👉ఇజ్రాయెల్‌పై డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ పెద్ద ఎత్తున దాడికి దిగింది.సిరియాలోని ఇరాన్ కాన్సులేట్‌పై జరిగిన దాడికి ప్రతీకారంగా ఇరాన్ ఈ దాడి చేసినట్లుగా చెబుతున్నారు….ఇజ్రాయెల్‌లోని ‘‘నిర్ధిష్ట లక్ష్యాలే’’ కేంద్రంగా తాజా దాడులు చేసినట్లుగా ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్‌జీసీ) చెప్పింది…
వంద కంటే ఎక్కువ డ్రోన్లను ఇరాన్ ప్రయోగించినట్లుగా ఇజ్రాయెల్ ఆర్మీ వర్గాలు తెలిపాయి.సీబీఎస్ న్యూస్ చెప్పినదాని ప్రకారం, అమెరికా కొన్ని డ్రోన్లను పేల్చేసింది.ఇజ్రాయెల్‌తో పాటు మిత్రపక్షాలు కలిసి క్రూయిజ్ క్షిపణులు,డ్రోన్లను ఇజ్రాయెల్ గగనతలం వెలుపలే కూల్చేసినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ చెప్పింది.ఇరాన్ దాడి తర్వాత ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు, క్యాబినెట్ సమావేశానికి పిలుపునిచ్చారు.ఈ రెండు ప్రధాన శత్రు దేశాల మధ్య ఏళ్లుగా పరోక్ష యుద్ధం జరుగుతోంది. కానీ, ముఖాముఖిగా తలపడటం ఇదే మొదటిసారి.‘‘అవసరమైన చోట ప్రత్యర్థి బెదిరింపులను నిలువరిస్తున్నాం’’ అని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) వెల్లడించింది.ఇరాన్ దాడి తర్వాత ఇజ్రాయెల్‌లో సైరన్‌ల మోతలు వినిపిస్తున్నాయి. జెరూసలెంలో ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా డ్రోన్లను పేల్చేయడంతో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి.👉ఇజ్రాయెల్‌లో డ్రోన్లు ఎక్కడ పడ్డాయి?..మిత్రదేశాలు, భాగస్వాములతో కలిసి ఇజ్రాయెల్‌ను, దాని ప్రజలను రక్షించడంలో పూర్తిగా నిమగ్నమై ఉన్నామని ఐడీఎఫ్ అధికార ప్రతినిధి, రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి చెప్పారు.ఇజ్రాయెల్‌లో కొన్ని క్షిపణులు పడ్డాయని, వాటి వల్ల ఒక సైనిక స్థావరానికి స్వల్ప నష్టం జరిగిందని, ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని ఆయన స్పష్టం చేశారు.
👉 ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై జరిగిన దాడిని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఖండించారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా
సీఎం జగన్ మోహన్ రెడ్డిపై దాడి జరిగి ఎడమ కంటిపై గాయం కావడం బాధాకరం, దురదృష్టకరమని అన్నారు.ఇది ప్రమాదవశాత్తు అయ్యిందని అనుకుంటున్నామని తెలిపారు.అలా కాకుండా ఇది ఎవరైనా కావాలని చేసి ఉంటే ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఖండించాల్సిందేనన్నారు.ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని అభిప్రాయపడ్డారు.హింసను ప్రతి ప్రజాస్వామికవాది ఖండించాల్సిందే అని వైఎస్ షర్మిల అన్నారు.జగన్ త్వరగా కోలుకోవాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నానని చెప్పారు.
