నేతలకు ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక సూచన ..వక్ఫ్ బోర్డును కాపాడే సత్తా తెలుగుదేశం పార్టీకే ఉంది: మొహమ్మద్ ఫతావుల్లా… వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి తిరుగుబాటు! … ఏసీబీకి చేరిన గవర్నర్ అనుమతి పత్రం..వాట్ నెక్ట్స్ !…ఆ ముగ్గురు లో ఎవరు ఆ బిడ్డ కి తండ్రి ? .. సెల్ ఫోన్ల రికవరీలో రాష్ట్రంలోనే ప్రధమ స్థానంలో తిరుపతి జిల్లా … .

👉 నేతలకు ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక సూచన.. మనుగడ ప్రమాదమంటూ.. ‘మనలో రెండు నేనులు ఉంటాయి. ఒకటి ముడిపదార్థం..మరొకటి పరిపక్వత చెందినది. ముడిపదార్థంగానే ఉండిపోతామంటే అగాధంలో పడిపోతాం’ అని వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన నేతలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. ప్రతి ఒక్కరూ ఇగోను పక్కన పెట్టాలని.. లేదంటే అగాధంలో పడిపోక తప్పదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అభిప్రాయడ్డారు.శాశ్వత ఆనందాన్ని గుర్తించినప్పుడే నిస్వార్థకంగా సేవలు అందిస్తారని అన్నారు. ఇదే ఇతరులకు సహాయం చేయాలని ధోరణిని పెంచుతుందని పేర్కొన్నారు. సమాజంలో జరిగే ప్రతి దానిని తప్పు అనే భావన పెరుగుతోందని అన్నారు.సమాజంలో ఏదో ఒక నెగెటివ్‌గా అంశం చోటుచేసుకుంటే..దానికి 40 రెట్లు మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు. కానీ.. సానుకూలం అంశాలేవీ ప్రజలకు చేరడం లేదన్నారు. సానుకూలం అంశాల గురించి అవగాహన కల్పించడం అవసరమన్నారు.
సేవ అనేది సమాజంలో శాశ్వత నమ్మకాన్ని పెంచుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రామకృష్ణ పరమహంస చెప్పిన మాటలను గుర్తు చేశారు. ‘మనలో రెండు నేనులు ఉంటాయి. ఒకటి ముడిపదార్థం. మరొకటి పరిపక్వత చెందినది. ముడిపదార్థంగానే ఉండిపోతామంటే అగాధంలో పడిపోతాం’ అని వ్యాఖ్యలు చేశారు. అన్నివర్గాల సాధికారతే దేశం అభివృద్ధిని సూచిస్తుందని మోహన్ భాగవత్ తెలిపారు. దేశ పురోగతికి దోహదపడేలా యువతను తీర్చిదిద్దాలని కోరారు. అయితే.. గతంలోనూ మోహన్ భాగవత్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. దేవుళ్లమని మనకు మనం స్వయంగా ప్రకటించుకోకూడదని, దానిని ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు. కొంత మంది మెరుపులా మెరవాలని కోరుకుంటారని, కానీ ఆ మెరుపు మరింత చీకటిగా మారుతుందని కొందరు నేతలను ఉద్దేశించి మాట్లాడారు. మోహన్ భాగవత్ మరోసారి నేతలను టార్గెట్ చేసి మాట్లాడడంతో ఆయన వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్‌లో చర్చకు దారితీశాయి.
👉 వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి తిరుగుబాటు చేశారు 😲😲😲.అయితే.. తిరుగుబాటు అంటే.. వైసీపీ పార్టీపైన కాదు.. తనపై కూటమి చేస్తున్న ఆరోపణలపై వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి తిరుగుబాటు చేయడం జరిగింది. భీమిలి తీరంలో ఉన్న స్థలం వివాదంపై తాజాగా వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి స్పందించారు. భీమిలి తీరంలో మా వియ్యంకులు… టీడీపీ ఎంపీ తండ్రి భరత్ వద్దే భూమి కొన్నారని క్లారిటీ ఇచ్చారు.ఇంకొంత వేరే వాళ్ళ దగ్గర కొన్నారని స్పష్టతనిచ్చారు సాయిరెడ్డి.
