టిడిపి జనసేనతో పొత్తుపై బీజేపీకి నో క్లారిటీ???

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్ది.. విపక్షాల పొత్తుపై సస్పెన్స్‌ అనేది ఇంకా కొనసాగుతూ ఉంది. వరుస భేటీలు, చర్చోచపర్చలు జరుగుతున్నా కూడా టీడీపీ, జనసేన కూటమిలోకి బీజేపీ ఎంట్రీపై క్లారిటీ రావడం లేదు.ఇటువంటి పరిస్థితుల్లో బీజేపీ అగ్రనేత అమిత్‌షా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. ఓ కాంక్లెవ్‌లో పాల్గొన్న ఆయన… ఉత్తరాదిలో ఒంటరిగానే పోటీచేస్తున్న తాము.. దక్షిణాదిలో నమ్మదగిన మిత్రులతోనే కలిసి వెళ్తామని చెప్పడం జరిగింది. ఎన్డీఏలోకి పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయన్న అమిత్ షా… ఆంధ్రప్రదేశ్ లో పొత్తులపై త్వరలోనే క్లారిటీ వస్తుందని చెప్పారు.ఆంధ్రప్రదేశ్ లో విపక్షాల పొత్తుపై రకరకాల ప్రచారం జరుగుతున్న వేళ.. పార్టీ నేతలకు బహిరంగలేఖ రాశారు జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌. పొత్తుపై నాయకులెవరూ బహిరంగంగా వ్యాఖ్యలు చేయొద్దని అన్నారు. భిన్నాభిప్రాయాలుంటే తన దృష్టికి తీసుకురావాలన్న పవన్‌ కళ్యాణ్ మరో 2 రోజుల్లో కూటమి పోటీ చేసే స్థానాలపై క్లారిటీ వస్తుందని లేఖలో తెలిపారు.

పార్టీ శ్రేణులంతా జాగ్రత్తగా ఉండాలని పవన్‌ కళ్యాణ్ హెచ్చరించారు.పొత్తులపై తెలుగుదేశం పార్టీ నుంచి కూడా.. త్వరలోనే అన్న మాటే ఎక్కువగా వినిపిస్తోంది. కూటమిపై కీలక వ్యాఖ్యలు చేసిన తెలుగు దేశపు పార్టీ సీనియర్‌ నేత బుచ్చయ్యచౌదరి బీజేపీతో పొత్తు ఇంకా ఖరారు కాలేదని చెప్పారు. ఒకవేళ పొత్తు కనుక కుదిరితే… 175 అసెంబ్లీ సీట్లలో ఎక్కువ త్యాగం టీడీపీనే చేయాల్సి వస్తుందని అన్నారు. జనసేన క్యాడర్ పరంగా ఇంకా బలపడాల్సి ఉందన్న బుచ్చయ్య… ప్రజల్లో పవన్‌ కళ్యాణ్ బలంగానే ఉన్నారన్నారు. ఎప్పటికైనా రాజ్యాధికారమే లక్ష్యంగా పవన్‌ కళ్యాణ్ పనిచేస్తున్నట్టు కనిపిస్తోందన్నారు.ఓ వైపు అధికార వైసీపీ ఒంటరిగా రెడీ అవుతుంటే ప్రతిపక్షాలు పొత్తుకు ఇంకెంత దూరం? అనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే టీడీపీ, జనసేన ఒక అవగాహనకు రావడం జరిగింది కాబట్టి… ఇక కూటమిపై తుది నిర్ణయం బీజేపీదేనని సమాచారం తెలుస్తోంది. అయితే, దీనిపై హైకమాండ్‌ ఎలా చెబితే అలా అంటోంది ఏపీ బీజేపీ. మరి, అమిత్‌ షా మాటల ప్రకారం త్వరలోనే ఏపీ పొత్తులపై క్లారిటీ వస్తుందా? లేదా ? అనేది చూడాలి.

7k network
Recent Posts

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం

కరెంటు బిల్లులపై ఏపీ సీఎం చంద్రబాబు ఊరటనిచ్చే ప్రకటన..50 లక్షలు సీఎమ్ రిలీఫ్ ఫండ్ కు చెక్ అందజేసిన ఎమ్మెల్యే అమిలినేని..తీవ్రంగా నష్టపోయాం…పెద్దమనసుతో ఆదుకోండి-మంత్రి నారా లోకేష్..బాసర ట్రిపుల్ ఐటీలో 2000 మంది విద్యార్థుల ఆందోళన..భోజనం పెట్టి మరీ సమస్యలు విన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..జగన్ పర్యటనకు హైకోర్టు బ్రేక్..తెలంగాణ సీఎస్ మీద మోడీ సర్కార్ సీరియస్?..తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మహేష్‌కుమార్‌గౌడ్‌.అదనపు భద్రతకు జగన్ అనర్హుడు: నచికేత్.

సీఎం చంద్రబాబుకి తప్పిన పెను ప్రమాదం..వెలుగులోకి ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలలు.. క్రమశిక్షణ చర్య…apuwj ఆధ్వర్యంలో వరద బాధితులకు విరాళం..22న హలోమాల చలో ఒంగోలు..శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల, మాజీ ఎమ్మెల్యే పద అన్నా..కంభంలో ఘనంగా టీచర్స్ డే.. పలువురికి ఘన సన్మానం.

ఏపీలో నేడు కేంద్ర బృందం పర్యటన..జగన్ ఐదు నిముషాల షో..ముఖ్యమంత్రి చంద్రబాబు విసుర్లు..బుడమేరుపై ఫలిస్తున్న మంత్రి లోకేష్ కృషి..ఆ రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పెన్షన్ రద్దు..బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు..వరద బాధితులకు కంభం వాసుల వితరణ..

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు విస్తృత పర్యటన..పనిచేయని మంత్రులనూ పీకి పారేస్తా😯విజయ సాయి కబ్జా కూల్చివేత….బిడ్డలున్నారు కదా? షర్మిల సంచలన కామెంట్స్..తండ్రిని పట్టించుకోని కొడుకు గిఫ్ట్ డీడ్ రద్దు..పారాలింపిక్స్‌లో తెలంగాణ యువతికి కాంస్యం..నేడు కడప ఉరుసు మహోత్సవం ..వరంగల్ లో నకిలీ సర్టిఫికెట్ల బాగోతం..