మూడుసార్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు పేద విద్యార్దులకు చేసిన మంచేంటి?.. సిద్ధం సభ పోస్టర్లను విడుదల చేసిన ఎమ్మెల్యే అన్నా.. ఏ వన్ గ్లోబల్ ఇంజనీరింగ్ కాలేజీలో సన్మానం..

మూడుసార్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు పేద విద్యార్థులకు చేసిన మంచేంటి? * 9.44 లక్షల మంది విద్యార్థులకు రూ.708.68 కోట్లు ‘జ‌గ‌న‌న్న విద్యా దీవెన’ నిధులు విడుద‌ల‌ చేసిన సీఎం జగన్* ..పేద పిల్లల భవిష్యత్తు మార్చేందుకు ఎప్పుడైనా చంద్రబాబు ప్రయత్నించారా?..చంద్రబాబు పేదవిద్యార్థుల కోసం చేసిన మంచి ఏంటి?..చంద్రబాబు పేరు చెబితే ఆయన చేసిన చెడు చాలానే ఉంది.చంద్రబాబు ఏ రోజైనా ప్రభుత్వ బడులను పట్టించుకున్నారా? అని సీఎం జగన్ కృష్ణా జిల్లా పామర్రులో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో ప్రశ్నించారు.నేను చేసిన పనుల్లో ఒక్క శాతమైనా చంద్రబాబు చేశారా?నారాయణ, చైతన్య విద్యాసంస్థల కోసమే చంద్రబాబు ఆలోచన అని ఎద్దేవా చేశారు.వసతిదీవెన, విద్యాదీవెన కోసం నేటి వరకు రూ.18 వేల కోట్లు వెచ్చించాం.. కేవలం పిల్లల చదువుల కోసమే 57 నెలల కాలంలో రూ. 73 వేల కోట్లు ఖర్చు చేసామన్నారు.రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న 9.44 లక్షల మంది విద్యార్థులకు అక్టోబరు – డిసెంబరు – 2023 త్రైమాసికానికి సంబంధించిన జగనన్న విద్యా దీవెన కింద రూ.708.68 కోట్లను శుక్రవారం సీఎం జ‌గ‌న్ విడుదల చేశారు.పెద్ద చదువులు చదువుకుంటున్న పేదింటి పిల్లల వారి పూర్తి ఫీజులు, పూర్తి డబ్బు మొత్తాన్ని వంద శాతం ఫీజును ఆ పిల్లల తల్లులకే ఇచ్చి, తల్లులే ఆ ఫీజులు కాలేజీలకు కట్టే ఈ జగనన్న విద్యా దీవెన కార్యక్రమాన్ని గత 57 నెలలుగా క్రమం తప్పకుండా ప్రతి త్రైమాసికమైపోయిన వెంటనే ఆ తల్లులకు జమ చేస్తూ జగనన్న విద్యా దీవెన కొనసాగిస్తూ వచ్చామని సీఎం చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చదువులు చదువుతున్న పిల్లలు 9.45 లక్షల మంది పిల్లలకు.. మొత్తం పిల్లల సంఖ్యలో ఏకంగా 93 శాతం మందికి జగనన్న విద్యా దీవెన ద్వారా మంచి చేస్తూ పిల్లల పూర్తి ఫీజును మీ జగనన్న ప్రభుత్వమే కడుతోందని తెలిపారు.

👉ఎమ్మెల్యే అన్నాను కలిసిన మార్కాపురం మున్సిపల్ కమిషనర్ కె.కిరణ్ కుమార్..

*మార్కాపురం మున్సిపల్ కమిషనర్ కె.కిరణ్ కుమార్ గిద్దలూరు శాసనసభ్యులు, మార్కాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అన్నా రాంబాబు ను మర్యాదపూర్వకంగా కలిశారు. శుక్రవారం మార్కాపురం జవహర్ నగర్లో అన్నా నివాసంలో కమీషనర్ ఎమ్మెల్యే అన్నాను మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే అన్నా మార్కాపురం మున్సిపాలిటీ పరిధిలోని పలు విషయాల పై సూచనలు అందించారు.

👉మార్చి 10న జరిగే సిద్ధం సభకు భారీగా వైసీపీ నాయకులు తరలిరావాలి* సిద్ధం పోస్టర్ల ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే అన్నా*

