మోడీ : అయోధ్య రామా వర్సెస్ రేషన్ బియ్యం !..రైల్వే పోలీసులకు అభినందనలు తెలిపిన పొదిలి వ్యాపారి..కిమ్స్ లో అరుదైన చికిత్స..వైద్యుల నిర్లక్ష్యం కారణంగా బాలిక మృతి..ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత..అక్రమ అపార్ట్మెంట్లపై ఉక్కు పాదం.

మోడీ : అయోధ్య రామా వర్సెస్ రేషన్ బియ్యం !

కేంద్రంలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ పూర్తిగా పరితపిస్తోంది.కేంద్రంలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ పూర్తిగా పరితపిస్తోంది. దాని కోసం పట్టుదలగా పనిచేస్తోంది. ఏకంగా 370 సీట్లు సొంతంగానే గెలుచుకోవాలని టార్గెట్ కూడా పెట్టుకుంది. ఇదిలా ఉంటే ఏ రాజకీయ పార్టీకి అయిన బలమైన నినాదం ఎన్నికల్లో ఉండాలి. అది జనాలకు పూర్తిగా కనెక్ట్ అయి ఉండాలి.అపుడే ఆశించిన స్పందన కనిపిస్తోంది. ఇక ఎన్నికల షెడ్యూల్ రాక ముందు వరకూ చూస్తే బీజేపీ చేతిలో ఒక బలమైన అస్త్రం ఉంది. అదే అయోధ్యలో రామమందిరం నిర్మాణం. ఇది తమకు ఈసారి ఒడ్డెక్కిస్తుందని బీజేపీ చాలా నమ్మకంగా భావించింది. అయోధ్యలో రామ మందిరం ప్రారంభం కార్యక్రమాన్ని పూర్తిగా పార్టీ వేడుకగా మార్చేసారన్న విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ బీజేపీ తన అజెండా ఏమిటో చెప్పక చెప్పేసిందన్నారు.

ఒక దశలో అయితే దేశంలో సగం ఎలక్షన్ ని రామమందిరం ప్రారంభోత్సవం పూర్తి చేసింది అని కూడా విశ్లేషించారు. బీజేపీకి సగం పని పూర్తి అయింది ఇక విజయానికి సగం దూరంలోనే ఉంది అని అన్నారు. సరిగ్గా ఆ సమయంలోనే బీజేపీ ఎన్నికల నినాదంగా సొంతంగా 370 సీట్లు, ఎన్డీయే కూటమితో కలిపి నాలుగు వందల సీట్లు అని ప్రకటించారు.

ఇదంతా ఎన్నికల షెడ్యూలు వెలువడక ముందు సంగతి. తీరా ఎన్నికల షెడ్యూల్ వెలువడ్డాక మాత్రం ఒక్కసారిగా దేశంలో పొలిటికల్ సినారియో మారిపోయింది. అయోధ్యలో రామమందిరం అన్నది అసలు ఇష్యూనే కాకుండా పోయిన నేపధ్యం ఏర్పడింది. దాంతో బీజేపీ రకరకాలైన అంశాలను తెర మీదకు తీసుకుని రావాల్సి వచ్చింది.

అందులో ప్రముఖంగా ఉన్నది ముస్లింలకు రిజర్వేషన్లు రద్దు అన్నది. నిజానికి ఇది ఎమోషన్ పండించే ఇష్యూనే. కానీ బీజేపీ గత పదేళ్లుగా చేసిన పాలన దాని మూలాన వచ్చిన యాంటీ ఇంకెంబెన్సీతో ఈ ఎమోషన్ సైడ్ కి పోయింది. పైగా ప్రతీ సారీ ఎన్నికలకు ముందు ఇలాంటి అంశాలను బీజేపీ కోరి తెర ముందుకు తెస్తుంది అని విమర్శలు విపక్షాల నుంచి రావడంతో పాటు జనంలోనూ అదే రకమైన భావన ఉండడంతో ఈ అంశం పెద్దగా పని చేయకుండా పోయింది.

