సమర శంఖం పూరిస్తున్న పవన్?..కేరళ సీఎం కీలక వ్యాఖ్యలు..గిద్దలూరు టిడిపిలో చేరికలు..దొంగను అరెస్టు చేసిన మార్కాపురం పోలీసులు

👉గెలుపు కోసం సమర శంఖం పూరిస్తున్న పవన్?

వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాడు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్..ఎన్నికల సమయం దగ్గరపడుతుండడంతో ప్రచారంలో దూకుడు పెంచుతున్నారు.ఈ నెల 30 వ తేదీన పిఠాపురం నుంచి సమర శంఖం పూరిస్తున్నారు. పిఠాపురం కేంద్రంగానే పవన్ కల్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి సిద్ధం అవుతున్నారు.మూడు విడతలుగా పవన్‌ కళ్యాణ్ ప్రచారం ఉండేలా పర్యటన షెడ్యూల్‌ రూపొందిస్తున్నారు పార్టీ నేతలు. ప్రతి విడతలో జనసేన పార్టీ పోటీ చేసే నియోజకవర్గాలకు వెళ్లేలా షెడ్యూల్‌ రూపొందించనున్నారు.ప్రచారంలో భాగంగా పవన్ కల్యాణ్ ఈనెల 30 వ తేదీన పిఠాపురం వెళ్తారు. మొదటి రోజు శక్తిపీఠమైన శ్రీ పురూహూతిక అమ్మవారిని పవన్‌ దర్శనం చేసుకోనున్నారు.అక్కడ వారాహి వాహనానికి పూజలు చేసిన తరువాత దత్తపీఠాన్ని సందర్శిస్తారు.ఇక ఆ రోజు నుంచి మూడు రోజుల పాటు నియోజకవర్గంలోనే ఉంటారు. ఈ క్రమంలో పార్టీ నేతలతో అంతర్గత సమావేశాలని నిర్వహిస్తారు.క్రియాశీల కార్యకర్తలతో మండలాల వారీగా సమావేశాలు ఉంటాయని పవన్‌ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి పి. హరిప్రసాద్ ప్రకటనలో తెలిపారు.అలాగే టీడీపీ,బీజేపీ నేతలతో కూడా పవన్ కళ్యాణ్ భేటీలకు ఏర్పాట్లు చేస్తున్నారని,పిఠాపురం నుంచే రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాలకు వెళ్లాలని పవన్‌ కళ్యాణ్ నిర్ణయం తీసుకోవడంతో అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ క్రమంలోనే పిఠాపురం నియోజకవర్గంలో బంగారు పాప దర్గా సందర్శన, క్రైస్తవ పెద్దలతో సమావేశంతో పాటు సర్వమత ప్రార్థనల్లో పవన్‌ కళ్యాణ్ పాల్గొంటారు. ఉగాది వేడుకలను కూడా పవన్‌ కళ్యాణ్ పిఠాపురంలోనే నిర్వహించుకోనున్నారు.ఇప్పటికే 18 అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానంలో అభ్యర్థులను ప్రకటించిన పవన్ కల్యాణ్.. పెండింగ్ స్థానాలపై కసరత్తు చేస్తున్నారు.3 అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానంలో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అవనిగడ్డ, పాలకొండ, విశాఖ సౌత్ అసెంబ్లీ స్థానాలు ఇంకా మచిలీపట్నం పార్లమెంట్ పై కొనసాగుతున్న సందిగ్ధత కొనసాగుతోంది. ఆ ప్రాంతాల నేతలతో ఇప్పటికే భేటీ అయిన పవన్ పలుమార్లు చర్చలు నిర్వహించారు. ఇవాళ రేపట్లొ ఫైనల్ చేసి ఎన్నికల ప్రచారానికి పవన్ బయలుదేరనున్నారని సమాచారం తెలుస్తోంది.

