఉద్దేశ్యపూర్వకంగా లక్ష్యంగా చేసుకొని అరెస్ట్ చేస్తున్నారు. ఇది చాలా దారుణం.అదే సమయంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ సీబీఐ లేదా ఈడీ దర్యాఫ్తు చేస్తున్న నాయకులు ఎవరైనా బీజేపీలో ఉంటే మాత్రం వారికి శిక్షపడడం లేదు.క‌నీసం విచార‌ణ కూడా సాగ‌డం లేదు. ముఖ్యంగా ఇతర పార్టీలో ఉన్నప్పుడు దర్యాఫ్తు సంస్థలు వెంటబడతాయి. బీజేపీలో చేరిన తర్వాత ఎలాంటి శిక్ష ఉండదు. ఇలాంటి వైఖరిని ప్రజాస్వామ్యంపై తీవ్రమైన దాడిగానే భావిస్తున్నాం”అని మ‌మ‌త వ్యాఖ్యానించారు.

👉తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు, మాజీ ఎంపీ మహువా మొయిత్రా ఇంట్లో సీబీఐ సోదాలు చేసింది.
కోల్‌కతాలోని అలీపూర్‌లో ఉన్న మహువా ఫ్లాట్‌తోపాటు,ఇతర నగరాల్లో ఆమెకు సంబంధించిన చోట్ల సోదాలు చేస్తున్నట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి.
మహువా డబ్బులు తీసుకొని పార్లమెంటులో ప్రశ్నలు అడిగారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే గతంలో ఆరోపించారు. ఎథిక్స్ కమిటీ సూచనల మేరకు మూడు నెలల కిందట మహువాను లోక్‌సభ నుంచి స్పీకర్ బహిష్కరించారు.
నిషికాంత్ ఆరోపణలపై దర్యాప్తు చేయాలని సీబీఐని లోక్‌పాల్ ఆదేశించింది. దీనిపై ఆరు నెలల్లోగా నివేదిక సమర్పించాలని కోరింది. అనంతరం మహువాపై సీబీఐ గురువారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో మహువా, కృష్ణానగర్‌ స్థానం నుంచి టీఎంసీ అభ్యర్థిగా పోటీచేస్తున్నారు.