మరో వైపు చూస్తే కనుక బీజేపీ పీవోకే ని స్వాధీనం చేసుకుంటామని బలమైన నినాదాన్ని ఇచ్చింది.అయితే అది కూడా జనంలోకి పెద్దగా వెళ్ళినట్లుగా కనిపించలేదు. ఇక దేశంలో ఆస్తులను ఒక వర్గానికి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కట్టబెడుతుందని బీజేపీ చేసిన కామెంట్స్ తిప్పి కొట్టాయి.అలాగే ఎక్కువ మంది పిల్లలను కంటారు అంటూ చేసిన మరో కామెంట్ కూడా జనాలను ఆకట్టుకోలేదు.అయితే వాటికి ఆ తరువాత సవరణలు ఇస్తూ బీజేపీ పెద్దలు ఇచ్చిన వివరణలు కూడా జనాలకు ఎక్కలేదు.దీంతో చూస్తూండగానే నాలుగు విడతల ఎన్నికలు దేశంలో జరిగిపోయాయి.దాంతో పాటు పోలింగ్ శాతం తగ్గుముఖం పట్టడం ముగిసిన పోలింగులో ఓటర్ల సరళి వంటివి బేరీజు వేసుకున్న బీజేపీ ఇపుడు అసలు వాస్తవాలతో జనాలకు చేరువ కావాలని చూస్తోంది.ఈ లోగా మెజారిటీ పోలింగ్ ముగిసిపోయింది.ఇక మిగిలిన ఆ చివరి మూడు విడతల పోలింగ్ లో బీజేపీ గతిని గమ్యాన్ని మార్చాలని ఆలోచిస్తున్నారు.👉అందుకే మెల్లగా రాముడు నుంచి పక్కకు జరిగి పేదల పక్షం వహించే విధంగా బీజేపీ మరో నినాదాన్ని అందుకుంది. అదే పేదలకు రేషన్ బియ్యం. ఈ దేశంలో నూటికి ఎనభై కోట్ల మందికి రేషన్ బియ్యం ఇస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ చెబుతూ తాజాగా ఎన్నికల ప్రచారాన్ని చేస్తున్నారు. ఇపుడు ఇది నిజంగా ఎన్నికల అంశమే అవుతుంది. ఎందుకంటే ఆకలిని తీర్చేందుకు ఏమి చేశారు అన్నదే ఏ ప్రభుత్వానికి అయినా ఎదురయ్యే ప్రశ్న. మిగిలిన అంశాలు ఏవీ ఎమోషనల్ గా ఉంటాయేమో కానీ కూడూ గూడూ పెట్టవు. అయితే బీజేపీ ఆఖరి దశలో ఇస్తున్న నినాదం ఏమేరకు పనిచేస్తుందన్నది చర్చగా ఉంది.

అంతే కాదు మోడీ పలు ఇంటర్వ్యూలో తమ ప్రభుత్వం మరోసారి వస్తే యువత సమస్యలను అడ్రస్ చేస్తామని చెప్పారు.ఇది కూడా బీజేపీలో వస్తున్న మౌలికమైన మార్పుగా చూడాలి. అయితే ఎన్నికలకు ముందు గడచిన పదేళ్ల పాలనలో యువత సమస్యలను పూర్తి స్థాయిలో అడ్రస్ చేసి ఉంటే ఇపుడు అవే బీజేపీ విజయానిని నిచ్చెన మెట్లుగా ఉండేవి కదా అన్న మాట వినిపిస్తోంది.అంతే కాదు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు అన్నారు. వాటిలో కనీసం ఎంతో కొంత శాతం భర్తీ చేసి ఉంటే కనుక అది బీజేపీకి ప్లస్ పాయింట్ గా మారి యువతను దగ్గర చేసేది కదా అన్న మాటా ఉంది ఏది ఏమైనా రాజకీయ పార్టీలు వాస్తవ దృక్పధంతో ఉండాలి.