అందులో ప్రభుత్వ భూమి ఇంచు కూడా లేదని క్లారిటీ ఇచ్చారు వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి. శారద పీఠం కు మేము భూమి ఇస్తే రద్దు చేశారని పేర్కొన్నారు. చంద్ర బాబు తన హయాంలో అనేక పీఠాలకు, సంస్థలకు భూములు కేటాయించ లేదా? అంటూ ప్రశ్నించారు. అనవసరంగా ఆరోపణలు చేయకూడదని కోరారు. ఇక 2027 లో జమిలి ఎన్నికల్లో పొత్తులపై జగన్ నిర్ణయం తీసుకుంటారన్నారు వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి..మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చాలా మంది నాయకుల్ని పొగుట్టుకున్నామన్నారు. ఇక నాయకుల్ని వదలుకోబోమని… అందరినీ నిలబెట్టుకుంటామని ప్రకటించారు. ఫిబ్రవరి నుంచి ప్రజల్ని, నాయకుల్ని కలుసుకునేందుకు ప్రజల్లోకి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి వస్తున్నారని ప్రకటించారు వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి..వైసీపీ పార్టీలో పూర్తిస్థాయిలో మార్పులు చూస్తారన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశంలో కుమార స్వామిని వైసిపి ఎంపీలు ఇప్పటికే కలిశామని గుర్తు చేశారు
వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి. ఎలాంటి పరిస్థితుల్లో ప్రయివేటీకరణ చేయం అని హామీ ఇచ్చారన్నారు. కార్మికులకు వ్యతిరేకంగా ఏ నిర్ణయిం తీసుకున్నా ఉద్యమిస్తామని కేంద్రానికి, కూటమికి హెచ్చరికలు జారీ చేశారు వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి. ఇకపై కూటమి ఆటలు సాగవని హెచ్చరించారు.

👉ఆ ముగ్గురు లో ఎవరు ఆ బిడ్డ కి తండ్రి ?
⭐మంత్రి నారా లోకేష్ కు కళింగిరి శాంతి భర్త మదన్ మోహన్ వినతి..⭐విజయసాయి రెడ్డి పై పోరాడుతున్నందుకు బదిలీ చేయించారు!..⭐నా భార్యను లోబర్చుకొని రూ.1500 కోట్ల భూములు కొల్లగొట్టారు.*
*⭐ఆయనకు డిఎన్ఎ పరీక్షలు నిర్వహించి వాస్తవాలు నిగ్గుతేల్చండి..⭐మంత్రి నారా లోకేష్ కు కళింగిరి శాంతి భర్త మదన్ మోహన్ వినతి.*
⭐అమరావతి.. ఎంపి విజయసాయిరెడ్డి తన భార్యను లోబర్చుకొని విశాఖపట్నం లో రూ.1500 కోట్ల విలువైన భూములు కొల్లగొట్టారని, ఆయన అక్రమాలు, అసాంఘిక కార్యకలాపాలపై పోరాడుతున్నందుకు తనను ఇటీవల హైదరాబాద్ నుంచి కోల్ కతాకు బదిలీ చేయించారని సస్పెన్షన్ కు గురైన దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ కళింగిరి శాంతి భర్త మదన్ మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు.
⭐ఉండవల్లి నివాసం లో ప్రజాదర్బార్ కు విచ్చేసిన మదన్ మోహన్… మంత్రి లోకేష్ ను కలిసి తన గోడును వెళ్లబోసుకున్నారు.
⭐నేను ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్యాకింగ్ (ఐఐపి)లో అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేస్తున్నాను.
⭐ఎంపి విజయసాయి రెడ్డి, అడ్వకేట్ సుభాష్ కలసి తన భార్య కళింగిరి శాంతిని లోబర్చుకొని విశాఖ లో ఆర్కే బీచ్ నుంచి భీమిలివరకు పెద్దఎత్తున భూములు కొల్లగొట్టారు.
⭐2022-23 నడుమ నన్ను ఏమార్చి అమెరికా పంపిన ఎంపి విజయసాయి నా భార్య శాంతి తో రహస్యంగా సహజీవనం చేసి మగబిడ్డను కన్నారు.
⭐తాను స్థానికంగా లేని సమయంలో బిడ్డకు విజయసాయిరెడ్డే తండ్రి అని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను. తనకు న్యాయం చేయాల్సిందిగా రాష్ట్రపతి, ప్రధాని కార్యాలయాలతో పాటు రాష్ట్ర హోంమంత్రి డీజీపీలను కలిసి విన్నవించాను. ఇప్పటివరకు నాకు న్యాయం జరగలేదు.