👉👉👉లౌకిక వాద పరిరక్షణ కొరకు దేశవ్యాప్తంగా బిజెపిని ఓడించండి..రాష్ట్రంలోని బిజెపితో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అంటకాగే పార్టీలను ఓడించండి..ఇండియా కూటమి లోని లౌకిక పార్టీలను వామపక్ష అభ్యర్థులను గెలిపించండి..రాష్ట్ర ఆవాజ్ కమిటీ పిలుపు ..లౌకిక వాద పరిరక్షణ కొరకు దేశవ్యాప్తంగా బిజెపిని ఓడించండి రాష్ట్రంలోని బిజెపితో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అంటకాగే పార్టీలను ఓడించండి ఇండియా కూటమి లోని లౌకిక పార్టీలను వామపక్ష అభ్యర్థులను గెలిపించాలని రాష్ట్ర ఆవాజ్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు ఎస్ ఏ సుభాన్,ఎం ఏ చిస్టి ఒక ప్రకటనలో కోరారు. శనివారం జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం జరిగినట్లు వారు తెలిపారు.మే 2014 నుంచి బిజెపి అధికారంలో వచ్చినప్పటి నుంచి మైనారిటీలపై దాడులు అజాన్,నమాజ్,హలాల్, హిజాబ్, యు సి సి, లవ్ జిహాద్, ఘర్ వాపసి,గోరక్షణ అంటూ అనేక రకాల దాడులు చేస్తుందన్నారు. దేశ బడ్జెట్లో కేటాయింపులో కోత వివిధ పథకాల నిలిపివేత, స్కాలర్షిప్లలో కుదింపులు అంటూ ఆర్థిక దాడులు కూడా చేస్తుంది.ఇంతకంటే దుర్మార్గంగా మత ప్రాతిపదికన పౌరసత్వం అంటూ ముస్లింల ఉనికే ప్రమాదంలోకి నెట్టి వేయబడే ఎన్ఆర్సి ఎన్పీఆర్ సిఏఏ లాంటి చట్టాలను తెచ్చిందని ఆరోపించారు.మూడు రైతు నల్ల చట్టాలు,నాలుగు లేబర్ కోడ్ లు,నిరుద్యోగం, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల,దళితులు మహిళలు గిరిజనులపై దాడులలో కేవలం మైనారిటీలే కాకుండా యావత్తు దేశంలోని అన్ని తరగతుల ప్రజల పైన నిరంకుశత్వం వైఖరితో పాలన సాగిస్తుందన్నారు.మేకింగ్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా స్టార్ట్ అప్ ఇండియా ఆత్మ నిర్భారత్ వికసిత భారత్ అంటూనే ఆచరణలో అదాని భారత్ అంబానీ భారత్ గా మార్చే ప్రయత్నం చేస్తుందని యావత్ దేశమే ప్రమాదంలో నెట్టి వేయబడుతుంది కనుక ఈ దేశ రాజ్యాంగాన్ని లౌకిక వాదాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ఈఎన్నికలలో బిజెపి ఎన్డీఏ కూటమిని ఓడించడమే తక్షణ కర్తవ్యమన్నారు.ఇక రాష్ట్రానికి సంబంధించి గత 10 ఏళ్లలో అధికారంలో ఉన్న టిడిపి,వైకాపా రెండు పార్టీలు కేంద్రంలోని బిజెపి ప్రవేశపెట్టే ప్రజా వ్యతిరేక చట్టాలన్నింటినీ ఏ ఒక్కటి మినహాయింపు లేకుండా సమర్ధించడం జరిగిందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా మైనారిటీలపై దళితులపై దాడులు జరుగుతుంటే ఖండించకపోవడం గర్హనీయం అన్నారు. ఈ రెండు పార్టీలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బిజెపితో అంట కాగడం తప్ప రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా విభజన హామీ అమలు సాధించే విషయంలో పూర్తిగా వైఫల్యం చెందాయన్నారు. వామపక్షాల శక్తి పరిమితంగా ఉన్నప్పటికీ దేశంలోనూ రాష్ట్రంలోనూ మతోన్మాద బిజెపికి వ్యతిరేకంగా నికరంగా నిలబడి పోరాటం చేస్తున్నాయన్నారు.అందువల్ల అటు దేశంలో బిజెపి కూటమిని ఇటు రాష్ట్రంలో వైకాపా టీడీపీ జనసేన బిజెపి కూటమిని ఓడించి వామపక్ష అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

👉 *ఇఫ్తార్ విందులో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు అన్నా,కేపీ*


పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా కంభం మాజీ జడ్పీటిసి జాకీర్ సోదరులు,వైసిపి మైనారిటీ నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా గిద్దలూరు,మార్కాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు అన్నారాంబాబు, కుందూరు నాగార్జునరెడ్డి,రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ షంషీర్ అలీబేగ్ లు పాల్గొన్నారు.శుక్రవారం కంభంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో వారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు కెపి, అన్నాలు మాట్లాడుతూ శాంతికి, పవిత్రమైన ప్రేమకు, సహనానికి ప్రతీక రంజాన్ మాసమని అన్నారు.ఇస్లాం అనేది ఒక మతం కాదని, అది విశ్వమానవాళి మనుగడకు అవసరమైన ఒక స్వచ్ఛమైన జీవన విధానం అని అన్నారు.ప్రతి ఒక్కరూ ఎదుటివారిని ప్రేమిస్తూ ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ సమాజంలో ఐక్యంగా మెలగాలని వారు ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు. అల్లా బోధనలు శాంతికి వరమత సహనానికి ఆదర్శప్రాయమని ఎమ్మెల్యేలు అన్నారు. ఈ కార్యక్రమం లో వైసీపీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు,మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
👉 *ఐ న్యూస్ ఛానల్ ఎండి శ్రవణ్ రావు ఇంట్లో పోలీసుల సోదాలు…*
*ఐ న్యూస్ ఎండి శ్రవణ్ కుమార్ రావుతో కలిసి ఫోన్ టాపింగ్ కు పాల్పడ్డట్టు స్టేట్మెంట్ ఇచ్చిన ప్రణీత్ రావు..
ప్రణీత్ రావు ఇచ్చిన ఆధారాలతో శ్రవణ్ కుమార్ రావు ఇంట్లో సోదాలు చేస్తున్న పోలీసులు..ఐ న్యూస్ ఆఫీసులో ఒక ప్రత్యేక సర్వర్ రూమ్ ఏర్పాటు చేసి వ్యాపారవేతలు, రాజకీయ నాయకుల ఫోన్ టాపింగ్ కు పాల్పడ్డట్టు ప్రణీత్ రావు స్టేట్ మెంట్..ప్రస్తుతం ఇంట్లో లేని శ్రవణ్ కుమార్ రావు..లండన్ పారిపోయినట్టు అనుమానిస్తున్న పోలీసులు..
👉 *అమరవీరుల త్యాగం అజరామరం*