👉 ‘ఆ’ నినాదాలను మీరు విడనాడగలరా ?..‘భారత్‌ మాతా కీ జై’ , ‘జై హింద్‌’ అంటూ మొదట ముస్లింలే నినదించారని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ వ్యాఖ్యానించారు.

ఆ నినాదాలను విడిచి పెట్టే ధైర్యం మీకు ఉందా? అని సంఫ్‌ు పరివార్‌ నేతలను నిలదీశారు.వివాదాస్పద సిఎఎని వ్యతిరేకిస్తూ కేరళ ప్రభుత్వం వరుసగా చేపడుతున్న నాలుగవ ర్యాలీ సోమవారం ముస్లింలు అధికంగా ఉండే ఉత్తర కేరళలో కొనసాగింది.ఈసందర్భంగా విజయన్‌ ప్రసంగించారు. దేశ చరిత్రలో,స్వాతంత్య్ర పోరాటంలో పలువురు ముస్లిం పాలకులు, పలువురు అధికారులు,వ్యక్తులు కీలక పాత్ర పోషించారని అన్నారు.చరిత్రలో ఇందుకు అనేక సాక్ష్యాలు ఉన్నాయని,అజీముల్లా ఖాన్‌ అనే ముస్లిం వ్యక్తి ‘భారత్‌ మాతా కీ జై ‘ అనే నినాదాన్ని రూపొందించారని అన్నారు. అలాగే అబిద్‌ హసన్‌ అనే దౌత్యవేత్త ‘జై హింద్‌’ అనే నినాదాన్ని లేవనెత్తారని చెప్పారు.ఇక్కడికి వచ్చిన కొందరు సంఘ్ పరివార్‌ నేతలు తమ ముందు కూర్చున్న వారిని ‘భారత్‌ మాతాకీ జై ’ అని నినాదాలు చేయాలని కోరారు.అయితే ఆ నినాదాన్ని ఎవరు మొదట రూపొందించారు.ఆ వ్యక్తి పేరు అజిముల్లా ఖాన్‌ అని వారికి తెలుసో లేదో తనకు తెలియదని అన్నారు. ఈ నినాదాన్ని ముందుకు తెచ్చింది ముస్లిం కావడంతో ఆ నినాదాన్ని ఆపేస్తారో లేదో కూడా తనకు తెలియదని వ్యాఖ్యానించారు.మొఘల్‌ చక్రవర్తి షాజహాన్‌ కుమారుడు దారా షికో 50కి పైగా ఉపనిషత్తులను సంస్కృత గ్రంథం నుండి పర్షియన్‌ భాషలోకి అనువదింప చేయడంతో ఆ భారతీయ గ్రంథాలు ప్రపంచమంతటా చేరాయని అన్నారు.ముస్లింలను భారత్‌ నుండి వెళ్లగొట్టాలనుకుంటున్న సంఘ్ పరివార్‌ నేతలు, కార్యకర్తలు ఈ చారిత్రక విషయాలను తెలుసుకోవాలని అన్నారు.స్వాతంత్య్ర పోరాటంలో ఇతరులతో పాటు ముస్లింలు కూడా కీలక పాత్ర పోషించారని ఈ సందర్భంగా విజయన్‌ గుర్తు చేశారు.

*ముత్తుముల సమక్షంలో 40 కుటుంబాలతో సహా టీడీపీలో చేరిన మాజీ ఎంపీటీసీ..*ప్రకాశం జిల్లా, గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో గిద్దలూరు మండలం,నరవ బయనపల్లె గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు మీసాల పాపయ్య యాదవ్ గ్రామంలోని 40 కుటుంబాలతో సహా వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.ఈ సందర్బంగా అశోక్ రెడ్డి టీడీపీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.. గ్రామాల్లో అభివృద్ధి జరగాలంటే తెలుగుదేశంతోనే సాధ్యమని, రాబోయే ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన అశోక్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తామన్నారు.*👉రాచర్ల వారి వివాహా కార్యక్రమంలో పాల్గోన్న ముత్తుముల*గిద్దలూరు పట్టణం,నంద్యాల రోడ్డులోని శ్రీ చీతిరాల కళ్యాణ మండపంలో పట్టణానికి చెందిన రాచర్ల మహేశ్వరరావు,సావిత్రి ల కుమారుడు “చి.మణికంఠ మరియు చి.ల.సౌ హర్ష”ల వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో గిద్దలూరు టిడిపి ఇన్చార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు.

