పిల్లలను కనాల్సిందే… ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్.. ఏపీలో మ‌ళ్లీ పాత జిల్లాలేనా… కూట‌మిలో కొత్త చ‌ర్చ‌.. క్యాడర్ ఎక్కడ ఉంది జగనన్నా.. వాలంటీర్లేగా!.. గ్రామస్థుడిని గొంతు కోసి హత్య* మావోయిస్టుల ఘాతుకం.. ములుగు జిల్లా వాజేడు ఎస్ ఐ హరీష్ ఆత్మహత్య !.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో మహిళా కానిస్టేబుల్‌ హత్య..ఆటోను ఢీకొన్న ఆర్వీటి ప్రైవేట్ ట్రావెల్స్ ఇద్దరు మృతి(పోరుమామిళ్ల).. బిజిఆర్ లాడ్జిలో ఓ వ్యక్తి హత్య (ప్రొద్దుటూరు)

👉పిల్లలను కనాల్సిందే…పొంచి ఉన్న ముప్పు!😯😯😯 వీటిని అన్నింటినీ చెబుతూ ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ భారతదేశం లాంటి దేశాలో ప్రతీ ఒక్కరూ ఎక్కువ మంది పిల్లలను కనాలని బలమైన నినాదం ఇచ్చారు. ఇపుడు సరికొత్త నినాదం ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోంది. జపాన్ చైనా లాంటి దేశాలు అయితే దీనినే ఎక్కువగా ప్రచారంలో పెడుతున్నాయి. ప్రభుత్వం పరంగా ప్రోత్సాహకాలు కూడా ఇస్తూ పోతున్నాయి. మరో వైపు రష్యా తీసుకుంటే ఆ దేశ జనాభా తగ్గుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. జనాభా పెరుగుదలకు ఆ దేశం అన్ని చర్యలను ప్రారంభించింది. ఇందుకోసం ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేస్తోంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మినిస్ట్రీ ఆఫ్ సెక్స్ అంటూ కొత్త మంత్రిత్వ శాఖను రష్యా ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న ఆలోచన చేస్తుంది. ఎక్కువ మంది పిల్లలను కనేందుకు అవసరమైన ప్రోత్సాహకాలను అందించేలా రష్యా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇలా ప్రపంచం అంతా పిల్లలు కావాలి మానవ వనరులు పెరగాలని కోరుకుంటున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఈ విషయంలో చాలా దూరదృష్టితోనే ఆలోచించారు. ఆయన తరచూ ఇదే మాట చెబుతున్నారు. ఎక్కువ మంది పిల్లలను కనాలని కూడా ప్రోత్సహిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇద్దరు పిల్లలు ఉంటేనే అన్న షరతుని ఎత్తేసి ఎంత మంది ఉన్నా ఓకే అంటూ ఇటీవల చట్ట సవరణ తెచ్చారు. ఇపుడు చూస్తే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం ఈ నినాదం అందుకుంది. దేశంలో జనాభా పెరుగుదల రేటు బాగా తగ్గుముఖం పడుతోంది అని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ అంటున్నారు. జనాభా పెరుగుదల రేటు 2.1 కంటే తక్కువ ఉండకూడదని డెమోగ్రఫీ నిబంధనలు చెబుతున్నాయని కూడా ఆయన గుర్తు చేస్తున్నారు. జనాభా రేటు