- .
రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 12వ తేదీన జారీ చేసిన డిఎస్సి 2024 నోటిఫికేషన్ లో ప్రకాశం జిల్లా ఉర్దూ మాధ్యమం పోస్టులు చూపించక పోవడం చాలా అన్యాయమని ముస్లిం మైనార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. మండల విద్యాశాఖ వారు ఖాళీలు ఉన్నట్లు లిస్టు పంపించినప్పటికీ జిల్లా విద్యాశాఖ నుండి కమిషనర్ కు పంపిన లిస్టులో ఖాళీలు చూపకపోవడం వల్ల ఇటువంటి దారుణం చోటుచేసుకుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.జిల్లా లో ఉర్దూ సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ పోస్టులు 25 ఉర్దూ మధ్యమంలో స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ 5 , పిఎస్ 1, సోషల్ 2 , గణితం 2 ఖాళీగా ఉన్నప్పటికీ డీఎస్సీ -2024 లో ఖాళీలు చూపించక పోవడం చాలా అన్యాయం అని , దీంతో పోస్టులు భర్తీ కాకపోవడం వల్ల విద్యార్థుల చదువులు తీవ్రంగా దెబ్బ తినే ప్రమాదం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక ఖాళీ పోస్టులు భర్తీ కాకపోవడం వల్ల ఎన్నో ఏళ్లుగా టీచర్ ట్రైనింగ్ చేసి ఏళ్ల తరబడిగా కళ్ళు కాయలు కాసేలా ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూపులు చూస్తున్న వారు ఉద్యోగ అవకాశాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉందని టీచర్ ట్రైనింగ్ చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత విద్యాశాఖ ఉన్నతాధికారులు వెంటనే చొరవ తీసుకొని, జరిగిన తప్పులను సరిదిద్ది అందరికీ న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని, ఉర్దు మాధ్యమం విద్యార్ధులకు అన్యాయం జరగకుండా ఈ మొత్తం పోస్టులను 2024 డీఎస్సీ చూపించ వలసిందిగా ముస్లిం మైనార్టీ నాయకులు కోరుతున్నారు.
👉మహిళపై భర్త కత్తితో దాడి !!!
గుంటూరులోని లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని మేదర బజార్లో మహిళపై ఆమె భర్త కత్తితో దాడి చేసిన సంఘటన.. భర్త కృష్ణ అతని భార్య ద్రాక్షాయని మధ్య గొడవల వల్ల సంవత్సర కాలంగా వేరువేరుగా జీవనం కొనసాగిస్తున్నారు.భర్తపై ద్రాక్షాయని తనని వేధిస్తున్నాడంటూ సంవత్సరం క్రితం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది .ఈ క్రమంలో భర్త కృష్ణ భార్య పనిచేసే దగ్గరకు వచ్చి కేసు వెనక్కి తీసుకోవాలని మూడు నెలలుగా ద్రాక్షాయిని చుట్టూ తిరుగుతున్నట్లు,కేసు వెనక తీసుకోకపోతే చంపేస్తానంటూ పలుమార్లు బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం.పనిచేసే చోట నుంచి ఇంటికి వెళ్లే క్రమంలో భార్యపై భర్త కత్తితో దాడి చేయగా,బాధితురాలు ద్రాక్షాయని పెద్దగా అరవడంతో భర్త కృష్ణ పరారీ అయినాడు.బాదితారాలికి బలమైన గాయాలు కావడంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు..విషయం తెలుసుకున్న లాలాపేట సీఐ పి.దేవప్రభాకర్ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు .
👉గుంటూరు జిల్లా తెనాలి గంగానమ్మపేటలో వివాహిత దారుణ హత్య..!!!
భవనం వారి వీదిలో నివాసం ఉంటున్న రామిశెట్టి అలేక్య (35) ను గొంతు కోసి హత్య చేసిన దుండగులు..గదిలో గొంతు కోసి హత్యకు గురై నగ్నంగా పడి ఉన్న అలేఖ్య మృతదేహం..అన్నం శ్రీనివాస్ అనే వ్యక్తితో అలేక్యకి గత ఏడు సంవ్సరాలుగా వివాహేతర సంబంధం ఉందంటున్న భర్త రమేష్ ..ఇరువురి మధ్య కోర్టులో కేసు నడుస్తున్న ట్లు సమాచారం.భవనంలోని కింద గదిలో ఉన్న తన భార్య అలేఖ్యని గత రాత్రి అక్రమ సంబంధం పెట్టుకున్న శ్రీనివాస్ హత్య చేసినట్టు భర్త రమేష్ ఆరోపిస్తున్నాడు..2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నారు.
👉*వివాహిత దారుణ హత్య.*
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ కడియం మండలం కడియపు సావరంలో దూళ్ళ సత్య శ్రీ (35) వివాహిత మహిళ దారుణ హత్యకు గురైంది. సత్యశ్రీ భర్త సూర్యప్రకాష్ (సూరిబాబు) హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఇరువురి దంపతుల మధ్య గత మూడు నెలలుగా ఏర్పడిన వివాదమే హత్యకు దారితీసి ఉండొచ్చని స్థానికులు తెలిపారు. కాగా ఇరువురు దంపతులకు పెద్దల సమక్షంలో ఒప్పందం కుదిరించారు. వీరికి 16 ఏళ్లు క్రితం ప్రేమ వివాహం జరిగిందని, ఒక పాప, బాబు సంతానం ఉండగా, పాప ఐదవ తరగతి, బాబు ఎనిమిదవ తరగతి చదువుతున్నట్లు తెలిపారు. సంఘటన స్థలాన్ని సౌత్ జోన్ డిఎస్పి అంబికా ప్రసాద్, కడియం సీఐ బి తులసీదర్ పరిశీలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం భర్త పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
👉ముత్తుముల సమక్షంలో టీడీపిలో చేరిన గ్రామ వాలంటీర్!!!
ప్రకాశం జిల్లా, గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపి ఇంచార్జ్ శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో కంభం, మండలం, లింగాపురం గ్రామానికి చెందిన గ్రామ వాలంటీర్ మిట్టా విద్యాసాగర్ తన వాలంటీర్ పదవికి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్బంగా అశోక్ రెడ్డి టీడీపి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.