👉 పొదిలి మండలంలో నీటి ఎద్దడి నివారణ కోసం మాదిరెడ్డి పాలెం, పోతవరం, కంభాలపాడు గ్రామాలలో వైస్సార్సీపీ పార్టీ తరుపున నీటి సరఫరా. అన్నా రాంబాబు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫ్లెక్సీలు పెట్టి నీటి సరఫరా చేస్తున్నారు.

👉జిల్లాలోని పలు ప్రాంతాల్లో మోటార్ సైకిళ్ళు, సెల్ ఫోన్ల చోరీలకు పాల్పడుతున్న షేక్ సుభాని అనే యువకున్ని అరెస్ట్ చేసి అతని వద్ద 5 మొబైళ్లు, మూడు బైక్ లు స్వాధీనం చేసుకున్న మార్కాపురం సీఐ ఆవుల వెంకటేశ్వర్లు, ఎస్సై అబ్దుల్ రెహమాన్.

7k network
Recent Posts

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం

కరెంటు బిల్లులపై ఏపీ సీఎం చంద్రబాబు ఊరటనిచ్చే ప్రకటన..50 లక్షలు సీఎమ్ రిలీఫ్ ఫండ్ కు చెక్ అందజేసిన ఎమ్మెల్యే అమిలినేని..తీవ్రంగా నష్టపోయాం…పెద్దమనసుతో ఆదుకోండి-మంత్రి నారా లోకేష్..బాసర ట్రిపుల్ ఐటీలో 2000 మంది విద్యార్థుల ఆందోళన..భోజనం పెట్టి మరీ సమస్యలు విన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..జగన్ పర్యటనకు హైకోర్టు బ్రేక్..తెలంగాణ సీఎస్ మీద మోడీ సర్కార్ సీరియస్?..తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మహేష్‌కుమార్‌గౌడ్‌.అదనపు భద్రతకు జగన్ అనర్హుడు: నచికేత్.

సీఎం చంద్రబాబుకి తప్పిన పెను ప్రమాదం..వెలుగులోకి ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలలు.. క్రమశిక్షణ చర్య…apuwj ఆధ్వర్యంలో వరద బాధితులకు విరాళం..22న హలోమాల చలో ఒంగోలు..శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల, మాజీ ఎమ్మెల్యే పద అన్నా..కంభంలో ఘనంగా టీచర్స్ డే.. పలువురికి ఘన సన్మానం.

ఏపీలో నేడు కేంద్ర బృందం పర్యటన..జగన్ ఐదు నిముషాల షో..ముఖ్యమంత్రి చంద్రబాబు విసుర్లు..బుడమేరుపై ఫలిస్తున్న మంత్రి లోకేష్ కృషి..ఆ రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పెన్షన్ రద్దు..బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు..వరద బాధితులకు కంభం వాసుల వితరణ..

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు విస్తృత పర్యటన..పనిచేయని మంత్రులనూ పీకి పారేస్తా😯విజయ సాయి కబ్జా కూల్చివేత….బిడ్డలున్నారు కదా? షర్మిల సంచలన కామెంట్స్..తండ్రిని పట్టించుకోని కొడుకు గిఫ్ట్ డీడ్ రద్దు..పారాలింపిక్స్‌లో తెలంగాణ యువతికి కాంస్యం..నేడు కడప ఉరుసు మహోత్సవం ..వరంగల్ లో నకిలీ సర్టిఫికెట్ల బాగోతం..