ముస్లిం మైనార్టీల సంక్షేమం తెలుగుదేశంతోనే సాధ్యం..మాజీ శాసనమండలి చైర్మన్ మహమ్మద్ షరీఫ్.. ఇంటింటికి ప్రచారంలో తెలుగు తమ్ముళ్లు.. భాష్యం స్కూల్ బిల్డింగ్ పై నుండి పడి విద్యార్థిని మృతి..ఆకట్టుకున్న వైజ్ఞానిక ప్రదర్శన..కంభం


రాష్ట్రంలో ముస్లిం మైనార్టీల సంక్షేమం తెలుగుదేశం ప్రభుత్వంతోనే సాధ్యమని మాజీ శాసన మండలి చైర్మన్ మహమ్మద్ షరీఫ్ అన్నారు. గిద్దలూరు పట్టణంలోని షాదీఖానాలో ఏర్పాటు చేసిన ముస్లిం మైనార్టీ సోదరుల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిధులుగా ఆయనతోపాటు గిద్దలూరు టీడీపి ఇంచార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి మరియు రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షులు మౌలానా ముస్తక్ అహ్మద్, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు రసూల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మండలి చైర్మన్ మహమ్మద్ షరీఫ్ మాట్లాడుతూ రాష్ట్రంలో నాడు తెలుగుదేశం ప్రభుత్వంలో ముస్లిం మైనార్టీల సంక్షేమానికి అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చి వారికి అన్నీ విధాలుగా అండగా నిలిచిన నాయకుడు చంద్రబాబు నాయుడు అని గుర్తు చేశారు. నేడు అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి మైనార్టీల సంక్షేమాన్ని మరిచి వారి పై దాడులు చేయటమే పనిగా పెట్టుకున్నారని, ముస్లిం సోదరుల పై వైసీపీ మూకలు దౌర్జన్యం చేస్తుంటే వైసీపీ ప్రభుత్వం చోద్యం చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అరాచక పాలనను తరిమికొట్టటానికి ముస్లిం సోదరులంతా సిద్ధంగా ఉండాలని, గిద్దలూరు నియోజకవర్గంలో టీడీపి జనసేనల ఉమ్మడి అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డిని గెలుపించేందుకు సంసిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో దోపిడీ ప్రభుత్వం నడుస్తుందని, అధికారంలోకి వచ్చిన నాటి నుండి దోచుకోవటమే పనిగా పెట్టుకున్న జగన్ రెడ్డిని ఇంటికి సాగనంపాలన్నారు.
కార్యక్రమంలో గిద్దలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనార్టీ నాయకులు, రాష్ట్ర, పార్లమెంట్ కమిటీ మైనార్టీ నాయకులు, ముస్లిం సోదరులు భారీ సంఖ్యలో పాల్గోన్నారు.
👉 *అశోక్ రెడ్డి గెలుపే లక్ష్యంగా దూసుకుపోతున్న తెలుగు తమ్ముళ్లు…

తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి కంభం మండలం లోని లింగోజిపల్లి లో ఇంటింటికి తిరిగి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్6 పథకాల గురించి వివరించడం జరుగుతుంది.మన ప్రియతమ నాయకుడు గౌరవనీయులు ముత్తుముల అశోక్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా కంభం మండలం లింగోజిపల్లి గ్రామంలో ని ప్రతి ఇంటికి తిరిగి మన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రచారం జరుగుతుంది కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సర్పంచి తాటికొండ వెంకటేశ్వర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు తాటికొండ కాశయ్య, ఆవులపాటి వెంకటసుబ్బయ్య, , నాగేళ్ల రామయ్య , కరణం ప్రసాదు , ఇ. లక్ష్మణరావు ,రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి గోన చెన్నకేశవులు , పార్లమెంట్ మైనార్టీ ప్రధాన కార్యదర్శి అనీష్ అహ్మద్, మాజీ ఎంపీటీసీ ఖాదర్ హుస్సేన్,మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు సిరివెళ్ల రవికుమార్ జిలాని, తదితరులు పాల్గొన్నారు.
👉గిద్దలూరు నియోజకవర్గ టీడీపి జనసేనల ఉమ్మడి అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డిని గెలిపించేందుకు తెలుగు తమ్ముళ్లు నడుం బిగించారు.
బుధవారం ఉదయం పట్టణంలోని 1వ వార్డు, 8వ వార్డు, మరియు 19వ వార్డులలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, మహిళలు, ప్రతీ ఇంటికి తిరిగి టీడీపి – జనసేనల ఉమ్మడి మ్యానిఫెస్టోలోని సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు. నాడు తెలుగుదేశం హయాంలో ముత్తుముల అశోక్ రెడ్డి పట్టణంలో త్రాగునీటి సమస్యను పరిష్కరించారని, పేదలకు 1404 ఎన్టీఆర్ టిడ్కొ గృహాలను మంజూరు చేశారని, సిమెంట్ రోడ్లు, పెన్షన్లు, రేషన్ కార్డులు మంజూరు చేశారని గుర్తు చేశారు..