కంభం: అమరవీరుల త్యాగం  అజరామరమనీ,వారి దేశ భక్తి అనిర్వచనీయమని ఎంఈఓలు బి.మాల్యాద్రి, కె.శర్వాణిలు పేర్కొన్నారు.శనివారం అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక మండల విద్యాశాఖ కార్యాలయంలో అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర పాలన విముక్తి,దేశ స్వాతంత్య్రం లక్ష్యంగా ప్రాణాలర్పించిన భరత మాత ముద్దు బిడ్డలు భగత్ సింగ్,రాజ్ గురు, సుఖ్ దేవ్ చారిత్రక సత్యాలుగా భారతీయుల హృదయాలలో నిలిచి వుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల సమన్వయకర్త చిన్ని. పద్మావతి, ఉపాధ్యాయులు శివశంకర్, మహమ్మద్ వలి, సీఆర్పీలు ఎమ్మార్సీ సిబ్బంది పాల్గొన్నారు.

7k network
Recent Posts

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం

కరెంటు బిల్లులపై ఏపీ సీఎం చంద్రబాబు ఊరటనిచ్చే ప్రకటన..50 లక్షలు సీఎమ్ రిలీఫ్ ఫండ్ కు చెక్ అందజేసిన ఎమ్మెల్యే అమిలినేని..తీవ్రంగా నష్టపోయాం…పెద్దమనసుతో ఆదుకోండి-మంత్రి నారా లోకేష్..బాసర ట్రిపుల్ ఐటీలో 2000 మంది విద్యార్థుల ఆందోళన..భోజనం పెట్టి మరీ సమస్యలు విన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..జగన్ పర్యటనకు హైకోర్టు బ్రేక్..తెలంగాణ సీఎస్ మీద మోడీ సర్కార్ సీరియస్?..తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మహేష్‌కుమార్‌గౌడ్‌.అదనపు భద్రతకు జగన్ అనర్హుడు: నచికేత్.

సీఎం చంద్రబాబుకి తప్పిన పెను ప్రమాదం..వెలుగులోకి ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలలు.. క్రమశిక్షణ చర్య…apuwj ఆధ్వర్యంలో వరద బాధితులకు విరాళం..22న హలోమాల చలో ఒంగోలు..శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల, మాజీ ఎమ్మెల్యే పద అన్నా..కంభంలో ఘనంగా టీచర్స్ డే.. పలువురికి ఘన సన్మానం.

ఏపీలో నేడు కేంద్ర బృందం పర్యటన..జగన్ ఐదు నిముషాల షో..ముఖ్యమంత్రి చంద్రబాబు విసుర్లు..బుడమేరుపై ఫలిస్తున్న మంత్రి లోకేష్ కృషి..ఆ రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పెన్షన్ రద్దు..బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు..వరద బాధితులకు కంభం వాసుల వితరణ..

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు విస్తృత పర్యటన..పనిచేయని మంత్రులనూ పీకి పారేస్తా😯విజయ సాయి కబ్జా కూల్చివేత….బిడ్డలున్నారు కదా? షర్మిల సంచలన కామెంట్స్..తండ్రిని పట్టించుకోని కొడుకు గిఫ్ట్ డీడ్ రద్దు..పారాలింపిక్స్‌లో తెలంగాణ యువతికి కాంస్యం..నేడు కడప ఉరుసు మహోత్సవం ..వరంగల్ లో నకిలీ సర్టిఫికెట్ల బాగోతం..