తాము చెప్పిందే జనాలు వింటారని, తామే వారిని డ్రైవ్ చేస్తున్నామని అనుకుంటే ఒక్కోసారి ఫలితాలు తేడా కొడతాయి.ఈసారి దేశంలో జరుగుతున్న ఎన్నికలు బీజేపీ పదేళ్ళ పాలన మీద జనాభిప్రాయమే అని ప్రతిపక్షాలు మేధావులూ అంటున్నారు.దాంతో బీజేపీ తన విజయాలను చెప్పుకోవడం ద్వారానే ఎన్నికల్లో జనాలకు చేరువ కాగలదని అంటున్నారు.అలా పదేళ్ల పాలనలో చేసిన మేలు గురించి చర్చకు పెట్టాల్సిన అవసరం అయితే బీజేపీకి ఇపుడు వచ్చింది.

👉రైల్వే పొలీసులకు అభినందనలు తెలిపిన పొదిలి వ్యాపారి…*_పొయిన విలువైన వస్తువులను తిరిగి అందించిన పొలీసులు…ప్రకాశంజిల్లా పొదిలి పట్టణానికి చెందిన కారంశెట్టి హరిక్రిష్ణ అనేవ్యాపారి ఈనెల 14న ఉజ్జయిని వెళ్ళి తిరిగి వచ్చే క్రమంలో  బంగారపు కమ్మలు,లేడిస్ ఫ్యాన్సి ఐటమ్ బాక్స్ లగేజ్ బ్యాగులో కనపడకపోవడంతో ..ఈ విషయాన్ని రైల్వే పొలీసులకు ఫిర్యాదు చేయడంతో స్పందించిన రైల్వే పొలీసులు తమిళనాడు రాష్ట్రం కాట్ పాడి వద్ద గుర్తించి వ్యాపారి వస్తువులు భద్రపరిచారు.ఈ విషయాన్ని వ్యాపారికి సమాచారం ఇవ్వడంతో కాట్ పాడి వెళ్ళి తన విలువైన వస్తువులను తెచ్చుకున్నట్లు హరిక్రిష్ణా తెలిపారు.పొయిన వస్తువులు నాదగ్గరకు వస్తాయని ఊహించలేదని, రైల్వే పొలీసుల నిజాయితి కి వారి నిబద్ధతకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు._