తగ్గిపోతోంది. ఇది అత్యంత ప్రమాదం అని ఆయన అంటున్నారు. ఇదే కనుక జరిగితే కొన్ని నాగరికతలు అనేక భాషలు కూడా అంతరించిపోయే ప్రమాదం ఉందని కూడా హెచ్చరిస్తున్నారు. ఇక భారతదేశమో జనాభా రేటు విధానాన్ని 1998 ప్రాంతంలో నిర్ణయించారు. దాని ప్రకారం చూస్తే 2.1 కంటే తక్కువ ఉండరాదు అని స్పష్టం చేశారు అని ఆయన పేర్కొన్నారు. సమాజ మనుగడకు కానీ దేశ శ్రేయస్సుకు కానీ జనాభా శస్త్రం పరంగా కానీ తీసుకుంటే ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది ఉండాల్సిందే అని ఆరెస్సెస్ చీఫ్ ఖండితంగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే జనాభా రేటు తగ్గితే ఏమి జరుగుతుంది అంటే మానవ వనరులు పెద్ద ఎత్తున తగ్గిపోతాయని జనాభా పరిశోధన నిపుణులు చెబుతున్నారు.భారత్ లాంటి దేశాలలో మహిళల సంతానోత్పత్తి రేటు గత అర్ధ శతాబ్ద కాలంగా గణనీయంగా తగ్గి పోతూ వస్తోందని పరిశోధనలో తేల్చాయి. వెనక్కి వెళ్ళి చూస్తే కనుక 1950 ప్రాంతంలో ఒక మహిళ సంతానోత్పత్తి రేటు జీవిత కాలంలో 4.7 గా ఉండేది అని గుర్తు చేస్తున్నారు. అది అలా తగ్గుతూ 2017 నాటికి 2.4 శాతానికి పడిపోయింది అని అంటున్నారు. ఇది యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్ కి చెందిన ఇన్సిటిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఇవాల్యూషన్ చేసిన ఒక అధ్యయనంలో తేలింది అంటున్నారు. ఇక ఈ అధ్యయనం ప్రకారం చూస్తే 2100 నాటికి అంటే ఇప్పటికి మరో డెబ్బయి అయిదేళ్లకు జనాభా వృద్ధి రేటు 1.7 శాతానికి పడిపోవచ్చు అని కూడా చెబుతున్నారు. ఇక 2064 నాటికి ఈ ప్రపంచ జనాభా 970 కోట్లకు చేరుకుంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఇక 2100 నాటికి 880 కోట్లకు పడిపోతుందటా. అంటే ఒక్కసారిగా 90 కోట్లు తగ్గుదల అన్న మాట. ఇపుడు అధిక జనాభా అని అంతా అంటున్న పరిస్థితి నుంచి జనాలు ఎక్కడ ఉన్నారో వెతుక్కునే దారుణమైన పరిస్థితులు కూడా వస్తాయంట. వీటిని అన్నింటినీ చెబుతూ ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ భారతదేశం లాంటి దేశాలో ప్రతీ ఒక్కరూ ఎక్కువ మంది పిల్లలను కనాలని బలమైన నినాదం ఇచ్చారు. మరి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే ఉంది కాబట్టి ఈ విషయంలో సీరియస్ గా దృష్టి పెట్టి ఏదైనా చట్టం తెస్తుందా అన్నది చూడాల్సి ఉంది.
👉 ఏపీలో మ‌ళ్లీ పాత జిల్లాలేనా… కూట‌మిలో కొత్త చ‌ర్చ‌…! దీంతో రాష్ట్రంలో 26 కొత్త జిల్లాలు ఏర్ప‌డ్డాయి. చాలా వ‌ర‌కు బాగానే ఉన్నా.. అన్న‌మ‌య్య‌, శ్రీస‌త్య‌సాయి, కోన‌సీమ వంటి జిల్లాల్లో జిల్లా కేంద్రాల ఏర్పాటు వివాదంగా మారింది.