⭐విజయసాయిరెడ్డికి డిఎన్ఎ పరీక్షలు నిర్వహించి శాంతికి కలిగిన బిడ్డకు తండ్రి ఎవరో తేల్చండి.
⭐గత ప్రభుత్వ హయాంలో శాంతి అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేసిన కాలంలో రూ.20 కోట్లకు పైగా అక్రమాస్తులు సంపాదించింది.
⭐కుంచనపల్లి లో రూ.4 కోట్ల విలువైన విల్లా, జగన్ ఇంటి సమీపంలో రూ.3 కోట్ల విలువైన ఇల్లు, విశాఖ సాగర్ నగర్లో ట్రిపుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ తోపాటు ఆమెకు విలాసవంతమైన కార్లు ఉన్నాయి.
⭐విశాఖ లో విజయసాయి, సుభాష్, తన భార్య శాంతి కలిసి కొట్టేసిన రూ.1500 కోట్ల భూములపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి, విజయసాయి కుట్రతో కోల్ కతా బదిలీ అయిన తనను తిరిగి హైదరాబాద్ కు ట్రాన్స్ ఫర్ చేయించాలని మదన్ మోహన్ విన్నవించారు.
⭐ఉన్నతాధికారులతో మాట్లాడి న్యాయం చేస్తామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు.
👉 కేంద్ర‌ మంత్రి కింజరాపు రామ్మోహ‌న్ నాయుడు కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కేశినేని శివనాథ్
ఢిల్లీ: కేంద్ర‌ పౌర విమానయాన శాఖ‌ మంత్రి కింజరాపు రామ్మోహ‌న్ నాయుడు కి ఎంపి కేశినేనిశివనాథ్ తన సహచర టిడిపి ఎంపిలతో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 38వ పుట్టిన రోజు జరుపుకుంటున్న కింజరాపు రామ్మోహ‌న్ నాయుడు జ‌న్మ‌దిన వేడుక‌లు బుధ‌వారం పార్లమెంట్ లోని టిడిపి పార్టీ కార్యాల‌యంలో టిడిపి ఎంపీలంద‌రూ క‌లిసి ఘ‌నంగా నిర్వ‌హించారు. టిడిపి ఎంపీలు రామ్మోహ‌న్ నాయుడుకి పుష్ప‌గుచ్చం అందించి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. అనంత‌రం రామ్మోహ‌న్ నాయుడు కేక్ క‌ట్ చేసి..త‌న‌కి శుబాకాంక్ష‌లు తెలిపిన ఎంపీల‌కు కృత‌జ్ఞ‌తలు తెలిపారు. కేంద్ర‌ పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహ‌న్ నాయుడు విమాన‌యాన రంగాన్ని అభివృద్ది విష‌యంలో ప‌రుగులు పెట్టిస్తున్నార‌ని ఎంపి కేశినేని శివ‌నాథ్ కొనియాడారు.
ఈ కార్య‌క్ర‌మంలో టిడిపి పార్ల‌మెంట‌రీ పార్టీ నాయ‌కుడు లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయులు, విజ‌య‌న‌గ‌రం ఎంపి కె.అప్ప‌ల‌నాయుడు,నెల్లూరు ఎంపి వేమిరెడ్డి ప్రభాక‌ర్ రెడ్డి , ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసులు రెడ్డి ,వైజాగ్ ఎంపి మతుకుమిల్లి శ్రీభరత్ , క‌ర్నూలు బ‌స్తిపాటి నాగ‌రాజు, అనంత‌పురం ఎంపి ల‌క్ష్మీనారాయణ, నంద్యాల ఎంపి బైరెడ్డి శ‌బ‌రి, చిత్తూరు ఎంపి దగ్గుమళ్ల ప్రసాదరావు, అమ‌లాపురం ఎంపి హరీష్ మాథుర్, బాప‌ట్ల ఎంపి తెన్నేటి కృష్ణ ప్ర‌సాద్, హిందూపురం ఎంపి బికె పార్థ‌సార‌ధి, మాజీ రాజ్య‌స‌భ ఎంపి ర‌వీంద్ర క‌న‌క‌మేడ‌ల పాల్గొన్నారు.
⭐ తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు…
సిఈఐఆర్ లో ఫిర్యాదు చేసిన సెల్ ఫోన్ల రికవరీలో తిరుపతి జిల్లా రాష్ట్రంలోనే ప్రధమ స్థానంలో ఉంది.