👉పవన్ కళ్యాణ్ పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు!!!ఈ సమయంలో తాజాగా జాతీయ ఎస్సీ కమిషన్ ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ పై మరో నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ తేదీకి కౌంట్ డౌన్ మొదలైంది. నెలరోజుల లోపే పోలింగ్ తేదీ ఉండటంతో పాటు అంతకు రెండు రోజుల ముందే ప్రచార పర్వాలకు తెర్పడనున్న నేపథ్యంలో..అన్ని రాజకీయ పార్టీలూ దూకుడు పెంచాయి. ఈ క్రమంలో…ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు తెరపైకి వస్తున్నాయి.ఇందులో భాగంగా తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై నాన్ బెయిలబుల్ కేసు నమోదవ్వడం ఆసక్తిగా మారింది.అవును… ఏపీలో ఎన్నికల పోలింగ్ తేదీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిన నేపథ్యంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి!ఇందులో భాగంగా… వాలంటీర్ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన తీవ్ర వ్యాఖ్యల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది.ఈ సమయంలో జాతీయ ఎస్సీ కమిషన్ రంగంలోకి దిగడంతో ఈ వ్యవహారం అత్యంత సీరియస్ గా మారిందని అంటున్నారు! గతంలో పవన్ కళ్యాణ్ పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరువు నష్టం కేసు వేసిన సంగతి తెలిసిందే.తనకు కేంద్ర నిఘా వర్గాల సమాచరం ఉందంటూ..ఏపీలో వాలంటీర్లు హ్యూమన్ ట్రాఫికింగ్ కి సహకరిస్తున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే.ఈ సమయంలో తాజాగా జాతీయ ఎస్సీ కమిషన్ ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ పై మరో నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. ఆంధ్రప్రదేశ్ లో మానవ అక్రమ రవాణా..సుమారు 29,000 మంది మహిళల అదృశ్యం వెనుక వాలంటీర్లు ఉన్నారంటూ గత ఏడాది పవన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి జాతీయ ఎస్సీ కమిషన్ స్పందించింది! ఒక మాదిగ సంఘం మహిళా వాలంటీర్.. పవన్ పై ఫిర్యాదు చేయడంతో ఈ కేసును ఎస్సీ కమిషన్ కు పంపారు.దీంతో… ఈ వ్యవహారంపై స్పందించిన నేషనల్ ఎస్సీ కమిషన్…పవన్ పై నాన్ బెయిలబుల్ కేసు బుక్ చేయాలని ఏలూరు పోలీసులను ఆదేశించారు.ఈ మేరకు పవన్ కల్యాణ్ పై 153, 504, 505 (2)ఐపీసీ కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి, దర్యాప్తుకు ఆదేశించారు! దీంతో… ఎన్నికల సమయంలో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది!ఇదే సమయంలో… ఈ కేసుకు సంబంధించి పవన్ కు అదుపులోకి తీసుకునే అవకాశం ఉందంటూ నెట్టింట ఊహాగాణాలు తెరపైకి వస్తున్నాయి!👉బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి బయట ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపినట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది.బాంద్రాలోని సల్మాన్ ఖాన్ నివాసం వద్ద ఉదయం 5 గంటలకు ఈ ఘటన జరిగినట్లు వెల్లడించింది.
మూడు రౌండ్ల పాటు ఫైరింగ్ జరిగినట్లు పోలీసులకు సమాచారం అందిందని, ఘటనా స్థలానికి చేరుకున్న క్రైం బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు ముంబయి పోలీసులను ఉటంకిస్తూ ఏఎన్‌ఐ పేర్కొంది.
👉 ఒంగోలు… హెచ్ సి ఎం కాలేజ్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పిస్తున్న ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి…👉 జగన్ పై దాడికి నిరసనగా వైసీపీ కార్యాలయంలో నిరసన వ్యక్తంచేసిన వైసిపి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కార్యకర్తలు.
👉 మార్కాపురం నియోజకవర్గం మార్కాపురం మండలం రైల్వేస్టేషన్ కాలనీ రాయవరం లో మార్కాపురం శాసనసభ అభ్యర్థి కందుల నారాయణరెడ్డి మరియు వారి తనయులు విఘ్నేష్ తో జరిగిన తెలుగుదేశం ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డి తనయులు మాగుంట రాఘవరెడ్డి కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం,జనసేన,బిజెపి మండల అధ్యక్షులు పలువురు నాయకులు,అభిమానులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది .
👉 “ఒంగోలు లోని మిరియాలపాలెం సెంటర్ లో డా. బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి మరియు ఒంగోలు శాసనసభ అభ్యర్థి దామచర్ల జనార్దన్ రావు, జనసేన ప్రకాశం జిల్లా ఇంచార్జి షేక్ రియాజ్ మరియు మాజీ మునిసిపల్ చైర్మన్ మంత్రి శ్రీను మరియు పలువురు నాయకులు,అభిమానులు పాల్గొన్నారు.
👉ఫ్యాన్ గుర్తుకు ఓటేద్దాం – ఎమ్మెల్యే అన్నాను గెలిపిద్దాం.. జగనన్నతోనే మహిళలకు భరోసా అంటూ ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా కోడలు అనూష.. మార్కాపురం ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాను గెలిపించాలని కోరుతూ పొదిలిలో 12వ వార్డులో ప్రచారం చేసిన అనూష.. సీఎం జగనన్న ద్వారానే మహిళలకు భరోసా, ఆర్థిక స్వేచ్చ లభిస్తోందని, కావున వైఎస్సార్సీపీ ఫ్యాన్ గుర్తుకే ఓటేసి మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థి అన్నా రాంబాబుని రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని కోరుతూ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా రాంబాబు కోడలు అన్నా అనూష ప్రచారం నిర్వహించారు. శనివారం పొదిలి పట్టణంలోని మెయిన్ రోడ్డులో గల ఆంజనేయ స్వామి ఆలయంలో ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా కోడలు అనూష ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం పొదిలిలోని 12వ వార్డులో ప్రచారం ప్రారంభించి ఆ వార్డులోని పలు వీధుల్లో ఇంటింటికి తిరిగి మార్కాపురం వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన మామ అన్నా రాంబాబుని, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి వేయించి అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని అభ్యర్థించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే కోడలు మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయడంలో తన మామ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవ చేస్తున్న మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగినవారన్నారు.గ్రామ సచివాలయ వ్యవస్థ వల్ల చాలా ప్రయోజనంచేకూరిందనన్నారు.గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్లను ఏర్పాటు చేయడం వల్ల ప్రభుత్వ సేవలు గ్రామాల్లోనే అందుతున్నాయన్నారు. పేదలకు మంచి చేస్తున్న జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఎమ్మెల్యే అభ్యర్థి కోడలు అన్నా అనూష పిలుపునిచ్చారు. ముందుగా అనూషని పలువురు వైసీపీ నాయకులు,కార్యకర్తలు , ప్రజలు ఘనంగా సన్మానించి ఆహ్వానించారు. కార్యక్రమం లో పొదిలి మున్సిపాలిటీ పరిధిలోని వైసీపీ ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.*
👉సంక్షేమ సారథికి అండగా నిలవండి..మార్కాపురం వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నా ..ముఖ్య అతిధిగా ఏపీఐఐసి చైర్మన్ జంకే..