రాష్ట్రంలో వైసీపీ హ‌యాంలో తీసుకున్న కొన్నినిర్ణ‌యాల‌ను కూట‌మి ప్ర‌భుత్వం ర‌ద్దు చేసిన విష‌యం తెలిసిందే. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ స‌హా.. చెత్త‌పై ప‌న్ను వంటివి ర‌ద్దు చేశారు. అలానే ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో న‌డిచిన మ‌ద్యం దుకాణాల‌ను ప్రైవేటుకు ఇచ్చారు. ఇసుక పాల‌సీని ర‌ద్దు చేసిన కూట‌మి ప్ర‌భుత్వం ఉచిత ఇసుక విధానాన్ని తీసుకువ‌చ్చింది. అలానే గ్రామ వార్డు స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌పై త‌ర్జ‌న భ‌ర్జ‌న‌తో ఉంది. దాదాపు ఇది కూడా రద్ద‌యినా.. ప్ర‌క‌ట‌న చేయ‌డంలో వెనుకాడుతున్న ప‌రిస్థితి ఉంది. ఇలా.. జ‌గ‌న్ హ‌యాంలో తెచ్చిన అనేక విష‌యాల్లో కూట‌మి మార్పుల దిశ‌గా అడుగులు వేస్తోంది. తాజాగా ఇప్పుడు జ‌గ‌న్ హ‌యాంలో చేసిన జిల్లాల ఏర్పాటును కూడా.. ర‌ద్దు చేసే దిశ‌గా అడుగులు ప‌డుతుండ డం గ‌మ‌నార్హం. దీనికి సంబంధించి కూట‌మిలో లోతైన చ‌ర్చే జ‌రుగుతోంది. జ‌గ‌న్ హ‌యాంలో అప్ప‌టి 13 జిల్లాల‌ను పార్ల‌మెంటు సెగ్మెంట్ కేంద్రంగా ఒక జిల్లాగా గుర్తిస్తూ.. 26 జిల్ల‌ల‌ను చేశారు. నిజానికి 25 పార్ల‌మెంటు స్థానాలు ఉన్నా.. విశాఖ‌లో పెద్ద నియోజ‌క‌వ‌ర్గాలు ఉండ‌డంతో వాటిని రెండుగా విభ‌జించారు. దీంతో రాష్ట్రంలో 26 కొత్త జిల్లాలు ఏర్ప‌డ్డాయి. చాలా వ‌ర‌కు బాగానే ఉన్నా.. అన్న‌మ‌య్య‌, శ్రీస‌త్య‌సాయి, కోన‌సీమ వంటి జిల్లాల్లో జిల్లా కేంద్రాల ఏర్పాటు వివాదంగా మారింది. అన్న‌మ‌య్య జిల్లాను రాజంపేట కేంద్రంగా ఏర్పాటు చేయాల‌ని, శ్రీస‌త్య‌సాయి జిల్లాను హిందూపురం కేంద్రంగా, కోన‌సీమ‌కు అంబేడ్క‌ర్ పేరు పెట్టాల‌న్న డిమాండ్లు వినిపించాయి. కోన‌సీమ వివాదం దేశ స్థాయిలో చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఇక‌, మ‌ద‌న‌ప‌ల్లెను ప్ర‌త్యేక జిల్లాగా గుర్తించాల‌న్న డిమాండ్ ఇప్ప‌టికీ ఉంది. అదేవిధంగా ప‌ల్నాడు జిల్లాకు గుర్రం జాషువా పేరు పెట్టాల‌ని అక్క‌డి వారు కోరుతున్నారు. ఇలా.. వైసీపీ చేసిన జిల్లాల విభ‌జ‌న వివాదాల‌కు దారితీసింది. ఇక‌, క‌లెక్ట‌ర్‌, ఐపీఎస్ అధికారుల‌కు భ‌వ‌నాలు సొంతంగా లేక‌పోవ‌డం మ‌రో చిక్కుగా మారింది. ప్ర‌స్తుతం చాలా జిల్లాల్లో అద్దె భ‌వ‌నాల్లోనే ఇవి సాగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో అస‌లు కొత్త జిల్లాల ద్వారా ప్ర‌యోజ‌నం క‌ట్టే ఇబ్బందులే ఎక్కువ‌గా ఉన్నాయ‌ని.. మంత్రులు చెబుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని.. కొత్త జిల్లాల‌ను ర‌ద్దు చేసే దిశ‌గా కూట‌మి ప్ర‌భుత్వం అడుగులు వేస్తుండ‌డం గ‌మ‌నార్హం. దీనిపై త్వ‌ర‌లోనే నిర్ణ‌యం ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది.
👉క్యాడర్ ఎక్కడ ఉంది జగనన్నా.. వాలంటీర్లేగా!?
వారంలో రెండు రోజులు కార్యకర్తలకే సమయం కేటాయిస్తానని .. ఉమ్మడి కృష్ణా జిల్లా ముఖ్యనేతల సమావేశంలో జగన్ ప్రకటించారు. ఆయన సమావేశానికి వచ్చిన ముఖ్యనేతలను చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాంక్ అయిపోయింది.పెద్ద వాలంటీర్ గా టీడీపీ నేతలు సెటైర్లు వేసే దేవినేని అవినాష్‌తో పాటు రాజకీయ జీవితం ముగింపునకు వచ్చిన ప్రతాప్ అప్పారావు లాంటి ఒకరిద్దరు మాత్రమే గుర్తు పట్టేవాళ్లు ఉన్నారు.మిగతా వారంతా .. ఎవరో తీసుకు వచ్చిన వారికే తెలియాలి.