👉బుధవారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవ సంబరాలను స్ఫూర్తిదాయకంగా నిర్వహించారు.తోలుత సర్ సి.వి. రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంఈఓ బి.మాల్యాద్రి మాట్లాడుతూ శాస్త్ర విజ్ఞానం ప్రజల దైనందిన జీవితాలతో ముడిపడి వుందనీ, శాస్త్ర సాంకేతిక అభివృద్ధి దేశ నిర్మాణ పటిష్టతకు సూచికగా,ఆర్థిక అభివృద్ధికి బాసటగా నిలుస్తాయనీ,విభిన్న రంగాలలో శాస్త్ర విజ్ఞాన సేవలు అద్భుతాలను చేస్తాయన్నారు.

ప్రజల జీవన ప్రమాణ పురోగతిలో శాస్త్రం సాంకేతిక విజ్ఞాన పాత్ర అద్వితీయమైనదనీ,పాఠశాల స్థాయిలోనే వినూత్న ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టేలా విద్యార్థులను తీర్చిదిద్దాలని సూచనలు చేశారు. అనంతరం పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన వైజ్ఞానిక ఆవిష్కరణలను తిలకించి ప్రశంసల జల్లు కురిపించారు.కార్యక్రమంలో సైన్స్ ఉపాధ్యాయులు వై. వీరనారాయణ, మొయినుద్దీన్, కొమ్మునూరి.కిరణ్ కుమార్, ఏ.వి.శ్రీకృష్ణ, పాండురంగ బాబు పాల్గొన్నారు

👉 భాష్యం స్కూల్ 4 వ అంతస్తు మీద నుండి పదవ తరగతి చదువుతున్న విద్యార్థి క్రింద పడి మృతి చెందిన సంఘటన పిడుగురాళ్లలో చోటుచేసుకుంది.వివరాల్లో కెళితే కొనకండ్ల రిషిత అనే బాలిక పదవ తరగతి భాష్యం స్కూల్లో చదువుతుంది. స్కూల్ బిల్డింగ్ నాలుగవ అంతస్తులో పదవ తరగతి క్లాసులు నిర్వహిస్తుంది.స్కూల్ మీద నుండి కింద పడ్డ రిషితను హుటాహుటిన పట్టణ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చటం జరిగింది.పై నుండి కింద పడ్డ రిషిత వెంటనే చనిపోవడం జరిగిందని తెలిపారు.

7k network
Recent Posts

అసెంబ్లీలో వైకాపా పై ధ్వజమెత్తిన సీఎం చంద్రబాబు.. ఫుడ్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తిన నకిలీ విలేఖరులు..పోలీస్ స్టేషన్లో రెచ్చిపోయిన నకిలీ విలేఖరి.. వివేకా హత్య కేసులో దస్తగిరి పేరు తొలగింపు.. పొదిలి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ..రాష్ట్ర తరగతులను జయప్రదం చేయండి..పీ డీ ఎస్ యూ..

కొత్త ప‌థ‌కాల‌కే రేవంత్ జై!..అమరావతిలో ల్యాండ్ పూలింగ్ షురూ..మోడీ మాయతో ఏపీకి అన్యాయం.. • ప్రజలు మోసపోతున్న మాట్లాడలేని జగన్ ..సమస్యలపై మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లిన మార్కాపురం ఎమ్మెల్యే కందుల..ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన పొదిలి సీఐ.. వైకాపా కార్యకర్తను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే అన్నా.. ప్రకాశం జిల్లా కలెక్టర్ పర్యటన.. రషీద్ హత్య కేసులో నిందితుల అరెస్టు..

ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన చంద్రబాబు..అసెంబ్లీ హైలెట్స్..లిక్క‌ర్ పాల‌సీపై విచార‌ణ‌..జ‌గ‌న్‌ను అరెస్టు చేస్తారా?..ఉద్యోగులకు త్వరలోనే పెండింగ్ డీఏలు: భట్టి..బడ్జెట్లో మైనార్టీలపై వివక్షత పై అవాజ్ కమిటీ ఆగ్రహం..ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆధ్వర్యంలో కొనసాగుతున్న మెగా డీఎస్సీ ఉచిత కోచింగ్ సెంటర్..ప్రకాశంలో తూనికలు కొలతల శాఖ దాడులు.

కుర్చీని కాపాడుకొనే బడ్జెట్- కాంగ్రెస్,సీపీఎం..నీతి ఆయోగ్ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీలు దూరం-సీఎం స్టాలిన్ మద్దతు..ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట..జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత డీఎస్సీ కోచింగ్..కరకట్టలో రైతుల ఆందోళన..డెలివరీ బాయ్ ముసుగులో గంజాయి విక్రయాలు

పెద్దన్న అంటే ..ఇచ్చింది గుండుసున్నా !..కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణపై కక్ష చూపించారు..అన్ని రూపాల్లో నిరసన తెలియజేస్తాం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించాలి..సీఎం రేవంత్.. హర్షం వ్యక్తం చేసిన ఏపీ మంత్రులు..పొదిలి నగర పంచాయితీలోని మున్సిపల్ కార్మికులకు 6నెలల హెల్త్ అలవెన్స్ బకాయిలను చెల్లించాలి..రాష్ట్రస్థాయి బండలాగుడి పోటీలను ప్రారంభించిన ఎంపీపీ అమూల్య…