ప్రజల అభ్యున్నతి, సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న సంక్షేమ సారథి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని మార్కాపురం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే అన్నా రాంబాబు అన్నారు.శనివారం మార్కాపురం మండలంలోని బిరుదుల నరవ,బిరుదుల నరవ ఎస్సీ పాలెం -1, 2, ఎల్.బి.ఎస్. నగర్, అయ్యవారిపల్లి, బడేఖాన్ పేట,చింతగుంట్ల, చింత గుంట్ల ఎస్సీ పాలెం -1, పాలెం -2 గ్రామల్లో మార్కాపురం ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా రాంబాబు గారు ప్రచార కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అన్నా ఆయా గ్రామాల్లోని ప్రతి గడపకు వెళ్లి జగనన్న పాలనలో అందించిన మంచిని వివరించి కరపత్రాలను అందచేశారు.అనంతరం ప్రజలను అడిగి సమస్యలు తెలుసుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఏపీఐఐసి చైర్మన్ జంకే వెంకట రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే అన్నా మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో మార్కాపురం ఎమ్మెల్యే అభ్యర్థి గా పోటీ చేస్తున్న తనను,ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు.మనమందరం బాగుండాలంటే రానున్న ఎన్నికల్లో అందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని తెలిపారు.జగనన్నను మళ్లీ సీఎంగా చేసుకుంటే ప్రజలకు మరింత సంక్షేమం అందుతుందన్నారు.టీడీపీ నాయకులు చెప్పే మాయమాటలను నమ్మి మోసపోవద్దని తెలిపారు. ఈ .ముందుగా ఆయా గ్రామాల్లోని పలువురు వైసీపీ నాయకులు, పలువురు వైసీపీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు,అభిమానులు, ప్రజలు, ఎమ్మెల్యే అన్నాను గజమాలతో ఘనంగా సన్మానించి ఆహ్వానం పలికారు.
*అభివృద్ధి చేసే నాయకులకు అండగా ఉండండి….ఆశీస్సులు అందించండి.. తన భర్త ఎమ్మెల్యే అన్నా రాంబాబును గెలిపించాలని కోరుతూ అన్నా సతీమణి దుర్గా కుమారి మార్కాపురం 6వ వార్డులో ప్రచారం.. ఘన స్వాగతం పలికిన వైసీపీ నాయకులు, మహిళలు కార్యకర్తలు..
ప్రజలకు అండగా ఉండి మంచి చేసి అభివృద్ధిని ఆకాంక్షించే మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థి అన్నా రాంబాబు గారిని రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని ఎమ్మెల్యే అభ్యర్థి సతీమణి అన్నా దుర్గాకుమారి అన్నారు.గురువారం మార్కాపురం పట్టణంలోని అమ్మవారి శాల ఆలయంలో ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా సతీమణి దుర్గకుమారి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం 6వ వార్డులో ప్రచారం ప్రారంభించి ఆ వార్డులోని పలు వీధుల్లో ప్రతి ఇంటింటికి తిరిగి మార్కాపురం వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన భర్త అన్నా రాంబాబుని, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి వేయించి అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని అభ్యర్థించారు.ముందుగా ఎమ్మెల్యే అన్నా సతీమణి దుర్గాకుమారిని పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘనంగా సన్మానించి ఆహ్వానించారు. ఈ కార్యక్రమం లో మార్కాపురం మున్సిపాలిటీ పరిధిలోని వైసీపీ ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
👉టీడీపి కి భారీ షాక్!!..
టీడీపీ పార్టీని వీడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లోకి చేరిన “బేస్తవారిపేట” మండలంలోని పెద్ద ఓబినేని పల్లె పంచాయతీ పరిధిలోని రెట్లపల్లి గ్రామానికి చెందిన నాయకులు..బేస్తవారిపేట మండలం పెద్ద ఓబిలేని పల్లె పంచాయతీ పరిధిలోని రెట్లపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు గిద్దలూరు నియోజకవర్గం వైయస్సార్ సీపీ బేస్తవారిపేట మండల పార్టీ అధ్యక్షులు వేగినాటి ఓసురారెడ్డి,జడ్పీటీసీ బండ్లమూడి వెంకట రాజయ్య,సర్పంచ్ ఓబిలిబోయిన వెంకటేశ్వర్లు,ఎంపీటీసీ వెన్నా భాస్కర్ రెడ్డి సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిన చల్లా నాగేష్,తమ్మిసెట్టి నాగరాజు,కేశవ్,బత్తుల వెంకటేశ్వర్లు,చెన్నూరి బాల చెన్నయ్య,వై.చెన్నయ్య వైసీపీ పార్టీలో చేరారు.వైసీపీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.. కార్యక్రమంలో చల్లారాములు ,రామాంజనేయులు గుమ్మా రవి గ్రామస్తులు పాల్గొన్నారు.