ఈ సమావేశంలో జగన్ తానేదో అతి మంచితనాన్ని చూపిస్తున్నానని ఫీలయ్యారు. అంత మంచితనం ఏం చూపించారో కానీ ఆయన పార్టీకి ఇప్పుడు క్యాడర్ కూడా లేదు. పదేళ్లు కష్టపడిన పార్టీ నేతలను ఐదేళ్లలో దోచి పడేశారు జగన్. ఆ దెబ్బకు క్యాడర్ అంతా కకావికలం అయిపోయింది. ఆయన పార్టీకి మిగిలింది వాలంటీర్లే. వారు కూడా ఇప్పుడు ఎవరి పనుల్లో వారు పడిపోయారు. సొంత కార్యకర్తలు ఉంటే.. పట్టించుకోకుండా వాలంటీర్లను లీడర్లు చేస్తానని చేసిన ప్రకటనలతో మిగతా క్యాడర్ సైడైపోయింది. అధికారం లో ఉన్నప్పుడు జగన్ రెడ్డి వికృత ఆనందం కోసం చేసిన విపరీత చేష్టలకు ఇప్పుడు తాము ఎందుకు కష్టపడాలని మిగతా వారు జంప్ అయ్యారు.అందుకే ఇప్పుడు వైసీపీకి క్యాడర్ లేదు.వారు మళ్లీ రావాలంటే జగన్ రెడ్డి ఒక పని చేయాలి.. తాను పడేసుకున్న కేరెక్టర్, క్రెడిబులిటీ ఏరుకుని తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవడం అంటే.. ముందు క్యాడర్ కోసం ప్రాణం పెడతానని నిరూపించాలి. జైలు పాలవుతున్న ప్రతి క్యాడర్ కుటుంబాన్ని ఆదుకోవాలి. కానీ ఇప్పటి వరకూ కనీస లాయర్ సాయం కూడా చేయడం లేదు. ఇంకెవరు ముందుకు వస్తారు?
👉 బియ్యం సరఫరా చెయ్యడానికి 29,000 రేషన్ షాపులు ఉండగా YCP ప్రభుత్వం డోర్ డెలివరీ చేస్తామనే అబద్ధపు ప్రచారంతో 1600 కోట్లతో 9260 వాన్లు కొని రాష్ట్ర వ్యాప్తంగా ఒక నెట్వర్క్ తయారు చేసి బియ్యం సేకరించడం మొదలు పెట్టారు… పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్..
కిలోకి 43.40 రూ ఖర్చయ్యే బియ్యాన్ని 10 రూ”లకే తీసుకుని వెళ్ళిపోడం, సరైన సమయానికి రాలేదు కాబట్టి వ్యాను వెళ్ళిపోయింది సరుకు ఇవ్వము అని చెప్పడం, ఎంఎల్ఏ పోయింట్ల దగ్గర నుండి కూడా గోతాలకు గీతాలు తీసుకుపోయిన సందర్భాలు ఆధారాలతో దొరికాయి.
ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకుని చిత్తూరు, శ్రీకాకుళం నుంచి నేషనల్ హైవే మీద నేరుగా కాకినాడకు బియ్యం తరలించే పకడ్బందీ కుట్ర చేశారనీ ఆరోపించారు.
👉 మావోయిస్టుల ఘాతుకం..*గ్రామస్థుడిని గొంతు కోసి హత్య* మావోయిస్టుల ఘాతుకం.. గ్రామస్థుడిని గొంతు కోసి హత్య..ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల ఘాతుకానికి పాల్పడ్డారు. పోలీస్ ఇన్‌ఫార్మర్ అనే అనుమానంతో గ్రామస్థుడిని గొంతు కోసి హత్య చేశారు. మృతుడు భైరాంగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దలేర్ గ్రామానికి చెందిన కుమ్మేష్ కుంజమ్‌గా గుర్తించారు. సంఘటన స్థలం నుండి భైరాంగఢ్ ఏరియా కమిటీ జారీ చేసిన కరపత్రాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
👉ములుగు జిల్లా వాజేడు ఎస్ ఐ హరీష్ సోమవారం ఆత్మహత్య 😲.. వాజేడు మండలం ముళ్ళకట్ట వద్ద వున్న రిసార్ట్ లో రివాల్వర్ తో కాల్చుకొని హరీష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్య కు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు విచారణ చేపట్టారు.పూర్తి వివరాలు తెలియాల్సి వుంది..