👉 కిమ్స్ హాస్పిటల్ అరుదైన చికిత్స..ఒంగోలు కిమ్స్ హాస్పిటల్ లో శుక్రవారం నాడు కార్డియాలజీ విభాగంలో టావి అనే అరుదైన శస్త్ర చికిత్స జరిగింది. అరుదైన చికిత్స చేయటం తమ వైద్యశాలకు ఎంతో గర్వకారణం అని ఈ సందర్భంగా వైద్యులు విలేకరుల సమావేశం ఏర్పాటు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్, విశాఖపట్నం మెట్రోనగరాలు తర్వాత 3వ నగరం మన ఒంగోలు, కిమ్స్ హాస్పిటల్ లో టావి చికిత్స చెయ్యడం జరిగింది. 67 సంవత్సరాలు వెంకట్రావు అనే వ్యక్తి తీవ్రమైన ఎరోటిక్ స్టెనోసిస్తో బాధపడుతూ కిమ్స్ హాస్పిటలికి వచ్చి కార్డియాలజిస్ట్ డా.ఓరుగంటి హారీష్ ని సంప్రదించడం జరిగింది. సాధారణంగా ఈలాంటి వ్యాధులకు ఓపెన్ హార్ట్ సర్జరీ ఏవియర్ లను పెద్ద ఆపరేషన్ చేయవలసి ఉంటుంది కానీ ఈ పేషెంట్ కి గతంలో బైపాస్ సర్జరీ జరగడం వల్ల ఏవిఆర్ ఆపరేషన్ సాధ్యపడదు.ఒంగోలు కిమ్స్ హాస్పిటల్లో అధునాతన పరికరాలు ఆధునిక పరిజ్ఞానం అందుబాటులో ఉండడము వలన టావి అనే శస్త్ర చికిత్స చేయడం జరిగింది. డా.ఓరుగంటి హారీష్ మరియు కార్డియాలజీ వైద్య బృందం ఆపరేషన్ లేకుండా ఈ విధానాన్ని విజయవంతం చేయండం జరిగింది. రోగి త్వరగా కోలుకుని 2వ రోజు నుండి ఆరోగ్యంతో మెరుగుపడి డిశ్చార్జ్ అయ్యారు. ఈ శస్త్ర చికిత్స విజయవంతం చేసినందుకు డా.ఓరుగంటి హారీష్ ని మరియు కార్డియాలజీ వైద్య విభాగాన్ని కిమ్స్ హాస్పిటల్ డాక్టర్లు అందరూ తమ హర్షం వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా డా. ఓరుగంటి హారీష్ మాట్లాడుతూ టావి శస్త్ర చికిత్స చేయడం ద్వారా రోగి పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్ అవ్వడం తమకెంతో ఆనందంగా ఉందని అని అన్నారు. రోగి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ డా. హారీష్ ని ,ఇతర వైద్య బృందానికి కిమ్స్ హాస్పిటల్ ఇబ్బందికి కృతజ్ఞత తెలిపారు. ఎక్సిక్యూటివ్ డైరెక్టర్ టి.గిరి మాట్లాడుతూ మెట్రోనగరాలకే పరిమితమైన ఇటువంటి క్లిష్ట సర్జరీలను మన ఒంగోలు కిమ్స్ హాస్పిటల్ నందు నిర్వహించటం ఎంతో అభినందనీయమని తెలుపుతూ వైద్య బృందాన్ని అభింనందించడం జరిగింది. మెడికల్ నూపరింటెండెంట్ డా. టి శ్రీ హరి రెడ్డి మాట్లాడుతూ చికిత్సలో పాల్గొన్న డా.ఓరుగంటి హారీష్ ని, కార్డియాలజీ వైద్య బృందాన్ని మరియు టెక్నీషియన్లని అభినందించడం జరిగింది.అత్యాధునిక వైద్య సేవలు ప్రకాశం జిల్లా వాసులకి ఎప్పటికపుడూ అందుబాటులోకి తీసుకుని రావడానికి సహకరించిన కిమ్స్ హాస్పిట్ మేనేజింగ్ డైరెక్టర్ బొల్లినేని భాస్కర రావు ని మరియు ఎక్సిక్యూటివ్ డైరెక్టర్ టి.గిరి నాయుడు కి మెడికల్ సూపరింటెండెంట్ డా. టి శ్రీ హరి రెడ్డి , జనరల్ మేనేజర్- మార్కెటింగ్ అమర్నాధ్ తదితరులు కృతజ్ఞతలు తెలియజేసారు. ఆధునిక వైద్య చికిత్స అందించడంలో తమ వైద్యశాల ఎప్పుడు అందుబాటులో ఉంటుందని ఈ సందర్భంగా వారు తెలిపారు.

👉ఎంజే నాయుడు హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత..విజయవాడ

లికిత అనే బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి..డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా బాలిక మృతి చెందిందని ఆసుపత్రి ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళన..భారీగా పోలీసులు మోహరింపు..ఇప్పటివరకు స్పందించని హాస్పిటల్ యాజమాన్యం..ఆస్పత్రి ఎదుట బైఠాయించిన మృతురాలి కుటుంబ సభ్యులు..ఆస్పత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్..ఆసుపత్రిని సీజ్ చేసే వరకు కదిలేది లేదంటున్న ఆందోళనకారులు…

👉 మార్కాపూర్ mpdo కార్యాలయంలో PD DWMA అర్జునరావు  సమీక్షా సమావేశం నిర్వహించారు. ఫారం పాండ్‌లు, ప్లాంటేషన్‌తో పాటు కొత్త పనులపై ఆయన దృష్టి సారించారు. టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లతో సమీక్షించి ఎస్సీ ఎస్టీలకు పనులు కల్పించేలా దృష్టి సారించాలని కోరారు. సమావేశంలో ఏపీడీ డ్వామా, ఎంపీడీఓ మార్కాపూర్, APO పాల్గొన్నారు.

👉తిరుమల ఘాటు రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం*

తిరుమల ఘాటురోడ్డులో ప్ర‌మాదం చోటుచేసుకుంది. తిరుమ‌ల‌లోని మొద‌టి ఘాటురోడ్డులో మాల్వాడి గుండం వద్ద ఈరోజు మధ్యాహ్నం మినీ వ్యాను బోల్తాప‌డింది.