ఈ నెల 10 వ తేదిన బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం, మేదరమెట్ల మండలంలోని పి.గుడిపాడు వద్ద ముఖ్య మంత్రి జగనన్న ఆధ్వర్యంలో జరిగే సిద్ధం సభకు మార్కాపురం నియోజకవర్గం నుండి వైసీపీ కుటుంబ సభ్యులందరూ భారీగా తరలిరావాలని గిద్దలూరు శాసన సభ్యులు, మార్కాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త అన్నా రాంబాబు పిలుపునిచ్చారు.శుక్రవారం మార్కాపురం జవహర్ నగర్ లోని ఎమ్మెల్యే అన్నా నివాసంలో పలువురు వైసీపీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే అన్నా సిద్ధం సభ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అన్నా మాట్లాడుతూ మార్కాపురం నియోజకవర్గం నుండి భారీగా వైసీపీ శ్రేణులు తరలిరావాలని, జగనన్న మన రాష్ట్రానికి చేయనున్న దిశా, నిర్దేశాలను ప్రతి ఒక్కరికి వివరించి రాబోయే ఎన్నికల్లో వైసీపీ విజయానికి కృషి చేయాలన్నారు. మార్కాపురం నియోజకవర్గ పరిధిలోని వైసీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, డైరెక్టర్లు, సోషల్ మీడియా సభ్యులు, వైసీపీ కుటుంబ సభ్యులు అందరూ పాల్గొనాలని ఎమ్మెల్యే అన్నా పిలుపు నిచ్చారు.*
*గొర్లగడ్డ లో పర్యటించిన ఎమ్మెల్యే అన్నా*ఘన స్వాగతం పలికిన వైసీపీ నాయకులు*..మార్కాపురం మున్సిపాలిటీ పరిధిలోని గొర్లగడ్డ వార్డులో గిద్దలూరు శాసనసభ్యులు, మార్కాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త అన్నా రాంబాబు శుక్రవారం పర్యటించారు. ఈ సందర్బంగా వార్డు కౌన్సిలర్ దొడ్డ భాగ్యలక్ష్మి, పలువురు ముస్లిం పెద్దలు, వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే అన్నాకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే అన్నా స్థానిక వార్డులో ముస్లిం పెద్దలు, పలువురు నాయకులతో సమావేశమై సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే అన్నా మాట్లాడుతూ రాబోయే 2024 ఎన్నికల్లో ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అండగా ఉండి నన్ను అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని ఎమ్మెల్యే అన్నా కోరారు.

👉పేదవిద్యార్థులకు అండగా జగనన్న విద్యాదీవెన  పథకం..

ఎమ్మెల్యే అన్నాను ఘనంగా ఆహ్వానించిన A1 గోబల్ ఇంజనీర్ కళాశాల నిర్వహకులు, విద్యార్థులు*..
పేద విద్యార్థులు కూడా పెద్ద పెద్ద చదువులు చదవాలన్న సమూన్నత లక్ష్యంతో పేద విద్యార్థులకు అండగా జగనన్న విద్యాదీవెన పథకం నిలుస్తుందని గిద్దలూరు శాసన సభ్యులు, మార్కాపురం నియోజకవర్గ సమన్వయకర్త అన్నా రాంబాబు అన్నారు. శుక్రవారం మార్కాపురం మండలంలోని దరిమడుగు లో A1 గోబుల్ ఇంజనీర్ కళాశాలలో ఏర్పాటు చేసిన జగనన్న విద్యా దీవెన నిధుల విడుదల కార్యక్రమం లో ఎమ్మెల్యే అన్నా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అన్నా మాట్లాడుతూ ఐటీఐ, పాలిటెక్నీక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సుల్లో చదివే పేద విద్యార్థుల కాలేజీలకు క్రమం తప్పకుండా జమ చేస్తూన్న జగనన్న కు మనం అండగా ఉండాలన్నారు. ముందుగాఎమ్మెల్యే అన్నాను A1 గోబల్ ఇంజనీర్ కళాశాల నిర్వహకులు, విద్యార్థులు ఘనంగా సన్మానించినారు.

7k network
Recent Posts

ఇజ్రాయిల్ పై ఇరాన్ క్షిపణి దాడులు..సీఎం జగన్ పై జరిగిన దాడిని ఖండించిన షర్మిల..పవన్ కళ్యాణ్ పై నాన్ బైయిలబుల్ కేసు!!! సల్మాన్ ఖాన్ఇంటి వద్ద కాల్పులు..పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట..ఎమ్మెల్యే అన్నా సతీమణి,కోడలు ప్రచారం..

సీఎం సమక్షంలో వైకాపాలో చేరిన కీలక నేతలు..ప్రచారంలో మాగుంట చందన..జగన్ సర్కారు పై ధ్వజమెత్తిన ముత్తుముల.. ఎమ్మెల్యే అన్నా సమక్షంలో వైకాపాలో చేరికలు..ఇజ్రాయిల్ దాడులను ఖండించిన ఎస్ఐఓ..రాష్ట్రస్థాయిలో కంభం వాసవి విద్యార్థుల ప్రతిభ.

బీజేపీ నేతలపై కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు .. పిఠాపురం నుంచి కే.పవన్ కల్యాణ్ పోటీ!..సింబల్ తెలిస్తే షాకే!..రంజాన్ వేడుకలలో ఎంపీ మాగుంట,ఎమ్మెల్యే కేపీ..విస్తృత పర్యటన లో ముత్తుముల..యశోద హాస్పిటల్ లో అరుదైన శస్త్ర చికిత్స