👉కాలువ కట్ట సమీపంలో ఆటోను ఢీకొన్న ఆర్వీటి ప్రైవేట్ ట్రావెల్స్ ఇద్దరు మృతి, ఇద్దరు పరిస్థితి విషమం, నలుగురికి తీవ్ర గాయాలు..కడపజిల్లా పొరుమామిళ్ళ..
మృతిచెందిన వారు రామేశ్వరం గ్రామానికి చెందిన రోశయ్య 55 అక్కల రెడ్డిపల్లి గ్రామానికి చెందిన సుబ్బయ్య ఆచారి 65..నలుగురిని పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ ద్వారా తరలింపు..ఇద్దరి పరిస్థితి విషమం..
ఆర్విటి ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవరు అతివేగంతో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేసారు..
👉రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో మహిళా కానిస్టేబుల్‌ హత్య😱😱😱
రాయపోలు నుంచి మన్యగుడ రహదారిపై కానిస్టేబుల్‌ నాగమణి హత్య..మృతురాలు నాగమణి స్వస్థలం రాయపోలుగా గుర్తింపు..హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న నాగమణి..నెల రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న నాగమణి..
👉 కడప జిల్లా ప్రొద్దుటూరులోని బిజిఆర్ లాడ్జిలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు.. తలపై బీరు సీసాతో కొట్టడంతో అతను మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతునికి సుమారు 30 ఏళ్లు ఉంటాయి..ప్రొద్దుటూరు కు చెందిన యనమల లోకేశ్వర్ రెడ్డి పేరుతో లాడ్జిలో రూం బుక్ చేశారు..హత్యకు గురైన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది
పొద్దుటూరు వన్ టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు

7k network
Recent Posts

*పెళ్ళుబుక్కుతున్న మత విద్వేష సునామి.. హిందువులు శంఖం ఊదాల్సింది అందుకు కాదు, మరెందుకు?* .. *విశాఖలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అరెస్ట్* …రుయా ఆసుపత్రిలో మెరుగైన సౌకర్యాలు ఏర్పాటుకు అన్ని విధాల చర్యలు*జిల్లాలో జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు తదితర ప్రాజెక్టుల భూసేకరణ, నిర్మాణ పనులు మరింత వేగవంతం చేయాలి: తిరుపతి జిల్లా కలెక్టర్ * ..*యూరప్ లో మోసపోయిన తెలుగు వారు …ప్రతీకార రాజకీయం కొనసాగుతోంది_డా. జయప్రకాష్ నారాయణ .. లంచం డిమాండ్ చేసిన ఎమ్మార్వో, వీఆర్వో, ఆర్ ఐ ల పై వేటు వేసిన జిల్లా కలెక్టర్ .. ఖమ్మం తిరుపతి జిల్లాలలో భారీగా గంజాయి పట్టివేత

👉కర్రలతో కొట్టుకున్న కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు ..* కేజీవాల్ కు అఖిలేష్ మద్దతు.. ”ఇదేంటి పవన్ ఇలా అనేశారు” .. *కుప్పం టీడీపీ కార్యాలయంలో ‘జన నాయకుడు’ కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు .. ప్రకాశం జిల్లాలో కుక్కల స్వైర విహారం *గంజాయి గూచుల వద్ద 120 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న ఏసిపి..*ఎక్కువ చెత్త ఉత్పత్తి చేసే వారు స్వయంగా కంపోస్టు ఎరువు తయారు చేయండి:*కమిషనర్ ఎన్.మౌర్య*..👉 ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తే కఠిన చర్యలు: గిద్దలూరు సీఐ సురేష్ .. *ఆక్రమణకు గురైన మూడు ఎకరాల ప్రభుత్వ భూమి అప్పగింత* .. *ఆన్‌లైన్‌ బెట్టింగులపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్…*రామ్ చరణ్, బాలయ్య సినిమాలపై హైకోర్టులో పిల్* 👉 బీజీపీ నేతలకు అద్దంకి దయాకర్ సవాల్ …*గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్? (కరీంనగర్).. * వైయస్ అభిషేక్ రెడ్డి మృతి..*