ఈ ప్ర‌మాదంలో తమిళ నాడుకు చెందిన భక్తులకు స్వల్ప గాయలు అయ్యా యి. ఈ ప్ర‌మాదంపై మ‌రింత స‌మాచారం తెలియాల్సి ఉంది..

👉నందిగామ పట్టణంలోని అక్రమ అపార్ట్మెంట్ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న మున్సిపల్ కమిషనర్ హేమమాలిని మరియు టౌన్ ప్లానింగ్ అధికారులు*ఎన్టీఆర్ జిల్లా నందిగామ*

పట్టణంలోని ఆరవ వార్డ్ యాదవ బావి వద్ద అనుమతికి మించి నిర్మిస్తున్న అక్రమ అపార్ట్మెంట్ అధికఫ్లోర్ నిర్మించడానికి వేసిన స్లాబ్ సెంట్రింగ్ ను కూల్చివేసిన టౌన్ ప్లానింగ్ అధికారులు మరియు సిబ్బంది*

పట్టణంలో అక్రమంగా అనుమతులకు మించి అధిక ఫ్లోర్లను నిర్మిస్తే వాటిని కూల్చివేస్తామని బిల్డర్లను హెచ్చరించే విధంగా నేడు స్లాబ్ కూల్చివేతతో ప్రజలలో అపోహలు తొలగిపోయేలా మున్సిపల్ కమీషనర్ మరియు టౌన్ ప్లానింగ్ అధికారులు తెలియజేశారని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.*

7k network
Recent Posts

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం

కరెంటు బిల్లులపై ఏపీ సీఎం చంద్రబాబు ఊరటనిచ్చే ప్రకటన..50 లక్షలు సీఎమ్ రిలీఫ్ ఫండ్ కు చెక్ అందజేసిన ఎమ్మెల్యే అమిలినేని..తీవ్రంగా నష్టపోయాం…పెద్దమనసుతో ఆదుకోండి-మంత్రి నారా లోకేష్..బాసర ట్రిపుల్ ఐటీలో 2000 మంది విద్యార్థుల ఆందోళన..భోజనం పెట్టి మరీ సమస్యలు విన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..జగన్ పర్యటనకు హైకోర్టు బ్రేక్..తెలంగాణ సీఎస్ మీద మోడీ సర్కార్ సీరియస్?..తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మహేష్‌కుమార్‌గౌడ్‌.అదనపు భద్రతకు జగన్ అనర్హుడు: నచికేత్.

సీఎం చంద్రబాబుకి తప్పిన పెను ప్రమాదం..వెలుగులోకి ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలలు.. క్రమశిక్షణ చర్య…apuwj ఆధ్వర్యంలో వరద బాధితులకు విరాళం..22న హలోమాల చలో ఒంగోలు..శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల, మాజీ ఎమ్మెల్యే పద అన్నా..కంభంలో ఘనంగా టీచర్స్ డే.. పలువురికి ఘన సన్మానం.

ఏపీలో నేడు కేంద్ర బృందం పర్యటన..జగన్ ఐదు నిముషాల షో..ముఖ్యమంత్రి చంద్రబాబు విసుర్లు..బుడమేరుపై ఫలిస్తున్న మంత్రి లోకేష్ కృషి..ఆ రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పెన్షన్ రద్దు..బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు..వరద బాధితులకు కంభం వాసుల వితరణ..

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు విస్తృత పర్యటన..పనిచేయని మంత్రులనూ పీకి పారేస్తా😯విజయ సాయి కబ్జా కూల్చివేత….బిడ్డలున్నారు కదా? షర్మిల సంచలన కామెంట్స్..తండ్రిని పట్టించుకోని కొడుకు గిఫ్ట్ డీడ్ రద్దు..పారాలింపిక్స్‌లో తెలంగాణ యువతికి కాంస్యం..నేడు కడప ఉరుసు మహోత్సవం ..వరంగల్ లో నకిలీ సర్టిఫికెట్ల బాగోతం..