నెల రోజుల వ్యవధిలో మొబైల్ హంట్ ద్వారా 87 లక్షల రూపాయల విలువ గల 435 మొబైల్ ఫోన్లు రికవరీ.
ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా సెల్ ఫోన్ పొగొట్టుకున్న బాధితులకు 11 విడతల్లో 3840 సెల్ ఫోన్లను రికవరీ చేయడం జరిగింది.
12వ విడతలో 7,56,40,000 రూపాయల విలువ గల 4275 ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందించడం జరిగింది.సత్పలితాలను ఇస్తున్న మొబైల్ హంట్ అప్లికేషన్ సేవల ద్వారా భారీగా మొబైల్ ఫోన్లు రికవరీ.
ఆధ్యాత్మిక క్షేత్రంలో మొబైల్ ఫోన్లు పొగొట్టుకున్న వారి సెల్ ఫోన్లు రికవరీ చేసి బాధితులకు న్యాయం చేసి సేవలందించిన సైబర్ క్రైమ్ పోలీసులను తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు అభినందించారు.తిరుపతి జిల్లా పోలీసు అఫిషియల్ వెబ్ సైట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బారాయుడు .
👉స్కూల్ బస్సు కింద పడి రెండేళ్ల చిన్నారి మృతి..
స్కూల్ బస్సు కింద పడి రెండేళ్ల చిన్నారి మృతి
ఆంధ్రప్రదేశ్ : నెల్లూరు జిల్లా కందుకూరు మండలంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. అనంతసాగరం గ్రామానికి చెందిన గోగినేని శ్రీకాంత్-నాగమణి దంపతులకు భార్గవ్, మోక్షజ్ఞ (2) ఇద్దరు కుమారులు. భార్గవ్ కందుకూరులోని ఓ పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతున్నాడు. రోజులాగే భార్గవ్‌ను స్కూల్ బస్సు ఎక్కించేందుకు తల్లితో పాటే వెళ్లిన మోక్షజ్ఞ వాహనం టైరు కింద పడి నలిగిపోయాడు. కొడుకు మృతదేహాన్ని పట్టుకుని తల్లిదండ్రులు విలపించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది.
👉 ఏసీబీకి చేరిన గవర్నర్ అనుమతి పత్రం..వాట్ నెక్ట్స్ !
గవర్నర్ అనుమతి కోసం ఎదురు చూస్తున్నామని ప్రభుత్వం మూడు నెలల నుంచి ప్రకటిస్తూ వచ్చింది. ఇప్పుడు అనుమతి వచ్చేసింది. ఆ అనుమతిని సీఎస్ శాంతి కుమారి ఏసీబీకి పంపించారు. కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని సూచించారు.ఇక ఏసీబీ రంగంలోకి దిగాల్సి ఉంది. మాములుగా అయితే రాజ్ భవన్ నుంచి అమోదం అనే సమాచారం రాగానే దూసుకెళ్లాలి. కానీ కేబినెట్ లో చర్చలు.. సీఎస్ లేఖలు ఏసీబీకి పంపడం అంటూ తాత్సారం చేస్తున్నారు.
కేసులు పెట్టారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను విచారణ చేయాలని కూడా సీఎస్ ఆదేశాలు ఇచ్చారు . ఇప్పటి వరకూ ప్రభుత్వం లీకులు ఇచ్చిన వివరాల ప్రకారం ప్రత్యేకంగా సాక్ష్యాల సేకరణ కూడా అవసరం లేదు. అన్నీ రెడీగా ఉన్నాయి. విదేశాలకు డబ్బులు తరలిపోయింది. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఓ విదేశీ సంస్థకు డబ్బులు పోయాయి. అలా తరలించినట్లుగా ఒప్పుకున్నారు. మరి దానికి అనుమతులు మాత్రం లేవంటున్నారు. అంటే డైరక్ట్ గా కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి అవసరమైన సాక్ష్యాలు ఉన్నట్లే.
ఈ రేసు కంపెనీతో ఒప్పందంఉన్నా.. ఏమి ఉన్నా.. ముందు డబ్బులు పంపితే దానికి అన్ని స్థాయిలోఅనుమతి అవసరం. మళ్లీ తమ ప్రభుత్వమే వస్తుందని అప్పుడు పాత తేదీలతో అయినా కరెక్ట్ చేసుకోవచ్చని అనుకుని ఆలస్యం చేశారు. అందు వల్లే ఇప్పుడు సమస్యలు వచ్చాయి. ఏసీబీ ఇప్పుడు ఏం చేయబోతున్నది రాజకీయ పరిణామాలను నిర్దేశించనుంది.
