సీనియర్ ఐఏఎస్ అధికారి ఏ.ఎండి ఇంతియాజ్ సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.వచ్చే ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి ఇంతియాజ్ ను వైసీపీ తరఫున బరిలో దించుతారని టాక్ నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అధికార వైసీపీలో చేరారు. ఆయనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పాల్గొన్నారు.వచ్చే ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి ఇంతియాజ్ ను వైసీపీ తరఫున బరిలో దించుతారని టాక్ నడుస్తోంది.వైసీపీ ఏర్పడ్డాక జరిగిన ఎన్నికల్లో 2014, 2019లో వైసీపీ తరఫున కర్నూలు నుంచి ఎస్వీ మోహన్ రెడ్డి, హఫీజ్ ఖాన్ గెలుపొందారు. 2014లో కర్నూలులో వైసీపీ తరఫున గెలిచిన ఎస్వీ మోహన్ రెడ్డి ఆ తర్వాత టీడీపీలోకి ఫిరాయించారు.మళ్లీ 2019 ఎన్నికల తర్వాత వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రసుతం ఆయన కూడా కర్నూలు సీటును ఆశించారు. మరోవైపు 2019లో కర్నూలు నుంచి వైసీపీ తరఫున హఫీజ్ ఖాన్ పోటీ చేసి గెలుపొందారు. ఆయన కూడా ఈ సీటును ఆశిస్తున్నారు. అయితే వైసీపీ అధినేత జగన్ వీరిద్దరిని కాదని.. ప్రస్తుతం పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ఫ్) సీఈవోగా, భూపరిపాలన శాఖ అదనపు కార్యదర్శిగా, మైనార్టీ శాఖ కార్యదర్శిగా పలు బాధ్యతలు నిర్వహిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ ను ఎంపిక చేశారని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇంకా పదవీకాలం ఉన్నప్పటికీ, ప్రస్తుతం సీనియర్ ఐఏఎస్ గా కీలక పదవుల్లో కొనసాగుతున్నప్పటికీ ఇంతియాజ్ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్) తీసుకున్నారు. ఈ మేరకు ఇందుకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవడం.. ప్రభుత్వం వెంటనే ఆమోదించడం జరిగిపోయాయి. ఈ విషయాన్ని కేంద్ర సిబ్బంది, వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సైతం రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. కాగా ఇంతియాజ్ గతంలో కృష్ణా జిల్లాతోపాటు పలు జిల్లాలకు కలెక్టర్ గా పనిచేశారు.ఇంతియాజ్ స్వస్థలం కర్నూలు జిల్లాలోని కోడుమూరు. కర్నూలు అసెంబ్లీ స్థానంతోపాటు పార్లమెంటు స్థానం పరిధిలో భారీగా ఉన్న ముస్లింల ఓటర్లను ఆకట్టుకోవడానికి వైసీపీ ఇంతియాజ్ కు సీటు ఇస్తుందని తెలుస్తోంది.కార్యక్రమంలో కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పాల్గొన్నారు.
👉నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కొరకు,పూర్తిస్థాయి అవినీతి రహిత పరిపాలన అందించుటకు మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉండటానికి నేను సిద్ధంగా ఉన్నానని గిద్దలూరు నియోజకవర్గం సమన్వయకర్త,నియోజకవర్గ సమన్వయకర్త కుందూరు నాగార్జున రెడ్డి అన్నారు.కొమరోలులో జరిగిన వాలంటరీ వందన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ స్వతంత్ర భారతదేశంలో గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని పూర్తిస్థాయిలో అమలుపరచుటకు, గౌరవ ముఖ్యమంత్రి ఒక గొప్ప సచివాల వ్యవస్థను ఏర్పాటు చేసి,ఆ వ్యవస్థకు ప్రజలకు అనుసంధానంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఒక గొప్ప వ్యవస్థను సృష్టించడం జరిగింది. ఆ వ్యవస్థ “వాలంటరీ వ్యవస్థ”.ఈ వ్యవస్థలో పనిచేసే ప్రతి వాలంటరీ పూర్తిస్థాయి ప్రజలకు సేవలు అందిస్తూ, ప్రభుత్వం తరఫున ఎప్పటికీ ఎప్పటికీ వారి సమస్యలను పరిష్కరిస్తూ,ఎవరికి ఏ సమస్య లేకుండా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి అందే విధంగా పూర్తి సేవ దృక్పథంతో పనిచేస్తున్న వాలంటరీలకు వందనాలు తెలిపారు.
*👉పొదిలి మండలంలో వైఎస్సార్ ఆసరా చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే అన్నా*భారీ గజ మాలతో ఎమ్మెల్యే అన్నాను ఘనంగా సన్మానించిన మహిళలు..జగనన్న చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన మహిళలు..రాబోయే ఎన్నికల్లో మీ ఆత్మీయునిగా వస్తున్న గెలిపించండి అని కోరిన ఎమ్మెల్యే అన్నా* ..అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తూ సంక్షేమపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి వర్యులు వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుందామని గిద్దలూరు ఎమ్మెల్యే,మార్కాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయ కర్త అన్నా రాంబాబు అన్నారు. బుధవారం పొదిలిలోని దర్శి రోడ్డులోని మంజునాథ కల్యాణ మండపంలో నిర్వహించిన వైఎస్సార్ ఆసరా 4 విడత వారోత్సవాలల్లో ఎమ్మెల్యే అన్నా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఏపీఐఐసి చైర్మన్, జిల్లా వైసీపీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జంకే వెంకట రెడ్డి పాల్గొన్నారు. అనంతరం వారు ముఖ్య మంత్రి జగనన్న చిత్రపటానికి మహిళలతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అన్నా మాట్లాడుతు మహిళల అభ్యున్నతి కొరకు, అన్ని వర్గాల మహిళలకు ఆర్థికంగా ఆదుకోవడానికి వైఎస్సార్ ఆసరా పథకం రూపొందించారన్నారు. ఈ పథకం వలన మహిళలు స్వతహాగా అనేక చిన్నచిన్న కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని, ప్రతి మహిళ ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఉపయోగ పడుతుందన్నారు. జగనన్న ఆదేశాల మేరకు మార్కాపురం నుండి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజా సేవకై వస్తున్న నన్ను ఆశీర్వదించి గెలిపించాలని ఎమ్మెల్యే అన్నా మహిళలను కోరారు. ఈ కార్యక్రమం లో మార్కాపురం నియోజకవర్గ వైసీపీ ముఖ్య నేతలు, పొదిలి మండల వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అధికారులు, మహిళలు, గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు.