ప్రియాంక గాంధీపై బీజేపీ నేత ర‌మేష్ బిధూరి చేసిన అనుచిత వ్యాఖ్య‌ల ప‌ట్ల‌ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన మంత్రి సీత‌క్క‌*.. *నవీన్ కి చెక్ పెట్టినట్లే కేజ్రీవాల్ కి కూడా ?.. *ఈ ఫార్ములా రేసులో కొన్ని నిజాలు *.. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఛైర్మెన్ జంగా రాఘవ రెడ్డి … ఏపీ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, మంత్రి సత్య కుమార్ యాదవ్* …ప్రభుత్వ ఆస్తిని అప్పనంగా దోచుకున్న ఓం నారాయణ పై చర్యలు : లంబాడి హక్కుల పోరాట సంఘం.. *పొదిలి మాదిరెడ్డిపాలెం వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షులుగా ఎర్రం రెడ్డి

👉ఎంఎస్‌పీ పంజాబ్‌కే కాదు.. దేశమంతటికీ అవసరమే ..*తెలుగు తమ్ముళ్లకు సంక్రాంతి పండుగ ముందే వచ్చిందా.😲 ..హుస్నాబాద్ మైనార్టీ గురుకుల బాలికల పాఠశాల లో ఆకస్మిక తనిఖీలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ … ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాటులను పర్యవేక్షించిన జిల్లా అధికారులు ..*ఆత్మకూరులో ఇస్తేమ పనులను పర్యవేక్షించిన మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్ .. *

👉ఏపీలో రేపటి నుంచి ఉచిత ఓపీ సేవలు బంద్ …* విశాఖ పోర్టులో పట్టుకున్న బియ్యానికి కలెక్టర్ క్లీన్ చిట్..😲… *విశాఖ సెంట్రల్‌ జైల్ ను సందర్శించిన రాష్ట్ర హోం మంత్రి .. అగ్ని ప్రమాదాల పై అవగాహన సదస్సు.. *ఉచిత బస్సు కంటే ఇతర సంక్షేమ పథకాలకు ఖర్చు పెడితే బెటరేమో ! .. *అధికారులను సత్కరించిన పొదిలి పట్టణ టిడిపి అధ్యక్షుడు. . *నిలిచిపోయిన కాపు భవనాలను పునఃప్రారంభించాలి: బలిజ సేవ సంఘం డిమాండ్ .

2700 కోట్ల ఇల్లు.. రూ.10 లక్షల సూట్ ధరించే వారా విమర్శించేది? .. *పవన్ ఆదేశాలు.. సముద్ర తీరంలో రెండు బోట్లు సీజ్* .. *విజయవాడలో వెలుగు చూసిన అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారం .. *చంద్రగిరి ‘బీసీ’ విద్యార్థినులకు మెరుగైన వైద్యం* *తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ కు మంత్రి సవిత ఆదేశం*.. *ఆర్మీ వాహనం లోయలో పడి ఇద్దరు సైనికులు మృతి.. *పుత్తూరు సబ్ డివిజన్ పోలీసులు హెల్మెట్ వాడకంపై అవగాహన కార్యక్రమాలు … మైలవరం లో మిక్సీంగ్ రాజకీయ సెగలు…! ..*రాజకీయ దుమారం రేపిన పాలడుగు దుర్గా ప్రసాద్, ఎమ్మెల్యే వసంత కలయిక… *ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తూ పోలీస్ సిబ్బంది జీవన విధానం ఉండాలి : ఐజి వి సత్యనారాయణ.. *పోలీసుల వేధింపులు తట్టుకోలేక హుజూర్‌ నగర్ పోలీస్ స్టేషన్ ముందు యువకుడి ఆత్మహత్యాయత్నం .. * డిగ్రీ విద్యార్థులకు కూడా తక్షణమే వర్తింప చేయండి..మాజీ ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు పివి శేషయ్య.