👉రైతు బీమా డబ్బుల కోసం చావు నాటకం..
మెదక్ జిల్లా గుట్టకిందిపల్లి గ్రామంలో ఘటన
బతికి ఉన్న ఇద్దరు రైతులు చనిపోయినట్లు డెత్ సర్టిఫికెట్ సృష్టించి రైతు బీమా సొమ్ము కాజేసిన వైనం.
రైతుల చావు నాటకంలో కీలక సూత్రధారి మాజీ సర్పంచ్ కుమారుడు.2021లో శ్రీను, 2023లో మల్లేశం చనిపోయినట్లు నమ్మించి, డెత్ సర్టిఫికెట్లు తీసుకుని రైతు బీమాకి దరఖాస్తు..ఇద్దరు రైతుల పేరుతో వచ్చిన రూ.10 లక్షల బీమా డబ్బుల్లో కొంత మొత్తాన్ని కాజేసిన మాజీ సర్పంచ్ కుమారుడు.ఇటీవల జరిగిన ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేలో బట్టబయలైన బాగోతం
పోలీసులు వచ్చేలోపే ఇళ్లకు తాళాలు వేసుకుని పారిపోయిన శ్రీను, మల్లేశం కుటుంబాలు..
👉ఎన్టీఆర్ జిల్లా:ఏ.కొండూరు మండలం ఎంపీడీవో *పి.హరిప్రియ* (36) గుండెపోటుతో మృతి.
డెలివరీ సమయంలో ఆడపిల్లకు జన్మనిచ్చి ప్రాణాలు వదిలిన తల్లి హరిప్రియ..ఎంపీడీవో కార్యాలయంలో మౌనం పాటించిన కార్యాలయ సిబ్బంది..
👉వక్ఫ్ బోర్డును కాపాడే సత్తా తెలుగుదేశం పార్టీకే ఉంది….. మొహమ్మద్ ఫతావుల్లా*
*ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నూతన వక్ఫ్ బోర్డ్ కు చైర్మన్ గా ఎన్నుకోబడిన నెల్లూరు మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఫతావుల్లాను వక్ఫ్ బోర్డ్ రాష్ట్ర కార్యాలయంలో కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు*
ఈ సందర్భంగా మొహమ్మద్ పతావుల్లా మాట్లాడుతూ వక్ఫ్ బోర్డ్ ను వక్ఫ్ ఆస్తులను రక్షించాలంటే అది కేవలం తెలుగుదేశం ప్రభుత్వంతోనే సాధ్యమని అన్నారు
వక్ఫ్ బోర్డు కు చైర్మన్ గా అబ్దుల్ అజీజ్ లాంటి మంచి వ్యక్తిని నియమించడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముస్లింలకు ఇచ్చిన ఒక వరమని అన్నారు
అబ్దుల్ అజీజ్ హయాంలో వక్ఫ్ ఆస్తులు రక్షించ బడటమే కాకుండా అభివృద్ధి కూడా జరుగుతుందని అలాగే వక్ఫ్ బోర్డులో కూరుకుపోయిన అవినీతి ప్రక్షాళన కూడా జరుగుతుందని అన్నారు. బడా బాబుల కబంధ హస్తాల నుంచి వక్ఫ్ భూములను వెలికి తీయాలని తద్వారా ముస్లిం పేద ప్రజానీకానికి లాభం చేకూరే విధంగా అబ్దుల్ అజీజ్ గారు అడుగులు వేయాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా జగన్ ప్రభుత్వ హయాంలో కొన్ని వందల మస్జిద్ మరియు దర్గా కమిటీలు పెండింగ్లో ఉన్నాయని అటువంటి పెండింగ్లో ఉన్న కమిటీలను నిజాయితీపరులు సేవా తత్పరులతో పూర్తి చేయాలని కోరారు

7k network
Recent Posts

రష్యాపై ఉక్రెయిన్ 9/11 తరహా దాడి .. “ఆర్జీవీకి వడ్డీతో కలిపి షాకిచ్చిన ఫైబర్ నెట్… ‘పుష్ప-2’ ఘటనపై పూసగుచ్చినట్లు వివరణ… రేవంత్ సంచలన వ్యాఖ్యలు! … వైసీపీ భూ మాఫియా ముఠా రాష్ట్రంలో వేలాది ఎకరాలు కొట్టేసింది : మంత్రి డోలా శ్రీ, ఎమ్మెల్యే కందుల ఆరోపణలు… మార్కాపురం పొదిలి లలో ఘనంగా జగనన్న జన్మదిన వేడుకలు

