Apiic చైర్మన్ జంకె వెంకటరెడ్డికి అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే అన్నా..అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేస్తాం: డీఎస్పీ బాలసుందర రావు.

 

 ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫాస్ట్రక్చర్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన ప్రకాశం జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డిని గిద్దలూరు ఎమ్మెల్యే, వైసీపీ మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ అన్నా రాంబాబు విజయవాడ లోని ఆయన ఛాంబర్ లో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారిని ఎమ్మెల్యే అన్నా శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు.కార్యక్రమంలో మార్కాపురం ఏఎంసీ చైర్మన్ షంషిర్అలి బేగ్, ఏయంసి డైరెక్టర్ పి ఎల్ పి యాదవ్ , ప్రముఖ వైద్యులు మగ్బుల్ భాష, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.*

👉దివంగత నేత గిద్దలూరు మాజీ శాసనసభ్యులు     కిశే పగడాల రామయ్య   ఆరవ వర్ధంతి    సందర్భంగా గిద్దలూరు వైఎస్ఆర్సిపి నియోజకవర్గ ఇన్చార్జ్ కేపీ నాగార్జున రెడ్డి వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

*అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేస్తాం: డీఎస్పీ బాలసుందర రావు*

ప్రకాశం జిల్లా మార్కాపురం డివిజన్ డిఎస్పి బాలసుందరరావు సోమవారం కొమరోలు, రాచర్ల  పోలీస్ స్టేషన్లను సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన డిఎస్పి బాలసుందర రావు మార్కాపురం డివిజన్ లో అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా కట్టుదిట్టంగా వ్యవహరిస్తామని అన్నారు. ముఖ్యంగా డివిజన్ పరిధిలో ట్రాఫిక్ పై దృష్టి సారించామని అలానే నాటు సారా అక్రమంగా మద్యం తరలింపు లేదా మద్యం బెల్ట్ షాపులు నియంత్రణ మైనర్ల రాష్ డ్రైవింగ్ పై నిఘ ఉంచామన్నారు. మైనర్లకు తల్లితండ్రులు వాహనాలు ఇవ్వవద్దని హెచ్చరించారు. ఎన్నికలను శాంతియుతంగా ముగిసేందుకు చర్యలు తీసుకుంటామని ప్రజలకు కూడా అందుకు సహకరించాలని అన్నారు. అలానే డివిజన్ పరిధిలో ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుంటే తమ దృష్టికి తీసుకురావాలని డి.ఎస్.పి బాల సుందర రావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

7k network
Recent Posts

పదేళ్లలో పెరిగిన ఈడీ దూకుడు..సీఎం జగన్ సమక్షంలో చేరికలు..నామినేషన్ వేసిన మాగుంట..రేపే కుందూరు నామినేషన్..రాజీనామా చేస్తే 15 వేలు!!!..బస్సులో అమ్మాయి అసభ్య ప్రవర్తన..సోదరుడి కోసం సోదరి ప్రచారం

టిడిపిని వాలంటీర్లే ఓడిస్తార?..పవన్ సీట్లు అమ్ముతున్నారని..పిఠాపురంలో డబ్బులు పంచుతున్నారని ఫిర్యాదు..సీతారాముల కళ్యాణంలో మాగుంట,ముత్తుముల దంపతులు..గిద్దలూరు వైకాపా టీడీపీలలో చేరికలు

సీఎం జగన్ సమక్షంలో హేమాహేమీల చేరికలు..ఓర్వలేకనే దాడులు..1400 కిలోల బంగారం స్వాధీనం..విస్తృత ప్రచారంలో మాగుంట తనయుడు..కంభంలో ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డిఆత్మీయ సమ్మేళనం.. త్రిబుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య..

ఇజ్రాయిల్ పై ఇరాన్ క్షిపణి దాడులు..సీఎం జగన్ పై జరిగిన దాడిని ఖండించిన షర్మిల..పవన్ కళ్యాణ్ పై నాన్ బైయిలబుల్ కేసు!!! సల్మాన్ ఖాన్ఇంటి వద్ద కాల్పులు..పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట..ఎమ్మెల్యే అన్నా సతీమణి,కోడలు ప్రచారం..