ఎస్పీ మల్లికా గార్గ్ సేవలు ప్రశంసనీయం..గుంటూరు రేంజ్ ఐజిపి పాలరాజు

పొలీసు అధికారులు సమర్థవంతమైన విధులతో ప్రజలకు ఉత్తమ సేవలందిస్తూ పోలీసు శాఖ ప్రతిష్ట పెంచాలి..గుంటూరు రేంజ్ ఐజిపి పాలరాజు

బదిలీపై వెళ్తున్న ప్రకాశం జిల్లా ఎస్పీ మలిక గర్గ్ కి ఘనంగా ఆత్మీయ వీడ్కోలు..

పొలీసు అధికారులు సమర్థవంతమైన విధులతో ప్రజలకు ఉత్తమ సేవలందిస్తూ పోలీసు శాఖ ప్రతిష్ట పెంచాలని గుంటూరు రేంజ్ ఐజిపి పాలరాజు పేర్కొన్నారు.

ప్రకాశం జిల్లా ఎస్పీగా రెండు సంవత్సరాల ఏడు నెలల పాటు వినూత్న కార్యక్రమాలతో, సిబ్బంది సంక్షేమంలో జిల్లాలో తనదైన ముద్ర వేసుకొని బదిలీపై తిరుపతి జిల్లాకు ఎస్పీగా బదిలీ అయిన ఎస్పీ మలిక గర్గ్ కు ఆదివారం ఒంగోలులోని , జిల్లా పోలీస్ కార్యాలయంలో వీడ్కోలు సభ నిర్వహించారు . ఈ సందర్బంగా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన గుంటూరు రేంజ్ ఐ జి పి పాలరాజు, మాట్లాడుతూ ప్రకాశం జిల్లా ఎస్పీగా మల్లికా గార్గ్ విశిష్టమైన సేవలను అందించి ఎన్నో కీలకమైనటువంటి కేసులను చాకచక్యంగా చేధించారన్నారు. అలాగే టంగుటూరు, చీమకుర్తిలలో జరిగిన జంట హత్యల కేసులను చేదించి నిందితులను అరెస్టు చేశారని, సంచలనం కలిగించిన కుమార్తెను చంపిన తండ్రి హత్య కేసులో ఎస్పీ విశిష్ట విధుల ద్వారా నిందితులను త్వరితగతిన అరెస్టు చేశారన్నారు. రోడ్డు ప్రమాదాలు 25% తగ్గించారని, శిక్షల శాతం పెంచారని, శాంతి భద్రత మరియు నేరాల నియంత్రణలో సమర్ధవంతంగా విధులు నిర్వర్తించారని జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ ను కొనియాడారు. అనంతరం బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి పోలీస్ ఆఫీసర్ గా వచ్చిన 6 నెలల వ్యవధిలోనే ఒక జిల్లాకి ఎస్పీగా అవడమే కాకుండా రాష్ట్రంలోనే ఉత్తమ పోలీసింగ్ సేవలు అందిస్తున్న జిల్లాల్లో ప్రకాశం జిల్లాను ముందు వరుసలో ఉంచడం ఎస్పీ పనితీరుకు పరిపాలన దక్షతకు నిదర్శనమని కొనియాడారు. జిల్లాకు మహిళా ఎస్పీగా వచ్చినప్పటి నుండి ఒక సవాలుగా తీసుకొని పోలీస్ శాఖలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా, లోతుగా విశ్లేషించి చర్యలు తీసుకుంటారని, ఎలాంటి సమస్యనైనా సమర్థవంతంగా ఎదుర్కొని పరిష్కరిస్తారని అన్నారు. విధి నిర్వహణలో ఎక్కువగా నిమగ్నమైనప్పటికీ, కుటుంబ జీవితానికి తగిన సమయం కేటాయిస్తారని, రెండింటిని చక్కగా బ్యాలెన్స్ చేస్తారని తెలిపారు. ప్రకాశం జిల్లా నుండి విభిన్న పరిస్థితులు ఉండే తిరుపతి జిల్లాకు బదిలీపై వెళ్తున్న ఎస్పీ అక్కడ కూడా తనదైన శైలిలో ఉత్తమ పోలీసు సేవలు అందించి అందరి మన్ననలు అందుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.అనంతరం జిల్లా కలెక్టర్ ఏ.ఎస్.దినేష్ కుమార్, బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, జిల్లా ఎస్పీ కుటుంబం సభ్యులు, మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఐ.వి.వెంకటేశ్వర్లు జిల్లా పోలీస్ అధికారులు తదితరులు ఎస్పీ మల్లికా గార్డ్ ను శాలువా, పూలమాలలతో సత్కరించి, జ్ఞాపికలను అందజేసి ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికారు.

7k network
Recent Posts

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం

కరెంటు బిల్లులపై ఏపీ సీఎం చంద్రబాబు ఊరటనిచ్చే ప్రకటన..50 లక్షలు సీఎమ్ రిలీఫ్ ఫండ్ కు చెక్ అందజేసిన ఎమ్మెల్యే అమిలినేని..తీవ్రంగా నష్టపోయాం…పెద్దమనసుతో ఆదుకోండి-మంత్రి నారా లోకేష్..బాసర ట్రిపుల్ ఐటీలో 2000 మంది విద్యార్థుల ఆందోళన..భోజనం పెట్టి మరీ సమస్యలు విన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..జగన్ పర్యటనకు హైకోర్టు బ్రేక్..తెలంగాణ సీఎస్ మీద మోడీ సర్కార్ సీరియస్?..తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మహేష్‌కుమార్‌గౌడ్‌.అదనపు భద్రతకు జగన్ అనర్హుడు: నచికేత్.

సీఎం చంద్రబాబుకి తప్పిన పెను ప్రమాదం..వెలుగులోకి ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలలు.. క్రమశిక్షణ చర్య…apuwj ఆధ్వర్యంలో వరద బాధితులకు విరాళం..22న హలోమాల చలో ఒంగోలు..శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల, మాజీ ఎమ్మెల్యే పద అన్నా..కంభంలో ఘనంగా టీచర్స్ డే.. పలువురికి ఘన సన్మానం.

ఏపీలో నేడు కేంద్ర బృందం పర్యటన..జగన్ ఐదు నిముషాల షో..ముఖ్యమంత్రి చంద్రబాబు విసుర్లు..బుడమేరుపై ఫలిస్తున్న మంత్రి లోకేష్ కృషి..ఆ రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పెన్షన్ రద్దు..బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు..వరద బాధితులకు కంభం వాసుల వితరణ..

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు విస్తృత పర్యటన..పనిచేయని మంత్రులనూ పీకి పారేస్తా😯విజయ సాయి కబ్జా కూల్చివేత….బిడ్డలున్నారు కదా? షర్మిల సంచలన కామెంట్స్..తండ్రిని పట్టించుకోని కొడుకు గిఫ్ట్ డీడ్ రద్దు..పారాలింపిక్స్‌లో తెలంగాణ యువతికి కాంస్యం..నేడు కడప ఉరుసు మహోత్సవం ..వరంగల్ లో నకిలీ సర్టిఫికెట్ల బాగోతం..