బీజేపీ నేతలు వారే కొట్టుకుని..నెపం రాహుల్‌గాంధీపై నెడుతున్నారు : వైఎస్‌ షర్మిల … “గుజరాత్ లో గుండె సమస్యలు లేని వారికి వైద్యం చేసి వీరిపై బిల్లులు పెట్టిన 17 మందిలో 5 మంది ICU లో ఇద్దరు మృతి !… ఎపి హైకోర్టులో మెత్తం 2,47,097 కేసులు,జిల్లా,సబార్డినేట్‌ కోర్టుల్లో 9,04,462 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి😱 :కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌* … పుత్రికోత్సాహంలో లిబ‌రేష‌న్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు ద‌ళాధిప‌తి విజయ్ కుమార్ …డ్రగ్స్ వద్దు బ్రో పోస్టర్ ను ఆవిష్కరించిన సినీ నటి శ్రీ లీల … పొరుమామిళ్ళ బంగారు వ్యాపారస్తులకు 60 లక్షలు కుచ్చు టోపీ పెట్టిన గోల్డ్ షాప్ యజమాని ..నేర సమీక్షా సమావేశం నిర్వహించిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు .. రోడ్డు పక్కన 52 KGల బంగారం,రూ.10 కోట్ల డబ్బు.. జగనన్నకు ముందస్తు జన్మదిన వేడుకలు (మార్కాపురం)..

ఎంపీల తోపులాట.. అంబేడ్కర్ పై షా వ్యాఖ్యలను కప్పిపుచ్చేందుకే – షర్మిల… బీజేపీని వణికించిన శీతాకాలం! … ప్రైవేట్ బస్సు ఢీకొని విద్యార్థి మృతి…అల్లూరి జిల్లా గొలుగొండలో 450 కేజీల గంజాయి పట్టివేత … మానవత్వం చాటుకున్న ఖమ్మం జిల్లా కలెక్టర్…తిరుపతిలో‌ వ్యభిచార రాకెట్ పై పోలీసుల దాడి..

రాహుల్ గాంధీపై కేసు నమోదు…అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు బీజేపీ అహంకారానికి నిదర్శనం.. వైఎస్ షర్మిల … అమిత్ షా వ్యాఖ్య‌ల‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి సీతక్క, త‌మిళ‌ న‌టుడు విజ‌య్‌, నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి, భీమ్ ఆర్మీ (తెలంగాణ),సిపిఐ (యం యల్ ) లిబరేషన్ పార్టీ…

ఆపరేషన్ వైసీపీ.. బాబు మాస్టర్ ప్లాన్?…ప్రియాంక గాంధీకి తొలి సవాల్! … కరోనా కంటే 7 రెట్లు ఎక్కువ ప్రాణాంతకమైన అంటువ్యాధి రాబోతోంది..! – WHO హెచ్చరిక!…టీడీపీలో ఆళ్ల నాని చేరిక వాయిదా… ధ్రువపత్రాలపై జగన్ ఫోటో- హైకోర్టులో విచారణ.. శ్రీ తేజ్ ను పరామర్శించిన అల్లు అరవింద్ .. ఉద్యోగాల పేరుతో మోసం చేశాడంటూ బాధితుల ర్యాలీ … అల్లు అర్జున్ చెప్పేవన్నీ అబద్ధాలా ? .. గద్దర్ జాతీయ సేవ పురస్కారం అందుకున్న మోతే కృష్ణ* … శారీరకంగా వాడుకొని యువతిని మోసం చేసిన ప్రియుడు… పెళ్లి పేరుతో 50 మంది యువతులను మోసం చేసిన వ్యక్తి..

అదానీ, మణిపూర్ అంశాలపై ప్రధానమంత్రి మోడీ మౌనం వీడాలని డిమాండ్ చేస్తూ ఏఐసీసీ దేశవ్యాప్త నిరసన .. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఒంగోలు ఎంపీ మాగుంట, ఎమ్మెల్యే ముత్తుముల.. కంభం మండలంలో పొలం బడి