ముఖ్య మంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అన్నా*.. ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు అయిన చెక్కులను బుధవారం గిద్దలూరు శాసన సభ్యులు, మార్కాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయ కర్త అన్నా రాంబాబు పంపిణీ చేశారు. బుధవారం పొదిలి దర్శి రోడ్డులోని మంజునాథ కల్యాణ మండపంలో జరిగిన కార్యక్రమం లో బాధితులకు ఎమ్మెల్యే అన్నా పంపిణీ చేశారు. పొదిలి మండలంలోని బుచ్చిన పాలెం గ్రామానికి చెందిన పల్లెర్ల చిన్న వెంకటేశ్వర్లుకు రూ.65 వేలు, సలకనూతలకు చెందిన బొల్లినేని నాగేశ్వరావు కు లక్ష రూపాయల చెక్కులను ఎమ్మెల్యే అన్నా అందచేశారు. అనంతరం బాధితులు ముఖ్య మంత్రి జగనన్న కు, ఎమ్మెల్యే అన్నా కు కృతజ్ఞతలు తెలిపారు.
👉*మీ ఆత్మీయునిగా వస్తున్న ఆదరించండి..పొదిలి పట్టణ, మండల వైసీపీ నాయకుల ఆత్మీయ సమావేశంలో గిద్దలూరు ఎమ్మెల్యే, మార్కాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త అన్నా*… మార్కాపురం నియోజకవర్గ అభివృద్దే లక్ష్యంగా మీ ఆత్మీయునిగా వస్తున్న రాబోయే ఎన్నికల్లో నన్ను అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని గిద్దలూరు శాసనసభ్యులు, మార్కాపురం నియోజక వర్గ వైసీపీ సమన్వయకర్త అన్నా రాంబాబు తెలిపారు. బుధవారం పొదిలి దర్శి రోడ్డు లోని మంజునాధ కల్యాణ మండపంలో నిర్వహించిన పార్టీ నాయకులు కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే అన్నా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఏపీఐఐసి చైర్మన్, జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలంలోని అన్ని పంచాయతీల నుంచి పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున హాజరై ఎమ్మెల్యే అన్నా కు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే అన్నా మాట్లాడుతూ పాదయాత్రలో పేదల సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్ నవరత్నాల ద్వారా ప్రతిఇంటికీ సంక్షేమం అందించారన్నారు. రాజకీయాల్లోకి రాకముందే తల్లిదండ్రుల పేరుపై ట్రస్టు ప్రారంభించి నీటి సమస్య తీర్చానని, ఉచిత అంబులెన్సు ఏర్పాటు చేశానన్నారు. 100 మంది కిపైగా విద్యార్థులను ఇంజినీరింగ్, ఎంబీఏ, మెడి సిన్ చదివించానన్నారు. పలు గ్రామాల నుంచి వచ్చిన కార్యకర్తలు ఎమ్మెల్యే అన్నాను పరిచయం చేసుకుని శాలువా, పూలదండలతో ఘనంగా సత్క రించారు.
👉ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందచేయడంలో వాలంటీర్లదే ప్రముఖ పాత్ర.. ముఖ్య మంత్రి జగనన్న ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందచేయడంలో వాలంటీర్లదే ప్రముఖ పాత్ర అని గిద్దలూరు ఎమ్మెల్యే, మార్కాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త అన్నా రాంబాబు అన్నారు. బుధవారం పొదిలిలోని దర్శిరోడ్డులో గల మంజునాథ ఫంక్షన్ హాలులో జరిగిన పొదిలి టౌన్, మండలములోని వాలంటీర్లకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నా పాల్గొని మాట్లాడారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్టం మరింత అభివృద్ధి చెందాలంటే ముఖ్య మంత్రి వై.ఎస్.జగన్ మెహన్ రెడ్డి అయితేనే సాధ్యమవుతుందన్నారు. వాలంటీర్లు తమ పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి జగనన్న అందించిన ప్రభుత్వ పధకాలను ప్రజలకు వివరించి జగనన్న కు అండగా నిలవాలని ప్రతి ఒక్కరిని కోరాలని సూచించారు.వాలంటీర్ లు వారి పరిధిలోని కుటుంబాల సమస్యలు ఎల్లప్పుడు తెలుసుకొని వాటిని పరిష్కరించాలన్నారు. అనంతరం పొదిలి టౌన్, మండల పరిధిలోని వాలంటీర్ లకు సేవావజ్ర, సేవారత్న, సేవా మిత్ర అవార్డులకు ఎంపికైన వాలంటీర్ లను ఎమ్మెల్యే అన్నా శాలువాతో, బ్యాడ్జ్, ప్రశంసాపత్రాలతో ఎమ్మెల్యే అన్నా సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమం లో పొదిలి మండలంలోని ప్రజాప్రతినిధులు, వైసీపీ ముఖ్య నేతలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు, సచివాలయ కన్వీనర్ లు, గృహ సారధులు పాల్గొన్నారు.